నాటింగమ్:భారత్ లక్ష్యం 228 పరుగులు
నాటింగమ్: భారత్ ఇంగ్లండ్ టూర్ 3వ వన్డేలో ఇంగ్లండ్ జట్టు 50 ఓవర్లకు 227 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత్ పరుగుల లక్ష్యం 228గా నిర్ధేసించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నఇంగ్లండ్ ఆరంభంలో దూకుడుగా ఆడింది. ఇండియా బౌలర్లను చీకాకు పరచింది. అయితే ఆ తరువాత భారత స్పిన్నర్లు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పతిప్పలు పెట్టారు.
కూక్ 44 పరుగులు, హేల్స్ 42, బెల్ 28, రూట్ 2, మోర్గాన్ 10, బట్లెర్ 42, స్టోక్స్ 2, ఓక్స్ 15, ట్రెడ్వెల్ 30, ఫిన్ 6 పరుగులు చేశారు. అండెర్సన్ పరుగులు ఏమీ చేయకుండా నాటౌట్గా నిలిచాడు. అశ్విన్ మూడు వికెట్లు, కుమార్, షమి, రైనా, రాయుడు, జడేజా ఒక్కో వికెట్ తీసుకున్నారు.