Nottingham
-
ముగిసిన రెండోరోజు ఆట.. టీమిండియా 125/4
► భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. వర్షం కారణంగా రెండో రోజు మ్యాచ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆట ముగిసే సరికి భారత్ స్కోర్: 125/4 ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్ (57), పంత్ (7) ఉన్నారు. ► వర్షం కారణంగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో రోజు మ్యాచ్ నిలిచిపోయింది. ఇప్పటికే వెలుతురు లేమితో రెండో సెషన్ తూడిచిపెట్టుకుపోగా.. మూడో సెషన్ ప్రారంభమైన కాసేపటికే వర్షం పడడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ 46.2 ఓవర్లకు 4 వికెట్ల నష్టంతో 125 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ ( 57 పరుగులు ), రిషబ్ పంత్ ( 7 పరుగులు) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఇంకా 57 పరుగుల వెనుకంజలో ఉంది. రహానే రనౌట్.. నాలుగో వికెట్ డౌన్ ► ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. తాజాగా 5 పరుగులు చేసిన అజింక్యా రహానే రనౌట్‌గా వెనుదిరిగాడు. ఓలి రాబిన్సన్ వేసిన ఇన్నింగ్స్ 44వ ఓవర్ రెండో బంతిని కేఎల్ రాహుల్ ఢిపెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న రహానే అప్పటికే క్రీజు వదిలి ముందుకు రావడంతో బంతిని అందుకున్న బెయిర్ స్టో నేరుగా త్రో విసిరాడు. దీంతో డైరెక్ట్ త్రోతో రహానే రనౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 4 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. రాహుల్ 52, పంత్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. కోహ్లి గోల్డెన్ డక్.. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా ►ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. లంచ్ విరామం అనంతరం ఇన్నింగ్స్ మొదలు పెట్టిన టీమిండియాకు పుజారా రూపంలో షాక్ తగిలింది. 4 పరుగులు చేసిన పుజారా అండర్సన్ బౌలింగ్‌లో కీపర్ బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అండర్సన్ వేసిన బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో స్లిప్‌లో ఉన్న బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. రాహుల్ 51, రహానే 0 క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్ ►ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఓలి రాబిన్సన్ బౌలింగ్‌లో సామ్ కరన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ లంచ్ విరామానికి వెళ్లింది. ప్రస్తుతం భారత్ 37.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 48 పరుగులతో క్రీజులో ఉన్నాడు. నిలకడగా ఆడుతున్న భారత్ ►ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో రెండో రోజు ఆటను భారత్ నిలకడగా ఆరంభించింది. ప్రస్తుతం 24 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 12, రోహిత్ శర్మ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. నాటింగ్హమ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలిరోజే స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. భారత పేస్ బౌలర్లు తమ ప్రదర్శనతో దుమ్మురేపడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (108 బంతుల్లో 64; 11 ఫోర్లు) మాత్రమే పట్టుదల ప్రదర్శించి అర్ధ సెంచరీ సాధించగా, మిగతావారంతా విఫలమయ్యారు. జస్ప్రీత్ బుమ్రాకు 4 వికెట్లు దక్కగా... మొహమ్మద్ షమీ 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 9, కేఎల్ రాహుల్ 9 పరుగులతో ఆడుతున్నారు. తొలిరోజు స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన భారత్ బ్యాటింగ్‌లో రెండో రోజు మొత్తం నిలబడి ఆడితే భారీ స్కోరు చేసే అవకాశం ఉంది. అంతకముందు బౌలింగ్ ధాటికి ఇంగ్లండ్ మొదటి రోజు తమ తొలి ఇన్నింగ్స్‌లో 65.4 ఓవర్లలో 183 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ జో రూట్ (108 బంతుల్లో 64; 11 ఫోర్లు) మాత్రమే పట్టుదల ప్రదర్శించి అర్ధ సెంచరీ సాధించగా, మిగతావారంతా విఫలమయ్యారు. జస్ప్రీత్ బుమ్రాకు 4 వికెట్లు దక్కగా... మొహమ్మద్ షమీ 3 కీలక వికెట్లు పడగొట్టాడు. -
ముగిసిన తొలిరోజు ఆట.. టీమిండియా 21/0
► భారత పేసర్లు దుమ్మురేపడంతో మొదటి టెస్టులో ఇంగ్లండ్ తొమ్మిది వికెట్లు కోల్పోయింది. పేసర్లు బుమ్రా, షమీ, శార్దూల్ ఠాకూర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది. ఇన్నింగ్స్ 59 ఓవర్ మొదటి బంతికి 64 పరుగులు చేసిన రూట్‌ను ఎల్బీగా వెనక్కి పంపిన శార్దూల్ ఆ తర్వాత నాలుగో బంతికి ఓలీ రాబిన్సన్ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. మరుసటి ఓవర్లో బుమ్రా స్టువర్ట్ బ్రాడ్‌ను వెనక్కి పంపడంతో ఇంగ్లండ్ 160 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ను కోల్పోయింది. ఇక 65.4 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసి ఇంగ్లండ్ ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్ల విజృంభణ.. ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ ► భారత్ పేస్ బౌలర్ల దాటికి ఇంగ్లండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. తాజాగా బుమ్రా బౌలింగ్‌లో జాస్ బట్లర్ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ 145 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 56 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 145 పరుగులె చేసింది. రూట్ 59, సామ్ కరన్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఇంగ్లండ్ జట్టు ఒకే ఓవర్లో రెండు వికెట్లను కోల్పోయింది. మహ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ 51వ ఓవర్ రెండో బంతికి జానీ బెయిర్ స్టో అవుట్ కాగానే ఇంగ్లండ్ టీ విరామానికి వెళ్లింది. విరామం అనంతరం షమీ వేసిన ఓవర్ చివరి బంతికి డానియెల్ లారెన్స్ డకౌట్‌గా వెనుదిరగడంతో 138 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కొల్పోయింది. రూట్ హాఫ్ సెంచరీ.. నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్ ► భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అర్థ సెంచరీతో మెరిశాడు. 89 బంతుల్లో అర్థ సెంచరీ మార్క్ అందుకున్న రూట్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు ఉన్నాయి. రూట్ నిలకడైన ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ కుదురుకుంటుంది. జానీ బెయిర్ స్టో 29 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. ఇప్పటివరకు ఇద్దరి మధ్య 70 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ప్రస్తుతం 50 ఓవర్ల ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు 137/3 గా ఉంది. మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ ► ఇంగ్లండ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. లంచ్ విరామం అనంతరం కాసేపటికే 18 పరుగులు చేసిన సిబ్లీ షమీ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 35 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్ 27, బెయిర్ స్టో 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. 27 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరంతంటే.. ► లంచ్ విరామం అనంతరం ఇంగ్లండ్ నిలకడగా ఆడుతోంది. 27 ఓవర్లు ముగిసేసమయానికి 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. డొమినిక్ సిబ్లీ 18, జో రూట్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్‌లు చెరో వికెట్ తీశారు. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ ► టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ 21వ ఓవర్ చివరి బంతికి 27 పరుగులు చేసిన క్రాలీ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ 42 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అంతకముందు ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ రోరీ బర్న్స్ డకౌట్‌గా వెనుదిరిగాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ ఐదో బంతికి బర్న్స్ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 23 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. ► ఇంగ్లండ్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోవడంతో ఆచితూచి ఆడుతోంది. పది ఓవర్లు ముగిసిన తర్వాత ఇంగ్లండ్ జట్టు 24 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీసులో జాక్ క్రాలీ (16), సిబ్లీ (8) ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ ► భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ రోరీ బర్న్స్ డకౌట్‌గా వెనుదిరిగాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ ఐదో బంతికి బర్న్స్ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 2 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలీ 2, సిబ్లీ 0 పరుగులతో ఆడుతున్నారు. నాటింగ్హమ్: ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో జరిగే తొలి టెస్టులో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధిస్తే మానసికంగా పైచేయి సాధించే అవకాశం ఉండటంతో ఇరు జట్లు శుభారంభమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఇక టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక మొదటి టెస్టుకు ఇషాంత్ శర్మకు చోటు దక్కలేదు. ఇక గాయంతో మయాంక్ దూరం కావడంతోకేఎల్ రాహుల్ తుది జట్టులోకి వచ్చాడు. రోహిత్ తనదైన శైలిలో దూకుడుగా ఆడగలడు. అయితే 3, 4, 5 స్థానాల బ్యాట్స్‌మెన్‌లో నిలకడ లోపించడం భారత్‌ను కొంత బలహీనంగా మారుస్తోంది. కోహ్లి కూడా భారీ స్కోరు సాధించడంలో విఫలమవుతుండగా... పుజారా, రహానే చెప్పుకోదగ్గ స్కోరు సాధించి చాలా కాలమైంది. వీరు రాణిస్తేనే భారత బ్యాటింగ్ పటిష్టంగా మారుతుంది. సామ్ కరన్ కీలకం... ప్రతిష్టాత్మక సిరీస్‌కు బెన్ స్టోక్స్‌లాంటి స్టార్ ఆటగాడు దూరం కావడం ఇంగ్లండ్‌కు పెద్ద దెబ్బ. అయితే యువ ఆల్‌రౌండర్ స్యామ్ కరన్ ఆ స్థానంలో తన వంతు పాత్ర పోషించనున్నాడు. అండర్సన్, బ్రాడ్‌లాంటి సీనియర్లతో పాటు రాబిన్సన్ మూడో పేసర్‌గా ఆడవచ్చు. ఇటీవల భారత పర్యటనకు వెళ్లి ఘోరమైన ప్రదర్శన కనబర్చిన బ్యాట్స్‌మెన్ బర్న్స్, సిబ్లీ, క్రాలీలకు సొంతగడ్డపైనైనా రాణించి ఆకట్టుకునేందుకు ఇది సరైన అవకాశం. ప్రధాన బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా తీవ్ర ఒత్తిడిలో ఉన్న రూట్‌కు కూడా ఈ సిరీస్ కీలకం కానుంది. పిచ్, వాతావరణం ఆరంభంలో సీమ్ బౌలింగ్‌కు అనుకూలిస్తూ ఆ తర్వాత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలిగే సాధారణ ఇంగ్లండ్ తరహా పిచ్. కొంత పచ్చిక ఉన్నా, టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. జట్ల వివరాలు: భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, జడేజా, శార్దుల్, షమీ, బుమ్రా ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), బర్న్స్, సిబ్లీ, క్రాలీ, బెయిర్‌స్టో, బట్లర్, సామ్ కరన్, రాబిన్సన్, బ్రాడ్, డేనియల్ లారెన్స, అండర్సన్ -
భార్య అనుష్కతో కోహ్లి లంచ్.. ఫోటో వైరల్
నాటింగ్హమ్: టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 4 నుంచి నాటింగ్హమ్ వేదికగా జరగనున్న తొలి టెస్టు ఆడేందుకు టీమిండియా ఇప్పటికే చేరుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లి తన భార్య అనుష్క శర్మతో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. తాను ఉంటున్న హోటల్ రూంలో అనుష్కతో కలిసి లంచ్ చేశాడు. దానికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. ఇక కోహ్లికి నాటింగ్హమ్లోని ట్రెంట్‌బ్రిడ్జి మైదానంలో మంచి రికార్డు ఉంది. ఆడిన రెండు టెస్టు మ్యాచ్‌లు కలిపి కోహ్లి 209 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉండడం విశేషం. ఆగస్టు 4న మొదలుకానున్న తొలి టెస్టులో కోహ్లి ఇదే ప్రదర్శనను పునరావృతం చేయాలని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తుంది. కాగా కౌంటీ ఎలెవెన్‌తో మూడు రోజలు ప్రాక్టీస్ మ్యాచ్.. డర్హమ్‌లో ప్రాక్టీస్ సెషన్ అనంతరం టీమిండియా కొత్త ఉత్సాహంతో కనిపిస్తుంది. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
రషీద్ ఖాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన; సూపర్ విక్టరీ
నాటింగ్హమ్: హండ్రెడ్ బాల్ క్రికెట్ కాంపీటీషన్లో భాగంగా ట్రెంట్ రాకెట్స్‌కు ఆడుతున్న ఆఫ్ఘన్ స్టార్ రషీద్ ఖాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్గాడు. ముందు బౌలింగ్‌లో మూడు వికెట్లతో దుమ్మురేపిన అతను ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ 25 పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే రషీద్ ఔటయ్యే సమయానికి ట్రెంట్ ఇంకా 47 పరుగులు చేయాల్సి ఉంది. అయితే ఓపెనర్‌గా వచ్చిన అలెక్స్ హేల్స్ 40 పరుగులతో చివరివరకు నాటౌట్‌గా నిలిచి అద్భుత విజయాన్ని అందించాడు. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నార్తన్ సూపర్‌చార్జర్స్ 99 బంతుల్లో 132 పరుగులకు ఆలౌట్ అయింది. నార్తన్ బ్యాటింగ్‌లో జె. సింప్సన్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హ్యారీ బ్రూక్ 38 పరుగులు చేశాడు. ట్రెంట్ రాకెట్స్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్ 3,డీ లాంజ్ 3, మాథ్యూ కార్టర్ 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ఆడిన ట్రెంట్ రాకెట్స్ 94 బంతుల్లో 8 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. అలెక్స్ హేల్స్ 40, రషీద్ ఖాన్ 25 పరుగులు చేశారు. -
నా సెంచరీ కంటే ఆ రెండు పాయింట్లే కీలకం
నాటింగ్హమ్ : ప్రపంచకప్‌లో భాగంగా ట్రెంట్ బ్రిడ్జ్‌లో గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 166 పరుగుల అద్వితీయమైన ఇన్నింగ్స్‌తో డేవిడ్ వార్నర్ జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ పూర్తయిన తర్వాత వార్నర్ మీడియాతో మాట్లాడుతూ ‘ నేను సెంచరీ చేసిన దాని కంటే ఈ గెలుపుతో మా జట్టుకు లభించిన 2 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి చేరడం నాకు సంతోషాన్ని కలిగించింది. మ్యాచ్ ఆరంభంలో బంగ్లా బౌలర్లు కొత్త బాల్‌తో బాగానే ఇబ్బంది పెట్టారు. అటువంటి కఠిన పరిస్థితుల్లో మొదట్లో నిలదొక్కుకొవడానికి ప్రయత్నించామని, తర్వాత పరుగులు వాటంతట అవే వచ్చాయని’ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా తరపున ప్రపంచకప్‌లో 150కి పైగా పరుగులు సాధించిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇంతకు ముందు ఈ రికార్డు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, మాజీ వికెట్‌కీపర్ ఆడం గిల్‌క్రిస్ట్‌ల పేరిట ఉండేది. జట్టు తరపున మొత్తం 16 సెంచరీలు చేసిన వార్నర్ ఆడం గిల్‌క్రిస్ట్‌తో సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి రెండు స్థానాల్లో రికీ పాంటింగ్(29), మార్క్ వా(19)లు ఉన్నారు. -
వార్నర్ విజృంభణ: బంగ్లాదేశ్‌కు భారీ టార్గెట్
నాటింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో సత్తా చాటింది. డేవిడ్ వార్నర్(166; 147 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభణకు తోడు ఉస్మాన్ ఖవాజా(89; 72 బంతుల్లో 10 ఫోర్లు), అరోన్ ఫించ్(53;51 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు)లు హాఫ్ సెంచరీలు సాధించడంతో ఆసీస్ 382 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ తీసుకోవడంతో ఇన్నింగ్స్‌ను అరోన్ ఫించ్, వార్నర్‌లు ఆరంభించారు. వీరిద్దరూ సమయోచితంగా ఆడటంతో ఆసీస్‌కు శుభారంభం లభించింది. ఈ జోడి 121 పరుగుల భాగస్వామ్యం సాధించిన తర్వాత ఫించ్(53; 51 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. సౌమ్య సర్కార్ బౌలింగ్‌లో రూబెల్కు సింపుల్ క్యాచ్ ఇచ్చిన ఫించ్ మొదటి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ తరుణంలో వార్నర్‌కు ఉస్మాన్ ఖవాజా జత కలిశాడు. వీరు బంగ్లా బౌలర్లకు పరీక్షగా నిలుస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ప్రధానంగా స్టైక్ రోటేట్ చేసి మరో విలువైన భాగస్వామ్యాన్ని సాధించారు. ఈ క్రమంలోనే వార్నర్ సెంచరీ, ఖవాజా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఈ జోడి రెండో వికెట్‌కు 192 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత వార్నర్ ఔటయ్యాడు. ఆ సమయంలో క్రీజ్‌లోకి వచ్చి మ్యాక్స్‌వెల్(32; 10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కాగా, అనవసరపు పరుగు కోసం క్రీజ్ దాటి రావడంతో రనౌట్ అయ్యాడు. ఆపై పరుగు వ్యవధిలో ఖవాజా ఔట్ కాగా, స్టీవ్ స్మిత్(1)సైతం నిరాశపరిచాడు. చివర్లో మార్కస్ స్టోయినిస్(17 నాటౌట్), అలెక్స్ క్యారీ(11 నాటౌట్)లు దూకుడుగా ఆడటంలో విఫలయ్యారు. ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మూడు వికెట్లు సాధించగా, ముస్తాఫిజుర్ రహ్మాన్ వికెట్ తీశాడు. -
వార్నర్ మళ్లీ బాదేశాడు..
నాటింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరో సెంచరీ బాదేశాడు. గురువారం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వార్నర్ శతకం సాధించాడు. 110 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో వార్నర్ సెంచరీ నమోదు చేశాడు. ఇది వార్నర్‌కు 16వ వన్డే సెంచరీ కాగా, ఈ వరల్డ్‌కప్‌లో రెండో సెంచరీ. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ తీసుకోవడంతో ఇన్నింగ్స్‌ను అరోన్ ఫించ్, వార్నర్‌లు ఆరంభించారు. వీరిద్దరూ సమయోచితంగా ఆడటంతో ఆసీస్‌కు శుభారంభం లభించింది. ఈ జోడి 121 పరుగుల భాగస్వామ్యం సాధించిన తర్వాత ఫించ్(53; 51 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. సౌమ్య సర్కార్ బౌలింగ్‌లో రూబెల్కు సింపుల్ క్యాచ్ ఇచ్చిన ఫించ్ మొదటి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ తరుణంలో వార్నర్‌కు ఉస్మాన్ ఖవాజా జత కలిశాడు. వీరు బంగ్లా బౌలర్లకు పరీక్షగా నిలుస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ప్రధానంగా స్టైక్ రోటేట్ చేసి మరో మంచి భాగస్వామ్యాన్ని సాధించారు. ఈ క్రమంలోనే వార్నర్ సెంచరీ సాధించాడు. దాంతో ఆసీస్ 35 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 208 పరుగులు చేసింది. -
మరో సంచలనంపై బంగ్లాదేశ్ గురి
నాటింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ రెండు సంచలన విజయాలు నమోదు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లను మట్టికరిపించిన బంగ్లాదేశ్ తాము కూడా రేసులో ఉన్నామంటూ మిగతా జట్లకు సవాల్ విసురుతోంది. దీనిలో భాగంగా గురువారం ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఆస్ట్రేలియాతో బంగ్లాదేశ్ తలపడుతోంది. సాధారణంగా అయితే ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆసీస్‌కు బంగ్లాదేశ్ ఏమంత క్లిష్ట ప్రత్యర్థి కానేకాదు. కానీ ఈ మెగా టోర్నీలో ఒకే ఒక్కడి జోరు ముందు ‘కంగారూ’ పడాల్సిందే. ఆ ఒక్కడు షకీబ్ అల్ హసన్. ఈ బంగ్లా ఆల్‌రౌండర్ బ్యాట్‌తో భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. బంతితో ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాడు. దాంతో బంగ్లాదేశ్‌ను ఆసీస్ నిలువరిస్తుందా అనేది ఆసక్తికరం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఇదిలా ఉంచితే. ఇరు జట్ల ముఖాముఖి రికార్డులో 21 వన్డేలు జరగ్గా, 18 మ్యాచ్‌లను ఆసీస్ గెలుపొందగా, బంగ్లాదేశ్ ఒకదాంట్లో మాత్రమే నెగ్గింది. మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఇక ప్రపంచకప్ ముఖాముఖి రికార్డులో ఇరు జట్లు మూడుసార్లు తలపడగా, రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్ విజయం సాధించింది. ఒక మ్యాచ్ రద్దయ్యింది. దాంతో ఆసీస్‌నే ఫేవరెట్‌గా దిగుతోంది. అయితే ఊహించని విజయాలు సాధిస్తున్న బంగ్లాదేశ్ మాత్రం మరో షాక్ ఇవ్వాలని యోచిస్తోంది. తుది జట్లు ఆస్ట్రేలియా ఆరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మర్కస్ స్టోయినిస్, అలెక్స్ క్యారీ, కౌల్టర్ నైల్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా బంగ్లాదేశ్ మష్రాఫ్ మొర్తజా(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, షకీబుల్ హసన్, ముస్తాఫికర్ రహీమ్, లిటాన్ దాస్, మహ్మదుల్లా, షబ్బీర్ రహ్మాన్, మెహిదీ హసన్, రూబెల్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్ -
ఈ వానేదో అక్కడ పడొచ్చు కదా: జాదవ్
నాటింగ్‌హామ్: ప్రపంచకప్‌లో భాగంగా భారత్- న్యూజిలాండ్ మ్యాచ్‌ను ఊహించినట్లుగానే వరుణుడు అడ్డుకున్నాడు. నాటింగ్‌హామ్‌లో బుధవారం నుంచి వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ జరిగే ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం చిత్తడిగా మారింది. మైదాన సిబ్బంది పిచ్ తడవకుండా తగిన ఏర్పాట్లు చేసినప్పటికీ అవుట్ ఫీల్డ్ మాత్రం తడిసి ముద్దయింది. దీంతో మ్యాచ్ జరిగే అవకాశం లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేసి ఇరుజట్లకు చెరోపాయింట్ ఇచ్చారు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా మ్యాచ్ రద్దవడానికి కంటే ముందు టీమిండియా క్రికెటర్లు మ్యాచ్ ప్రారంభం కోసం బాల్కనీ నుంచి ఆత్రుతగా ఎదురుచూశారు. రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్‌లు బ్రెడ్ ఆమ్లెట్ తింటూ వర్షాన్ని ఎంజాయ్ చేశారు. అయితే కివీస్‌తో మ్యాచ్‌కు వర్షం పడటం పట్ల కేదార్ జాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ వర్షం నాటింగ్‌హామ్‌లో కాకుండా మహారాష్ట్రలో పడాలని కోరుకున్నాడు. గత కొన్ని నెలలుగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కరువు తాండవిస్తోన్న కారణంగానే జాదవ్ అలా కోరుకున్నాడు. ఇక మహారాష్ట్రలో రోజురోజుకి నీటి సమస్య జఠిలమవుతోంది. మరాఠ్వాడా, విదర్బ, పశ్చిమ మహారాష్ట్రతోపాటు అనేక ప్రాంతాల్లో గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. ఊష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో జలాశయాల్లోని నీరు త్వరగా తగ్గుతోంది. పరిణామంగా అనేక ప్రాంతాల్లో సాగునీటితోపాటు తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. -
భారత్-కివీస్ మ్యాచ్‌కు తప్పని వరుణుడి ముప్పు
నాటింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో వర్షం దెబ్బకు మరో మ్యాచ్ కొట్టుకుపోయింది. టాస్ వేసే అవకాశమే లేనంతగా వర్షం పడటంతో గురువారం భారత్-న్యూజిలాండ్ జట్ల జరగాల్సిన మ్యాచ్ రద్దయ్యింది. మధ్యలో పలుమార్లు వర్షం తెరిపిచ్చినా మళ్లీ ప్రారంభం కావడంతో నీళ్లు తోడటానికి గ్రౌండ్‌మెన్ తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం గం. 2.30 ని.లకు టాస్ వేయాల్సి ఉన్నప్పటికీ ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటం చేత టాస్కు అంతరాయం ఏర్పడింది. అయితే వర్షం కాస్త తెరుపు ఇవ్వడంతో టాస్‌ను గం. 3.00ని.లకు వేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ క్రమంలోనే పిచ్‌పై కవర్లు తొలగించారు. కాగా, మళ్లీ వర్షం కురవడం ప్రారంభం కావడంతో పిచ్‌ను మళ్లీ కవర్లతో కప్పి వేశారు. ఇలా వర్షం వస్తూ పోతూ ఉండటంతో మ్యాచ్ కనీసం 20 ఓవర్ల పాటు జరుగుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. చివరగా రాత్రి గం. 7.30ని.లకు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పిచ్, ఔట్‌ఫీల్డ్ మ్యాచ్ నిర్వహణకు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో ఫీల్డు అంపైర్లు ఎరాస్మస్, పాల్ రీఫెల్లు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ఇరు జట్లకు తలో పాయింట్ వచ్చింది. ప్రస్తుతం కివీస్ 7 పాయింట్లతో ఉండగా, భారత్ 5 పాయింట్లతో ఉంది. ఈ వరల్డ్‌కప్‌లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడం నాల్గోసారి. ఇలా ప్రపంచకప్ చరిత్రలో నాలుగు మ్యాచ్‌లు వర్షం కారణంగా ఫలితం తేలకుండా రద్దు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
భారత్-కివీస్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం
నాటింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగునున్న మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. దాంతో టాస్ వేయడానికి మరింత ఆలస్యం కానుంది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం గం. 2.30 ని.లకు టాస్ వేయాల్సి ఉన్నప్పటికీ ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటం చేత ఆటకు అంతరాయ ఏర్పడింది. అయితే తొలుత కాస్త తెరుపు ఇవ్వడంతో టాస్‌ను గం. 3.00ని.లకు వేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ క్రమంలోనే పిచ్‌పై కవర్లు తొలగించారు. కాగా, మళ్లీ వర్షం కురవడం ప్రారంభం కావడంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. (ఇక్కడ చదవండి: ‘వరల్డ్‌కప్ నా చేతుల్లో ఉండాలనుకుంటున్నా’) -
పాకిస్తాన్ దంచికొట్టింది..
నాటింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఘోర పరాభవం ఎదుర్కొన్న పాకిస్తాన్ తన రెండో మ్యాచ్‌లో చెలరేగిపోయింది. సోమవారం ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ 349 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. పాక్ ఆటగాళ్లలో ఇమాముల్ హక్(44:58 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), ఫకార్ జమాన్(36:40 బంతుల్లో 6 ఫోర్లు), బాబర్ అజామ్(63:66 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), హఫీజ్ (84: 62 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), సర్పరాజ్ అహ్మద్(55: 44 బంతుల్లో 5 ఫోర్లు)లు రాణించి జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ప్రధానంగా ఓపెనర్లు ఇమాముల్ హక్-ఫకార్ జమాన్‌లు అత్యంత నిలకడగా ఆడి మంచి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 82 పరుగులు జత చేసిన తర్వాత ఫకార్ జమాన్ ఔటయ్యాడు. మొయిన్ అలీ వేసిన 15 ఓవర్ తొలి బంతికి ఫకార్ జమాన్ స్టంపౌట్ అయ్యాడు. అటు తర్వాత ఇమాముల్ హక్- బాబర్ అజామ్‌లు స్కోరు బోర్డును చక్కదిద్దారు. అయితే జట్టు స్కోరు 111 పరుగుల వద్ద ఇమాముల్ హక్ భారీ షాట్‌కు యత్నించి రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. మొయిన్ అలీ బౌలింగ్ క్రిస్ వోక్స్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ఇమాముల్ హక్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇక బాబర్ అజామ్-హఫీజ్‌లు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. హఫీజ్ దూకుడుగా ఆడగా, బాబర్ అజామ్ కుదురుగా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ జోడి 88 పరుగులు జత చేసిన తర్వాత అజామ్ మూడో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తరుణంలో హపీజ్తో కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్ జత కలిశాడు. వీరు 80 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత హఫీజ్ ఔటయ్యాడు. ఇక గత మ్యాచ్‌లో విఫలమై పూర్తిగా విమర్శలు పాలైన సర్పరాజ్.. ఈ మ్యాచ్‌లో బాధ్యతాయుతంగా ఆడాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోరును పెంచే క్రమంలో సర్పరాజ్ ఔట్ కాగా, చివరి వరుస ఆటగాళ్లు సైతం బ్యాట్ ఝుళిపించడంతో పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్లానికి 348 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, క్రిస్ వోక్స్‌లు తలో మూడు వికెట్లు సాధించగా, మార్క్‌వుడ్ రెండు వికెట్లు తీశాడు. -
భారీ స్కోరు దిశగా పాకిస్తాన్
నాటింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ 35 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు నష్టానికి 218 పరుగులు చేసింది. పాక్ ఆటగాళ్లలో ఇమాముల్ హక్(44:58 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), ఫకార్ జమాన్(36:40 బంతుల్లో 6 ఫోర్లు), బాబర్ అజామ్(63:66 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, హఫీజ్ సైతం హాఫ్ సెంచరీతో మెరిశాడు. పాక్ కోల్పోయిన తొలి మూడు వికెట్లు మొయిన్ అలీ ఖాతాలో పడ్డాయి. తొలుత ఫకార్ జమాన్‌ను ఔట్ చేసిన అలీ.. ఆపై ఇమాముల్ హక్‌ను కూడా పెవిలియన్ చేర్చాడు. దాంతో పాకిస్తాన్ 111 పరుగుల వద్ద ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. అటు తర్వాత 33 ఓవర్లో కుదురుగా ఆడుతున్న బాబర్ అజామ్‌ను మొయిన్ అలీ ఔట్ చేశాడు. బాబర్ అజామ్ భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో హఫీజ్‌కు జత కలిసిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళుతున్నాడు. ఈ క్రమంలో హఫీజ్ అర్థ సెంచరీ సాధించాడు. -
ఇంగ్లండ్‌ను ఆపగలదా?
నాటింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఆరంభ పోరులో పటిష్ఠ దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన ఉత్సాహంలో ఉన్న హాట్ ఫేవరెట్ ఇంగ్లండ్ క్రికెట్ జట్టు తమ రెండో మ్యాచ్‌లో నేడు(సోమవారం) పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. ముందుగా పాక్‌ను బ్యాటింగ్ ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ జరిగే ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ బ్యాట్స్‌మెన్‌కు స్వర్గ ధామం. ఈ వికెట్‌పై ఇంగ్లండ్ ఏకంగా రెండుసార్లు అత్యధిక స్కోర్లతో వన్డే వరల్డ్ రికార్డులు నెలకొల్పడం విశేషం. తొలుత 2016లో పాకిస్తాన్‌పై 444/3తో మొదటిసారి ప్రపంచ రికార్డు సృష్టించింది. గత జూన్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనైతే 481/6తో సరికొత్త రికార్డు నెలకొల్పింది. రెండోసారి ప్రపంచ రికార్డు నెలకొల్పిన వికెట్‌పై జరుగుతుండడంతో మరి తమ రికార్డును ఇంగ్లండ్ మరోసారి తిరగ రాస్తుందేమో చూడాలి. ఇదే మైదానంలో తమ ఆరంభ పోరులో వెస్టిండీస్ చేతిలో పాకిస్తాన్ ఘోర పరాజయం చవిచూసింది. మొదటి మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో విఫలమైన పాకిస్తాన్.. దూకుడు మీదున్న ఇంగ్లండ్‌ను ఏమాత్రం ఆపగలదో చూడాలి. ఇక ముఖాముఖి రికార్డులో ఇరు జట్లు ఇప్పటివరకు 87 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. వీటిలో 31 మ్యాచ్‌ల్లోనే పాకిస్తాన్ గెలిచింది. ఇంగ్లండ్ 53 మ్యాచ్‌ల్లో నెగ్గింది. మూడింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్‌లో 9 సార్లు ఎదురుపడగా చెరో నాలుగుసార్లు విజయం సాధించాయి. ఒకదాంట్లో ఫలితం రాలేదు. ఫైనల్లో ఇంగ్లండ్‌పై గెలవడం ద్వారానే పాక్ తమ ఏకైక ప్రపంచ కప్ (1992)ను సాధించడం విశేషం. పాకిస్తాన్ సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్), ఇమాముల్ హక్, ఫకార్ జమాన్, బాబర్ అజమ్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, అసిఫ్ అలీ, షాదబ్ ఖాన్, హసన్ అలీ, వహబ్ రియాజ్, మహ్మద్ అమిర్ ఇంగ్లండ్ ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), జేసన్ రాయ్, బెయిర్ స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, మార్క్‌వుడ్ -
పాకిస్తాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన వెస్టిండీస్
-
వరల్డ్‌కప్: పాకిస్తాన్ చిత్తు చిత్తు
నాటింగ్‌హామ్: పెద్దగా అంచనాలు లేకుండా వరల్డ్‌కప్ సమరానికి సిద్ధమైన వెస్టిండీస్ టోర్నీని ఘనంగా ఆరంభించింది. పాకిస్తాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించి శుభారంభం చేసింది. తొలుత పాకిస్తాన్‌ను కూల్చేసిన వెస్టిండీస్.. ఆపై గెలుపును సునాయాసంగా అందుకుంది. పాకిస్తాన్ నిర్దేశించిన 106 పరుగుల టార్గెట్‌ను విండీస్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్(50; 34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.మరో ఓపెనర్ షాయ్ హోప్(11) నిరాశపరిచగా, డారెన్ బ్రేవో డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. కాగా, గేల్ మాత్రం తనదైన శైలిలో ఆడుతూ ఇన్నింగ్స్ నడిపించాడు. అయితే గేల్ హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత మూడో వికెట్‌గా పెవిలియన్ చేరగా, మిగతా పనిని నికోలస్ పూరన్(34 నాటౌట్; 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పూర్తి చేశాడు. పూరన్ ధాటిగా ఆడటంతో విండీస్ 13.4 ఓవర్లలో విజయాన్ని సాధించింది. పాక్ బౌలర్లలో మహ్మద్ ఆమిర్ మూడు వికెట్లు సాధించడం మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : పాకిస్తాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన వెస్టిండీస్ (ఇక్కడ చదవండి: 27 ఏళ్ల తర్వాత పాకిస్తాన్..) అంతకుముందు పాకిస్తాన్ 105 పరుగులకే ఆలౌటైంది. ఏ దశలోనే విండీస్ పేస్ బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కోలేక మూడంకెల స్కోరును దాటడానికి అష్టకష్టాలు పడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఇమాముల్ హక్(2) ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. దాంతో 17 పరుగులకే పాకిస్తాన్ తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆపై పాక్ టాపార్డర్ ఆటగాళ్లలో ఫకార్ జమాన్(22), హరీస్ సోహైల్(8), బాబర్ అజమ్(22), సర్పరాజ్ అహ్మద్(8)లు సైతం నిరాశపరిచారు. విండీస్ బౌలర్ల నుంచి వచ్చే పదునైన బంతులకు పాక్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఆటు తర్వాత వచ్చిన ఆటగాళ్లలో వహబ్ రియాజ్(18; 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో పాకిస్తాన్ వంద పరుగుల మార్కును అతికష్టం మీద చేరింది. చివరి వికెట్‌గా రియాజ్ ఔట్ కావడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 21. 4 ఓవర్లలోనే ముగిసింది. విండీస్ బౌలర్లలో థామస్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా, జేసన్ హోల్డర్ మూడు వికెట్లతో పాక్ వెన్నువిరిచాడు. ఇక ఆండ్రీ రసెల్ రెండు వికెట్లు తీయగా, కాట్రెల్‌కు వికెట్ లభించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పాకిస్తాన్ 105 పరుగులకే ఆలౌట్
-
27 ఏళ్ల తర్వాత పాకిస్తాన్..
నాటింగ్‌హామ్: వరల్డ్‌కప్ చరిత్రలో పాకిస్తాన్ మరోసారి చెత్త ప్రదర్శన చేసింది. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్ 105 పరుగులకే చాపచుట్టేసింది. ఏ దశలోనే విండీస్ పేస్ బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కోలేక మూడంకెల స్కోరును దాటడానికి అష్టకష్టాలు పడింది. పాకిస్తాన్ ప్రధాన ఆటగాళ్లు ఇమాముల్ హక్(2), ఫకార్ జమాన్(22), హరీస్ సోహైల్(8), బాబర్ అజమ్(22), సర్పరాజ్ అహ్మద్(8)లు సైతం నిరాశపరచడంతో ఆ జట్టు చెత్త గణాంకాలను నమోదు చేసింది. (ఇక్కడ చదవండి: పాకిస్తాన్ పేకమేడలా..) కనీసం పోరాడాకుండానే చేతులెత్తేసిన పాకిస్తాన్ వంద పరుగుల మార్కును అతికష్టం మీద చేరింది. తద్వారా తమ వరల్డ్‌కప్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరును పాక్ నమోదు చేసినట్లయ్యింది. అది కూడా 27 ఏళ్ల తర్వాత ఒక వరల్డ్‌కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ అత్యల్ప స్కోరుకు పరిమితమైంది. 1992లో అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 74 పరుగులకే ఆలౌట్ కాగా, ఆ తర్వాత స్థానాన్ని తాజా మ్యాచ్ ఆక్రమించింది. వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ టాప్-5 అత్యల్ప స్కోర్లు ఇలా ఉన్నాయి.. 74 పరుగులకు ఆలౌట్- 1992లో ఇంగ్లండ్‌పై 105 పరుగులకు ఆలౌట్-2019లో వెస్టిండీస్‌పై 132 పరుగులకు ఆలౌట్-1999లో ఆసీస్‌పై 132 పరుగులకు ఆలౌట్-2007లో ఐర్లాండ్‌పై 134 పరుగులకు ఆలౌట్- 2003లో ఇంగ్లండ్‌పై -
పాకిస్తాన్ పేకమేడలా..
నాటింగ్‌హామ్: పాకిస్తాన్ క్రికెట్ జట్టు అంటేనే నిలకడలేమికి మారుపేరు. ఆ జట్టులో స్టార్ క్రికెటర్లు ఉన్నా అది కాగితాలకే పరిమితం అవుతుందనే విషయం మరోసారి రుజువైంది. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ 105 పరుగులకే కుప్పకూలింది. ఏ దశలోనే విండీస్ పేస్ బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కోలేక మూడంకెల స్కోరును దాటడానికి అష్టకష్టాలు పడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఇమాముల్ హక్(2) ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. దాంతో 17 పరుగులకే పాకిస్తాన్ తొలి వికెట్‌ను కోల్పోయింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : పాకిస్తాన్ 105 పరుగులకే ఆలౌట్ ఆపై పాక్ టాపార్డర్ ఆటగాళ్లలో ఫకార్ జమాన్(22), హరీస్ సోహైల్(8), బాబర్ అజమ్(22), సర్పరాజ్ అహ్మద్(8)లు సైతం నిరాశపరిచారు. విండీస్ బౌలర్ల నుంచి వచ్చే పదునైన బంతులకు పాక్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఆటు తర్వాత వచ్చిన ఆటగాళ్లలో వహబ్ రియాజ్(18; 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో పాకిస్తాన్ వంద పరుగుల మార్కును అతికష్టం మీద చేరింది. చివరి వికెట్‌గా రియాజ్ ఔట్ కావడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 21. 4 ఓవర్లలోనే ముగిసింది. విండీస్ బౌలర్లలో థామస్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా, జేసన్ హోల్డర్ మూడు వికెట్లతో పాక్ వెన్నువిరిచాడు. ఇక ఆండ్రీ రసెల్ రెండు వికెట్లు తీయగా, కాట్రెల్‌కు వికెట్ లభించింది. -
విండీస్‌తో మ్యాచ్: పాకిస్తాన్ విలవిల
నాటింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ విలవిల్లాడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 78 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. పాక్ ఓపెనర్లు ఇమాముల్ హక్(2), ఫకార్ జమాన్(22), హరీస్ సోహైల్(8), బాబర్ అజమ్(22), సర్పరాజ్ అహ్మద్(8), ఇమాద్ వసీం(1), షాదబ్ ఖాన్(0)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. (ఇక్కడ చదవండి: వెస్టిండీస్ 7..పాకిస్తాన్ 3) కాట్రెల్ వేసిన మూడో ఓవర్లో ఇమాముల్ హక్ ఔట్ కాగా, ఆండ్రీ రసెల్ వేసిన ఆరో ఓవర్లో ఫకార్ జమాన్ పెవిలియన్ బాటపట్టాడు. రసెల్ వేసిన 10వ ఓవర్లో సోహైల్ ఔట్ కాగా, ఓష్నే థామస్ వేసిన 14వ ఓవర్లో బాబర్ అజమ్ పెవిలియన్ చేరాడు. ఇక సర్ఫరాజ్ అహ్మద్, ఇమాద్ వసీంలను జేసన్ హోల్డర్ ఔట్ చేయగా, ఓష్నే థామస్ బౌలింగ్‌లో షాదబ్ ఖాన్ పెవిలియన్ చేరాడు. కట్టుదిట్టమైన వెస్టిండీస్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక ఆపసోపాలు పడుతున్న పాకిస్తాన్ స్వల్ప విరామాల్లో కీలక వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు శిబిరంలో ఒత్తిడి నెలకొంది. -
పచ్చ రైలు...
గార్డెనింగ్ చాలామందికి ఇష్టం. పొద్దునే లేచి మొక్కలకు నీళ్లుపడుతూ, వాటిని కత్తిరిస్తూ... గడపడం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్‌షైర్ కౌంటీలోని రెట్ఫోర్డ్కు చెందిన 77 ఏళ్ల పెద్దమనిషి చార్లెస్ ఫిషర్‌కు చిన్నప్పటి నుంచి రైళ్లంటే ఇష్టమట. దాంతో తన ఇంటిముందున్న గార్డెన్లో ఇదిగో ఇలా ఓ బుల్లి రైలింజన్‌ను మలిచాడు. దీనికి కార్డ్‌బోర్డ్‌తో చేసిన కళ్లు, ముక్కు తగిలించాడు. ఇంకేముంది అటుగా వెళ్లే వాళ్లంతా దీన్ని చూసి ముచ్చటపడుతున్నారట. సెల్ఫీలు దిగుతున్నారు కూడా. స్థానిక పిల్లలకైతే ఇది ఎంతో నచ్చేసిందట. అలా చార్లెస్ ఉండే వీధిని కాస్తా ఇప్పుడందరూ 'ట్రెయిన్ స్ట్రీట్' అని పిలుస్తున్నారట. -
నాటింగమ్:భారత్ లక్ష్యం 228 పరుగులు
నాటింగమ్: భారత్ ఇంగ్లండ్ టూర్ 3వ వన్డేలో ఇంగ్లండ్ జట్టు 50 ఓవర్లకు 227 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత్ పరుగుల లక్ష్యం 228గా నిర్ధేసించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నఇంగ్లండ్ ఆరంభంలో దూకుడుగా ఆడింది. ఇండియా బౌలర్లను చీకాకు పరచింది. అయితే ఆ తరువాత భారత స్పిన్నర్లు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పతిప్పలు పెట్టారు. కూక్ 44 పరుగులు, హేల్స్ 42, బెల్ 28, రూట్ 2, మోర్గాన్ 10, బట్లెర్ 42, స్టోక్స్ 2, ఓక్స్ 15, ట్రెడ్‌వెల్ 30, ఫిన్ 6 పరుగులు చేశారు. అండెర్సన్ పరుగులు ఏమీ చేయకుండా నాటౌట్‌గా నిలిచాడు. అశ్విన్ మూడు వికెట్లు, కుమార్, షమి, రైనా, రాయుడు, జడేజా ఒక్కో వికెట్ తీసుకున్నారు. -
నాటింగ్‌హామ్‌లో అంతే!
రవీంద్ర జడేజా, అండర్సన్ మధ్య వివాదం ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. భారత్, ఇంగ్లండ్ మధ్య సుదీర్ఘ టెస్టు సిరీస్ ఆరంభంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. తొలి టెస్టు రెండో రోజు లంచ్ విరామ సమయంలో జడేజాను తోసేయడంతో పాటు దూషణకు దిగిన అండర్సన్ నిషేధాన్ని ఎదుర్కొనే ప్రమాదంలో పడ్డాడు. ఇరు జట్ల కెప్టెన్లు కూడా తమ ఆటగాళ్లకే మద్దతుగా నిలిచి పరస్పర ఫిర్యాదులు నమోదు చేయడంతో వాతావరణం వేడెక్కింది. క్రికెటేతర కారణం ఈ సిరీస్‌నూ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మార్చేసింది. వరుసగా మూడో ఇంగ్లండ్ పర్యటనలోనూ భారత్ నేరుగా తమ పాత్ర లేకున్నా వివాదంలో భాగమైంది. 2007లో, ఆ తర్వాత 2011 సిరీస్‌లలో కూడా జట్టు వివాదానికి కేంద్రంగా మారింది. అయితే ఈ మూడు ఘటనలూ నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలోనే జరగడం విశేషం! -సాక్షి క్రీడా విభాగం చేదు ‘జెల్లీ’ చిన్నపిల్లల ఆటలాగా ఒక అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లో ఆటగాళ్లు ‘చిల్లర’ చేష్టలు చేస్తారా అని ఆశ్చర్యపడే విధంగా ఇంగ్లండ్ ఆటగాళ్లు వ్యవహరించారు. 2007 పర్యటనలో నాటింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టు మూడో రోజు ఈ ఘటన చోటు చేసుకుంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో జహీర్ ఖాన్ బ్యాటింగ్‌కు వచ్చే ముందు వికెట్‌కు సమీపంలో కొన్ని జెల్లీ బీన్స్ కనిపించాయి. వాటిని పక్కన పడేసిన జహీర్ ఆట కొనసాగించాడు. అయితే ఆ వెంటనే మళ్లీ జెల్లీ బీన్స్ అతనికి దగ్గరలో పడ్డాయి. దాంతో ఇది కావాలని చేస్తున్నాడని భావించిన జహీర్, అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. అంతటితో ఆగకుండా పీటర్సన్ వైపు బ్యాట్ చూపించి ‘ఏమిటిదంతా...నేను క్రికెట్ ఆడటానికి వచ్చాను’ అని హెచ్చరించాడు. పీటర్సన్ అమాయకత్వం నటిస్తే... క్రీజ్‌కు దగ్గరలో ఉన్న బెల్, కుక్ కూడా తమకేమీ తెలీదన్నారు. ఆ తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ వాన్... స్లిప్నుంచి విసరలేదన్నాడే గానీ ఎక్కడనుంచి వచ్చాయో చెప్పలేదు. ఇంగ్లండ్ మీడియా జెల్లీబీన్ గేట్ అంటూ వివాదానికి ఆజ్యం పోసింది. అన్నట్లు...ఈ ఘటన తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో రెచ్చిపోయిన జహీర్ 5 వికెట్లు తీసి భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు. ఎవరిది క్రీడా స్ఫూర్తి..? మరో నాలుగేళ్ల తర్వాత ఇదే ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలోనే ఇంగ్లండ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా... ‘క్రీడా స్ఫూర్తి లేని జట్టు’ అంటూ టీమిండియానే ఒక దశలో భారం మోయాల్సి వచ్చింది. మ్యాచ్ మూడో రోజు టీ విరామానికి ముందు ఈ ఘటన జరిగింది. రెండో సెషన్ ఆఖరి బంతిని మోర్గాన్ షాట్ కొట్టగా బౌండరీ వద్ద ప్రవీణ్ ఆపాడు. అయితే అది బౌండరీ దాటిందని భావించిన మరో బ్యాట్స్‌మన్ ఇయాన్ బెల్ తన పరుగును పూర్తి చేయకుండా టీ విరామం కోసం మైదానం వైపు కదిలాడు. బంతిని అందుకొని బెయిల్స్ గిరాటేసిన భారత ఫీల్డర్లు అప్పీల్ చేశారు. రీప్లేలో భారత్ నిబంధనల ప్రకారమే చేసిందని, అది ‘అవుట్’ అని తేలింది. అప్పీల్‌ను వెనక్కి తీసుకునేందుకు ధోని అంగీకరించలేదు. అయితే విరామ సమయంలో మరో డ్రామా జరిగింది. ఇంగ్లండ్ కెప్టెన్ స్ట్రాస్, కోచ్ ఫ్లవర్ భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చి విజ్ఞప్తి చేశారు. మరో వైపు మైదానంలో భారత్ వ్యతిరేక నినాదాలు అప్పటికే మొదలయ్యాయి. క్రీడా స్ఫూర్తి లేదంటూ ఇంగ్లండ్ అభిమానులు చెలరేగిపోయారు. చివరకు ధోని అప్పీల్ వెనక్కి తీసుకొని బెల్‌ను మళ్లీ మైదానంలోకి పిలిచాడు. అనంతరం అతను మరో 22 పరుగులు జత చేశాడు. ఈ ఘటన సమయానికే భారత్ చేతుల్లోంచి మ్యాచ్ వెళ్లిపోయినా...వివాదం మాత్రం నిలిచిపోయింది. -
మూడవ రోజు ఆట: ఇంగ్లాండ్ 352/9
నాటింగహమ్: పటౌడీ కప్ లో భాగంగా నాటింగ్ హమ్ లో జరుగుతున్న తొలిటెస్టులో భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మలు విజృభించడంతో మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఆటగాడు రూట్ 78, అండర్సన్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడవ రోజు ఆటలో భారత బౌలర్లు భువనేశ్వర్ కు 4 వికెట్లు, ఇషాంత్ శర్మ 3, షమీకి రెండు వికెట్లు పడగొట్టారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో రాబ్సన్ 59, బల్లాన్స్ 71, బ్రాడ్ 47 పరుగులు చేసి అవుటయ్యారు. 105 పరుగులు వెనకపడి ఉన్న ఇంగ్లాండ్ చేతిలో మరో వికెట్ ఉంది. -
భారత్ ఆలౌట్ 457, ఇంగ్లాండ్ 43/1