అభిమాని బిత్తిరి చర్య.. మ్యాచ్‌కు అంతరాయం..! | Streaker Runs Out In Ground Interruption England vs New Zealand Match | Sakshi
Sakshi News home page

అభిమాని బిత్తిరి చర్య.. మ్యాచ్‌కు అంతరాయం..!

Published Thu, Jul 4 2019 12:04 PM | Last Updated on Thu, Jul 4 2019 12:05 PM

Streaker Runs Out In Ground Interruption England vs New Zealand Match - Sakshi

చెస్టర్‌ లీ స్ట్రీట్‌: ఆతిథ్య ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఓ అభిమాని వెర్రివేషాలు వైరల్‌ అయ్యాయి. కివీస్‌ జట్టు బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో సెక్యురిటీ సిబ్బంది కళ్లుగప్పి ఓ వ్యక్తి బట్టల్లేకుండా మైదానంలో పరుగులు తీశాడు. దీంతో ఆటగాళ్లతోపాటు, మ్యాచ్‌ వీక్షిస్తున్న అభిమానులు షాక్‌కు గురయ్యారు. కాసేపు ఆటకు అంతరాయం కలిగింది ఆ సమయంలో టామ్‌ లాథమ్‌, మిచెల్‌ సాంట్నర్‌ క్రీజులో ఉన్నారు. వారి ఎదుటకు చేరిన ఆ అభిమాని చిందులు వేశాడు. తేరుకున్న భద్రతా సిబ్బంది తొలుత అతన్ని అవతారాన్ని బట్టలో కప్పేశారు. అనతంరం.. బయటికి లాక్కెళ్లారు. 
(చదవండి : ఇంగ్లండూ వచ్చేసింది)

అయితే, సెక్యురిటీ సిబ్బంది అలక్ష్యం, వారు నింపాదిగా స్పందించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇక 306 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్‌ ఆరంభించిన కివీస్‌ అప్పటికీ 145/6 గా ఉంది. కాగా, ఈ మ్యాచ్‌లో 119 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఇంగ్లండ్‌ సెమీస్‌ చేరింది. 27 ఏళ్ల అనంతరం ఇంగ్లండ్‌ వరల్డ్‌కప్‌ సెమీస్‌ చేరడం విశేషం. అంతకుముందు 1992 ప్రపంచకప్‌లో ఆ జట్టు సెమీస్‌ చేరింది. ఇక వరుసగా మూడు పరాజయాలు మూటగట్టుకున్న కివీస్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ఆ జట్టు సెమీస్‌ చేరడం లాంఛనమే..!
(చదవండి : కనీసం 316 పరుగులతో గెలవాలి..అయితేనే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement