Rahul Dravid Teaches Kannada To British High Comissioner Alex Ellis In Bengaluru - Sakshi
Sakshi News home page

కన్నడ టీచర్‌గా మారిన రాహుల్ ద్రవిడ్

Published Mon, Aug 9 2021 4:17 PM | Last Updated on Mon, Aug 9 2021 5:11 PM

Rahul Dravid Teaches Kannada To British High Commissioner Alex Ellis - Sakshi

నాటింగ్‌హామ్: రాహుల్ ద్రవిడ్ కొద్దిసేపు కన్నడ టీచర్‌గా మారారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో  టీమిండియా టెస్ట్‌ సిరీస్‌లో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సీరీస్‌ నేపథ్యంలో బ్రిటీష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లీస్కు రాహుల్ ద్రవిడ్ కన్నడ నేర్పిస్తున్నాడు. దీనికి సంభందించిన వీడియోను అలెక్స్ ఎల్లీస్ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియోలో ద్రవిడ్ కన్నడ నేర్పిస్తుండగా..  వేగంగా పరిగెత్తూ అనే పదాన్ని కన్నడలో బేగా ఓడి అని చెప్పాలని రాహుల్ ద్రవిడ్ చేప్పడం విశేషం.

ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియోలో వైరల్‌ అవుతుంది. కాగా శ్రీలంక పర్యటనలో రాహుల్ ద్రవిడ్  కోచ్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. శ్రీలంకతో జరిగిన 50 ఓవర్ల సీరిస్‌ను భారత్‌ కైవసం చేసుకోగా, టీ20 సిరీస్‌ను  శ్రీలంక సొంతం చేసుకుంది. అయితే ఈ పర్యటనలో రాహుల్ ద్రవిడ్ కోచ్ గా తన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement