వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో నిన్న (జూన్ 24) పెను సంచలనం నమోదైంది. రెండు సార్లు ప్రపంచకప్ ఛాంపియన్ వెస్టిండీస్‌ను పసికూన జింబాబ్వే మట్టికరిపించింది. ఈ ఓటమితో విండీస్ వన్డే వరల్డ్‌కప్ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ భారీ పరాభవం నుంచి తేరుకోకముందే విండీస్‌కు మరో భారీ షాక్ తగిలింది. జింబాబ్వేతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గాను ఆ జట్టు మ్యాచ్ ఫీజ్‌లో 60 శాతం కోత పడింది. నిర్ణీత సమయంలో విండీస్ బౌలర్లు 3 ఓవర్లు తక్కువ వేసినందున ఓవర్‌కు 20 శాతం చొప్పున ప్రతి ఆటగాడి మ్యాచ్ ఫీజ్‌లో 60 శాతం కోత విధించినట్లు ఐసీసీ వెల్లడించింది.
కాగా, నిన్నటి మ్యాచ్‌లో వెస్టిండీస్.. జింబాబ్వే చేతిలో ఓడినప్పటికీ సూపర్ సిక్స్ దశకు అర్హత సాధించింది. అయితే ఈ మ్యాచ్ కోల్పోవడంలో లాసైన 2 పాయింట్లు విండీస్‌కు తదుపరి దశలో అత్యంత కీలకంగా మారతాయి. అవి విండీస్ వరల్డ్‌కప్ అవకాశాలను ప్రభావితం చేస్తాయి. దీంతో ఈ మ్యాచ్‌లో ఓటమితో విండీస్ కలవరపడుతుంది.
ఇదిలా ఉంటే, గ్రూప్-ఏ మ్యాచ్‌లో జింబాబ్వే.. తమకంటే ఎన్నో రెట్లు పటిష్టమైన వెస్టిండీస్‌ను 35 పరుగుల తేడాతో ఓడించింది. సికందర్ రజా (68, 2/45) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో, టెండాయ్ చటార (3/52), బ్లెస్సింగ్ ముజరబాని (2/33), రిచర్డ్ నగరవ (2/25) అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో జింబాబ్వేను విజయతీరాలకు చేర్చారు.
తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. 49.5 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌట్ కాగా, విండీస్ 44.4 ఓవర్లలో 233 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. గ్రూప్-ఏ నుంచి వెస్టిండీస్‌తో పాటు జింబాబ్వే, నెదర్లాండ్స్ సూపర్ సిక్స్ దశకు అర్హత సాధించాయి. గ్రూప్-బి నుంచి శ్రీలంక, స్కాట్లాండ్, ఒమన్ దేశాలు సూపర్ సిక్స్ దశకు చేరే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment