Pakistan vs West Indies
-
పురుషులే అనుకున్నాం.. మహిళా క్రికెటర్లది అదే తీరు!
పాకిస్తాన్ క్రికెట్ నిలకడలేమికి మారుపేరు. ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికి తెలియదు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోవడం.. ఓడిపోవాల్సిన మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలు సాధించడం వారికి అలవాటే. అయితే ఇలాంటివి పురుషుల క్రికెట్లో బాగా చూస్తుంటాం. తాజాగా పాకిస్తాన్ మహిళల జట్టు కూడా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా ఓడిపోయింది. అది కూడా మహిళల టి20 వరల్డ్‌కప్‌లో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌ను ఓడిపోయి సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. గ్రూప్-బిలో భాగంగా ఆదివారం పాకిస్తాన్, వెస్టిండీస్ వుమెన్స్ మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. రష్దా విలియమ్స్ 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగతావారిలో క్యాంప్బెల్లె 23 పరుగులు, హేలీ మాథ్యూస్ 20 పరుగులు చేసింది. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 113 పరుగులకే పరిమితమై మూడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పాక్ బ్యాటర్లలో అలియా రియాజ్ 29 పరుగులు, నిదా దార్ 27 పరుగులు, బిస్మా మరుఫ్ 26 పరుగులు చేశారు. విండీస్ వుమెన్స్ బౌలర్లలో మాథ్యూ 2 వికెట్లు తీయగా.. అరీ ఫ్లెచర్, కరీష్మా, షమీలా కనెల్లు తలా ఒక వికెట్ తీశారు. పాక్ చివరి మూడు ఓవర్లలో 30 పరుగులు చేయాల్సిన దశలో విండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ అద్బుతంగా బౌలింగ్ చేసింది. ఆ ఓవర్లో ఒక వికెట్‌తో పాటు ఐదు పరుగులు మాత్రమే ఇచ్చుకుంది. ఆ తర్వాతి ఓవర్ చినెల్లే కూడా సూపర్‌గా వేసింది. తొలి రెండు బంతులు వైడ్ వేసినప్పటికి ఆ తర్వాత ఐదు పరుగులు ఇవ్వడంతో చివరి ఓవర్లో 18 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో పాకిస్తాన్ బ్యాటర్లు వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో సమీకరణం 2 బంతుల్లో ఐదు పరుగులుగా మారింది. అయితే ఐదో బంతికి అలియా రియాజ్ ఔట్ కావడంతో మ్యాచ్ విండీస్ వైపు తిరిగింది. చివరి బంతికి నాలుగు పరుగులు కావాల్సి ఉండగా ఒక్క పరుగు మాత్రమే రావడంతో విండీస్ మూడు పరుగుల తేడాతో సంచలన విజయం అందుకుంది. చదవండి: 'గెలిచాం.. కానీ చాలా పాఠాలు నేర్చుకున్నాం' -
వెస్టిండీస్ కెప్టెన్ అరుదైన రికార్డు.. దిగ్గజాల సరసన
వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ వన్డేల్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. బ్యాటింగ్ ప్రధానంగా ఉండే కెప్టెన్.. ఒక వన్డేల్లో బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయడం చాలా తక్కువగా చూస్తుంటాం. ఒక కెప్టెన్ బౌలింగ్‌లో ఐదు వికెట్ల ఫీట్ నమోదు చేయడం కూడా అరుదుగానే కనిపిస్తోంది. రెగ్యులర్ బౌలర్ కెప్టెన్‌గా ఐదు వికెట్లు తీయడం కొత్త కాకపోవచ్చు.. కానీ ఒక బ్యాటర్ తొలిసారి బౌలింగ్‌లో మూడు అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం అరుదు. తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో నికోలస్ పూరన్ అదే ఫీట్ నమోదు చేశాడు. బౌలింగ్‌లో సూపర్ ప్రదర్శన చేసి దిగ్గజ ఆటగాళ్ల సరసన నిలిచాడు. ఇంతకముందు వన్డే కెప్టెన్‌గా ఉంటూ బౌలింగ్‌లో మూడు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాళ్లు నలుగురు మాత్రమే. వారిలో సౌరవ్ గంగూలీ, మైక్ గాటింగ్, గ్రహం గూచ్, నవ్రోజ్ మంగల్లు మాత్రమే ఉన్నారు. పూరన్.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసి 48 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అయితే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో పాకిస్తాన్ 53 పరుగుల తేడాతో విజయం సాధించిన సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయడం విశేషం. ఇక పూరన్ పాక్‌తో మ్యాచ్‌కు ముందు వన్డేల్లో కేవలం మూడు బంతులు మాత్రమే వేశాడు. తాజాగా మాత్రం 10 ఓవర్ల కోటా బౌలింగ్ పూర్తి చేసి రెగ్యులర్ బౌలర్ తరహాలో నాలుగు వికెట్లు తీసి అందరిని ఆకట్టుకున్నాడు. ఇక పూరన్ ప్రదర్శనను మెచ్చుకున్న ఐసీసీ.. గతంలో బ్యాటింగ్ కెప్టెన్ బౌలింగ్‌లో అద్బుత ప్రదర్శన చేసిన సందర్భాలను మరోసారి గుర్తుచేసుకొంది. వాటిని ఒకసారి పరిశీలిద్దాం. సౌరవ్ గంగూలీ: టీమిండియా తరపున విజయవంతమైన కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ ఒకడు. తన కెరీర్లో 311 వన్డేలు ఆడిన గంగూలీ సరిగ్గా వంద వికెట్లు తీయడం విశేషం. ఎక్కువగా పార్ట్‌టైమ్ బౌలర్‌గా బౌలింగ్ చేసిన గంగూలీ.. ఒక కెప్టెన్‌గా 25 వన్డేల్లో 10 ఓవర్ల కోటాను పూర్తి చేశాడు. ఇక 2000లో కాన జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో గంగూలీ 10 ఓవర్లు వేసి 34 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ 68 బంతుల్లో 78 పరుగులు నాటౌట్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్రహం గూచ్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ గ్రహం గూచ్ 1989లో ఎంఆర్ఎఫ్ వరల్డ్ సిరీస్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి బౌలింగ్‌లో చెలరేగాడు. 10 ఓవర్ల కోటా బౌలింగ్ పూర్తి చేసిన గ్రహం గూచ్ 19 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. జావెంద్ మియాందాద్, సలీమ్ యూసఫ్, వసీం అక్రమ్ల రూపంలో తన ఖాతాలో వేసుకున్నాడు. గ్రహం గూచ్ దెబ్బకు పాకిసతఆన్ 148 పరుగులు చేసింది. ఆ తర్వాత 44 ఓవర్లలో ఆసీస్ విజయం అందుకుంది. మైక్ గాటింగ్: మైక్ గాటింగ్ తన కెరరీలో 10 వికెట్లు తీయగా.. అందులో మూడు వికెట్లు 1987లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో తీశాడు. 9 ఓవర్లు వేసిన గాటింగ్ 59 పరుగులిచ్చి మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తూ ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది. నౌరోజ్ మంగల్: అఫ్గన్‌కు కెప్టెన్‌గా పనిచేసిన నౌరోజ్ మంగల్ 2009లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ బౌలింగ్‌తో మెరిశాడు. 6 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన మంగల్ 35 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. కాగా నెదర్లాండ్స్ ఓపెనర్లు టెన్ డెస్కటే,ఎరిక్ క్రిన్స్కిల 113 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీసిన మంగల్ ఆ తర్వాత మరో రెండు వికెట్లు తీశాడు. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గానిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించడం విశేషం. -
పాక్ పై ఓటమి మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది: పూరన్
ఆదివారం ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన అఖరి వన్డేలో 53 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఓటమి చెందింది. తద్వారా పాక్ చేతిలో 0-3 తేడాతో విండీస్ వైట్‌వాష్‌కు గురైంది. కాగా మ్యాచ్ అనంతరం మాట్లాడిన విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్.. ఈ సిరీస్‌లో ఓటమి తమను తీవ్రంగా నిరాశ పరిచింది చెప్పాడు. త్వరలో బంగ్లాదేశ్‌తో జరగబోయే సిరీస్ కోసం తాను ఎదురు చూస్తున్నానని పూరన్ తెలిపాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, మూడు టీ20లు, మూడు వన్డేల్లో వెస్టిండీస్ తలపడనుంది. జూన్ 16 (గురువారం) నుంచి ఇరు జట్లు మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. “అఖరి రెండు మ్యాచ్‌లు మాకు నిరాశ కలిగించాయి. తొలి వన్డేలో మేం బాగా రాణించాం. తర్వాతి మ్యాచ్‌ల్లో మేము పూర్తిగా విఫలమయ్యాం. దీని ఫలితంగా సిరీస్‌కు కోల్పోయాము. ఈ పరాజయం నుంచి చాలా పాఠాలు నేర్చుకుంటాం. త్వరలో బంగ్లాదేశ్‌తో ఆడనున్నాం. ఈ సిరీస్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాము" అని పూరన్ పేర్కొన్నాడు. పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మూడో వన్డే: టాస్: పాకిస్తాన్- తొలుత బ్యాటింగ్ పాక్ స్కోరు: 269/9 (48) వెస్టిండీస్ స్కోరు: 216 (37.2) విజేత: డీఎల్ఎస్ మెథడ్‌లో 53 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షాదాబ్ ఖాన్(78 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 86 పరుగులు) చదవండి: IPL: ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకున్న సోనీ, జియో! ఒక్కో మ్యాచ్‌కు ఎంతంటే! -
Pak Vs WI: వారం రోజుల వ్యవధిలోనే అటు క్లీన్‌స్వీప్.. ఇటు వైట్‌వాష్!
Pakistan vs West Indies ODI Series: వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలోనూ పాకిస్తాన్ పైచేయి సాధించింది. వరుణుడి ఆటంకం కారణంగా 48 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో 53 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా స్వదేశంలో విండీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసి సత్తా చాటింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం నికోలస్ పూరన్ బృందం పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముల్తాన్ వేదికగా జరిగిన మొదటి రెండు మ్యాచ్‌లలో పరాజయం పాలైన వెస్టిండీస్.. మూడో వన్డేలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావించింది. కానీ, పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ 86 పరుగులతో పాక్ జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించి.. పర్యాటక జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు. ఓపెనర్లు ఫఖార్ జమాన్(35),ఇమామ్ ఉల్-హక్(62)కు తోడు షాబాద్ బ్యాట్ ఝులిపించడంతో 48 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఆతిథ్య పాక్ 269 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు టాపార్డర్ కుప్పకూలడంతో కష్టాలు తప్పలేదు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అకీల్ హుసేన్ ఒక్కడే 60 పరుగులతో మెరుగ్గా రాణించాడు. మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో 37.2 ఓవర్లలోనే విండీస్ ఆలౌట్ అయి, పాక్ చేతిలో 53 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకుంది. మూడో వన్డేలో ఓటమితో 0-3 తేడాతో వైట్‌వాష్‌కు గురైంది. కాగా ఐసీసీ వరల్డ్‌కప్ సూపర్ లీగ్‌లో భాగంగా పాక్ పర్యటన కంటే ముందు నెదర్లాండ్స్‌లో పర్యటించిన వెస్టిండీస్ జట్టు ఆతిథ్య జట్టును 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే పాక్ వచ్చి అదే రీతిలో ఆతిథ్య జట్టు చేతిలో పరాభవం చూడటం గమనార్హం. పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మూడో వన్డే: టాస్: పాకిస్తాన్- తొలుత బ్యాటింగ్ పాక్ స్కోరు: 269/9 (48) వెస్టిండీస్ స్కోరు: 216 (37.2) విజేత: డీఎల్ఎస్ మెథడ్‌లో 53 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షాదాబ్ ఖాన్(78 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 86 పరుగులు) చదవండి: Rishabh Pant: అదే మా పొరపాటు.. అందుకే ఓడిపోయాం.. ఇక మూడింటికి మూడు గెలవాల్సిందే! Dwaine Pretorius: ప్రతీసారి కలిసిరాదు.. ఈ చిన్న లాజిక్ ఎలా మరిచిపోయారు High-quality action, spectacular performances, huge crowds - it's a wrap from Multan 🙌#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/WxMWLtm2LV — Pakistan Cricket (@TheRealPCB) June 12, 2022 Excellent in his first series since comeback from injury 👏 🗣️ Player of the match @76Shadabkhan reflects on his scintillating display in the third ODI #PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/74q1UMqhft — Pakistan Cricket (@TheRealPCB) June 12, 2022 -
మ్యాచ్‌కు ఆటంకం కలిగించిన అభిమాని.. క్రికెటర్ చర్య వైరల్
పాకిస్తాన్, వెస్టిండీస్ మధ్య శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఒక సంఘటన ఆసక్తి కలిగించింది. మ్యాచ్ జరుగుతుండగానే ఒక అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. ఈ చర్యతో ఆటగాళ్లు సహా అంపైర్లు షాక్‌కు గురయ్యారు. అయితే సదరు వ్యక్తి ఎవరికి హాని కలిగించకుండా నేరుగా స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న పాక్ బ్యాటర్ షాదాబ్ ఖాన్ వద్దకు వచ్చాడు. మొదట ఆశ్చర్యంగా చూసినప్పటికి.. ఆ తర్వాత తన వద్దకు వచ్చిన అభిమానిని సంతోషంగా హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి సంతోషంగా నవ్వుకుంటూ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. కాగా షాదాబ్ ఖాన్ తన చర్యతో మిగతా క్రికెట్ ఫ్యాన్స్ మనసులు గెలుచుకున్నాడు. ఇన్నింగ్స్ 39వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఇక రెండో వన్డేలో పాకిస్తాన్ 120 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో పాకిస్తాన్ కైవసం చేసుకుంది. పాక్ విజయంలో ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజాం,మహ్మద్ నవాజ్ కీలక పాత్ర పోషించారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 155 పరుగులకే కుప్పకూలింది. విండీస్ ఇన్నింగ్స్‌లో షమర్ బ్రూక్స్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. Shadab Khan fan enter in the ground and hug him. Best moment 😍. Video of the day.#PAKvWI pic.twitter.com/c51kmIXfMl — Gokboru (@gokboru_se) June 10, 2022 చదవండి: Babar Azam: విండీస్‌తో మ్యాచ్ పాకిస్తాన్ కెప్టెన్ ‘ఇల్లీగల్ ఫీల్డింగ్’.. అందుకు మూల్యంగా.. పాక్ కెప్టెన్‌పై తిట్ల దండకం.. వీడియో వైరల్ -
Pak Vs WI: పాకిస్తాన్ కెప్టెన్ ‘ఇల్లీగల్ ఫీల్డింగ్’.. అందుకు మూల్యంగా..
Pakistan Vs West Indies: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం చర్య కారణంగా ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు లభించాయి. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో తన అనుచిత ప్రవర్తనతో ఆన్ ఫీల్డ్ అంపైర్ దృష్టిలో పడ్డాడు బాబర్. దీంతో పాక్ జట్టు ఈ మేరకు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్ ఏకపక్ష విజయం నమోదు చేయడంతో ఈ విషయం పెద్దగా ప్రభావం చూపలేదు. అసలేం జరిగిందంటే.. రీషెడ్యూల్డ్ వన్డే సిరీస్‌లో భాగంగా ముల్తాన్ వేదికగా పాక్ జట్టు వెస్టిండీస్‌తో రెండో మ్యాచ్‌లో తలపడింది. శుక్రవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్, కెప్టెన్ బాబర్ ఆజం చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పర్యాటక విండీస్ కైల్ మేయర్స్(33 పరుగులు), బ్రూక్స్(42 పరుగులు), కెప్టెన్ నికోలస్ పూరన్(25) మినహా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో ఘోర పరాజయం చవిచూసింది. ఏకంగా 120 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. అయితే, వెస్టిండీస్ ఇన్నింగ్స్ సమయంలో 29వ ఓవర్లో బాబర్ వికెట్ కీపింగ్ గ్లోవ్ తొడుక్కుని ఫీల్డింగ్ చేశాడు. కాగా క్రికెట్ చట్టాల్లోని 28.1(ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్) నిబంధన ప్రకారం.. ఫీల్డింగ్ సమయంలో వికెట్ కీపర్ తప్ప మరే ఇతర ఫీల్డర్ గ్లోవ్స్ తొడుక్కోవడానికి వీల్లేదు. లెగ్ గార్డ్స్ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఒకవేళ ఫీల్డర్ వేళ్లకు గాయమైతే అంపైర్ అనుమతి తీసుకున్న తర్వాతే గ్లోవ్స్ ధరించవచ్చు. ఈ నేపథ్యంలో తన పర్మిషన్ లేకుండా గ్లోవ్తో ఫీల్డింగ్ చేసిన బాబర్‌కు ఆన్ ఫీల్డ్ అంపైర్ శిక్ష విధించాడు. వెస్టిండీస్‌కు ఐదు పరుగులు యాడ్ చేశాడు. ఈ విషయంపై స్పందించిన నెటిజన్లు.. ‘‘రికార్డులు సాధిస్తే సరిపోదు.. కాస్త క్రమశిక్షణ కూడా ఉండాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఇలాగే ఉంటుంది’’ అని ట్రోల్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో 77 పరుగులు చేసిన బాబర్.. మూడు ఫార్మాట్లలో వరుసగా తొమ్మిది ఫిప్టీ ప్లస్ స్కోర్లను నమోదు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో విజయంతో పాక్ 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో వన్డే జూన్ 12న జరుగనుంది. పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ రెండో వన్డే స్కోర్లు పాకిస్తాన్: 275/8 వెస్టిండీస్: 155/10 ఫలితం: 120 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం End of another fantastic innings from @babarazam258 👏 He has scores of 77, 103, 105*, 114, 57 and 158 in his last six ODI innings 💪#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/tOAc1aRm0m — Pakistan Cricket (@TheRealPCB) June 10, 2022 The perfect finish 😍@Wasim_Jnr picks up three wickets on his comeback 🌟 #PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/8oL8ekoxUp — Pakistan Cricket (@TheRealPCB) June 10, 2022 A rare thing happened tonight. West Indies were awarded 5 penalty runs due to illegal fielding by Pakistan. Laws of cricket: 28.1 - No fielder other than the wicket-keeper shall be permitted to wear gloves or external leg guards. #PakvWI pic.twitter.com/WPWf1QeZcP — Mazher Arshad (@MazherArshad) June 10, 2022 -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజాం.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా..!
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 77 పరుగులు సాధించిన బాబర్.. పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో బాబర్ ఆజాం అరుదైన ఘనత సాధించాడు. మూడు ఫార్మాట్లలో వరుసగా తొమ్మిది ఫిప్టీ ప్లస్ స్కోర్లను నమోదు చేసిన తొలి ఆటగాడిగా బాబర్ నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 120 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో పాకిస్తాన్ కైవసం చేసుకుంది. స్కోర్లు పాకిస్తాన్: 275/8 వెస్టిండీస్: 155/10 ఫలితం: 120 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం మూడు ఫార్మాట్లలో గత తొమ్మిది ఇన్నింగ్స్‌లలో బాబర్ సాధించిన స్కోర్లు ►196 వర్సెస్ ఆస్ట్రేలియా (2వ టెస్టు - మార్చి 12) ►67, 55 వర్సెస్ ఆస్ట్రేలియా (3వ టెస్టు - మార్చి 21) ►57 వర్సెస్ ఆస్ట్రేలియా (తొలి వన్డే - మార్చి 29) ►114 వర్సెస్ ఆస్ట్రేలియా (రెండో వన్డే - మార్చి 31) ►105( నాటౌట్) వర్సెస్ ఆస్ట్రేలియా(మూడో వన్డే-ఏప్రిల్ 2) ►66 వర్సెస్ ఆస్ట్రేలియా(ఏకైక టీ20-ఏప్రిల్ 5 ) ►103 వర్సెస్ వెస్టిండీస్ (తొలి వన్డే - జూన్ 8) ►77 vs వెస్టిండీస్ (రెండో వన్డే - జూన్ 10) చదవండి: PAK vs WI: వెస్టిండీస్‌పై పాకిస్తాన్ ఘన విజయం.. సిరీస్ కైవసం.. -
వెస్టిండీస్‌పై పాకిస్తాన్ ఘన విజయం.. సిరీస్ కైవసం..
ఐసీసీ వరల్డ్‌కప్ సూపర్ లీగ్‌లో భాగంగా ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ 120 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో పాకిస్తాన్ కైవసం చేసుకుంది. పాక్ విజయంలో ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజాం,మహ్మద్ నవాజ్ కీలక పాత్ర పోషించారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో ఇమామ్-ఉల్-హక్(72),బాబర్ అజాం(77) పరుగులతో రాణించారు. విండీస్ బౌలర్లలో అకేల్ హోసేన్ మూడు, ఫిలిప్, జోషఫ్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 155 పరుగులకే కుప్పకూలింది. విండీస్ ఇన్నింగ్స్‌లో షమర్ బ్రూక్స్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. పాక్ బౌలర్లలో మహ్మద్ నవాజ్ నాలుగు వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు మహ్మద్ వసీం మూడు, షదాబ్ ఖాన్ రెండు, షాహిన్ ఆఫ్రిది ఒక్క వికెట్ సాధించారు. ఇక ఈ సిరీస్‌లో అఖరి వన్డే ఆదివారం జరగనుంది. చదవండి: T20 WC 2022: 'అతడు టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు బెస్ట్ ఫినిషర్ అవుతాడు' One jaffa after another! 🌟 Superstar @mnawaz94 registers his career-best figures of 𝟭𝟬-𝟬-𝟭𝟵-𝟰 🙌#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/jf8Eg05fwO — Pakistan Cricket (@TheRealPCB) June 10, 2022 -
వన్డే క్రికెట్ చరిత్రలో పాక్ బ్యాటర్స్ అరుదైన ఫీట్
వన్డే క్రికెట్ చరిత్రలో పాక్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజం, ఇమాముల్ హక్‌లు అరుదైన ఫీట్ సాధించారు. తమ కెరీర్లోనే ఈ ఇద్దరు భీకరమైన ఫామ్‌లో ఉన్నారు. కొడితే హాఫ్ సెంచరీ లేదంటే సెంచరీ అనేంతలా వీరిద్దరి ఇన్నింగ్స్‌లు ఉంటున్నాయి. తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో బాబర్ అజం, ఇమాముల్ హక్‌లు హాఫ్ సెంచరీలతో మెరిశారు. కాగా ఈ ఇద్దరికి వరుసగా ఆరో అర్థశతకం కావడం విశేషం. వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా ఒకేసారి ఇద్దరు పాక్ బ్యాట్స్మన్లు వరుసగా సమాన అర్థశతకాలు నమోదు చేయడం ఇదే మొదటిసారి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. బాబర్ ఆజం 77, ఇమాముల్ హక్ 72 పరుగులు చేసి ఔటయ్యారు. చదవండి: PAK vs WI 2nd ODI: పాక్ కెప్టెన్‌పై తిట్ల దండకం.. వీడియో వైరల్ -
పాక్ కెప్టెన్‌పై తిట్ల దండకం.. వీడియో వైరల్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంపై తోటి బ్యాటర్ తిట్ల దండకం అందుకున్నాడు. అనవసరంగా రనౌట్ చేశాడన్న కారణంతో పాక్ కెప్టెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. 17 పరుగులు చేసి ఫఖర్ జమాన్ ఔటైన తర్వాత బాబర్ ఆజం క్రీజులోకి వచ్చాడు. మరో ఓపెనర్ ఇమాముల్ హక్‌తో కలిసి పాక్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఇద్దరి మధ్య రెండో వికెట్‌కు 120 పరుగులు కీలక భాగస్వామ్యం కూడా ఏర్పడింది. తమ బ్యాటింగ్‌తో ప్రమాదకరంగా మారుతున్న సమయంలో బాబర్ ఆజం చేసిన చిన్న తప్పు వికెట్ పడేలా చేసింది. ఇన్నింగ్స్ 28వ ఓవర్లో అకీల్ హొసేన్ బౌలింగ్‌కు వచ్చాడు. ఇమాముల్ హక్ మిడ్‌వికెట్ దిశగా ఆడి సింగిల్‌కు ప్రయత్నించాడు. అయితే బంతి ఎక్కువ దూరం వెళ్లకపోవడంతో బాబర్ పరుగు తీయలేదు. అయితే అప్పటికే ఇమాముల్ హక్ సగం క్రీజు దాటి నాన్‌స్ట్రైకర్ ఎండ్‌కు వచ్చేశాడు. బాబర్ పిలుపుతో వెనక్కి వెళ్లినప్పటికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బంతిని అందుకున్న షెయ్ హోప్ వికెట్లను గిరాటేయడంతో ఇమాముల్ హక్ 72 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. అంతే ఇమాముల్ హక్‌లో కోపం కట్టలు తెచ్చుకుంది. పెవిలియన్‌కు వెళ్తూ బ్యాట్‌ను కింద కొట్టుకుంటూనే తిట్ల దండకం అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత బాబర్ ఆజం 77 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓవరాల్‌గా పాకిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. కాగా బాబర్ ఆజం, ఇమాముల్ హక్లకు ఇది వరుసగా ఆరో అర్థసెంచరీలు కావడం విశేషం. చదవండి: దీనస్థితిలో ఉత్తరాఖండ్ రంజీ ఆటగాళ్లు .. రోజూవారి వేతనం తెలిస్తే షాకవుతారు 'కిల్లర్' మిల్లర్ అనగానే ఆ ఎపిక్ ఎంట్రీ గుర్తుకురావడం ఖాయం View this post on Instagram A post shared by Pakistan Cricket (@therealpcb) -
కోహ్లి రికార్డు బద్దలు.. వన్డేల్లో బాబర్ ఆజాం అరుదైన ఫీట్..!
వన్డే క్రికెట్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం అరుదైన ఘనత సాధించాడు. కెప్టెన్‌గా అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా బాబర్ రికార్డులకెక్కాడు. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 103 పరుగులు చేసిన బాబర్.. ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుమందు ఈ ఘనత టీమిండియా స్టార్ ఆటగాడు,మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి ఈ రికార్డును 17 ఇన్నింగ్స్‌లలో సాధించగా.. బాబర్ కేవలం 13 ఇన్నింగ్స్‌లోనే తన పేరిట లిఖించుకున్నాడు. మరోవైపు వన్డే క్రికెట్ చరిత్రలో డబుల్ హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా బాబర్ నిలిచాడు. విరాట్ కోహ్లి వర్సెస్ బాబర్ ఆజం: ►బాబర్ ఆజాం 86 వన్డేల్లో 17 సెంచరీలు సాధించగా.. కోహ్లి 260 వన్డేల్లో 43 సెంచరీలు చేశాడు. ►బాబర్ ఆజం కేవలం 13 ఇన్నింగ్స్‌ల్లోనే కెప్టెన్‌గా అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ►కోహ్లి 17 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. ►విరాట్ కోహ్లీ వన్డే సగటు 58.07 కాగా, బాబర్ ఆజం సగటు 59.78. ►బాబర్ ఆజం రెండు సార్లు హ్యాట్రిక్ సెంచరీలు సాధించాడు చదవండి: PAK vs WI: వన్డేల్లో చరిత్ర సృష్టించిన పాక్ కెప్టెన్.. తొలి ఆటగాడిగా..! -
బాబర్ ఆజం ఊహించని చర్య.. ఆ ఆటగాడి కోసం!
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం తన క్రీడా స్పూర్తితో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో పాక్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ బాబర్ ఆజాం(103) సెంచరీతో చెలరేగి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో బాబర్ ఆజాంకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే బాబర్ అందరనీ ఆశ్చర్యపరుస్తూ.. తనకు దక్కిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ ఖుష్దిల్ షాకు బాబర్ అందజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక బాబర్ క్రీడా స్పూర్తికి అభిమానులు ఫిదా అవుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ఖుష్దిల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అఖరి ఓవర్ వరకు జరిగిన ఈ మ్యాచ్‌లో.. కేవలం 23 బంతుల్లోనే 41 పరుగులు సాధించి జట్టుకు ఖుష్దిల్ అద్భుతమైన విజయాన్ని అందించాడు. పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మొదటి వన్డే: ♦టాస్- వెస్టిండీస్- బ్యాటింగ్ ♦వెస్టిండీస్ స్కోరు: 305/8 (50) ♦పాకిస్తాన్ స్కోరు: 306/5 (49.2) ♦విజేత: పాకిస్తాన్.. 5 వికెట్ల తేడాతో పర్యాటక విండీస్‌పై విజయం చదవండి: PAK vs WI: వన్డేల్లో చరిత్ర సృష్టించిన పాక్ కెప్టెన్.. తొలి ఆటగాడిగా..! Beautiful gesture from the skipper 😍@babarazam258 gives his player of the match award to @KhushdilShah_ 🏆👏#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/7BrSiV7TyL — Pakistan Cricket (@TheRealPCB) June 8, 2022 -
PAK vs WI: వన్డేల్లో చరిత్ర సృష్టించిన పాక్ కెప్టెన్.. తొలి ఆటగాడిగా..!
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం వన్డే క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో బాబర్ సెంచరీతో చెలరేగాడు. కాగా ఏడాదిలో వన్డేల్లో బాబర్‌కు ఇది వరుసగా మూడో సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలో బాబర్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో రెండుసార్లు వరుసగా హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా బాబర్ ఆజాం రికార్డులకెక్కాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అఖరి రెండు మ్యాచ్‌ల్లో బాబర్ వరుసగా సెంచరీలు సాధించాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్ తర్వాత స్వదేశంలో విండీస్‌తో పాక్ తలపడతోంది. విండీస్‌తో ఆడిన తొలి వన్డేలోనే బాబర్ సెంచరీ సాధించాడు. తద్వారా ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 2016లో యూఏఈ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి సారిగా బాబర్ వరుసగా మూడు సెంచరీలు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముల్తాన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో విండీస్‌పై పాక్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో షాయీ హోప్ 127,బ్రూక్స్ 70 పరుగులతో రాణించారు. అనంతరం 306 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బాబర్ ఆజం(103) సెంచరీతో చెలరేగాడు. పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మొదటి వన్డే: ♦టాస్- వెస్టిండీస్- బ్యాటింగ్ ♦వెస్టిండీస్ స్కోరు: 305/8 (50) ♦పాకిస్తాన్ స్కోరు: 306/5 (49.2) చదవండి: SL Vs Aus: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా! మా ఓటమికి కారణం అదే! The moment @babarazam258 etched his name in the record books 🙏#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/D7caU729F3 — Pakistan Cricket (@TheRealPCB) June 8, 2022 -
Pak Vs WI: విండీస్‌కు షాక్.. పాక్ చేతిలో పరాజయం
West Indies tour of Pakistan, 2021-22: 1st ODI- నెదర్లాండ్స్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసి పాకిస్తాన్లో అడుగుపెట్టిన వెస్టిండీస్‌కు ఓటమి ఆహ్వానం పలికింది. మొదటి వన్డేలో పాకిస్తాన్ చేతిలో విండీస్ పరాజయం పాలైంది. నికోలస్ పూరన్ బృందంపై 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. కాగా కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డ వన్డే సిరీస్ ఆడేందుకు విండీస్ జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం(జూన్ 8) ముల్తాన్ వేదికగా పాక్- విండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ఓపెనర్ షాయీ హోప్ 127 పరుగులతో విండీస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బ్రూక్స్ సైతం 70 పరుగులతో రాణించాడు. అయితే, నెదర్లాండ్స్ పర్యటనలో తీవ్రంగా నిరాశ పరిచిన కెప్టెన్ నికోలస్ పూరన్ మరోసారి విఫలమయ్యాడు. కేవలం 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రోవ్‌మన్ పావెల్ 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఇక విండీస్ విధించిన లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ ఆదిలోనే ఓపెనర్ ఫఖార్ జమాన్(11 పరుగులు) వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్(65) బ్యాట్ ఝులిపించడంతో ఊపిరి పీల్చుకుంది. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ బాబర్ ఆజమ్ 103 పరుగుల భారీ స్కోరుతో పాక్ విజయానికి బాటలు వేశాడు. మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అర్ధ శతకం(59పరుగులు) ఆకట్టుకోగా.. ఖుష్ దిల్ షా 23 బంతుల్లోనే 41 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. పాకిస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ సూపర్ లీగ్‌లో భాగంగా ఈ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మొదటి వన్డే: ♦టాస్- వెస్టిండీస్- బ్యాటింగ్ ♦వెస్టిండీస్ స్కోరు: 305/8 (50) ♦పాకిస్తాన్ స్కోరు: 306/5 (49.2) ♦విజేత: పాకిస్తాన్.. 5 వికెట్ల తేడాతో పర్యాటక విండీస్‌పై విజయం 🔥🔥🔥 🔊🔛 @KhushdilShah_ sends the ball sailing for THREE 6️⃣s in a row! 💪#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/JBRxSN5Ihi — Pakistan Cricket (@TheRealPCB) June 8, 2022 .@KhushdilShah_ THE FINISHER 💥 Unbelievable striking from the southpaw! 😍#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/MDqnCK3abS — Pakistan Cricket (@TheRealPCB) June 8, 2022 🏏 𝟒𝟏* (23) 💥 𝟒 massive sixes ⚡ 𝟏𝟕𝟖.𝟐𝟔 strike rate 🗣️ Player of the match @KhushdilShah_ reflects on his explosive knock and his power-hitting prowess 💪 #PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/bNqPo2v848 — Pakistan Cricket (@TheRealPCB) June 8, 2022 -
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన పాకిస్తాన్.. స్టార్ ఆటగాడు వచ్చేశాడు
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును సోమవారం ప్రకటించింది. ఈ జట్టకు బాబర్ ఆజాం సారథ్యం వహించనున్నాడు. ఇక గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కాగా ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్‌కు 21 మంది సభ్యులను ఎంపిక చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సెలెక్టర్లు .. ఈ సారి ఆ సంఖ్యను 16కు తగ్గించారు. దీంతో జట్టుకు ఆసిఫ్ అఫ్రిది, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, ఉస్మాన్ ఖాదిర్ వంటి ఆటగాళ్లు దూరమయ్యారు. ఇక ఇరు జట్లు మధ్య తొలి వన్డే రావల్పిండి వేదికగా జూన్ 8న జరగనుంది. పాకిస్తాన్ జట్టు బాబర్ ఆజాం(కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమామ్-ఉల్-హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ వసీం జూనియర్, షాహీన్ షా ఆఫ్రిది, షానవాజ్ దహానీ, జాహిద్ మహమూద్ చదవండి: IPL 2022: ప్లే ఆఫ్ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయితే..? -
హోల్డర్‌కు రెస్ట్.. నెదర్లాండ్స్, పాక్‌తో సిరీస్‌కు విండీస్ జట్టు ఇదే!
నెదర్లాండ్స్, పాకిస్తాన్‌తో పర్యటనల నేపథ్యంలో వెస్టిండీస్ తమ క్రికెట్ జట్టును ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ల కోసం 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేసింది. ఐసీసీ ప్రపంచకప్ సూపర్‌లీగ్‌లో భాగంగా జరుగనున్న ఈ సిరీస్‌లతో పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా నికోలస్ పూరన్ తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. ఇక పూరన్ నాయకత్వంలోని ఈ జట్టులో కొత్త ముఖాలు జేడెన్ సీల్స్, షెర్మోన్ లూయిస్, కీసీ కార్టీకి చోటు దక్కింది. జేడెన్, షెర్మోన్ ఫాస్ట్ బౌలర్లు కాగా.. కార్టీ బ్యాటర్. కాగా మే 31న నెదర్లాండ్స్‌తో విండీస్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2022లో భాగమైన పూరన్, పావెల్, రొమారియో షెఫర్డ్ తదితరులు లీగ్ ముగిసిన వెంటనే జాతీయ జట్టుతో కలవనున్నారు. ఇక లక్నో సూపర్జెయింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న జేసన్ హోల్డర్‌కి మాత్రం సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. నెదర్లాండ్స్, పాకిస్తాన్‌తో వన్డే సిరీస్లకై వెస్టిండీస్ 15 మంది సభ్యులతో కూడిన జట్టు: 👉🏾నికోలస్ పూరన్(కెప్టెన్), షాయ్ హోప్(వైస్ కెప్టెన్), ఎన్క్రుమా బానర్, షామర్ బ్రూక్స్, కేసీ కార్టీ, అకీల్ హొసేన్, అల్జరీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, షెర్మోన్ లూయిస్, కైల్ మేయర్స్, అండర్సన్ ఫిలిప్, రోవ్‌మన్ పావెల్, జేడెన్ సీల్స్, రొమారియో షెఫర్డ్, హైడెన్ వాల్ష్ జూనియర్. వెస్టిండీస్ నెదర్లాండ్స్ టూర్ 2022 షెడ్యూల్: 👉🏾మే 31- మొదటి వన్డే- వీఆర్ఏ క్రికెట్ గ్రౌండ్- అమ్స్టెల్వీన్ 👉🏾జూన్ 2- రెండో వన్డే- వీఆర్ఏ క్రికెట్ గ్రౌండ్- అమ్స్టెల్వీన్ 👉🏾జూన్ 4- మూడో వన్డే-వీఆర్ఏ క్రికెట్ గ్రౌండ్- అమ్స్టెల్వీన్ వెస్టిండీస్ పాకిస్తాన్ టూర్ 2022 షెడ్యూల్ 👉🏾జూన్ 8- మొదటి వన్డే- పిండి స్టేడియం- రావల్పిండి 👉🏾జూన్ 10- రెండో వన్డే- పిండి స్టేడియం- రావల్పిండి 👉🏾జూన్ 12- మూడో వన్డే- పిండి స్టేడియం- రావల్పిండి చదవండి👉🏾Jasprit Bumrah: నాకు అవన్నీ తెలుసు.. అయినా నేను అలాంటి వాడిని కాదు: బుమ్రా -
Pak Vs WI ODI Series: విండీస్‌తో మూడు వన్డేలు.. త్వరలోనే టీ20 సిరీస్ కూడా!
ICC World Cup Super League Pakistan Vs West Indies: వెస్టిండీస్‌తో స్వదేశంలో జరుగబోయే వన్డే సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రకటించింది. జూన్ 8 నుంచి జూన్ 12 వరకు మూడు వన్డేలు ఆడనున్నట్లు పేర్కొంది. కాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం విండీస్ జట్టు పాకిస్తాన్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఐసీసీ వరల్డ్‌కప్ సూపర్ లీగ్‌లో భాగంగా ఈ సిరీస్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి పీసీబీ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. రావల్పిండిలో ఈ మ్యాచ్‌లు జరుగనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు.. ‘‘ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ సూపర్‌లీగ్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జూన్ 8 నుంచి 12 మధ్య జరిగే సిరీస్‌కు రావల్పిండి ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందుకోసం వెస్టిండీస్ జట్టు జూన్ 5న ఇస్లామాబాద్‌కు చేరుకుంటుంది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో డిసెంబరు 2021లో జరగాల్సిన ఈ సిరీస్‌ను రీ షెడ్యూల్ చేసేందుకు ఇరు వర్గాల అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతేకాదు అప్పుడు జరగాల్సిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా 2023లో వీలైనంత త్వరగా ఆడటానికి విండీస్ బోర్డు అంగీకారం తెలిపింది. ఇందుకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తాం’’ అని పీసీబీ వెల్లడించింది. పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ వన్డే సిరీస్ రావల్పిండిలోని పిండి స్టేడియం వేదికగా మూడు తొలి వన్డే: జూన్ 8 రెండో వన్డే: జూన్ 10 మూడో వన్డే: జూన్ 12 చదవండి: IPL 2022: ఎవరీ ఆయుష్ బదోని.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు IPL 2022 GT Vs LSG: అతడొక సంచలనం; తను నన్ను అవుట్ చేశాడు, నేను గెలిచా.. కుటుంబం మొత్తం హ్యాపీ: హార్దిక్ పాండ్యా -
ఇది పాక్ క్రికెటర్లకే సాధ్యం.. 13 ఏళ్లకు సేమ్‌సీన్ రిపీట్
వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగిన టి20 సిరీస్‌ను పాకిస్తాన్ గెలుచుకుందనే విషయం కంటే మరొక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాఫిక్‌గా మారింది. పాకిస్తాన్ ఆటగాళ్లు ఇఫ్తికార్ అహ్మద్, మొహ్మద్ హస్నేన్లు చేసిన పని పాక్ జట్టును ట్రోల్స్ బారిన పడేలా చేసింది. ఇద్దరి మధ్య ఏర్పడిన సమన్వయ లోపంతో విండీస్ బ్యాట్స్‌మన్ బ్రూక్స్ ఇచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేశారు. తప్పు నీదంటే నీది అని కాసేపు వాదోపవాదాలు చేసుకున్నారు. ఆ సమయంలో తమ చెత్త ఫీల్డింగ్‌తో 13 ఏళ్ల కింద జరిగిన సంఘటనను రీక్రియేట్ చేశామని పాపం వారికి తెలియదు. ఇదే వారి కొంపముంచింది. అసలు విషయం ఏంటంటే.. 2008లో అచ్చం ఇదే తరహాలో షోయబ్ మాలిక్, సయీద్ అజ్మల్‌లు సమన్వయ లోపంతో ఒక క్యాచ్‌ను వదిలేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అప్పుడు, ఇప్పుడు ప్రత్యర్థి వెస్టిండీస్ కావడం విశేషం. సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ ఇఫ్తికార్ అహ్మద్, మొహ్మద్ హస్నేన్లను ట్యాగ్ చేస్తూ.. మాలిక్, అజ్మల్ 2.0 అంటూ ట్రోల్ చేశారు. ''ఏదైనా పాక్ క్రికెటర్లకే సాధ్యం.. చరిత్రను తిరగరాశారు''.. '' హస్నేన్ క్యాచ్ వదిలేసి సయీద్ అజ్మల్ గౌరవాన్ని పెంచాడు.''.. ''న్యూ అజ్మల్, మాలిక్‌లు.. బట్ సేమ్ ఓల్డ్ వెస్టిండీస్'' అంటూ కామెంట్స్ పెట్టారు. Hasnain & ifti 🤝 Malik & ajmal On both occasions opponent was west indies 😂😂❤️ #PAKvWI pic.twitter.com/YQj12liy5P — Saad Irfan 🇵🇰 (@SaadIrfan967) December 16, 2021 -
కోపంతో ఊగిపోయిన బౌలర్.. తన స్టైల్లో ప్రతీకారం
పాకిస్తాన్, వెస్టిండీస్ మధ్య ముగిసిన మూడో టి20లో ఒక ఆసక్తికరఘటన చోటుచేసుకుంది. వెస్టిండీస్ బ్యాటింగ్ సమయంలో పాకిస్తాన్ బౌలర్ మహ్మద్ వసీమ్ జూనియర్ తన స్టైల్లో ప్రతీకారం తీర్చుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. వెస్టిండీస్ పవర్‌ప్లేలో బౌండరీలు, సిక్సర్ల మోత మోగిస్తూ దాటిగా ఆడుతుంది. తొలి పవర్‌ప్లే ఆఖరి ఓవర్‌ను మహ్మద్ వసీమ్ వేశాడు. చదవండి: Mohammad Rizwan: టి20 క్రికెట్లో పాక్ ఓపెనర్ కొత్త చరిత్ర.. ఒక్క ఏడాదిలోనే ఓవర్ ఐదో బంతిని 43 పరుగులతో దూకుడుగా ఆడుతున్న బ్రాండన్ స్టార్క్ వెనక్కి జరిగి స్క్వేర్‌లెగ్ దిశగా భారీ సిక్సర్ కొట్టాడు. అతని దెబ్బకు బంతి వెళ్లి రూఫ్‌టాప్ మీద పడింది. దీంతో కోపంతో ఊగిపోయిన మహ్మద్ వసీమ్ తర్వాతి బంతికే దెబ్బకు దెబ్బ తీశాడు. ఓవర్ చివరి బంతిని వసీమ్ గుడ్‌లెంగ్త్‌తో వేయగా.. బ్రాండన్ కింగ్ వెనక్కి జరిగి షాట్ ఆడాలనుకున్నాడు. కానీ బంతి మిస్ అయి ఆఫ్‌స్టంప్‌ను ఎగురగొట్టింది. దీంతో వసీమ్ తన స్టైల్లో వెళ్లు.. పెవిలియన్ వెళ్లు.. అంటూ సైగలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోనూ పాకిస్తాన్ క్రికెట్ తన ట్విటర్లో షేర్ చేసింది. ఇక మహ్మద్ వసీమ్ ఈ సిరీస్‌లో విశేషంగా రాణించాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ పూరన్, బ్రూక్స్, బ్రాండన్ కింగ్ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అయితే బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్(87), బాబర్(79) అజమ్‌లు చెలరేగడంతో 18.5 ఓవర్లో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో మూడు టి20ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. కరోనా కారణంగా శనివారం నుంచి జరగాల్సిన వన్డే సిరీస్‌ను జూన్ 2022లో నిర్వహించాలని ఇరుబోర్డులు ఒక అంగీకారానికి వచ్చాయి. చదవండి: చంపేస్తానంటూ హెచ్చరిక.. ఆటగాడిపై జీవితకాల నిషేధం pic.twitter.com/Y0LwFWWKbk — Pakistan Cricket (@TheRealPCB) December 16, 2021 -
టి20 క్రికెట్లో పాక్ ఓపెనర్ కొత్త చరిత్ర
Mohammad Rizwan First Batter Reach 2000 Runs T20Is Single Calender Year.. పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ టి20 క్రికెట్లో కొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే క్యాలండర్ ఇయర్లో టి20 క్రికెట్లో 2వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా మహ్మద్ రిజ్వాన్ రికార్డులకెక్కాడు. కరాచీ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన చివరి టి20లో 45 బంతుల్లోనే 87 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రిజ్వాన్.. ఒక్క ఏడాదిలోనే అంతర్జాతీయ, ఇతర లీగ్‌లు కలిపి 2వేల పరుగులు సాధించాడు. చదవండి: చంపేస్తానంటూ హెచ్చరిక.. ఆటగాడిపై జీవితకాల నిషేధం అతనికి తోడుగా మరో ఓపెనర్ బాబర్ అజమ్ కూడా 79 పరుగులు చేయడంతో పాకిస్తాన్ 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. అంతకముందు వెస్టిండీస్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (64), బ్రూక్స్ (49), బ్రెండన్ కింగ్ (43) చెలరేగారు. స్టిండీస్తో జరిగిన మూడు టి20ల సిరీస్‌ను పాకిస్తాన్ 3–0తో సొంతం చేసుకుంది. ఇక ఇరుజట్ల నుంచి ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండడంతో విండీస్ పూర్తి జట్టును బరిలోకి దింపగలదా అనే అనుమానం కనిపించింది. అయితే ఏదో రకంగా చివరి టి20 ఆడే విధంగా విండీస్‌ను పాక్ బోర్డు ఒప్పించగలిగింది. అయితే శనివారంనుంచి జరగాల్సిన వన్డే సిరీస్‌ను ప్రస్తుతానికి రద్దు చేసి జూన్ 2022లో మళ్లీ జరిపేందుకు ఇరు బోర్డులు అంగీకరించాయి. చదవండి: పాక్ క్రికెట్‌కు కరోనా కాటు.. మరో సిరీస్ వాయిదా -
పాక్ క్రికెట్‌కు కరోనా కాటు.. మరో సిరీస్ వాయిదా
West Indies Vs Pakistan ODI Series: గత కొంతకాలంగా వివిధ కారణాల చేత పాకిస్థాన్‌లో జరగాల్సిన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు రద్దవుతూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కరోనా కారణంగా ఆ దేశంలో జరగాల్సిన మరో సిరీస్ వాయిదా పడింది. ఇప్పటికే పాక్ పర్యటనలో ఉన్న విండీస్ జట్టులో కరోనా కేసులు నమోదవ్వడంతో ఇరు జట్ల మధ్య జరగాల్సిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ వచ్చే ఏడాది(2022) జూన్‌కు వాయిదా పడింది. విండీస్ క్యాంపులో తాజాగా మరో ఐదుగురు(మొత్తం 9 మంది) కరోనా బారినపడడంతో ఇరు జట్లు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) గురువారం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ఇదిలా ఉంటే, విండీస్ క్యాంప్‌లో గురువారం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో 15 మంది ఆటగాళ్లకు నెగిటివ్ రిపోర్ట్ రావడంతో పాక్‌తో జరగాల్సిన మూడో టీ20 యధాతథంగా కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్.. తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. బ్రెండన్ కింగ్(21 బంతుల్లో 43; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రూక్స్(31 బంతుల్లో 49; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), పూరన్(37 బంతుల్లో 64; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), డారెన్ బ్రావో(27 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) చెలరేగి ఆడారు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన పాక్ ఇదివరకే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. చదవండి: Ashes 2nd Test: ఇంగ్లండ్ బౌలర్ అరుదైన ఘనత.. -
బాబర్ అజమ్ మరీ ఇంత బద్దకమా!
PAK vs WI: Babar Azam Run Out Viral.. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టి20లో బాబర్ అజమ్ రనౌట్ అయిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విండీస్ స్పిన్నర్ ఏకియల్ హొస్సేన్ వేసిన మూడో ఓవర్ మూడో బంతిని మహ్మద్ రిజ్వాన్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. అయితే క్విక్ సింగిల్ తీయొచ్చనే ఉద్దేశంతో రిజ్వాన్ నాన్ స్ట్రైక్ ఎండ్‌వైపు పరిగెత్తాడు. కాల్ అందుకున్న బాబార్ అజమ్ కూడా పరిగెత్తినప్పటికి సకాలంలో క్రీజులోకి చేరుకోలేకపోయాడు. ఇంతలో బంతిని అందుకున్న హెడెన్ వాల్ష్ కీపర్ పూరన్‌కు త్రో విసిరాడు. చదవండి: PAK Vs WI: ప్రపంచ రికార్డు సాధించిన పాకిస్తాన్.. ఏకైక జట్టుగా! దీంతో బాబర్ అజమ్ క్రీజుకు చాలా దూరంలో ఉండగానే పూరన్ బెయిల్స్ ఎగురగొట్టడంతో బాబర్ రనౌటయ్యాడు. ప్రస్టేషన్‌తో బాబర్ అజమ్ పెవిలియన్‌కు వెళ్తూ బ్యాట్‌ను కోపంతో కొట్టడం కెమెరాలకు చిక్కింది. దీంతో బాబర్ అజమ్‌ను క్రికెట్ ఫ్యాన్స్ తమదైన శైలిలో ట్రోల్ చేశారు. ''బాబర్ అజమ్ మరీ ఇంత బద్దకమా.. నీకు వయసు అయిపోతుంది.. సింగిల్ వద్దు అనుకుంటే రిజ్వాన్‌కు కాల్ ఇవ్వాల్సింది..'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్‌లో పాకిస్తాన్ తొమ్మిది పరుగుల తేడాతో నెగ్గి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. తొలుత పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. రిజ్వాన్ (38; 4 ఫోర్లు, 1 సిక్స్), ఇఫ్తిఖార్ అహ్మద్ (32; 1 ఫోర్, 2 సిక్స్‌లు), హైదర్ అలీ (31; 4 ఫోర్లు) రాణించారు. విండీస్ 20 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. బ్రాండన్ కింగ్ (67; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), షెపర్డ్ (35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడారు. చివరి ఓవర్లో గెలుపు కోసం 23 పరుగులు చేయాల్సిన స్థితిలో వెస్టిండీస్ 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ పేసర్ షాహీన్ అఫ్రిది 3 వికెట్లు తీశాడు. చివరి టి20 గురువారం జరుగుతుంది. Early loss for Pakistan, Babar Azam in run out!#PAKvWI#HumTouKhelainGey pic.twitter.com/wNWyZVt2fa — Pakistan Cricket (@TheRealPCB) December 14, 2021 -
చెలరేగిన షాహిన్ అఫ్రిది.. పాకిస్తాన్‌దే టి20 సిరీస్
కరాచీ: వెస్టిండీస్‌తో రెండో టి20 క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ తొమ్మిది పరుగుల తేడాతో నెగ్గి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. తొలుత పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. రిజ్వాన్ (38; 4 ఫోర్లు, 1 సిక్స్), ఇఫ్తిఖార్ అహ్మద్ (32; 1 ఫోర్, 2 సిక్స్‌లు), హైదర్ అలీ (31; 4 ఫోర్లు) రాణించారు. విండీస్ 20 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. బ్రాండన్ కింగ్ (67; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), షెపర్డ్ (35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడారు. చివరి ఓవర్లో గెలుపు కోసం 23 పరుగులు చేయాల్సిన స్థితిలో వెస్టిండీస్ 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ పేసర్ షాహీన్ అఫ్రిది 3 వికెట్లు తీశాడు. చివరి టి20 గురువారం జరుగుతుంది. -
Pak Vs WI: విండీస్ 137 పరుగులకే ఆలౌట్.. పాకిస్తాన్ ఘన విజయం
T20 Series- Pakistan Won In 1st T20 Against West Indies: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో పాకిస్తాన్ 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా పాక్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. మొహమ్మద్ రిజ్వాన్ (52 బంతుల్లో 78; 10 ఫోర్లు), హైదర్ అలీ (39 బంతుల్లో 68; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా...చివర్లో నవాజ్ (10 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. అనంతరం విండీస్ 19 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. షై హోప్ (26 బంతుల్లో 31; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. వసీమ్ (4/40), షాదాబ్ ఖాన్ (3/17) ప్రత్యర్థిని పడగొట్టారు. హైదర్ అలీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పాక్ 1–0తో ఆధిక్యంలో నిలవగా, రెండో మ్యాచ్ నేడు ఇదే మైదానంలో జరుగుతుంది. స్కోర్లు: పాకిస్తాన్- 200/6 (20) వెస్టిండీస్- 137 (19) Player of the match @iamhaideraly reviews his 68-run innings.#PAKvWI #HumTouKhelainGey pic.twitter.com/WSw3OxZsXN — Pakistan Cricket (@TheRealPCB) December 13, 2021 It's a WRAP from the National Stadium Karachi! Pakistan win by 63 runs and go 1-0 in three-match #PAKvWI T20I series.#HumTouKhelainGey pic.twitter.com/QqGvlhgauZ — Pakistan Cricket (@TheRealPCB) December 13, 2021 But falls to @76Shadabkhan shortly after pic.twitter.com/UnejzC7gKw — Pakistan Cricket (@TheRealPCB) December 13, 2021 -
వెస్టిండీస్ జట్టులో కరోనా కలకలం
పాకిస్తాన్ పర్యటనలో వెస్టిండీస్‌కు షాక్ తగిలింది. సిరీస్ ప్రారంభానికి ముందు నిర్వహించిన కరోనా పరీక్షలో ముగ్గురు ఆటగాళ్లు సహా సిబ్బందిలో ఒకరికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని విండీస్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా కోవిడ్ పాజిటివ్‌గా తేలిన క్రికెటర్లు రోస్టన్ చేజ్, కైల్ మేయర్స్, షెల్డన్ కాట్రెల్లతో పాటు సిబ్బందిలో ఒకరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపింది. చదవండి: Omicron cases: బంగ్లా క్రికెట్ జట్టులో ఒమిక్రాన్ కలకలం.. ఇద్దరికి నిర్ధారణ మిగతా ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహించగా.. కోవిడ్ నెగెటివ్ అని తేలడంతో సిరీస్ యథాతదంగా జరుగుతుందని విండీస్ బోర్డు పేర్కొంది. కాగా పాకిస్తాన్ పర్యటనలో విండీస్ జట్టు మూడు టి20లు.. మూడు వన్డేలు ఆడనుంది. డిసెంబర్ 13, 14, 16 తేదీల్లో మూడు టి20లు జరగనుండగా.. డిసెంబర్ 18 నుంచి 22 మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి.