ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. 102 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 433/8గా ఉంది. యశస్వి (57), రోహిత్ శర్మ (103), శుభ్‌మన్ గిల్ (110), దేవ్‌దత్ పడిక్కల్ (65), సర్ఫరాజ్ ఖాన్ (56), రవీంద్ర జడేజా (15), దృవ్ జురెల్ (15), అశ్విన్ (0) ఔట్ కాగా.. కుల్దీప్ (6), బుమ్రా (0) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 215 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 4 వికెట్లు పడగొట్టగా.. టామ్ హార్ట్లీ 2, ఆండర్సన్, స్టోక్స్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
Historic - Team India's Top 5 scored 50+ scores in a Test innings for the first time after 15 years.
— CricketMAN2 (@ImTanujSingh) March 8, 2024
- TEAM INDIA WRITTEN HISTORY AT DHARAMSHALA...!!!! 🇮🇳 pic.twitter.com/S32yzlfHx6
15 ఏళ్లలో తొలిసారి..
భారత తొలి ఇన్నింగ్స్‌లో ఐదుగురు టపార్డర్ బ్యాటర్లు 50 అంతకంటే ఎక్కువ స్కోర్లు (యశస్వి (57), రోహిత్ శర్మ (103), శుభ్‌మన్ గిల్ (110), దేవ్‌దత్ పడిక్కల్ (65), సర్ఫరాజ్ ఖాన్ (56)) నమోదు చేశారు. భారత్‌కు సంబంధించి టెస్ట్ క్రికెట్‌లో ఇలా జరగడం ఇది నాలుగో సారి. 1998లో తొలిసారి ఐదుగురు భారత టాపార్డర్ బ్యాటర్లు 50 ప్లస్ స్కోర్లు నమోదు చేశారు.
కోల్‌కతా వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌లో ఆసీస్‌పై ఈ అరుదైన ఫీట్ నమోదైంది. ఆతర్వాత 1999లో ఓసారి (మొహాలీలో న్యూజిలాండ్‌పై), ఆతర్వాత 2009లో ముంబై వేదికగా శ్రీలంకపై మరోసారి భారత టాపార్డర్ బ్యాటర్లు ప్రతాపం చూపించారు. తిరిగి 15 ఏళ్ల తర్వాత మరోసారి భారత టాపార్డర్‌లోని ఐదుగురు బ్యాటర్లు 50 ప్లస్ స్కోర్లు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment