ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ స్పిన్నర్లు చెలరేగారు. విండీస్ స్పిన్నర్ల దాటికి పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 154 పరుగులకే కుప్పకూలింది. జోమెల్ వారికన్ 4 వికెట్లతో సత్తాచాటగా.. మరో స్పిన్నర్ గుడ్‌కేష్ మోటీ మూడు వికెట్లతో మెరిశాడు.
వీరిద్దరితో పాటు ఫాస్ట్ బౌలర్ కీమర్ రోచ్ రెండు వికెట్లు సాధించాడు. పాకిస్తాన్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్(75 బంతుల్లో 8 ఫోర్లతో 49) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సౌధ్ షకీల్(32) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. పాక్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం మరోసారి నిరాశపరిచాడు.
కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన బాబర్ ఆజం.. మోటీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. అంతకుముందు విండీస్ కూడా బ్యాటింగ్‌లో విఫలమైంది. కరేబియన్లు తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 163 పరుగులకే ఆలౌటైంది. పాక్ స్పిన్నర్ నోమాన్ అలీ 6 వికెట్లు పడగొట్టి విండీస్‌ను దెబ్బతీశాడు.
అతడితో పాటు సాజిద్ ఖాన్ రెండు, కాషిఫ్ అలీ, ఆర్బర్ ఆహ్మద్ తలా వికెట్ సాధించాడు. విండీస్ బ్యాటర్లలో టెయిలాండర్ మోటీ(55) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు వారికన్(36), రోచ్(25) రాణించారు. కాగా విండీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 9 పరుగుల ఆధిక్యం లభించింది. కాగా తొలి రోజు ఆటలో ఇరు జట్ల స్పిన్నర్లు ఏకంగా 16 వికెట్లు పడగొట్టడం గమనార్హం.
తుది జట్లు
పాకిస్తాన్: షాన్ మసూద్ (కెప్టెన్), ముహమ్మద్ హుర్రైరా, బాబర్ ఆజం, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సల్మాన్ అఘా, సాజిద్ ఖాన్, నోమన్ అలీ, కాషిఫ్ అలీ, అబ్రార్ అహ్మద్
వెస్టిండీస్: క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), మికిల్ లూయిస్, అమీర్ జాంగూ, కవెమ్ హాడ్జ్, అలిక్ అథానాజ్, జస్టిన్ గ్రీవ్స్, టెవిన్ ఇమ్లాచ్ (వికెట్ కీపర్), కెవిన్ సింక్లైర్, గుడాకేష్ మోటీ, కెమర్ రోచ్, జోమెల్ వారికన్
చదవండి: BCCI: టీమిండియాకు భారీ షాక్.. ఇంగ్లండ్ సిరీస్ నుంచి ఇద్దరు స్టార్లు ఔట్
Comments
Please login to add a commentAdd a comment