Northamptonshire VS India 2nd T20 Warm Up Match: Harshal Stars, IND Won By 10 Runs - Sakshi
Sakshi News home page

IND VS Northamptonshire: హర్షల్‌ ఆల్‌రౌండ్‌ షో.. రెండో మ్యాచ్‌లోనూ టీమిండియాదే విజయం

Published Mon, Jul 4 2022 10:26 AM | Last Updated on Mon, Jul 4 2022 10:32 AM

Northamptonshire VS India 2nd T20 Warm Up Match: Harshal Stars, IND Won By 10 Runs - Sakshi

ఇంగ్లండ్‌ పర్యటనలో టీమిండియా ఓ పక్క టెస్ట్‌ మ్యాచ్‌లో చెలరేగి ఆడుతుంటే, మరో పక్క యువ భారత జట్టు టీ20ల్లో దుమ్మురేపుతోంది. డెర్బీషైర్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన యువ భారత్‌.. నార్తంతాంప్టన్‌షైర్ క్లబ్‌తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లోనూ సత్తా చాటింది. నిన్న జరిగిన ఈ మ్యాచ్‌లో డీకే సారధ్యంలోని యంగ్‌ ఇండియా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేసినప్పటికీ.. నామమాత్రపు స్కోర్‌ను డిఫెండ్‌ చేసుకోవడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. టాపార్డర్‌ బ్యాటర్లు దారుణంగా విఫలం కాగా.. కెప్టెన్‌ డీకే (26 బంతుల్లో 34; 3 ఫోర్లు, సిక్స్‌), హర్షల్‌ పటేల్‌ (36 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) టీమిండియాను ఆదుకున్నారు. నార్తంతాంప్టన్‌ బౌలర్లలో బ్రాండన్‌ గ్లోవర్‌ 3, బక్‌, ఫ్రెడ్డీ హెల్డ్రిచ్‌ తలో 2 వికెట్లు, కాబ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

ఛేదనలో భారత బౌలర్లు విజృంభించడంతో నార్తంతాంప్టన్‌ 19.3 ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టులో సైఫ్‌ జైబ్‌ 33 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌, ఆవేశ్‌ ఖాన్‌, హర్షల్‌ పటేల్‌, చహల్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ధ్‌ కృష్ణ, వెంకటేశ్‌ అయ్యర్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. హర్షల్‌ పటేల్‌ ఆల్‌రౌండర్‌ షోతో (54, 2/23) టీమిండియా వరుసగా రెండో టీ20లోనూ విజయం సాధించింది. 
చదవండి: వారెవ్వా... కెప్టెన్‌ బుమ్రా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement