నాటింగ్‌హామ్: వరల్డ్‌కప్ చరిత్రలో పాకిస్తాన్ మరోసారి చెత్త ప్రదర్శన చేసింది. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్ 105 పరుగులకే చాపచుట్టేసింది. ఏ దశలోనే విండీస్ పేస్ బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కోలేక మూడంకెల స్కోరును దాటడానికి అష్టకష్టాలు పడింది. పాకిస్తాన్ ప్రధాన ఆటగాళ్లు ఇమాముల్ హక్(2), ఫకార్ జమాన్(22), హరీస్ సోహైల్(8), బాబర్ అజమ్(22), సర్పరాజ్ అహ్మద్(8)లు సైతం నిరాశపరచడంతో ఆ జట్టు చెత్త గణాంకాలను నమోదు చేసింది.
(ఇక్కడ చదవండి: పాకిస్తాన్ పేకమేడలా..)
కనీసం పోరాడాకుండానే చేతులెత్తేసిన పాకిస్తాన్ వంద పరుగుల మార్కును అతికష్టం మీద చేరింది. తద్వారా తమ వరల్డ్‌కప్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరును పాక్ నమోదు చేసినట్లయ్యింది. అది కూడా 27 ఏళ్ల తర్వాత ఒక వరల్డ్‌కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ అత్యల్ప స్కోరుకు పరిమితమైంది. 1992లో అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 74 పరుగులకే ఆలౌట్ కాగా, ఆ తర్వాత స్థానాన్ని తాజా మ్యాచ్ ఆక్రమించింది.
వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ టాప్-5 అత్యల్ప స్కోర్లు ఇలా ఉన్నాయి..
74 పరుగులకు ఆలౌట్- 1992లో ఇంగ్లండ్‌పై
105 పరుగులకు ఆలౌట్-2019లో వెస్టిండీస్‌పై
132 పరుగులకు ఆలౌట్-1999లో ఆసీస్‌పై
132 పరుగులకు ఆలౌట్-2007లో ఐర్లాండ్‌పై
134 పరుగులకు ఆలౌట్- 2003లో ఇంగ్లండ్‌పై
Comments
Please login to add a commentAdd a comment