
పాకిస్తాన్ పర్యటనలో వెస్టిండీస్‌కు షాక్ తగిలింది. సిరీస్ ప్రారంభానికి ముందు నిర్వహించిన కరోనా పరీక్షలో ముగ్గురు ఆటగాళ్లు సహా సిబ్బందిలో ఒకరికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని విండీస్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా కోవిడ్ పాజిటివ్‌గా తేలిన క్రికెటర్లు రోస్టన్ చేజ్, కైల్ మేయర్స్, షెల్డన్ కాట్రెల్‌లతో పాటు సిబ్బందిలో ఒకరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపింది.
చదవండి: Omicron cases: బంగ్లా క్రికెట్ జట్టులో ఒమిక్రాన్ కలకలం.. ఇద్దరికి నిర్ధారణ
మిగతా ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహించగా.. కోవిడ్ నెగెటివ్ అని తేలడంతో సిరీస్ యథాతదంగా జరుగుతుందని విండీస్ బోర్డు పేర్కొంది. కాగా పాకిస్తాన్ పర్యటనలో విండీస్ జట్టు మూడు టి20లు.. మూడు వన్డేలు ఆడనుంది. డిసెంబర్ 13, 14, 16 తేదీల్లో మూడు టి20లు జరగనుండగా.. డిసెంబర్ 18 నుంచి 22 మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment