గాయంతో విలవిలాడిన ఇమామ్
అబుదాబి: న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ వేసిన బౌన్సర్.. ఆస్ట్రేలియా ఆటగాడు ఫిలిప్ హ్యూస్‌ను గుర్తుచేసింది. అంతటి ప్రమాదకర బౌన్సర్‌కు పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ విలవిలాడాడు. ఫెర్గూసన్ వేసిన బౌన్సర్ నేరుగా ఇమామ్ హెల్మెట్‌కు తగిలింది. దీంతో అతను మైదానంలో కుప్పకూలాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా మైదానంలోని ఆటగాళ్లు.. ప్రేక్షకులు కలవరపాటు గురయ్యారు. వెంటనే మైదానంలోకి పరుగెత్తుకొచ్చిన ఫిజియో ఇమామ్‌కు ప్రాథమిక చికిత్స అందించే ప్రయత్నం చేశాడు. కానీ ఇమామ్ గాయం తీవ్రంగా ఉండటంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
అనంతరం పరీక్షలు నిర్వహించామని భయపడాల్సిన గాయం కాదని పాక్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. షోయబ్ మాలిక్ సైతం ఇమామ్‌తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ అతను బాగానే ఉన్నాడని తెలిపాడు. ఆసీస్ బౌలర్ సీన్ అబాట్ వేసిన బౌన్సర్‌ను ఆడబోయి హ్యూస్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ రాస్ టేలర్ (86), హెన్రీ నికోలస్(33), వర్కర్ (28) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవ్వడంతో 9 వికెట్లు నష్టానికి 209 పరుగులే చేసింది. అనంతరం పాక్.. ఫకార్ జమాన్ (88), బాబర్ అజమ్ (46)లు రాణించడంతో 40.3 ఓవర్లోనే లక్ష్యాన్ని అందుకుంది. ఈ గెలుపుతో కివీస్‌పై వరుస(12) పరాజయాలకు అడ్డుకట్ట వేసింది.
Get well soon #ImamUlHaq pic.twitter.com/MaR0MZPIaM
— Ramiz Ahmed Patel (@ramizrap1) November 9, 2018
He’s just fine #Alhumdulilah! Fine knock today boi 👍🏽 #PakVsNZ pic.twitter.com/gcrFg0oK3y
— Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) November 9, 2018
Comments
Please login to add a commentAdd a comment