టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా మళ్లీ అగ్రస్ధానాన్ని కైవసం చేసుకుంది. స్వదేశంలో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. 122 రేటింగ్ పాయింట్లతో నంబర్ 1 ర్యాంక్ కైవసం చేసుకుంది. ఇక ఇప్పటివరకు టాప్ ర్యాంక్‌లో ఉన్న ఆస్ట్రేలియా 117 రేటింగ్ పాయింట్స్‌తో రెండో స్థానానికి పడిపోయింది.
ఇక భారత్ చేతితో ఘోర పరాభవం పొందిన ఇంగ్లండ్ 111 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. భారత్ ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ టాప్ ర్యాంక్‌లోనే నిలవడం గమనార్హం. అదే విధంగా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 పాయింట్ల పట్టికలోనూ భారత్ అగ్రస్ధానంలో ఉంది.
68.51 విజయ శాతంతో టీమిండియా తొలి స్ధానంలో ఉంది. భారత్ తర్వాత స్ధానంలో న్యూజిలాండ్(60.00 విజయ శాతం) ఉంది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో టీమిండియాకు ఇంకా కేవలం 5 టెస్టులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్, న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ భారత్ ఆడనుంది. ఈ సిరీస్‌లలో భారత్ విజయం సాధిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దాదాపు ఖరారైనట్లే.
Comments
Please login to add a commentAdd a comment