
నాటింగ్‌హమ్: టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 4 నుంచి నాటింగ్‌హమ్ వేదికగా జరగనున్న తొలి టెస్టు ఆడేందుకు టీమిండియా ఇప్పటికే చేరుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లి తన భార్య అనుష్క శర్మతో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. తాను ఉంటున్న హోటల్ రూంలో అనుష్కతో కలిసి లంచ్ చేశాడు. దానికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి.
ఇక కోహ్లికి నాటింగ్‌హమ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జి మైదానంలో మంచి రికార్డు ఉంది. ఆడిన రెండు టెస్టు మ్యాచ్‌లు కలిపి కోహ్లి 209 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉండడం విశేషం. ఆగస్టు 4న మొదలుకానున్న తొలి టెస్టులో కోహ్లి ఇదే ప్రదర్శనను పునరావృతం చేయాలని జట్టు మేనేజ్‌మెంట్ ఆశిస్తుంది. కాగా కౌంటీ ఎలెవెన్‌తో మూడు రోజలు ప్రాక్టీస్ మ్యాచ్.. డర్హమ్‌లో ప్రాక్టీస్ సెషన్ అనంతరం టీమిండియా కొత్త ఉత్సాహంతో కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment