అహ్మదాబాద్: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో స్లో ఓవర్‌రేట్ కారణంగా టీమిండియాకు జరిమానా పడింది. నిర్ణీత సమయంలోపు ఒక ఓవర్ తక్కువగా వేయడంతో మ్యాచ్ రిఫరి జవగళ్ శ్రీనాథ్ టీమిండియా మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తాము చేసిన తప్పిదాన్ని అంగీకరించడంతో పాటు జరిమానాకు కూడా భరిస్తామని రిఫరికి తెలిపాడు.
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ పునఃప్రారంభం అయిన తర్వాత భారత్‌కు జరిమానా పడడం ఇది మూడోసారి. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్‌కు రెండుసార్లు ఫైన్ పడింది.
కాగా, భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి, ఐదు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 మార్చి 16న ఇదే వేదికగా జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment