Threat To New Zealand Cricketers Came From India: భద్రతా కారణాల రిత్యా న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పాక్ పర్యటన నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన నేపథ్యంలో పాక్ సమాచార మంత్రి ఫవాద్ చౌదరి సంచలన ఆరోపణలు చేశాడు. కివీస్ టూర్ రద్దుకు భారత్ కుట్ర చేసిందంటూ పసలేని వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ జట్టుకు బెదిరింపు ఈమెయిల్(కివీస్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ భార్యకు వచ్చింది) సింగపూర్ ఐపీ అడ్రస్ చూపించే వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్(వీపీఎన్) ఉపయోగించి భారత్‌లోని అనుబంధ పరికరం నుండి పంపబడిందంటూ బుధవారం ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించాడు. అయితే, ఈ విషయమై భారత విదేశీ మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం విశేషం.
పరిమిత ఓవర్ల సిరీస్ కోసం 18 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తొలి వన్డే(సెప్టెంబర్ 17)కు కొద్ది నిమిషాల ముందు భద్రతా కారణాల రీత్యా సిరీస్ మొత్తాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సైతం తాము పాక్‌లో పర్యటించడం లేదంటూ వెల్లడించింది. ఈ రెండు జట్లు పాక్ టూర్‌ను రద్దు చేసుకోవడంతో పాక్ క్రికెట్ బోర్డుపై తీవ్ర ప్రభావం పడింది. భవిష్యత్తులో విదేశీ జట్లు పాక్‌లో పర్యటించడం ప్రశ్నార్ధకంగా మారింది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ జట్టు పాక్ టూర్‌ను రద్దు చేసుకోవాలని తమ ప్రభుత్వం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కు ఎలాంటి సూచన చేయలేదని పాక్‌లో యూకే హైకమిషనర్ క్రిస్టియన్ టర్నర్ పేర్కొనడం కొసమెరుపు.
చదవండి: "పాక్ క్రికెట్‌ను న్యూజిలాండ్ చంపేసింది.."
Comments
Please login to add a commentAdd a comment