New Zealand cricket team
-
విలియమ్సన్కు గాయం: మూడు మ్యాచ్‌లకు దూరం
చెన్నై: ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ! అనుభవజు్ఞడైన కెపె్టన్ కేన్ విలియమ్సన్ బొటన వేలి గాయంతో ఏకంగా మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్‌లో పరుగు తీస్తున్న సమయంలో ఫీల్డర్ విసిరిన త్రో కారణంగా అతని ఎడమ చేతి బొటన వేలికి గాయమైంది. దీంతో 78 పరుగుల వద్ద కేన్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే తదనంతరం ఎక్స్‌రే తీయగా వేలికి ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. దీంతో తదుపరి మూడు మ్యాచ్‌లకు (18న అఫ్గానిస్తాన్‌తో; 22న భారత్‌తో; 28న దక్షిణాఫ్రికాతో) అతను దూరం కానున్నాడు. అతను గాయం నుంచి కోలుకున్న తర్వాతే వచ్చే నెల మ్యాచ్‌లకు అందుబాటు లో ఉండేది లేనిది తెలుస్తుంది. -
న్యూజిలాండ్- 'ఎ'తో సిరీస్.. భారత కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్!
స్వదేశంలో న్యూజిలాండ్-'ఎ' తో జరగనున్న సిరీస్(నాలుగు రోజులు పాటు జరిగే టెస్టు మ్యాచ్)కు భారత్- 'ఎ' జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. కాగా బీసీసీఐ ప్రకటించిన ఈ జట్టులో హనుమ విహారి, వాషింగ్టన్ సుందర్, కేఎస్ భరత్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్నారు. అదే విధంగా రంజీట్రోఫీ(2021-22)లో అదరగొట్టిన యశస్వి జైస్వాల్, షామ్స్ మూలానీ, సర్ఫరాజ్ ఖాన్, యష్ దూబే వంటి యువ ఆటగాళ్లకు కూడా అవకాశం లభించింది. కాగా ఈ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్‌తో భారత్ మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. సెప్టెంబర్ 1న బెంగళూరు వేదికగా జరగనున్న తొలి టెస్టుతో న్యూజిలాండ్-‘ఎ’ టూర్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లు అన్నీ బెంగళూరు వేదికగానే జరగనున్నాయి. అదే విధంగా వన్డే సిరీస్‌కు చెన్నై వేదికగా కానుంది. భారత్-ఏ జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశ్ దూబే, హనుమ విహారి, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), షమ్స్ ములానీ, జలజ్ సక్సేనా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్, శుభమ్ శర్మ, అక్షయ్ వాడ్కర్, షాబాజ్ అహ్మద్, మణిశంకర్ మురాసింగ్ చదవండి: David Warner: వార్నర్ అభిమానులకు గుడ్ న్యూస్.. తొమ్మిదేళ్ల తర్వాత ఆ లీగ్‌లో రీ ఎంట్రీ! -
న్యూజిలాండ్ జట్టులో కల్లోలం.. మరో స్టార్ క్రికెటర్‌కు కరోనా
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ జట్టులో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఇప్పటికే వరుసగా రెండు టెస్ట్‌ల్లో ఓడి 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2 తేడాతో చేజార్చుకున్న ఆ జట్టుకు కరోనా మహమ్మారి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.రెండో టెస్ట్ ముగిసిన వెంటనే జరిపిన పరీక్షల్లో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, తాజాగా ఇవాళ (జూన్ 16) జరిపిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే మహమ్మారి బారిన పడినట్లు రిపోర్టులు వచ్చాయి. దీంతో కివీస్ మేనేజ్మెంట్ జట్టు సభ్యులందరికీ మరోసారి కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు నమూనాలు సేకరించి, కాన్వేను ఐదు రోజుల పాటు ఐసోలేషన్‌కు తరలించింది. కాన్వేకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో న్యూజిలాండ్ బృందంలో కేసుల సంఖ్య ఐదుకు చేరింది. రెండో టెస్ట్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఆతర్వాత సపోర్టింగ్ స్టాఫ్‌లో ఇద్దరు సభ్యులు కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ఓ పక్క వరుస ఓటములు, మరో పక్క కోవిడ్ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కివీస్ జట్టును గాయాల బెడద కూడా వేధిస్తుంది. తొలి టెస్ట్ సందర్భంగా ఆల్‌రౌండర్ కొలిన్ గ్రాండ్‌హోమ్ గాయపడగా, అతనికి రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన బ్రేస్‌వెల్ కరోనా బారిన పడ్డాడు. అలాగే రెండో టెస్ట్ సందర్భంగా మరో ఆల్‌రౌండర్ కైల్ జేమీసన్ కూడా గాయపడ్డట్లు తెలుస్తోంది. రెండో టెస్టు ఆఖరి రోజు బౌలింగ్ చేస్తూ జేమీసన్ గాయపడ్డాడని.. అతని గాయం చాలా తీవ్రమైందని సమాచారం. దీంతో జేమీసన్ కూడా మూడో టెస్ట్ ఆడటం అనుమానమేనని తెలుస్తోంది. దీంతో చివరిదైన మూడో టెస్ట్‌కు న్యూజిలాండ్ పూర్తి జట్టును బరిలోకి దించేది అనుమానంగా మారింది. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ జూన్ 23 నుంచి ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే, ట్రెంట్ బ్రిడ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. రసవత్తరంగా సాగిన ఈ సమరంలో ఇంగ్లండ్ బ్యాటర్లు జూలు విదిల్చి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. బెయిర్‌స్టో సూపర్ శతకంతో (92 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 136), బెన్ స్టోక్స్ (70 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 75) అజేయమైన అర్ధశతకంతో చెలరేగి క్రికెట్ ప్రేమికులకు టీ20 క్రికెట్ మజాను అందించారు. చదవండి: విజయానందంలో ఉన్న ఇంగ్లండ్‌కు ఐసీసీ షాక్.. -
‘కివీస్ జట్టుకు బెదిరింపులు భారత్ కుట్రే’.. పాక్ మంత్రి సంచలన ఆరోపణ
Threat To New Zealand Cricketers Came From India: భద్రతా కారణాల రిత్యా న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పాక్ పర్యటన నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన నేపథ్యంలో పాక్ సమాచార మంత్రి ఫవాద్ చౌదరి సంచలన ఆరోపణలు చేశాడు. కివీస్ టూర్ రద్దుకు భారత్ కుట్ర చేసిందంటూ పసలేని వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ జట్టుకు బెదిరింపు ఈమెయిల్(కివీస్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ భార్యకు వచ్చింది) సింగపూర్ ఐపీ అడ్రస్ చూపించే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్(వీపీఎన్) ఉపయోగించి భారత్‌లోని అనుబంధ పరికరం నుండి పంపబడిందంటూ బుధవారం ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించాడు. అయితే, ఈ విషయమై భారత విదేశీ మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం విశేషం. పరిమిత ఓవర్ల సిరీస్ కోసం 18 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తొలి వన్డే(సెప్టెంబర్ 17)కు కొద్ది నిమిషాల ముందు భద్రతా కారణాల రీత్యా సిరీస్ మొత్తాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సైతం తాము పాక్‌లో పర్యటించడం లేదంటూ వెల్లడించింది. ఈ రెండు జట్లు పాక్ టూర్‌ను రద్దు చేసుకోవడంతో పాక్ క్రికెట్ బోర్డుపై తీవ్ర ప్రభావం పడింది. భవిష్యత్తులో విదేశీ జట్లు పాక్‌లో పర్యటించడం ప్రశ్నార్ధకంగా మారింది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ జట్టు పాక్ టూర్‌ను రద్దు చేసుకోవాలని తమ ప్రభుత్వం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కు ఎలాంటి సూచన చేయలేదని పాక్‌లో యూకే హైకమిషనర్ క్రిస్టియన్ టర్నర్ పేర్కొనడం కొసమెరుపు. చదవండి: "పాక్ క్రికెట్‌ను న్యూజిలాండ్ చంపేసింది.." -
న్యూజిలాండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. టీ20ల్లో కివీస్ చెత్త రికార్డు..
ఢాకా: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు టి20 ఫార్మాట్లో తొలిసారి బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. ఢాకాలో బుధవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 16.5 ఓవర్లలో 60 పరుగులకే ఆలౌటైంది. షకీబ్ (2/10), ముస్తఫిజుర్ (3/13), నాసుమ్ అహ్మద్ (2/5), సైఫుద్దీన్ (2/7) న్యూజిలాండ్‌ను దెబ్బ తీశారు. టి20ల్లో న్యూజిలాండ్‌కిదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. అనంతరం 15 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ విజయం సాధించింది. బంగ్లా టీంలో ముస్తిఫర్ రహీమ్ 16, మహ్మదుల్లా 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మరో వికెట్ పడకుండా విజయం సాధించారు. కాగా ఈ సిరీస్ కోసం, న్యూజిలాండ్ జట్టు 10 మంది ప్రధాన ఆటగాళ్లు లేకుండానే బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చింది. చదవండి: Shaheen Afridi: కెరీర్లో చాలా ఎదగాలి.. పెళ్లికి తొందరేంలేదు What a start for Bangladesh! New Zealand are 18/4 after the Powerplay 👀 Who will help them rebuild?#BANvNZ | https://t.co/4Bvg9arZLr pic.twitter.com/tMPt3JnFY8 — ICC (@ICC) September 1, 2021 Bangladesh registered their first T20I victory over New Zealand after defeating the visitors by seven wickets in the opening match.#BANvNZ report 👇 — ICC (@ICC) September 1, 2021 -
ఇంటికి చేరిన ఇంగ్లండ్ క్రికెటర్లు
-
ఇంటికి చేరిన ఇంగ్లండ్ క్రికెటర్లు
న్యూఢిల్లీ: ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడటంతో వివిధ ఫ్రాంచైజీలలో భాగంగా ఉన్న విదేశీ క్రికెటర్లు బయో బబుల్‌ను వదిలి తమ దేశాలకు బయలుదేరారు. పలువురు ఆటగాళ్లు ఇప్పటికే స్వస్థలాలకు చేరుకోగా... మరికొందరు ఆయా దేశాల ఆంక్షలు, నిబంధనల ప్రకారం తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భారత క్రికెటర్లు దాదాపు అంతా తమ సొంత నగరాలకు వెళ్లిపోయారు. కరోనా సోకిన ఆటగాళ్లు ఉన్న టీమ్‌లలో కూడా మిగిలిన వారికి పరీక్షలు నిర్వహించి నెగెటివ్‌గా తేలితే ఫ్రాంచైజీలు పంపించేందుకు సిద్ధమయ్యాయి. విదేశీ క్రికెటర్లలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ మినహా మిగతా దేశాలకు చెందిన క్రికెటర్లు ఎలాంటి సమస్య లేకుండా వెళ్లిపోతున్నారు. న్యూజిలాండ్: ఐపీఎల్లో ఉన్న 17 మంది న్యూజిలాండ్ ఆటగాళ్లు రెండు బృందాలుగా విడిపోయారు. ఇందులో ఒక బృందం స్వదేశానికి వెళ్లనుండగా, మిగిలిన ఆటగాళ్లు ఇంగ్లండ్‌కు వెళతారు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్, ఆపై భారత్‌తో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో, ఇంగ్లండ్ టి20 బ్లాస్ట్‌లో పాల్గొనేందుకు కివీస్ ఆటగాళ్లు విలియమ్సన్, బౌల్ట్, జేమీసన్, సాన్‌ట్నర్, ఫెర్గూసన్, నీషమ్, ఫిన్ అలెన్ ఇంగ్లండ్ వెళతారు. అయితే వీరంతా మే 10 వరకు భారత్‌లోనే ఉండనున్నారు. ఆపై ఇంగ్లండ్ ప్రభుత్వం సడలించే ఆంక్షలను బట్టి బయల్దేరతారు. ఫ్లెమింగ్, మెకల్లమ్, మిల్స్, షేన్ బాండ్ తదితరులు న్యూజిలాండ్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరికి ప్రభుత్వ పరంగా సమస్య లేదు కానీ ప్రయాణించేందుకు విమానాలు మాత్రం లేవు. ఐపీఎల్లో ఒకటి, రెండు ఫ్రాంచైజీలు కలిసి వీరి కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఇంగ్లండ్: ఐపీఎల్లో భాగంగా ఉన్న 11 మంది ఇంగ్లండ్ క్రికెటర్లలో ఎనిమిది మంది లండన్‌కు చేరుకున్నారు. బట్లర్, మొయిన్ అలీ, స్యామ్ కరన్, టామ్ కరన్, వోక్స్, బెయిర్‌స్టో, జేసన్ రాయ్, స్యామ్ బిల్లింగ్స్ బుధవారం ఉదయమే హీత్రూ విమానాశ్రయానికి వచ్చారని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. మరో ముగ్గురు ఇంగ్లండ్ ఆటగాళ్లు మోర్గాన్, జోర్డాన్, మలాన్ రెండు రోజులు ఆలస్యంగా బయలుదేరుతారు. వీరంతా అక్కడి నిబంధనల ప్రకారం పది రోజుల పాటు ప్రభుత్వ అనుమతి పొందిన హోటల్లలో క్వారంటైన్లో ఉంటారు. ఆస్ట్రేలియా: ఆసీస్ క్రికెటర్లు భారత్ వీడటంపై మాత్రం స్పష్టత వచ్చేసింది. నేరుగా తమ దేశంలోనికి అనుమతి లేదని తెలుసు కాబట్టి ప్రత్యామ్నాయంగా వీరంతా మాల్దీవులను ఎంచుకున్నారు. ఆటగాళ్ల కోసం ప్రత్యేక సడలింపులు ఏమీ లేవు కాబట్టి సుమారు 40 మంది ఆస్ట్రేలియన్లు రెండు వారాలు మాల్దీవులలో గడిపిన తర్వాతే స్వదేశానికి వెళతారు. బీసీసీఐ వీరి కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. ముందుగా మాల్దీవులకు, అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్లేందుకు కూడా బోర్డు బాధ్యత తీసుకుంటోంది. బుధవారం వీరంతా ఢిల్లీకి చేరుకొని ఒకటి, రెండు రోజుల్లో ఇక్కడి నుంచి బయలుదేరుతారు. కరోనా పాజిటివ్‌గా తేలిన మైక్ హస్సీ మాత్రం భారత్‌లోనే కనీసం పది రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నాడు. -
న్యూజిలాండ్‌దే టి20 సిరీస్
హామిల్టన్: బ్యాట్స్‌మెన్ టిమ్ సీఫెర్ట్ (63 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), కెపె్టన్ కేన్ విలియమ్సన్ (42 బంతుల్లో 57 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధసెంచరీలతో చెలరేగడంతో పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొమ్మిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కివీస్ 2–0తో గెలుచుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు చేసింది. మొహమ్మద్ హఫీజ్ (57 బంతుల్లో 99 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. హఫీజ్ ఒంటరి పోరాటం చేయగా... మిగతా బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టిమ్ సౌతీ 4 వికెట్లతో చెలరేగాడు. జేమ్స్ నీషమ్, ఇష్ సోధి చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం న్యూజిలాండ్ 19.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 164 పరుగులు చేసి గెలుపొందింది. గప్టిల్ (11 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు. సీఫెర్ట్, విలియమ్సన్ రెండో వికెట్‌కు అజేయంగా 95 బంతుల్లో 124 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. అష్రఫ్‌కు ఒక వికెట్ దక్కింది. నామమాత్రమైన మూడో టి20 మంగళవారం జరుగుతుంది. -
న్యూజిలాండ్ క్రికెటర్ల ప్రాక్టీస్ షురూ
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లోనూ క్రికెట్ కార్యకలాపాలు నెమ్మదిగా ప్రారంభమవుతున్నాయి. కివీస్ టాప్ క్రికెటర్లు టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, మ్యాట్ హెన్రీ, డరైల్ మిచెల్ సోమవారం ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. క్రికెటర్ల కోసం సెప్టెంబర్ వరకు ఆరు జాతీయ క్యాంప్‌లను నిర్వహించనున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్‌జడ్‌సీ) ప్రకటించింది. ‘లింకన్‌లోని హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో ఈ వారం జరిగే తొలి జాతీయ శిబిరంలో కివీస్ అగ్రశ్రేణి పురుషుల, మహిళల క్రికెటర్లు పాల్గొంటారు. రెండో శిబిరం మౌంట్ మాంగనీలోని బే ఓవల్‌లో ఈనెల 19–24 జరుగుతుంది. మూడోది ఆగస్టు 10–13 వరకు, నాలుగో శిబిరం ఆగస్టు 16–21 వరకు, మిగతా రెండు సెప్టెంబర్‌లో నిర్వహిస్తాం’ అని ఎన్‌జడ్‌సీ పేర్కొంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ మౌంట్‌మాంగనీలో జరిగే రెండో శిబిరంలో పాల్గొననున్నాడు. మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించడం పట్ల కివీస్ మహిళల వైస్ కెప్టెన్ ఆమీ సాటర్‌వైట్ ఆనందం వ్యక్తం చేసింది. -
అభిమాని బిత్తిరి చర్య.. మ్యాచ్‌కు అంతరాయం..!
చెస్టర్ లీ స్ట్రీట్: ఆతిథ్య ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఓ అభిమాని వెర్రివేషాలు వైరల్ అయ్యాయి. కివీస్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సెక్యురిటీ సిబ్బంది కళ్లుగప్పి ఓ వ్యక్తి బట్టల్లేకుండా మైదానంలో పరుగులు తీశాడు. దీంతో ఆటగాళ్లతోపాటు, మ్యాచ్ వీక్షిస్తున్న అభిమానులు షాక్‌కు గురయ్యారు. కాసేపు ఆటకు అంతరాయం కలిగింది ఆ సమయంలో టామ్ లాథమ్, మిచెల్ సాంట్నర్ క్రీజులో ఉన్నారు. వారి ఎదుటకు చేరిన ఆ అభిమాని చిందులు వేశాడు. తేరుకున్న భద్రతా సిబ్బంది తొలుత అతన్ని అవతారాన్ని బట్టలో కప్పేశారు. అనతంరం.. బయటికి లాక్కెళ్లారు. (చదవండి : ఇంగ్లండూ వచ్చేసింది) అయితే, సెక్యురిటీ సిబ్బంది అలక్ష్యం, వారు నింపాదిగా స్పందించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇక 306 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ అప్పటికీ 145/6 గా ఉంది. కాగా, ఈ మ్యాచ్‌లో 119 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఇంగ్లండ్ సెమీస్ చేరింది. 27 ఏళ్ల అనంతరం ఇంగ్లండ్ వరల్డ్‌కప్ సెమీస్ చేరడం విశేషం. అంతకుముందు 1992 ప్రపంచకప్‌లో ఆ జట్టు సెమీస్ చేరింది. ఇక వరుసగా మూడు పరాజయాలు మూటగట్టుకున్న కివీస్ నాలుగో స్థానంలో నిలిచింది. ఆ జట్టు సెమీస్ చేరడం లాంఛనమే..! (చదవండి : కనీసం 316 పరుగులతో గెలవాలి..అయితేనే..) -
ఇంగ్లండూ వచ్చేసింది
చెస్టర్ లీ స్ట్రీట్: హాట్ ఫేవరెట్‌గా ప్రపంచ కప్‌ను మొదలుపెట్టి, ఓ దశలో అనూహ్య ఓటములతో ముప్పు కొనితెచ్చుకున్న ఆతిథ్య ఇంగ్లండ్... కీలక సమయంలో జూలు విదిల్చి 1992 తర్వాత ప్రపంచకప్‌లో మళ్లీ సెమీఫైనల్ మెట్టెక్కింది. ఆ జట్టు బుధవారం న్యూజిలాండ్‌ను 119 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ఓపెనర్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జానీ బెయిర్‌స్టో (99 బంతుల్లో 106; 15 ఫోర్లు, సిక్స్) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ బాదాడు. మరో ఓపెనర్ జేసన్ రాయ్ (61 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధ శతకం చేశాడు. కెప్టెన్ మోర్గాన్ (40 బంతుల్లో 42; 5 ఫోర్లు) రాణించాడు. నీషమ్ (2/41), హెన్రీ (2/54), బౌల్ట్ (2/56) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఛేదనలో లాథమ్ (65 బంతుల్లో 57; 5 ఫోర్లు) మినహా మరెవరూ నిలవకపోవడంతో న్యూజిలాండ్ 45 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటైంది. ఎంతో అనుకుంటే...! 194/1... సరిగ్గా 30 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోరిది. అప్పటికి బెయిర్‌స్టో శతకం (95 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. రూట్ (24) కుదురుకున్నాడు. దీంతో 350 పైగానే చేసేలా కనిపించింది. కానీ, వీరిద్దరినీ వరుస ఓవర్లలో ఔట్ చేసి బౌల్ట్, హెన్రీ పరిస్థితిని మార్చివేశారు. మోర్గాన్ నిలిచినా బట్లర్ (11), స్టోక్స్ (11), వోక్స్ (4)లను పెవిలియన్ చేర్చి కివీస్ బౌలర్లు పైచేయి సాధించారు. ప్లంకెట్ (15 నాటౌట్), రషీద్ (16) శక్తిమేర పోరాడి 300 దాటించారు. అంతకుముందు రాయ్, బెయిర్ స్టో ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్నారు. వీరి ధాటికి 15 ఓవర్లలోపే స్కోరు 100 దాటింది. నీషమ్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన రాయ్ మరుసటి బంతికి ఔటవడంతో 123 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కివీస్ పోరాడకుండానే... ఓపెనర్లు నికోల్స్ (0), గప్టిల్ (8) పేలవ ఫామ్ కొనసాగడంతో ఛేదనలో న్యూజిలాండ్ ముందే తేలిపోయింది. మూడో వికెట్‌కు 47 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గాడిన పెడుతున్న సమయంలో తొలుత కెప్టెన్ విలియమ్సన్ (40 బంతుల్లో 27; 3 ఫోర్లు), తర్వాత రాస్ టేలర్ (42 బంతుల్లో 28; 2 ఫోర్లు) దురదృష్టవశాత్తు రనౌటయ్యారు. ఆల్‌రౌండర్లు నీషమ్ (19), గ్రాండ్‌హోమ్ (3) విఫలమయ్యారు. దీంతో కివీస్ ఏ దశలోనూ లక్ష్యాన్ని అందుకునేలా కనిపించలేదు. ఓటమి ఖాయమైన నేపథ్యంలో మిగతావారి పోరాటం పరుగుల అంతరాన్ని తగ్గించేందుకు మాత్రమే ఉపయోగపడింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) సాన్‌ట్నర్ (బి) నీషమ్ 60; బెయిర్‌స్టో (బి) హెన్రీ 106; రూట్ (సి) లాథమ్ (బి) బౌల్ట్ 24; బట్లర్ (సి) విలియమ్సన్ (బి) బౌల్ట్ 11; మోర్గాన్ (సి) సాన్‌ట్నర్ (బి) హెన్రీ 42; స్టోక్స్ (సి) హెన్రీ (బి) సాన్‌ట్నర్ 11; వోక్స్ (సి) విలియమ్సన్ (బి) నీషమ్ 4; ప్లంకెట్ (నాటౌట్) 15; రషీద్ (బి) సౌతీ 16; ఆర్చర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 305. వికెట్ల పతనం: 1–123, 2–194, 3–206, 4–214, 5–248, 6–259, 7–272, 8–301. బౌలింగ్: సాన్‌ట్నర్ 10–0–65–1; బౌల్ట్ 10–0–56–2; సౌతీ 9–0–70–1; హెన్రీ 10–0–54–2; గ్రాండ్‌హోమ్ 1–0–11–0; నీషమ్ 10–1–41–2. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 8; నికోల్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వోక్స్ 0; విలియమ్సన్ (రనౌట్) 27; టేలర్ (రనౌట్) 28; లాథమ్ (సి) బట్లర్ (బి) ప్లంకెట్ 57; నీషమ్ (బి) వుడ్ 19; గ్రాండ్‌హోమ్ (సి) రూట్ (బి) స్టోక్స్ 3; సాన్‌ట్నర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వుడ్ 12; సౌతీ (నాటౌట్) 7; హెన్రీ (బి) వుడ్ 7; బౌల్ట్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 4; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (45 ఓవర్లలో ఆలౌట్) 186. వికెట్ల పతనం: 1–2, 2–14, 3–61, 4–69, 5–123, 6–128, 7–164, 8–166, 9–181, 10–186. బౌలింగ్: వోక్స్ 8–0–44–1; ఆర్చర్ 7–1–17–1; ప్లంకెట్ 8–0–28–1; వుడ్ 9–0–34–3; రూట్ 3–0–15–0; రషీద్ 5–0–30–1; స్టోక్స్ 5–0–10–1. -
బౌన్సర్‌కు పాక్ బ్యాట్స్‌మన్ విలవిల
అబుదాబి: న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ వేసిన బౌన్సర్.. ఆస్ట్రేలియా ఆటగాడు ఫిలిప్ హ్యూస్‌ను గుర్తుచేసింది. అంతటి ప్రమాదకర బౌన్సర్‌కు పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ విలవిలాడాడు. ఫెర్గూసన్ వేసిన బౌన్సర్ నేరుగా ఇమామ్ హెల్మెట్‌కు తగిలింది. దీంతో అతను మైదానంలో కుప్పకూలాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా మైదానంలోని ఆటగాళ్లు.. ప్రేక్షకులు కలవరపాటు గురయ్యారు. వెంటనే మైదానంలోకి పరుగెత్తుకొచ్చిన ఫిజియో ఇమామ్‌కు ప్రాథమిక చికిత్స అందించే ప్రయత్నం చేశాడు. కానీ ఇమామ్ గాయం తీవ్రంగా ఉండటంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరీక్షలు నిర్వహించామని భయపడాల్సిన గాయం కాదని పాక్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. షోయబ్ మాలిక్ సైతం ఇమామ్‌తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ అతను బాగానే ఉన్నాడని తెలిపాడు. ఆసీస్ బౌలర్ సీన్ అబాట్ వేసిన బౌన్సర్‌ను ఆడబోయి హ్యూస్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ రాస్ టేలర్ (86), హెన్రీ నికోలస్(33), వర్కర్ (28) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవ్వడంతో 9 వికెట్లు నష్టానికి 209 పరుగులే చేసింది. అనంతరం పాక్.. ఫకార్ జమాన్ (88), బాబర్ అజమ్ (46)లు రాణించడంతో 40.3 ఓవర్లోనే లక్ష్యాన్ని అందుకుంది. ఈ గెలుపుతో కివీస్‌పై వరుస(12) పరాజయాలకు అడ్డుకట్ట వేసింది. Get well soon #ImamUlHaq pic.twitter.com/MaR0MZPIaM — Ramiz Ahmed Patel (@ramizrap1) November 9, 2018 He’s just fine #Alhumdulilah! Fine knock today boi 👍🏽 #PakVsNZ pic.twitter.com/gcrFg0oK3y — Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) November 9, 2018 -
‘హ్యాట్రిక్’ విజయం
అబుదాబి: న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ‘హ్యాట్రిక్’తో జట్టుకు విజయాన్ని అందించాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో అతడు ఈ ఘనత సాధించాడు. ఫలితంగా పాక్ 47 పరుగులతో పరాజయం పాలైంది. హ్యాట్రిక్‌తో టాప్ ఆర్డర్‌ను కూల్చి పాక్ పతనాన్ని బౌల్ట్ శాసించాడు. ఫఖర్ జమాన్, బాబర్ అజామ్, మహ్మద్ హఫీజ్‌లను వరుస బంతుల్లో పెలివియన్‌కు పంపాడు. బౌల్ట్ దెబ్బకు పాక్ కోలుకోలేకపోయింది. 267 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక 47.2 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ అహ్మద్(64), ఇమాద్ వాసిం(50) అర్థ సెంచరీలతో పోరాడారు. కివీస్ బౌలర్లలో ఫెర్గుసన్ 3, గ్రాండ్హోమె 2 వికెట్లు పడగొట్టారు. సోధి ఒక వికెట్ దక్కించుకున్నాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. టేలర్(80) లాంథమ్ (68) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో షహీన్ షా ఆఫ్రిది, షదబ్ ఖాన్ నాలుగేసి వికెట్లు నేలకూల్చారు. ఇమాద్ వాసిం ఒక వికెట్ తీశాడు. ‘బౌల్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. మూడోవాడు! న్యూజిలాండ్ తరపున వన్డేల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన మూడో పురుష బౌలర్‌గా ట్రెంట్ బౌల్ట్గా నిలిచాడు. అతడి కంటే ముందు డానీ మోరిసన్, షేన్ బాండ్ ఈ ఘనత సాధించారు. -
389 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
లార్డ్స్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 389 పరుగులకు ఆలౌటైంది. 354/7 ఓవర్ నైట్ స్కోరుతో రెండు ఆట ప్రారంభించిన ఇంగ్లీషు టీమ్ మరో 35 పరుగులు జత చేసి మిగతా వికెట్లు కోల్పోయింది. జో రూట్ 98, బెన్ స్టోక్స్ 94 , బట్లర్ 67, మొయిన్ అలీ 54 అర్థ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ కుక్ 16 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, హన్సీ నాలుగేసి వికెట్లు పడగొట్టారు. సౌతీ, క్రెయిగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ వికెట్ నష్టపోకుండా 145 పరుగులు చేసింది. ఓపెర్లు గప్టిల్(70), లాథమ్(59) అర్థ సెంచరీలతో ఆడుతున్నారు. -
మెకల్లమ్ ద్విశతకం; కివీస్‌కు భారీ ఆధిక్యం
వెల్లింగ్టన్: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ పట్టుబిగిచింది. కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ డబుల్ సెంచరీ, వాట్లింగ్ సెంచరీలతో చెలరేగడంతో కివీస్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. 252/5 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ఆరంభించిన కివీస్ మ్యాచ్ ముగిసే సమయానికి 571/6 స్కోరు చేసింది. దీంతో న్యూజిలాండ్‌కు 325 పరుగుల ఆధిక్యం లభించింది. మెకల్లమ్, వాట్లింగ్ ఆరో వికెట్‌కు 355 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడంతో కివీస్ కోలుకుంది. వాట్లింగ్(124)ను మహ్మద్ షమీ అవుట్ చేయడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత మరో వికెట్ పడకుండా కివీస్ జాగ్రత్త పడింది. మెకల్లమ్ ట్రిఫుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. అయితే ట్రిఫుల్ సెంచరీ చేసే వరకు ఆగుతాడా లేక మ్యాచ్ ను ముందే డిక్లేర్ చేస్తాడా అనేది మంగళవారం తేలుతుంది. మెకల్లమ్ 281, నిషామ్ 67 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. చివరి రోజు ఏదైనా సంచలనం జరిగితే తప్పా మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేదు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 192, భారత్ 438 పరుగులు చేశాయి. -
టీమిండియా విజయలక్ష్యం 407 పరుగులు
ఆక్లాండ్ : ఆక్లాండ్ టెస్ట్‌లో రెండో ఇన్సింగ్స్‌లో న్యూజిలాండ్ 105 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 407 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. కాగా మూడో రోజు పిచ్ స్వభావం దారుణంగా మారిపోయింది. ఫలితంగా పదహారు వికెట్లు టప టప రాలిపోయాయి. టీమిండియా మూడో రోజు అనూహ్య రీతిలో 202 పరుగులకు ఆలౌటైతే, ఆ తర్వాత న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 105 పరుగులకు కుప్ప కూలింది. టీమిండియా బ్యాట్స్‌మెన్ నిలదొక్కుకుంటే తప్ప ఈ పిచ్ మీద విజయం సాధించడం కష్ట సాధ్యమే. ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ 72 మినహా మిగతా వారెవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. వాగ్నర్ నాలుగు వికెట్లు తీసుకుంటే, బౌల్ట్, సౌతీ మూడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో టేలర్ 41 పరుగులు మినహాయిస్తే ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. షమీ మూడు, జహీర్ రెండు, ఇశాంత్ రెండు వికెట్లు పడగొట్టారు. -
ఒక్కడి స్కోరు కొట్టలేకపోయారు
ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 202 పరుగులకు ఆలౌటయింది. దీంతో న్యూజిలాండ్‌కు 301 ఆధిక్యం లభించింది. కివీస్ కెప్టెన్ మెకల్లమ్ ఒక్కడే 224 పరుగులు చేయగా, ధోని సేన మాత్రం ఒక్కడు సాధించిన స్కోరు కూడా చేయలేక చతికిలపడింది. 130/4 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ కేవలం 72 పరుగులు జోడించి మిగతా వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ 72, ధోని 10, జహీర్ ఖాన్ 14 పరుగులు చేసి అవుటయ్యారు. జడేజా 3 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు. కివీస్ బౌలర్లో వాగ్నేర్ 4, బౌల్ట్ 3, సౌతీ 3 వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 15 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఫుల్టన్(5), రూథర్‌ఫోర్డ్(0), విలియమ్సన్(3), మెకల్లమ్(0) అవుటయ్యారు. -
నెంబర్ వన్ పోయె.. పరువూ పోయె..!
వన్డే క్రికెట్లో టీమిండియా ప్రపంచ చాంపియన్. న్యూజిలాండ్ పర్యటనకు ముందు ర్యాంకింగ్స్ లోనూ నెంబర్ వన్. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ప్రపంచ కప్ కు ఆతిథ్యమివ్వనుండటంతో.. ధోనీసేన కివీస్ గడ్డపై సత్తాచాటాలనే లక్ష్యంతో వెళ్లింది. అయితే సీన్ రివర్సయింది. విదేశీ గడ్డపై తడబడే బలహీనత టీమిండియాను మరోసారి వెంటాడింది. బౌలర్లు ఘోరంగా విఫలమవ్వగా, బ్యాట్స్ మెన్ దీ దాదాపు అదే పరిస్థితి. ధోనీసేన అన్ని విభాగాల్లో విఫలమైంది. ఫలితంగా వన్డే సిరీస్ లో చిత్తుగా ఓడిపోయింది. సిరీస్ సంగతి అటుంచి వరుస పరాజయాలతో నెంబర్ వన్ ర్యాంక్ చేజార్చుకుంది. చివరి వన్డేలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ధోనీసేన ఆరాటపడినా బోణీయే కొట్టకుండా సిరీస్ ముగించింది. సొంతగడ్డపై సత్తాచాటిన కివీస్ 4-0తో సిరీస్ ను సొంతం చేసుకుంది. మూడో వన్డేలో మాత్రం రాణించిన భారత్ అతికష్టమ్మీద టైగా ముగించింది. భారత్ ఉపఖండంలోనే పులి అన్న విమర్శను ధోనీసేన మరోసారి చెత్తప్రదర్శనతో నిజం చేసింది. విదేశీ పరిస్థితులు, అక్కడి పిచ్ లపై తడబడటం భారత ఆటగాళ్ల బలహీనత. న్యూజిలాండ్ తో పోలీస్తే టీమిండియా అన్ని విధాల పటిష్టమైన జట్టు. అయితే కివీస్ స్వదేశంలో సానుకూల పరిస్థితుల్ని సద్వినియోగం చేసుకోగా.. భారత ఆటగాళ్లు తేలిపోయారు. ఓపెనర్లు విఫలమవడం జట్టుపై ప్రతికూల ప్రభావం చూపించింది. బ్యాటింగ్ ఆర్డర్ లో విరాట్ కోహ్లీ, ధోనీ మాత్రమే నిలకడగా రాణించారు. జడేజా రెండు మ్యాచ్ ల్లో మెరుపులు మెరిపించాడు. అయితే ఇతర ఆటగాళ్లు బ్యాట్లెత్తేయడంతో విజయం అందని ద్రాక్షగానే మిగిలింది. ఓపెనర్లను మార్చినా, జట్టుకు భారంగా మారిన రైనాను తప్పించి అంబటి రాయుడుకు చాన్స్ ఇచ్చినా ఫలితం దక్కలేదు. ఇక బౌలర్లయితే ఘోరంగా విఫలమయ్యారు. షమీ ఆకట్టుకున్నా కీలక ఓవర్లలో పరుగులు కట్టడి చేయలేకపోయాడు. మరోవైపు న్యూజిలాండ్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో రాణించి సత్తాచాటారు. వన్డే సిరీస్ లో దారుణంగా ఓడిన ధోనీసేనకు కివీస్ గడ్డపై మరో సవాల్ ఎదురవుతోంది. ఆతిథ్య జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. వన్డే సిరీస్ లో ఓడి నిరుత్సాహంగా ఉన్న టీమిండియా పుంజుకుంటుందా? టెస్టుల్లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. -
టీమిండియాకు బోణీయే కరువాయె
-
టీమిండియాకు బోణీయే కరువాయె
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో భారత బోణీ కల నెరవేరలేదు. ధోనీసేన మరోసారి చిత్తుగా ఓడింది. సిరీస్ పోయింది.. పరువూ పోయింది.. నంబర్ వన్ ర్యాంకూ గల్లంతైంది. వెల్లింగ్టన్లో జరిగిన చివరి వన్డేలోనూ టీమిండియా ఓడింది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్ మరోసారి కలిసికట్టుగా విఫలమై.. టీమ్ కొంప ముంచారు. శుక్రవారమిక్కడ జరిగిన చివరి, ఐదో వన్డేలో భారత్ 87 పరుగులతో కివీస్ చేతిలో పరాజయం మూటగట్టుకుంది. ఇంతకుముందు సిరీస్ ను సొంతం చేసుకున్న కివీస్ ఆధిక్యాన్ని 4-0కు పెంచుకుంది. మూడో వన్డే టైగా ముగియగా, మిగిలిన మ్యాచ్ ల్లో భారత్ ఓడిన సంగతి తెలిసిందే. చివరి మ్యాచ్ లో 304 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీసేన మరో రెండు బంతులు మిగులుండగా 216 పరుగులకు కుప్పకూలింది. విరాట్ కోహ్లీ (82), ధోనీ (47) మినహా ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. తెలుగుతేజం అంబటి రాయుడు 20, భువనేశ్వర్ కుమార్ 20 పరుగులు చేశారు. కివీస్ బౌలర్ హెన్నీ నాలుగు వికెట్లు తీశాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. 41 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన కివీస్‌ను విలియమ్సన్, రాస్ టేలర్ ఆదుకున్నారు. టేలర్(102) సెంచరీ, విలియమ్సన్(88) అర్థ సెంచరీ సాధించారు. నీషమ్ 34, గుప్తిల్ 16, రైడర్ 17, రోంచి 11 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఆరోన్ 2 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, విరాట్ కోహ్లి తలో వికెట్ తీశారు. -
టేలర్ సెంచరీ; కివీస్ భారీ స్కోరు
-
హామిల్టన్ వన్డేలోనూ భారత్ ఓటమి
-
హామిల్టన్ వన్డేలోనూ భారత్ ఓటమి
హామిల్టన్: న్యూజిలాండ్ గడ్డపై ధోని సేనకు వరుసగా రెండో పరాభవం ఎదురయింది. కివీస్‌తో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమి పాలయింది. బుధవారమిక్కడ జరిగిన రెండో వన్డేలో భారత్ పరుగుల తేడాతో ఓడిపోయింది. 297 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 41.3 ఓవర్లలో 277 పరుగులు చేసింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం 15 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయినట్టు ప్రకటించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ 293 చేయాల్సివుంది. కోహ్లి(78), ధోని(56) అర్థ సెంచరీలు చేసినా టీమిండియాకు ఓటమి తప్పలేదు. రహానే 36, రైనా 35, రోహిత్ శర్మ 20, జడేజా 12, ధావన్ 12 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో సౌతి 4, ఆండర్సన్ 3 వికెట్లు పడగొట్టారు. మిల్స్, మెక్ క్లీనాగన్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించడంతో ఆటను 42 ఓవర్లకు కుదిరించారు. కివీస్ 42 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. దీంతో భారత్ విజయ లక్ష్యాన్ని 42 ఓవర్లలో 297 పరుగులుగా నిర్ణయించారు. -
ఇండియా టార్గెట్ 297 పరుగులు
హామిల్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్‌కు కివీస్ 297 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 42 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమయింది. దీంతో మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించారు. విలియమ్సన్(77), టేలర్(57) అర్థ సెంరీలు చేశారు. గుప్తిల్ 44, రైడర్ 20, ఆండర్సన్ 44, రోచి 18 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టాడు. భవనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, జడేజా, రైనా తలో వికెట్ తీశారు. డక్ వర్త్ లూయిస్ ప్రకారం భారత్ టార్గెట్ 297 పరుగులుగా నిర్ణయించారు. -
నేపియర్ వన్డేలో ధోని సేన ఓటమి
-
నేపియర్ వన్డేలో ధోని సేన ఓటమి
నేపియర్: న్యూజిలాండ్ పర్యటనలో ధోని సేనకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారమిక్కడ జరిగిన తొలి వన్డేలో భారత్ 24 పరుగుల తేడాతో ఓటమిపాలయింది. కివీస్ నిర్దేశించిన 293 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 48.4 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌటయింది. కోహ్లి, ధోని మినహా మిగతా ఆటగాళ్లు విఫలమవడంతో భారత్‌కు పరాజయం ఎదురైంది. కోహ్లి ఒక్కడే అద్భుతంగా ఆడి సెంచరీ(123) సాధించాడు. కెప్టెన్ ధోని 40 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. శిఖర్ ధావన్ 32, రైనా 18, అశ్విన్ 12, రహానే 7, ఇషాంత్ శర్మ 5, రోహిత్ శర్మ 3, భువనేశ్వర్ కుమార్ 3 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మెక్ క్లినగన్ 4, ఆండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు. సౌతి, మిల్నీ, విలియమ్సన్ తలో వికెట్ తీశారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్ లో కివీస్ 1-0 ఆధిక్యం దక్కించుకుంది. -
షమీ షేక్; కివీస్‌కు బ్రేక్
నేపియర్: ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారమిక్కడ ప్రారంభమయిన తొలి వన్డేలో భారత్‌కు న్యూజిలాండ్ 293 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసింది. విలియమ్సన్(71), టేలర్(55), ఆండర్సన్(68) అర్థ సెంచరీలతో రాణించారు. 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కివీస్‌ను వీరు ఆదుకున్నారు. మెక్ కల్లమ్ 30, రోంచి 30, రైడర్ 18 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ పదునైన బౌలింగ్‌తో కివీస్ ఆటగాళ్ల జోరుకు కళ్లెం వేశాడు. 4 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, జడేజా తలో వికెట్ తీశారు. -
న్యూజిలాండ్ చేరుకున్న ధోని సేన
నేపియర్: భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ చేరుకుంది. ఐదు వన్డేల సిరీస్‌తో పాటు రెండు టెస్టులను ఆడేందుకు ధోని నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఇక్కడికి చేరుకుంది. ఆహ్లాదక వాతావరణం, ఉల్లాపరిచే పరిసరాలు నేపియర్ తమకు స్వాగతం పలికిందని ఇక్కడికి చేరుకున్న తర్వాత విరాట్ కోహ్లి ట్వీట్ చేశాడు. మైదానంలో దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నామని పేర్కొన్నాడు. టీమిండియా సభ్యులు ముంబై నుంచి ఆక్లాండ్ చేరుకుని అక్కడి నుంచి నాపియర్కు వచ్చారు. ఈనెల 19 నుంచి 31 వరకు జరిగే వన్డే సిరీస్‌లో నేపియర్, వెల్లింగ్టన్, హామిల్టన్, ఆక్లాండ్ వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. వచ్చే నెల 6 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభమవుతుంది. దీనికి ముందు రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఉంటుంది. అయితే బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా, మురళీ విజయ్, పేస్ బౌలర్లు జహీర్ ఖాన్, ఉమేశ్ యాదవ్ మరో వారం తర్వాత కివీస్‌కు వెళ్లనున్నారు. 2008-09 అనంతరం భారత జట్టు తొలిసారిగా న్యూజిలాండ్ పర్యటనకు వెళుతుండగా ఓవరాల్‌గా ఇది తొమ్మిదోసారి. -
ఎడ్వార్డ్స్, బ్రేవో బాదారు.. కివీస్ బేజారు
హామిల్టన్: న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. చివరి వన్డేలో కివీస్‌ను విండీస్ 203 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది. కిర్క్ ఎడ్వార్డ్స్(123), డ్వేన్ బ్రేవో(106) సెంచరీలతో కదం తొక్కారు. ఓపెనర్ పావెల్(73) అర్థ సెంచరీతో రాణించాడు. చార్లెస్ 31 పరుగులు చేశాడు. కివీస్ మెక్ కల్లమ్, ఆండర్సన్, విలియమ్సన్ ఒక్కో వికెట్ తీశారు. 364 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 160 పరుగులకే కుప్పకూలింది. ఆండర్సర్(29) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో మిల్లర్ 4 వికెట్లు పడగొట్టాడు. హోల్డర్, రసెల్ రెండేసి వికెట్లు తీశారు. బ్రేవో ఒక వికెట్ దక్కించుకున్నాడు. డ్వేన్ బ్రేవోకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. మొదటి వన్డేలో వెస్టిండీస్ 2 వికెట్ల తేడాతో నెగ్గగా, రెండో వన్డే వర్షం కారణంగా రద్దయింది. మూడు, నాలుగు వన్డేల్లో న్యూజిలాండ్ విజయంగా సాధించింది.