match fee fined
-
CWC 2023: ఇంగ్లండ్ చేతిలో ఖంగుతిన్న బంగ్లాదేశ్‌కు మరో షాక్
ధర్మశాలలో నిన్న ఇంగ్లండ్ చేతిలో ఖంగుతిన్న బంగ్లాదేశ్‌కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు మ్యాచ్ ఫీజ్‌లో ఐదు శాతం కోత విధించారు. నిర్ధేశిత సమయం పూర్తియ్యే సరికి బంగ్లాదేశ్ తమ కోటా ఓవర్ల కంటే ఓ ఓవర్ వెనుపడి ఉండటంతో ఐసీసీ ఈ ఫైన్ విధించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.22 ప్రకారం బంగ్లాదేశ్ సభ్యులందరికీ ఈ ఫైన్ వర్తిస్తుంది. ఆన్‌ఫీల్డ్ అంపైర్లు ఎహసాన్ రజా, పాల్ విల్సన్, థర్డ్ అంపైర్ అడ్రియన్ హోల్డ్‌స్టాక్, ఫోర్త్ అంపైర్ కుమార ధర్మసేన బంగ్లాదేశ్ ఆటగాళ్లపై ఛార్జ్ తీసుకున్నారు. ఐసీసీ విధించిన ఈ జరిమానాను బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అంగీకరించాడు. దీంతో ఐసీసీ ప్యానెల్ ముందు హాజరుకు అతనికి మినహాయింపు లభించింది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 137 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. డేవిడ్ మలాన్ (140) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 48.2 ఓవర్లలో 227 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది. రీస్ టాప్లే (10-1-43-4) బంగ్లా పతనాన్ని శాశించాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో లిటన్ దాస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో శ్రీలంకపై పాకిస్తాన్ చారిత్రక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక నిర్ధేశించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ మరో పది బంతులు మిగిలుండగానే ఛేదించి, ప్రపంచకప్‌లో 300 అంతకంటే ఎక్కువ టార్గెట్‌ను ఛేదించిన తొలి జట్టుగా రికార్డుల్లోకెక్కింది. -
జింబాబ్వే చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్న వెస్టిండీస్‌కు మరో బిగ్ షాక్
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో నిన్న (జూన్ 24) పెను సంచలనం నమోదైంది. రెండు సార్లు ప్రపంచకప్ ఛాంపియన్ వెస్టిండీస్‌ను పసికూన జింబాబ్వే మట్టికరిపించింది. ఈ ఓటమితో విండీస్ వన్డే వరల్డ్‌కప్ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ భారీ పరాభవం నుంచి తేరుకోకముందే విండీస్‌కు మరో భారీ షాక్ తగిలింది. జింబాబ్వేతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గాను ఆ జట్టు మ్యాచ్ ఫీజ్‌లో 60 శాతం కోత పడింది. నిర్ణీత సమయంలో విండీస్ బౌలర్లు 3 ఓవర్లు తక్కువ వేసినందున ఓవర్‌కు 20 శాతం చొప్పున ప్రతి ఆటగాడి మ్యాచ్ ఫీజ్‌లో 60 శాతం కోత విధించినట్లు ఐసీసీ వెల్లడించింది. కాగా, నిన్నటి మ్యాచ్‌లో వెస్టిండీస్.. జింబాబ్వే చేతిలో ఓడినప్పటికీ సూపర్ సిక్స్ దశకు అర్హత సాధించింది. అయితే ఈ మ్యాచ్ కోల్పోవడంలో లాసైన 2 పాయింట్లు విండీస్‌కు తదుపరి దశలో అత్యంత కీలకంగా మారతాయి. అవి విండీస్ వరల్డ్‌కప్ అవకాశాలను ప్రభావితం చేస్తాయి. దీంతో ఈ మ్యాచ్‌లో ఓటమితో విండీస్ కలవరపడుతుంది. ఇదిలా ఉంటే, గ్రూప్-ఏ మ్యాచ్‌లో జింబాబ్వే.. తమకంటే ఎన్నో రెట్లు పటిష్టమైన వెస్టిండీస్‌ను 35 పరుగుల తేడాతో ఓడించింది. సికందర్ రజా (68, 2/45) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో, టెండాయ్ చటార (3/52), బ్లెస్సింగ్ ముజరబాని (2/33), రిచర్డ్ నగరవ (2/25) అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో జింబాబ్వేను విజయతీరాలకు చేర్చారు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. 49.5 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌట్ కాగా, విండీస్ 44.4 ఓవర్లలో 233 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. గ్రూప్-ఏ నుంచి వెస్టిండీస్‌తో పాటు జింబాబ్వే, నెదర్లాండ్స్ సూపర్ సిక్స్ దశకు అర్హత సాధించాయి. గ్రూప్-బి నుంచి శ్రీలంక, స్కాట్లాండ్, ఒమన్ దేశాలు సూపర్ సిక్స్ దశకు చేరే అవకాశం ఉంది. -
IND VS ENG 5th Test: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మరో భారీ షాక్
అసలే ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు పుండు మీద కారం చల్లే పరిణామం! ఇంగ్లండ్‌తో చివరి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్‌పై ఐసీసీ చర్య తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానాతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల నుంచి 2 పాయింట్లు కోత విధించింది. దాంతో డబ్ల్యూటీసీ పాయింట్ల జాబితాలో మన జట్టు నాలుగో స్థానానికి పడిపోయింది. ఇదే సిరీస్ తొలి టెస్టులో, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ టెస్టులో కూడా ఇదే తరహాలో స్లో ఓవర్ రేట్ శిక్షకు గురైన టీమిండియా మొత్తంగా ఈ ఏడాది డబ్ల్యూటీసీలో ఐదు పాయింట్లు ఇలాగే కోల్పోయింది. కాగా, బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రీ షెడ్యూల్డ్ టెస్ట్‌లో టీమిండియా 7 వికెట్లు తేడాతో దారుణ ఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పరాభవంతో పటౌడీ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. స్కోరు వివరాలు.. భారత్ తొలి ఇన్నింగ్స్: 416; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284; భారత్ రెండో ఇన్నింగ్స్: 245; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: లీస్ (రనౌట్) 56; క్రాలీ (బి) బుమ్రా 46; పోప్ (సి) పంత్ (బి) బుమ్రా 0; రూట్ (నాటౌట్) 142; బెయిర్‌స్టో (నాటౌట్) 114; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (76.4 ఓవర్లలో 3 వికెట్లకు) 378. వికెట్ల పతనం: 1–107, 2–107, 3–109. బౌలింగ్: బుమ్రా 17–1–74–2, షమీ 15–2–64–0, జడేజా 18.4–3–62–0, సిరాజ్ 15–0–98–0, శార్దుల్ 11–0–65–0. -
టీమిండియాపై గెలుపు.. సంబరాల్లో ఉన్న దక్షిణాఫ్రికాకు అక్షింతలు
South Africa Fined For Slow Over Rate In 2nd ODI Vs India: టీమిండియాపై 2-0 తేడా వన్డే సిరీస్ గెలుపొందిన దక్షిణాఫ్రికాకు.. గెలుపు సంబరాల నుంచి తెరుకునే లోపే గట్టి షాక్ తగిలింది. రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు మ్యాచ్ ఫీజ్‌లో 20 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఈ మేరకు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ శనివారం ప్రకటన విడుదల చేశాడు. నిర్ణీత సమయంలోగా ఓ ఓవర్ తక్కువగా బౌల్ చేసినందుకు బవుమా సేనకు ఫైన్ విధిస్తున్నట్లు పైక్రాఫ్ట్ పేర్కొన్నాడు. కాగా, టీమిండియాతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. అంతకుముందు ఇదే వేదికగా జరిగిన తొలి వన్డేలోనూ దక్షిణాఫ్రికానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ప్రొటీస్ సేన 31 పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను కూడా ఆతిధ్య జట్టే 2-1తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. చదవండి: పటిష్టంగా కనిపించినా..రెండు సిరీస్‌లూ పాయే..! -
Ashes 1st Test: ఆసీస్ చేతిలో భంగపడ్డ రూట్ సేనకు మరో భారీ షాక్..
బ్రిస్బేన్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ తొలి టెస్ట్‌లో ఆతిధ్య ఆసీస్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న ఇంగ్లండ్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్(5 ఓవర్లు) కారణంగా 5 డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత పడటంతో పాటు జట్టు మ్యాచ్ ఫీజు మొత్తాన్ని(100 శాతం) కోల్పోయింది. ఐసీసీ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ మ్యాచ్ అనంతరం ఈ మేరకు వెల్లడించాడు. మరోవైపు, ఇదే మ్యాచ్‌లో సూపర్ శతకంతో చెలరేగిన ఆసీస్ ఆల్‌రౌండర్ ట్రావిస్ హెడ్‌కు కూడా జరిమానా విధిస్తున్నట్లు రిఫరీ బూన్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను పరుష పదజాలంతో దూషించినందుకు గాను హెడ్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధిస్తున్నట్లు తెలిపాడు. ఇదిలా ఉంటే, ఐదు టెస్ట్‌ల యాషెస్ సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిధ్య జట్టు మూకుమ్మడిగా రాణించింది. ఫలితంగా ఈ మ్యాచ్ కేవలం నాలుగు రోజుల్లోనే ముగిసింది. నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ నిర్ధేశించిన 20 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు వికెట్ కోల్పోయి చేధించింది. అంతకముందు మూడోరోజు ఆట ముగిసే సమయానికి 220/2 స్కోరుతో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్ నాలుగోరోజు ఆట తొలి సెషన్లో తేలిపోయింది. 297 పరుగుల చేసి ఆలౌటైంది. నాలుగో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే 82 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మలాన్ ఔట్ కావడంతో ఇంగ్లండ్ పతనం మొదలైంది. ఆ జట్టు చివరి 74 పరుగుల చేసే క్రమంలో 8 వికెట్లు చేజార్చుకుంది. రూట్ 89 పరుగులు చేయగా.. మిగతా వారు ఆశించిన మేరకు రాణించలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో లియోన్ 4, కామెరాన్ గ్రీన్, కమిన్స్ చెరో రెండు వికెట్లు తీయగా.. స్టార్క్, హాజిల్‌వుడ్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 147 పరుగులకే కుప్పకూలగా.. ట్రావిస్ హెడ్(152 పరుగులు) శతక్కొటడంతో పాటు వార్నర్(94), లబుషేన్(74) రాణించడంతో ఆసీస్ 425 పరుగుల భారీ స్కోరు చేసింది. చదవండి: సెంచరీల మోత మోగిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ -
టీమిండియాకు జరిమానా.. కోవిడ్ తర్వాత మూడోసారి
అహ్మదాబాద్: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో స్లో ఓవర్‌రేట్ కారణంగా టీమిండియాకు జరిమానా పడింది. నిర్ణీత సమయంలోపు ఒక ఓవర్ తక్కువగా వేయడంతో మ్యాచ్ రిఫరి జవగళ్ శ్రీనాథ్ టీమిండియా మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తాము చేసిన తప్పిదాన్ని అంగీకరించడంతో పాటు జరిమానాకు కూడా భరిస్తామని రిఫరికి తెలిపాడు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ పునఃప్రారంభం అయిన తర్వాత భారత్‌కు జరిమానా పడడం ఇది మూడోసారి. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్‌కు రెండుసార్లు ఫైన్ పడింది. కాగా, భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి, ఐదు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 మార్చి 16న ఇదే వేదికగా జరుగనుంది. -
శరణ్ కు జరిమానా
హైదరాబాద్: సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ బరిందర్ శరణ్ కు జరిమానా విధించారు. మైదానంలో అనుచితంగా ప్రవర్తించినందుకు అతడిపై మ్యాచ్ రిఫరీ చర్య తీసుకున్నారు. మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. లెవల్ వన్ నేరం (ఆర్టికల్ 2.1.7 ఐపీల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ది ప్లేయర్స్ అండ్ టీమ్ ఆఫీషియల్స్) కింద అతడిపై చర్య తీసుకున్నారు. సోమవారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో అతడు 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. పార్థివ్ (10), బట్లర్ (11), అంబటి రాయుడు(54)లను అవుట్ చేశాడు. ఈ మ్యాచ్ లో ముంబై జట్టుపై ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది.