Imam-ul-Haq
-
కషాల్లో పాకిస్తాన్ క్రికెట్.. ఆ స్టార్ క్రికెటర్‌కు మళ్లీ పిలుపు
పాకిస్తాన్ క్రికెట్ జట్టు తీరు ఏ మాత్రం మారలేదు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో రెడ్ బాల్ సిరీస్‌ను ఓటమితో ఆరంభించింది. ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో పాక్ ఓటమి చవిచూసింది.దీంతో సర్వాత్ర పాక్ జట్టు, మెనెజ్‌మెంట్ విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆక్టోబర్ 15 నుంచి ముల్తాన్ వేదికగా జరిగే రెండు టెస్టుకు ముందు తమ జట్టులో పలు మార్పులు పీసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సమా టీవీకి చెందిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఖాదిర్ ఖవాజా రిపోర్ట్స్ ప్రకారం.. స్టార్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌ను తిరిగి జట్టులోకి తీసుకు రావాలని పీసీబీ సెలక్షన్ కమిటీ యోచిస్తుందంట. అతడితో పాటు కమ్రాన్ గులామ్, మీర్ హంజా, నౌమాన్ అలీ, యువ ఓపెనర్ మహమ్మద్ హురైరాలను కూడా జట్టులో చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇమామ్ ఉల్ హక్ చివరగా పాకిస్తాన్ తరపున గతేడాది డిసెంబర్లో ఆస్ట్రేలియాపై టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతడికి పాక్ జట్టులో చోటు దక్కలేదు. ఇప్పటివరకు తరపున 24 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఇమామ్..37.33 సగటుతో 1568 పరుగులు చేశాడు. అతడి టెస్టు కెరీర్లో 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.చదవండి: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రాబిన్ ఉతప్ప -
పెళ్లి పీటలెక్కనున్న పాక్ స్టార్ ఆటగాడు.. అమ్మాయి ఎవరంటే?
పాకిస్తాన్ క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ పెళ్లి పీటలకెక్కనున్నాడు. నార్వేకు చెందిన తన చిరకాల ప్రేయసి అన్మోల్ మెహమూద్‌ను ఇమామ్ వివాహమాడనున్నాడు. వీరిద్దరి నిఖా నవంబర్ 25న లాహొర్లో జరగనుంది. ఇప్పటికే వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. మంగళవారం(నవంబర్ 21) నార్వేలో మెహందీ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అన్మోల్ మెహమూద్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీరి వివాహ వేడుకకు పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజం, టీ20 కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ హాజరకానున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by HSY (@theworldofhsy) ఎవరీ అన్మోల్ మెహమూద్? అన్మోల్ మెహమూద్.. నార్వేకు చెందిన డాక్టర్. ప్రస్తుతం ఆమె తన కుటంబ సభ్యులతో కలిసి నార్వేలో నివసిస్తుంది. అయితే ఆమె తన కలిసి సభ్యులతో కలిసి నార్వేకు వెళ్లకముందు పాకిస్తాన్‌లోనే కొన్నేళ్లు గడిపింది. ఈ క్రమంలోనే మెహమూద్తో ఇమామ్‌కు పరిచయం ఏర్పడింది. View this post on Instagram A post shared by Anmol Mehmood (@anmolmehmood) చదవండి: విండీస్ టీ20 ప్రపంచకప్ వీరుడికి బిగ్ షాకిచ్చిన ఐసీసీ.. -
పాక్ ఓపెనర్‌ను ఔట్ చేసిన హార్దిక్.. సెలబ్రేషన్స్ వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా పాకిస్తాన్‌తో భారత్ తలపడతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి తన బౌలింగ్‌తో జట్టును అదుకున్నాడు. 36 పరుగులతో క్రీజులతో పాతుకుపోయే ప్రయత్నం చేసిన పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్-హక్‌ను అద్భుతమైన బంతితో పెవిలియన్‌కు పంపాడు. తన వేసిన తొలి రెండు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న హార్దిక్.. తన మూడో ఓవర్లో మాత్రం అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. పాక్ ఇన్నింగ్స్ 13 ఓవర్లో మూడో బంతిని వైడ్ ఆఫ్‌స్టంప్ దిశగా వేశాడు. ఇమామ్ కవర్ డ్రైవ్ షాట్ ఆడటానికి ప్రయత్నించగా.. బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ రాహుల్ చేతికి వెళ్లింది. దీంతో ఒక్కసారిగా స్టేడియం దద్దరిల్లిపోయింది. వెంటనే హార్దిక్ కూడా స్పెషల్ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. బంతిని చేతిలో పట్టుకుని నమస్కారం పెడుతూ ఇమామ్‌కు సెండాఫ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: WC 2023- Ind vs Pak: పాక్ గుండు సున్నా.. రోహిత్ ఒక్కడే 27! ఇదీ మీ లెవల్ అంటూ.. If God doesn't exist, explain this atheistspic.twitter.com/ve3VXJ3cE8 — Sagar (@sagarcasm) October 14, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) -
అఫ్గనిస్తాన్‌పై ఘన విజయం.. పాత రికార్డు బద్దలు కొట్టిన పాకిస్తాన్
Afghanistan vs Pakistan, 1st ODI: అఫ్గనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాకిస్తాన్ విజయంతో ఆరంభించింది. శ్రీలంకలోని హంబన్‌టోటాలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 142 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా తన పేరిట ఉన్న పాత రికార్డును బద్దలు కొట్టింది. కాగా తొలి వన్డేలో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, అఫ్గన్ బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ క్రమంలో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ అర్ధ శతకంతో(61)తో రాణించగా.. షాబాద్ ఖాన్ 39 పరుగులతో పర్వాలేదనిపించాడు. చుక్కలు చూపించిన రవూఫ్ మిగతా వాళ్లు నామమాత్రపు స్కోర్లకే పరిమితం కావడంతో పాకిస్తాన్ 201 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గనిస్తాన్‌కు పాకిస్తాన్ పేసర్ హారిస్ రవూఫ్ చుక్కలు చూపించాడు. 6.2 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 5 వికెట్లు కూల్చాడు. రవూఫ్ దెబ్బకు అఫ్గన్ బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది. 19.2 ఓవర్లలో 59 పరుగుల వద్ద అఫ్గన్ కథ ముగిసిపోయింది. అఫ్గన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించిన హారిస్ రవూఫ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. పాత రికార్డు బద్దలు కొట్టిన పాక్.. చెత్త రికార్డుతో అఫ్గన్ ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో 142 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన బాబర్ ఆజం బృందం సరికొత్త రికార్డు సృష్టించింది. వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో గెలుపు నమోదు చేసిన పాక్ జట్టుగా నిలిచింది. అంతకు ముందు 1998లో శ్రీలంకపై పాకిస్తాన్ 110 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పుడు అఫ్గన్‌పై విజయంతో ఈ రికార్డును బాబర్ బృందం చెరిపేసింది. కాగా వన్డేల్లో అఫ్గనిస్తాన్‌కు ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. చదవండి: Ind Vs Ire: ప్రయోగానికి ఆఖరి అవకాశం .. జితేశ్, షహబాజ్‌లకు ఛాన్స్! A spectacle of pace, intensity and pure fire! 🚀🔥 Witness the explosive magic of @HarisRauf14's five-wicket haul ✨#AFGvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/cEG8HoPl63 — Pakistan Cricket (@TheRealPCB) August 22, 2023 -
చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. పాక్ బ్యాటర్ ప్రపంచ రికార్డు బద్దలు.. ఏకంగా..
West Indies vs India, 3rd ODI- Shubman Gill World Record: వెస్టిండీస్‌తో టెస్టుల్లో దారుణంగా విఫలమైన టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్.. వన్డే సిరీస్‌ను మాత్రం ఘనంగా ముగించాడు. ఏరికోరి టెస్టు సిరీస్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ 6, 10, 29(నాటౌట్) పరుగులు మాత్రమే సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వన్డే సిరీస్‌నూ సింగిల్ డిజిట్ స్కోరు(7)తోనే ఆరంభించిన గిల్‌పై విమర్శలు కొనసాగాయి. తీవ్ర ఒత్తిడిలోనూ.. ఇక, రెండో వన్డేలో 34 పరుగులు సాధించినప్పటికీ జట్టు ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన గిల్ మళ్లీ అభిమానులకు టార్గెట్ అయ్యాడు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడితో కూరుకున్న సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో మాత్రం శుబ్‌మన్ గిల్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. పాక్ బ్యాటర్ ప్రపంచ రికార్డు బద్దలు బ్రియన్ లారా స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అతడు 92 బంతులు ఎదుర్కొని 11 ఫోర్ల సాయంతో 85 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీతో మెరిసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అద్భుత ఇన్నింగ్స్‌తో సరికొత్త రికార్డు సృష్టించాడు. మొన్న బాబర్‌ను దాటేసి సెంచరీ మిస్ అయినా.. పాకిస్తాన్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో 27 వన్డే ఇన్నింగ్స్‌లో సగటు 62.48తో 1437 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు సాధించాడు. ఇక గత మ్యాచ్‌లో 1352 పరుగుల వద్ద ఉన్న గిల్.. బాబర్ ఆజం(1322)ను అధిగమించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ వన్డేల్లో 27 వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించింది వీళ్లే! 1.శుబ్‌మన్ గిల్- 1437 2.ఇమాన్ ఉల్ హక్- 1381 3.రాసీ వాన్ డెర్ డసెన్- 1353 4.రియాన్ టెన్ డొషాటే- 1353 5. జొనాథన్ ట్రాట్- 1342. చదవండి: విండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా.. అరుదైన రికార్డు! ప్రపంచంలోనే ఏకైక జట్టుగా.. ఓడిపోతే ఏం జరిగేదో తెలుసు! అందుకే రోహిత్, కోహ్లిలను కాదని ఇలా: హార్దిక్ మొన్న వాటర్‌బాయ్! ఇప్పుడు ఇలా.. ఏంటిది కోహ్లి! వీడియో వైరల్ Well played. Deserved a 💯@ShubmanGill . .#INDvWIAdFreeonFanCode #WIvIND pic.twitter.com/KPWdZjFQt6 — FanCode (@FanCode) August 1, 2023 -
వన్డే క్రికెట్ చరిత్రలో పాక్ బ్యాటర్స్ అరుదైన ఫీట్
వన్డే క్రికెట్ చరిత్రలో పాక్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజం, ఇమాముల్ హక్‌లు అరుదైన ఫీట్ సాధించారు. తమ కెరీర్లోనే ఈ ఇద్దరు భీకరమైన ఫామ్‌లో ఉన్నారు. కొడితే హాఫ్ సెంచరీ లేదంటే సెంచరీ అనేంతలా వీరిద్దరి ఇన్నింగ్స్‌లు ఉంటున్నాయి. తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో బాబర్ అజం, ఇమాముల్ హక్‌లు హాఫ్ సెంచరీలతో మెరిశారు. కాగా ఈ ఇద్దరికి వరుసగా ఆరో అర్థశతకం కావడం విశేషం. వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా ఒకేసారి ఇద్దరు పాక్ బ్యాట్స్మన్లు వరుసగా సమాన అర్థశతకాలు నమోదు చేయడం ఇదే మొదటిసారి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. బాబర్ ఆజం 77, ఇమాముల్ హక్ 72 పరుగులు చేసి ఔటయ్యారు. చదవండి: PAK vs WI 2nd ODI: పాక్ కెప్టెన్‌పై తిట్ల దండకం.. వీడియో వైరల్ -
పాక్ కెప్టెన్‌పై తిట్ల దండకం.. వీడియో వైరల్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంపై తోటి బ్యాటర్ తిట్ల దండకం అందుకున్నాడు. అనవసరంగా రనౌట్ చేశాడన్న కారణంతో పాక్ కెప్టెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. 17 పరుగులు చేసి ఫఖర్ జమాన్ ఔటైన తర్వాత బాబర్ ఆజం క్రీజులోకి వచ్చాడు. మరో ఓపెనర్ ఇమాముల్ హక్‌తో కలిసి పాక్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఇద్దరి మధ్య రెండో వికెట్‌కు 120 పరుగులు కీలక భాగస్వామ్యం కూడా ఏర్పడింది. తమ బ్యాటింగ్‌తో ప్రమాదకరంగా మారుతున్న సమయంలో బాబర్ ఆజం చేసిన చిన్న తప్పు వికెట్ పడేలా చేసింది. ఇన్నింగ్స్ 28వ ఓవర్లో అకీల్ హొసేన్ బౌలింగ్‌కు వచ్చాడు. ఇమాముల్ హక్ మిడ్‌వికెట్ దిశగా ఆడి సింగిల్‌కు ప్రయత్నించాడు. అయితే బంతి ఎక్కువ దూరం వెళ్లకపోవడంతో బాబర్ పరుగు తీయలేదు. అయితే అప్పటికే ఇమాముల్ హక్ సగం క్రీజు దాటి నాన్‌స్ట్రైకర్ ఎండ్‌కు వచ్చేశాడు. బాబర్ పిలుపుతో వెనక్కి వెళ్లినప్పటికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బంతిని అందుకున్న షెయ్ హోప్ వికెట్లను గిరాటేయడంతో ఇమాముల్ హక్ 72 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. అంతే ఇమాముల్ హక్‌లో కోపం కట్టలు తెచ్చుకుంది. పెవిలియన్‌కు వెళ్తూ బ్యాట్‌ను కింద కొట్టుకుంటూనే తిట్ల దండకం అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత బాబర్ ఆజం 77 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓవరాల్‌గా పాకిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. కాగా బాబర్ ఆజం, ఇమాముల్ హక్లకు ఇది వరుసగా ఆరో అర్థసెంచరీలు కావడం విశేషం. చదవండి: దీనస్థితిలో ఉత్తరాఖండ్ రంజీ ఆటగాళ్లు .. రోజూవారి వేతనం తెలిస్తే షాకవుతారు 'కిల్లర్' మిల్లర్ అనగానే ఆ ఎపిక్ ఎంట్రీ గుర్తుకురావడం ఖాయం View this post on Instagram A post shared by Pakistan Cricket (@therealpcb) -
రనౌట్ వైరల్: నువ్వు రమ్మన్నావ్.. వచ్చేశా!
రావల్పిండి: బంతి బౌండరీ దాటిందని రిలాక్స్ అవడమో, క్రీజులోకి వచ్చామనే భ్రమలో ఉండటంతోనో లేక అతితొందరతోనో బ్యాట్స్‌మన్ రనౌట్ అవుతుంటారు. నిర్లక్ష్యంతో కూడా బ్యాట్స్‌మన్ కూడా రనౌట్లు అవుతూ ఉండటం చాలానే చూశాం. స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ పరుగు తీయడానికి నాన్‌స్టైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌కు పిలుపు ఇవ్వడం, ఆపై వెంటనే నిర్ణయాన్ని మార్చుకుని స్టైకింగ్ బ్యాట్స్‌మన్ వెనక్కి వెళ్లిపోవడం ఆ క్రమంలోనే ఎవరో ఒకరు బలి అయిపోవడం మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తాజాగా ఇదే తరహా రనౌట్ సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం పాకిస్తాన్లో పర్యటిస్తోంది జింబాబ్వే జట్టు. మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం పాక్‌కు వచ్చింది. ఈ క్రమంలోనే వీరిమధ్య శుక్రవారం తొలి వన్డే జరుగుతోంది. కాగా, ఇక్కడ ఓపెనర్ ఇమాముల్ హక్ రనౌట్‌గా నిష్క్రమించాడు. ఇమాముల్(58) హాఫ్ సెంచరీ చేసిన తర్వాత పరుగు కోసం యత్నించి తనకు తానే మూల్యం చెల్లించుకున్నాడు. జింబాబ్వే బౌలర్ రాజా వేసిన 26 ఓవర్ ఐదో బంతిని బ్యాక్వర్డ్ పాయింట్లోకి ఆడి నాన్‌స్టైకింగ్ ఎండ్‌లో ఉన్న సొహైల్ హారిస్‌ను పరుగుకోసం రమ్మన్నాడు. దాంతో ఒక్క ఉదుటున పరుగు అందుకున్న సొహైల్.. స్టైకర్స్ ఎండ్‌లోకి వెళ్లిపోయాడు. కాగా, బాల్ సమీపంలో ఉండటంతో ఆ బంతిని మాద్వేరె.. రాజా చేతికి ఇవ్వడంతో ఇమాముల్ ఔటయ్యాడు. స్టైకింగ్ ఎండ్ నుంచి కాల్‌ను ఇమాముల్ వెనక్కి తీసుకుని మళ్లీ క్రీజ్‌లోకి పరుగెత్తే యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.అప్పటికే స్టైకింగ్ ఎండ్‌లోకి చేరుకున్న సొహైల్ ముందుగా బ్యాట్‌ను క్రీజ్‌లో పెట్టడంతో ఇమాముల్ రనౌట్ అయ్యాడు. అయితే ‘నువ్వు రమ్మన్నావ్.. వచ్చేశా’ అనే ఫీలింగ్ కనబడింది సొహైల్ మోములో. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. హారిస్ సొహైల్ 71 పరుగులు చేశాడు. pic.twitter.com/7jwEsDnzLZ — Sandybatsman (@sandybatsman) October 30, 2020 -
ఇమాముల్‌ను దారుణంగా ట్రోల్ చేసిన ఐస్లాండ్
అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టులో ఘోరంగా విఫలమైన పాకిస్తాన్ ఓపెనర్ ఇమాముల్ హక్‌ను ఐస్లాండ్ క్రికెట్ దారుణంగా ఆడేసుకుంది. ఈ మ్యాచ్‌తో ఐస్లాండ్ క్రికెట్‌కు ఏమాత్రం సంబంధం లేకపోయినా ఇమాముల్ ఒక ప్లేయర్ కాదు అనేంతగా ట్వీటర్ అకౌంట్లో విమర్శలు చేసింది. ఆసీస్‌తో రెండో టెస్టులో ఆడుతున్న ఇమాముల్ హక్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు పరుగులు చేస్తే, రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. ఇక ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రెండు టెస్టులకు గాను రెండు ఇన్నింగ్స్‌లు ఆడి 489 పరుగులు చేశాడు. అందులో 154 పరుగుల్ని బ్రిస్బేన్‌లో జరిగిన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సాధిస్తే, ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 335 పరుగులు చేశాడు. దీన్ని టార్గెట్ చేస్తూ.. వార్నర్ రెండు ఇన్నింగ్స్‌లో చేసిన పరుగుల కంటే ఇమాముల్ హక్ తన కెరీర్లో సాధించిన పరుగులే తక్కువంటా ఎద్దేవా చేసింది. ఇప్పటివరకూ ఇమాముల్ హక్ 11 టెస్టు మ్యాచ్‌లకు గాను 21 ఇన్నింగ్స్‌లు ఆడి 485 పరుగులు చేశాడు. ఇక పాకిస్తాన్ తన రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. ఇమాముల్ హక్ డకౌట్‌గా వెనుదిరిగితే, అజహర్ అలీ 9 పరుగులు చేసి నిరాశపరిచాడు. బాబర్ అజామ్ కూడా 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. పాకిస్తాన్ 16.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 39 పరుగుల వద్ద ఉండగా వర్షం పడటంతో మ్యాచ్ నిలిపివేశారు. David Warner has scored more runs in his last two innings than Imam-ul-Haq has scored in his entire test career. #AUSvPAK — Iceland Cricket (@icelandcricket) December 1, 2019 -
359 పరుగుల లక్ష్యం...45 ఓవర్లలోపే ఉఫ్!
రన్ పవర్ పెరుగుతోంది. ఛేదనెంతైనా సులువవుతోంది. మూడొందల పైచిలుకు కొండంత స్కోరైనా... బ్యాట్స్‌మెన్ ధాటికి కరిగిపోతోంది. పాపం బౌలర్లు! టి20ల దెబ్బకు కుదేలవుతున్నారు. వన్డేల్లోనూ వారిని దంచేస్తున్నారు. బ్రిస్టల్: పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ చెలరేగితే... ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ చితక్కొట్టారు. అంతే... కొండంత లక్ష్యం కాస్తా చిన్నబోయింది. 359 పరుగుల లక్ష్యాన్ని 5.1 ఓవర్ల ముందే ఛేదించి ఆతిథ్య ఇంగ్లండ్ జయభేరి మోగించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా పాక్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఓపెనర్ ఇమాముల్ హక్ (131 బంతుల్లో 151; 16 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లోనే బెస్ట్ సెంచరీ బాదేశాడు. ఆసిఫ్ అలీ (53; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), హారిస్ సొహైల్ (41; 7 ఫోర్లు) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4 వికెట్లు పడగొట్టగా, టామ్ కరన్ 2 వికెట్లు తీశాడు. తర్వాత భారీ లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 44.5 ఓవర్లలోనే 4 వికెట్లకు 359 పరుగులు చేసి గెలిచింది. ఈ జట్టులోనూ ఓపెనర్లే చెలరేగారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జానీ బెయిర్‌స్టో (93 బంతుల్లో 128; 15 ఫోర్లు, 5 సిక్స్‌లు), జేసన్ రాయ్ (55 బంతుల్లో 76; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో కలిసి తొలి వికెట్‌కు 17.3 ఓవర్లలోనే 159 పరుగులు జోడించడమే ఇంగ్లండ్ విజయానికి పునాది అయింది. తర్వాత వచ్చిన వారిలో రూట్ (43; 4 ఫోర్లు, 1 సిక్స్), మొయిన్ అలీ (46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో ఇంగ్లండ్ ఈజీగా ఛేజింగ్ చేసింది. మోర్గాన్‌పై సస్పెన్షన్ వేటు దుబాయ్: స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. అతనిపై ఒక వన్డే నిషేధం విధించడంతో పాటు మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించారు. 12 నెలల వ్యవధిలో రెండోసారి స్లో ఓవర్ రేట్ నమోదవడంతో ఐసీసీ నిబంధనల మేరకు మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ అతనిపై చర్య తీసుకున్నారు. దీంతో మోర్గాన్ నాటింగ్‌హామ్‌లో రేపు జరిగే నాలుగో వన్డేకు దూరమయ్యాడు. -
బౌన్సర్‌కు పాక్ బ్యాట్స్‌మన్ విలవిల
అబుదాబి: న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ వేసిన బౌన్సర్.. ఆస్ట్రేలియా ఆటగాడు ఫిలిప్ హ్యూస్‌ను గుర్తుచేసింది. అంతటి ప్రమాదకర బౌన్సర్‌కు పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ విలవిలాడాడు. ఫెర్గూసన్ వేసిన బౌన్సర్ నేరుగా ఇమామ్ హెల్మెట్‌కు తగిలింది. దీంతో అతను మైదానంలో కుప్పకూలాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా మైదానంలోని ఆటగాళ్లు.. ప్రేక్షకులు కలవరపాటు గురయ్యారు. వెంటనే మైదానంలోకి పరుగెత్తుకొచ్చిన ఫిజియో ఇమామ్‌కు ప్రాథమిక చికిత్స అందించే ప్రయత్నం చేశాడు. కానీ ఇమామ్ గాయం తీవ్రంగా ఉండటంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరీక్షలు నిర్వహించామని భయపడాల్సిన గాయం కాదని పాక్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. షోయబ్ మాలిక్ సైతం ఇమామ్‌తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ అతను బాగానే ఉన్నాడని తెలిపాడు. ఆసీస్ బౌలర్ సీన్ అబాట్ వేసిన బౌన్సర్‌ను ఆడబోయి హ్యూస్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ రాస్ టేలర్ (86), హెన్రీ నికోలస్(33), వర్కర్ (28) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవ్వడంతో 9 వికెట్లు నష్టానికి 209 పరుగులే చేసింది. అనంతరం పాక్.. ఫకార్ జమాన్ (88), బాబర్ అజమ్ (46)లు రాణించడంతో 40.3 ఓవర్లోనే లక్ష్యాన్ని అందుకుంది. ఈ గెలుపుతో కివీస్‌పై వరుస(12) పరాజయాలకు అడ్డుకట్ట వేసింది. Get well soon #ImamUlHaq pic.twitter.com/MaR0MZPIaM — Ramiz Ahmed Patel (@ramizrap1) November 9, 2018 He’s just fine #Alhumdulilah! Fine knock today boi 👍🏽 #PakVsNZ pic.twitter.com/gcrFg0oK3y — Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) November 9, 2018