రెండుసార్లు ప్రపంచకప్ విజేత వెస్టిండీస్‌కు ఘోర అవమానం ఎదురైన సంగతి తెలిసిందే. అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్ మెగా సమరానికి అర్హత సాధించని విండీస్ జట్టు క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ ఆడాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లోనూ దారుణ ఆటతీరు కనబరిచి వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలను చేజేతులా జారవిడుచుకుంది.
సూపర్ సిక్స్‌కు క్వాలిఫై అయినప్పటికి.. జింబాబ్వే, నెదర్లాండ్స్ చేతిలో ఓడిన విండీస్‌కు సూపర్ సిక్స్‌లో సున్నా పాయింట్లు ఉన్నాయి. అదే సమయంలో లీగ్ దశలో నెదర్లాండ్స్, వెస్టిండీస్(సూపర్ సిక్స్‌కు క్వాలిఫై అయిన జట్లు)లపై విజయాలు సాధించిన జింబాబ్వే నాలుగు పాయింట్లతో టాపర్‌గా ఉంది. ఇక నెదర్లాండ్స్ విండీస్‌పై సూపర్ ఓవర్‌లో విజయం సాధించి రెండు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ దశలో వెస్టిండీస్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడం అసాధ్యమని తెలుసు.
కానీ వెస్టిండీస్‌కు వరల్డ్‌కప్‌కు అర్హత సాధించేందుకు ఇప్పటికి ఒక అవకాశం మిగిలి ఉంది. కష్టసాధ్యమైనప్పటికి అదృష్టం కూడా కలిసివస్తే మాత్రం విండీస్ మెగా సమరానికి వెళ్లే అవకాశముంటుంది.అదెలా అంటే.. ఒకే గ్రూప్‌లో ఉన్న జింబాబ్వే వద్ద ప్రస్తుతం 4 పాయింట్లు ఉన్నాయి. మరో గ్రూప్‌లో ఉన్న శ్రీలంక ఖాతాలోనూ 4 పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు జట్లు వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే విషయంలో ముందు వరుసలో ఉన్నాయి.
అన్ని మ్యాచ్‌లు గెలవాల్సిందే..
ఈ నేపథ్యంలో సూపర్ సిక్స్‌లో వెస్టిండీస్ శ్రీలంక, ఒమన్, స్కాట్లాండ్‌లతో ఆడుతుంది. తొలుత ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ విండీస్ కచ్చితంగా గెలవాల్సిందే. ఒక్క మ్యాచ్ ఓడినా విండీస్ ఇంటిబాట పట్టాల్సిందే. ఒకవేళ విండీస్ మూడు మ్యాచ్‌లు గెలిస్తే ఆరు పాయింట్లు తన ఖాతాలో ఉంటాయి. ఇక జింబాబ్వే, శ్రీలంకలు తాము ఆడబోయే మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓటమి పాలవ్వాలి. అలా జరిగితేనే వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వేలు ఆరు పాయింట్లతో సమానంగా ఉంటాయి. ఒకవేళ శ్రీలంక, జింబాబ్వేలు చెరో రెండు విజయాలు సాధిస్తే అప్పుడు రెండు జట్లు 8 పాయింట్లతో వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తే.. విండీస్ ఇంటిబాట పడుతుంది.
నెట్ రన్‌రేట్ పెంచుకోవాల్సిందే..
ఒకవేళ మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి.. శ్రీలంక, జింబాబ్వేలు చెరో రెండు మ్యాచ్‌లు ఓడినా విండీస్‌కు అవకాశాలు అంతంతే. ఎందుకంటే ఆ సమయంలో నెట్‌రన్‌రేట్ కీలకపాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం విండీస్ రన్‌రేట్ (-0.350)గా ఉంది. మూడు మ్యాచ్‌ల్లోనూ గెలవడంతో పాటు భారీ విజయాలతో విండీస్ రన్‌రేట్‌ను గణనీయంగా మెరుగుపరుచుకోవాలి. ఇప్పటికైతే విండీస్‌కు, శ్రీలంక(+2.698)కు నెట్‌రన్‌రేట్ విషయంలో చాలా తేడా ఉంది. ఒమన్‌పై 99 పరుగుల టార్గెట్‌ను 35 ఓవర్లు మిగిలి ఉండగానే చేధించడం లంక రన్‌రేట్‌ను బాగా మెరుగుపరిచింది. ఇక జింబాబ్వే నెట్ రన్‌రేట్ కూడా +0.982గా ఉంది. ఇది కూడా విండీస్‌కు ఒక దెబ్బ అని చెప్పొచ్చు
జింబాబ్వే అన్ని మ్యాచ్‌లు ఓడిపోతే..
అయితే విండీస్‌కు నెట్ రన్‌రేట్ పెంచుకోవడంలో విఫలమైనా ఆఖరిగా ఒక చాన్స్ ఉంది. అదేంటంటే.. జింబాబ్వే సూపర్ సిక్స్‌లో తాను ఆడబోయే మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూడాలి.. అదే సమయంలో విండీస్ అన్ని మ్యాచ్‌ల్లో గెలవాలి. అప్పుడు జింబాబ్వే ఖాతాలో నాలుగు పాయింట్లు ఉంటే.. విండీస్ ఆరు పాయింట్లు సాధించి వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో శ్రీలంక విండీస్ చేతిలో ఓడి.. మిగతా రెండు మ్యాచ్‌ల్లో గెలవాలి. ఇక ఒమన్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్‌లు తలా ఒక విజయం సాధించాలి.
కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వెస్టిండీస్‌కు ఇది అంత సులువు కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఫామ్ దృశ్యా శ్రీలంక, జింబాబ్వేలను ఓడగొట్టడం మిగతా జట్లకు పెద్ద సవాల్. అందునా మరీ రెండు మ్యాచ్‌లు ఓడిపోయే దుస్థితిలో ఈ రెండు జట్లు ఎంతమాత్రం లేవు. ఇన్ని ఇబ్బందుల మధ్య విండీస్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుందని ఆశించడం వ్యర్థం.. కానీ ఏ మూలనో ఆ జట్టుకు అదృష్టం రాసి ఉంటే తప్ప.
చదవండి: వరల్డ్‌కప్ వేదికలపై వివాదం.. బీసీసీఐ వివరణ
2011 టోర్నీ మొత్తం ధోని అదే తిన్నాడు: సెహ్వాగ్.. రోహిత్ ఆ వడాపావ్ మానేసి..
Comments
Please login to add a commentAdd a comment