సూపర్ సెంచరీతో అదరగొట్టిన కేఎల్ రాహుల్
టపార్డర్ బ్యాట్స్‌మెన్లు దారుణంగా విఫలమైన వేళ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్(101 రిటైర్డ్) అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. అతనికి మరో ఎండ్‌లో జడేజా(57) హాఫ్ సెంచరీతో సపోర్ట్ ఇవ్వడంతో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. క్రీజ్‌లో జడేజాకు తోడుగా శార్దూల్ ఠాకూర్(9) ఉన్నాడు. 77 ఓవర్ల తర్వాత టీమిండియా 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల సాధించింది.
CENTURY @klrahul11 💯
— Durham Cricket (@DurhamCricket) July 20, 2021
A brilliant innings 👏🇮🇳
Live Stream ➡️ https://t.co/ZsCqJdCEX1#CountyXIvIndia @BCCI pic.twitter.com/4Ffzd5wnEP
టీమిండియా నాలుగో వికెట్ డౌన్.. విహారి(24) ఔట్
టీమిండియా ప్లేయర్లు ఒకొక్కరుగా తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరుతున్నారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారి(24) కూడా కనీసం హాఫ్‌సెంచరీ మార్క్ చేరుకోలేకపోయాడు. స్పిన్నర్ ప్యాటర్సన్ వైట్ బౌలింగ్‌లో.. క్రెయిగ్ మైల్స్‌కు క్యాచ్ అందించి వెనుదిరిగాడు. క్రీజ్లో కేఎల్ రాహుల్(47), రవీంద్ర జడేజా(9) ఉన్నారు. 47 ఓవర్ల తర్వాత టీమిండియా 4 వికెట్ల నష్టానికి141 పరుగులు చేసింది.
Patterson-White gets Vihari!
India are 107/4
Live stream ➡️ https://t.co/FfTRHD7fDr#CountyXIvIndia @TrentBridge pic.twitter.com/dNC7ERr83J
— Durham Cricket (@DurhamCricket) July 20, 2021
Carson x Rew, Pujara gone. 🏴🇮🇳@SussexCCC 🤝 @SomersetCCC
— Durham Cricket (@DurhamCricket) July 20, 2021
Live Stream ➡️ https://t.co/JeTNRWzv2g pic.twitter.com/aB1jPQLNTT
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. పుజారా(21) ఔట్
ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ దారుణంగా విఫలమైంది. ఓపెనర్లు రోహిత్ శర్మ(9), మయాంక్ అగర్వాల్(28) సహా వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ పుజారా(21) కూడా తక్కువ స్కోర్‌కే చేతులెత్తేశారు. ప్రాక్టీస్ మ్యాచ్ అని సరదాగా తీసుకున్నారో ఏమో కానీ, నిర్లక్ష్యంగా షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నారు. లంచ్ విరామ సమాయనికి 30 ఓవర్లు ఆడిన టీమిండియా బ్యాట్స్‌మెన్లు 3 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేశారు.
క్రీజ్‌లో విహారి(16), కేఎల్ రాహుల్(5) ఉన్నారు. కౌంటీ సెలెక్ట్ ఎలెవెన్ బౌలర్లలో లిండన్ జేమ్స్ 2 వికెట్లు పడగొట్టగా, పుజారా వికెట్ జాక్ కార్సన్‌కు దక్కింది. కార్సన్ బౌలింగ్‌లో పుజారా క్రీజ్ వదిలి ముందుకు రావడంతో వికెట్‌కీపర్ జేమ్స్ రివ్ స్టంపింగ్ చేశాడు.
చెస్టర్ లీ స్ట్రీట్: కౌంటీ సెలెక్ట్ ఎలెవెన్ జట్టుతో మంగళవారం మధ్యాహ్నం 3:30కు ప్రారంభమైన మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెగ్యులర్ కెప్టెన్ కోహ్లీ గైర్హాజరీలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ(33 బంతుల్లో 9; 2 ఫోర్లు) దారుణంగా విఫలం కాగా, మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(35 బంతుల్లో 28; 6 ఫోర్లు) కాస్త పర్వాలేదనిపించాడు.
Brilliant from @TrentBridge's Lyndon James who picks up his second.
Agarwal bowled for 28 👏
Live Stream ➡️ https://t.co/ZoY9QkxDQk#CountyXIvIndia @CountyChamp pic.twitter.com/PWOlck8Y5o
— Durham Cricket (@DurhamCricket) July 20, 2021
ప్రత్యర్ధి బౌలర్ లిండన్ జేమ్స్‌కు ఈ రెండు వికెట్లు దక్కాయి. 14 ఓవర్ల తర్వాత భారత జట్టు స్కోర్ 46/1గా ఉంది. క్రీజ్‌లో పుజారా(8), విహారి(1) ఉన్నారు. కాగా, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ కోసం టీమిండియా ఈ మ్యాచ్‌ను పట్టుపట్టి మరీ షెడ్యూల్ చేసుకుంది.
భారత జట్టు: రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పుజారా, హనుమ విహారి, కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, బుమ్రా, మహ్మద్ సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment