నాటింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ రెండు సంచలన విజయాలు నమోదు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లను మట్టికరిపించిన బంగ్లాదేశ్ తాము కూడా రేసులో ఉన్నామంటూ మిగతా జట్లకు సవాల్ విసురుతోంది. దీనిలో భాగంగా గురువారం ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఆస్ట్రేలియాతో బంగ్లాదేశ్ తలపడుతోంది. సాధారణంగా అయితే ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆసీస్‌కు బంగ్లాదేశ్ ఏమంత క్లిష్ట ప్రత్యర్థి కానేకాదు. కానీ ఈ మెగా టోర్నీలో ఒకే ఒక్కడి జోరు ముందు ‘కంగారూ’ పడాల్సిందే. ఆ ఒక్కడు షకీబ్ అల్ హసన్. ఈ బంగ్లా ఆల్‌రౌండర్ బ్యాట్‌తో భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. బంతితో ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాడు. దాంతో బంగ్లాదేశ్‌ను ఆసీస్ నిలువరిస్తుందా అనేది ఆసక్తికరం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు.
ఇదిలా ఉంచితే. ఇరు జట్ల ముఖాముఖి రికార్డులో 21 వన్డేలు జరగ్గా, 18 మ్యాచ్‌లను ఆసీస్ గెలుపొందగా, బంగ్లాదేశ్ ఒకదాంట్లో మాత్రమే నెగ్గింది. మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఇక ప్రపంచకప్ ముఖాముఖి రికార్డులో ఇరు జట్లు మూడుసార్లు తలపడగా, రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్ విజయం సాధించింది. ఒక మ్యాచ్ రద్దయ్యింది. దాంతో ఆసీస్‌నే ఫేవరెట్‌గా దిగుతోంది. అయితే ఊహించని విజయాలు సాధిస్తున్న బంగ్లాదేశ్ మాత్రం మరో షాక్ ఇవ్వాలని యోచిస్తోంది.
తుది జట్లు
ఆస్ట్రేలియా
ఆరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మర్కస్ స్టోయినిస్, అలెక్స్ క్యారీ, కౌల్టర్ నైల్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా
బంగ్లాదేశ్
మష్రాఫ్ మొర్తజా(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, షకీబుల్ హసన్, ముస్తాఫికర్ రహీమ్, లిటాన్ దాస్, మహ్మదుల్లా, షబ్బీర్ రహ్మాన్, మెహిదీ హసన్, రూబెల్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్
Comments
Please login to add a commentAdd a comment