ఇంగ్లండ్ లెజెండరీ పేసర్ జేమ్స్ ఆండర్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఆండర్సన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే వన్డేలు, టీ20ల నుంచి తప్పుకున్న ఆండర్సన్.. ఈ వేసవి సీజన్‌తో టెస్టు క్రికెట్ నుంచి కూడా తప్పుకోనున్నాడు.
ఈ ఏడాది జూలైలో లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్టు అనంతరం తన 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు పలకున్నట్లు ఆండర్సన్ ప్రకటించాడు. ఈ విషయాన్ని శనివారం సోషల్ మీడియా వేదికగా 41 ఏళ్ల ఆండర్సన్ వెల్లడించాడు.
"ఈ వేసవిలో లార్డ్స్‌లో వెస్టిండీస్‌తో జరిగే మొదటి టెస్ట్ నా చివరి టెస్టు మ్యాచ్. 20 ఏళ్లకు పైగా నా దేశానికి అత్యున్నత స్ధాయిలో ప్రాతినిథ్యం వహించడం చాలా గర్వంగా ఉంది. నేను ఎంతో ఇష్టపడే ఆటకు విడ్కోలు పలుకుతుండడం చాలా బాధగా ఉంది.
కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలని ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నా ఈ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ఇంగ్లండ్ క్రికెట్‌కు ,అభిమానులకు ధన్యవాదాలంటూ" ఇన్‌స్టాగ్రామ్‌లో జేమ్స్ రాసుకొచ్చాడు.
ఇక ఆండర్సన్‌కు వరల్డ్‌క్రికెట్‌లో ప్రత్యేకమైన స్ధానం ఉంది. 41 ఏళ్ల ఆండర్సన్ టెస్టుల్లో 700 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 187 టెస్టులు, 194 వన్డేలు, 19 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఓవరాల్‌గా 400 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆండర్సన్ 987 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment