PAK vs WI: Babar Azam Run Out Viral.. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టి20లో బాబర్ అజమ్ రనౌట్ అయిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విండీస్ స్పిన్నర్ ఏకియల్ హొస్సేన్ వేసిన మూడో ఓవర్ మూడో బంతిని మహ్మద్ రిజ్వాన్ బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. అయితే క్విక్ సింగిల్ తీయొచ్చనే ఉద్దేశంతో రిజ్వాన్ నాన్ స్ట్రైక్ ఎండ్‌వైపు పరిగెత్తాడు. కాల్ అందుకున్న బాబార్ అజమ్ కూడా పరిగెత్తినప్పటికి సకాలంలో క్రీజులోకి చేరుకోలేకపోయాడు. ఇంతలో బంతిని అందుకున్న హెడెన్ వాల్ష్ కీపర్ పూరన్‌కు త్రో విసిరాడు.
చదవండి: PAK Vs WI: ప్రపంచ రికార్డు సాధించిన పాకిస్తాన్.. ఏకైక జట్టుగా!
దీంతో బాబర్ అజమ్ క్రీజుకు చాలా దూరంలో ఉండగానే పూరన్ బెయిల్స్ ఎగురగొట్టడంతో బాబర్ రనౌటయ్యాడు. ప్రస్టేషన్‌తో బాబర్ అజమ్ పెవిలియన్‌కు వెళ్తూ బ్యాట్‌ను కోపంతో కొట్టడం కెమెరాలకు చిక్కింది. దీంతో బాబర్ అజమ్‌ను క్రికెట్ ఫ్యాన్స్ తమదైన శైలిలో ట్రోల్ చేశారు. ''బాబర్ అజమ్ మరీ ఇంత బద్దకమా.. నీకు వయసు అయిపోతుంది.. సింగిల్ వద్దు అనుకుంటే రిజ్వాన్‌కు కాల్ ఇవ్వాల్సింది..'' అంటూ కామెంట్స్ చేశారు.
ఇక మ్యాచ్‌లో పాకిస్తాన్ తొమ్మిది పరుగుల తేడాతో నెగ్గి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. తొలుత పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. రిజ్వాన్ (38; 4 ఫోర్లు, 1 సిక్స్), ఇఫ్తిఖార్ అహ్మద్ (32; 1 ఫోర్, 2 సిక్స్‌లు), హైదర్ అలీ (31; 4 ఫోర్లు) రాణించారు. విండీస్ 20 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. బ్రాండన్ కింగ్ (67; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), షెపర్డ్ (35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడారు. చివరి ఓవర్లో గెలుపు కోసం 23 పరుగులు చేయాల్సిన స్థితిలో వెస్టిండీస్ 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ పేసర్ షాహీన్ అఫ్రిది 3 వికెట్లు తీశాడు. చివరి టి20 గురువారం జరుగుతుంది.
Early loss for Pakistan, Babar Azam in run out!#PAKvWI#HumTouKhelainGey pic.twitter.com/wNWyZVt2fa
— Pakistan Cricket (@TheRealPCB) December 14, 2021
Comments
Please login to add a commentAdd a comment