Ind Vs SA 2nd ODI: South Africa Fined 20 Percent Of Match Fee For Slow Over Rate - Sakshi
Sakshi News home page

IND Vs SA 2nd ODI: టీమిండియాపై వన్డే సిరీస్‌ గెలుపు.. ఇంతలోనే ఐసీసీ అక్షింతలు

Published Sat, Jan 22 2022 5:38 PM | Last Updated on Sat, Jan 22 2022 8:09 PM

IND Vs SA ODI Series: South Africa Fined For Slow Over Rate In Paarl - Sakshi

South Africa Fined For Slow Over Rate In 2nd ODI Vs India: టీమిండియాపై 2-0 తేడా వన్డే సిరీస్‌ గెలుపొందిన దక్షిణాఫ్రికాకు.. గెలుపు సంబరాల నుంచి తెరుకునే లోపే గట్టి షాక్‌ తగిలింది. రెండో వన్డేలో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఆ జట్టు మ్యాచ్‌ ఫీజ్‌లో 20 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఈ మేరకు మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ శనివారం ప్రకటన విడుదల చేశాడు. నిర్ణీత సమయంలోగా ఓ ఓవర్‌ తక్కువగా బౌల్‌ చేసినందుకు  బవుమా సేనకు ఫైన్‌ విధిస్తున్నట్లు పైక్రాఫ్ట్‌ పేర్కొన్నాడు. 

కాగా, టీమిండియాతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ కైవసం​ చేసుకుంది. అంతకుముందు ఇదే వేదికగా జరిగిన తొలి వన్డేలోనూ దక్షిణాఫ్రికానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ప్రొటీస్‌ సేన 31 పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను కూడా ఆతిధ్య జట్టే 2-1తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. 
చదవండి: పటిష్టంగా కనిపించినా..రెండు సిరీస్‌లూ పాయే..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement