
వన్డే క్రికెట్ చరిత్రలో పాక్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజం, ఇమాముల్ హక్‌లు అరుదైన ఫీట్ సాధించారు. తమ కెరీర్‌లోనే ఈ ఇద్దరు భీకరమైన ఫామ్‌లో ఉన్నారు. కొడితే హాఫ్ సెంచరీ లేదంటే సెంచరీ అనేంతలా వీరిద్దరి ఇన్నింగ్స్‌లు ఉంటున్నాయి. తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో బాబర్ అజం, ఇమాముల్ హక్‌లు హాఫ్ సెంచరీలతో మెరిశారు. కాగా ఈ ఇద్దరికి వరుసగా ఆరో అర్థశతకం కావడం విశేషం.
వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా ఒకేసారి ఇద్దరు పాక్ బ్యాట్స్‌మన్‌లు వరుసగా సమాన అర్థశతకాలు నమోదు చేయడం ఇదే మొదటిసారి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. బాబర్ ఆజం 77, ఇమాముల్ హక్ 72 పరుగులు చేసి ఔటయ్యారు.
చదవండి: PAK vs WI 2nd ODI: పాక్ కెప్టెన్‌పై తిట్ల దండకం.. వీడియో వైరల్