ఇంగ్లండూ వచ్చేసింది | England also came to the world cup semis 2019 | Sakshi
Sakshi News home page

ఇంగ్లండూ వచ్చేసింది

Published Thu, Jul 4 2019 5:19 AM | Last Updated on Thu, Jul 4 2019 2:23 PM

England also came to the world cup semis 2019 - Sakshi

చెస్టర్‌ లీ స్ట్రీట్‌: హాట్‌ ఫేవరెట్‌గా ప్రపంచ కప్‌ను మొదలుపెట్టి, ఓ దశలో అనూహ్య ఓటములతో ముప్పు కొనితెచ్చుకున్న ఆతిథ్య ఇంగ్లండ్‌... కీలక సమయంలో జూలు విదిల్చి 1992 తర్వాత ప్రపంచకప్‌లో మళ్లీ సెమీఫైనల్‌ మెట్టెక్కింది. ఆ జట్టు బుధవారం న్యూజిలాండ్‌ను 119 పరుగుల తేడాతో ఓడించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ఓపెనర్, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జానీ బెయిర్‌స్టో (99 బంతుల్లో 106; 15 ఫోర్లు, సిక్స్‌) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ బాదాడు. మరో ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (61 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధ శతకం చేశాడు. కెప్టెన్‌ మోర్గాన్‌ (40 బంతుల్లో 42; 5 ఫోర్లు) రాణించాడు. నీషమ్‌ (2/41), హెన్రీ (2/54), బౌల్ట్‌ (2/56) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఛేదనలో లాథమ్‌ (65 బంతుల్లో 57; 5 ఫోర్లు) మినహా మరెవరూ నిలవకపోవడంతో న్యూజిలాండ్‌ 45 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటైంది. ఎంతో అనుకుంటే...! 

194/1... సరిగ్గా 30 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోరిది. అప్పటికి బెయిర్‌స్టో శతకం (95 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. రూట్‌ (24) కుదురుకున్నాడు. దీంతో 350 పైగానే చేసేలా కనిపించింది. కానీ, వీరిద్దరినీ వరుస ఓవర్లలో ఔట్‌ చేసి బౌల్ట్, హెన్రీ పరిస్థితిని మార్చివేశారు. మోర్గాన్‌ నిలిచినా బట్లర్‌ (11), స్టోక్స్‌ (11), వోక్స్‌ (4)లను పెవిలియన్‌ చేర్చి కివీస్‌ బౌలర్లు పైచేయి సాధించారు. ప్లంకెట్‌ (15 నాటౌట్‌), రషీద్‌ (16) శక్తిమేర పోరాడి 300 దాటించారు. అంతకుముందు రాయ్, బెయిర్‌ స్టో ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్నారు. వీరి ధాటికి 15 ఓవర్లలోపే స్కోరు 100 దాటింది. నీషమ్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన రాయ్‌ మరుసటి బంతికి ఔటవడంతో 123 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.
 
కివీస్‌ పోరాడకుండానే... 
ఓపెనర్లు నికోల్స్‌ (0), గప్టిల్‌ (8) పేలవ ఫామ్‌ కొనసాగడంతో ఛేదనలో న్యూజిలాండ్‌ ముందే తేలిపోయింది. మూడో వికెట్‌కు 47 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గాడిన పెడుతున్న సమయంలో తొలుత కెప్టెన్‌ విలియమ్సన్‌ (40 బంతుల్లో 27; 3 ఫోర్లు), తర్వాత రాస్‌ టేలర్‌ (42 బంతుల్లో 28; 2 ఫోర్లు) దురదృష్టవశాత్తు రనౌటయ్యారు. ఆల్‌రౌండర్లు నీషమ్‌ (19), గ్రాండ్‌హోమ్‌ (3) విఫలమయ్యారు. దీంతో కివీస్‌ ఏ దశలోనూ లక్ష్యాన్ని అందుకునేలా కనిపించలేదు. ఓటమి ఖాయమైన నేపథ్యంలో మిగతావారి పోరాటం పరుగుల అంతరాన్ని తగ్గించేందుకు మాత్రమే ఉపయోగపడింది. 



స్కోరు వివరాలు 
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: రాయ్‌ (సి) సాన్‌ట్నర్‌ (బి) నీషమ్‌ 60; బెయిర్‌స్టో (బి) హెన్రీ 106; రూట్‌ (సి) లాథమ్‌ (బి) బౌల్ట్‌ 24; బట్లర్‌ (సి) విలియమ్సన్‌ (బి) బౌల్ట్‌ 11; మోర్గాన్‌ (సి) సాన్‌ట్నర్‌ (బి) హెన్రీ 42; స్టోక్స్‌ (సి) హెన్రీ (బి) సాన్‌ట్నర్‌ 11; వోక్స్‌ (సి) విలియమ్సన్‌ (బి) నీషమ్‌ 4; ప్లంకెట్‌ (నాటౌట్‌) 15; రషీద్‌ (బి) సౌతీ 16; ఆర్చర్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 305. 

వికెట్ల పతనం: 1–123, 2–194, 3–206, 4–214, 5–248, 6–259, 7–272, 8–301. బౌలింగ్‌: సాన్‌ట్నర్‌ 10–0–65–1; బౌల్ట్‌ 10–0–56–2; సౌతీ 9–0–70–1; హెన్రీ 10–0–54–2; గ్రాండ్‌హోమ్‌ 1–0–11–0; నీషమ్‌ 10–1–41–2. 

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్టిల్‌ (సి) బట్లర్‌ (బి) ఆర్చర్‌ 8; నికోల్స్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) వోక్స్‌ 0; విలియమ్సన్‌ (రనౌట్‌) 27; టేలర్‌ (రనౌట్‌) 28; లాథమ్‌ (సి) బట్లర్‌ (బి) ప్లంకెట్‌ 57; నీషమ్‌ (బి) వుడ్‌ 19; గ్రాండ్‌హోమ్‌ (సి) రూట్‌ (బి) స్టోక్స్‌ 3; సాన్‌ట్నర్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) వుడ్‌ 12; సౌతీ (నాటౌట్‌) 7; హెన్రీ (బి) వుడ్‌ 7; బౌల్ట్‌ (స్టంప్డ్‌) బట్లర్‌ (బి) రషీద్‌ 4; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (45 ఓవర్లలో ఆలౌట్‌) 186. 

వికెట్ల పతనం: 1–2, 2–14, 3–61, 4–69, 5–123, 6–128, 7–164, 8–166, 9–181, 10–186. బౌలింగ్‌: వోక్స్‌ 8–0–44–1; ఆర్చర్‌ 7–1–17–1; ప్లంకెట్‌ 8–0–28–1; వుడ్‌ 9–0–34–3; రూట్‌ 3–0–15–0; రషీద్‌ 5–0–30–1; స్టోక్స్‌ 5–0–10–1. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement