
నాటింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్ టోర్నీని పాకిస్తాన్ జట్టు దారుణంగా ఆరంభించింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 105 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవిచూసింది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన వెస్టిండీస్‌కు పాకిస్తాన్ దాసోహమైంది. దాంతో పాకిస్తాన్ జట్టుపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. ఏ మాత్రం పోటీ లేకుండా లొంగిపోయిన పాకిస్తాన్‌ను ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. అందులో కొన్ని సెటైర్లను చూద్దాం. ‘నేను మ్యాచ్ చూసే క్రమంలో గ్రౌండ్‌కు రావడానికి పట్టిన సమయ 125 నిమిషాలు అయితే, పాకిస్తాన్ ఇన్నింగ్స్ మాత్రం 111 నిమిషాల్లోనే ముగిసింది’ అని ఒకరు ఎద్దేవా చేయగా, ఇంగ్లండ్‌కు పాకిస్తాన్ 38 రోజలు ముందు వస్తే, మ్యాచ్‌ను 38 నిమిషాల్లో ముగించేశారు’ అని మరొకరు విమర్శించారు.
(ఇక్కడ చదవండి: పాకిస్తాన్ చిత్తు చిత్తు)
‘పాకిస్తాన్‌కు వంద శాతం ప్రదర్శన చేయమని ఇమ్రాన్ ఖాన్ చెబితే, వీళ్లకి వంద పరుగులు చేయమన్నట్లు వినబడిందేమో’ అని మరొక అభిమాని ట్వీట్ చేశారు. ‘ డియర్ పాకిస్తాన్.. ఇది వన్డే వరల్డ్‌కప్.. టీ20 వరల్డ్‌కప్ అనుకుంటున్నారేమో.. కాస్త చూసి ఆడండి’ అంటూ మరొకరు సెటైర్ వేశాడు. ఇక పాక్ ఘోర ప‍్రదర్శనపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ స్పందిస్తూ.. ఇది ఎవరికీ అర్థం కాని పాకిస్తాన్.. అనుమానమే లేదు పాకిస్తాన్ వరల్డ్‌కప్ గెలుస్తుంది’ అంటూ కాస్త వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment