టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా రేపు (జూన్ 1) తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ వార్మప్ మ్యాచే అయినప్పటికీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. న్యూయార్క్‌లో కొత్తగా నిర్మించిన స్టేడియంలో జరుగబోతున్న తొలి మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. ఇదే మైదానంలో టీమిండియా జూన్ 9న పాకిస్తాన్‌తో తలపడనుంది.
దాయాదితో ఆడబోయే మ్యాచ్ కూడా ఇదే మైదానంలో జరుగనుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి మరింత ఎక్కువగా ఉంది. భారతకాలమానం ప్రకారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం లేనప్పటికీ.. ఆన్‌లైన్‌లో స్కోర్ అప్‌డేట్స్ అందుబాటులో ఉంటాయి. టీమిండియా తరఫున కోహ్లి మినహా మిగతా జట్టంతా అందుబాటులో ఉంది. కోహ్లి నిన్ననే ముంబై నుంచి న్యూయార్క్‌కు బయల్దేరాడు. ప్రయాణ బడలికల కారణంగా రేపటి మ్యాచ్‌కు కోహ్లి అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువ.
కాగా, ప్రపంచకప్ రెగ్యులర్ మ్యాచ్‌లు సైతం రేపటి నుంచే ప్రారంభంకానున్నాయి. ఆతిథ్య యూఎస్‌ఏ-కెనడా మధ్య మ్యాచ్‌తో పోట్టి ప్రపంచకప్ 2024 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం జూన్ 2వ తేదీ ఉదయం 6 గంటలకు మొదలవుతుంది. డల్లాస్‌లో కొత్తగా నిర్మించిన స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ వేదికపై ఇదివరకు పలు ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరిగాయి. యూఎస్‌ఏ-కెనడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. డల్లాస్‌లో జరగాల్సిన గత మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.
ఇదిలా ఉంటే, ప్రపంచకప్‌లో భారత్ ప్రస్తానం జూన్ 5న ఐర్లాండ్‌తో జరుబోయే మ్యాచ్‌తో మొదలవుతుంది. జూన్ 9న టీమిండియా.. దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. గ్రూప్ దశలో భారత్.. పాక్, ఐర్లాండ్‌లతో పాటు యూఎస్‌ఏ, కెనడా జట్లతో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment