బజ్‌బాల్.. టెస్ట్‌ క్రికెట్‌లో సరికొత్త మంత్ర | Bazzball, England New Found Approach In Test Cricket | Sakshi
Sakshi News home page

Bazzball.. టెస్ట్‌ క్రికెట్‌లో సరికొత్త మంత్ర

Published Thu, Jul 7 2022 11:47 AM | Last Updated on Thu, Jul 7 2022 11:51 AM

Bazzball, England New Found Approach In Test Cricket - Sakshi

Bazball: బజ్‌బాల్.. ప్రస్తుతం క్రికెట్‌ ప్రపంచంలో ట్రెండింగ్‌లో ఉన్న పదం. విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ ఫాలోవర్స్‌ అంతా ప్రస్తుతం ఈ పదంపైనే చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏంటీ బజ్‌‌బాల్..? క్రికెట్‌కి ఈ పదానికి ఉన్న సంబంధం ఏంటి..? వివరాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం. 

ఇటీవల న్యూజిలాండ్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ముగిసిన టెస్ట్‌ సిరీస్‌ తర్వాత క్రికెట్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్న పదం బజ్‌బాల్‌. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ అనుసరించిన మెరుపుదాడి విధానాన్నే బజ్‌బాల్‌ అని అంటారు. మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్‌ సిరీస్‌లో న్యూజిలాండ్‌ నిర్ధేశించిన భారీ టర్గెట్‌లను ( 277, 299, 296) బెన్‌ స్టోక్స్‌, బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ ఆధ్వర్యంలోని న్యూ ఇంగ్లండ్‌ జట్టు బజ్‌బాల్‌ విధానాన్ని అవలంబించి అవలీలగా ఛేదించింది. 

తాజాగా టీమిండియాతో జరిగిన రీ షెడ్యూల్డ్‌ టెస్ట్‌లోనూ ఇంగ్లండ్‌ ఇదే మంత్రను ఫాలో అయి సక్సెస్‌ అయ్యింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు రూట్‌, బెయిర్‌స్టో టీమిండియా బౌలర్లపై మెరుపుదాడికి దిగి 378 పరుగుల భారీ టార్గెట్‌ను ఈజీగా ఊదేశారు. డిఫెన్స్‌ మోడ్‌లో సాగే టెస్ట్‌ క్రికెట్‌లో గెలుపే లక్ష్యంగా బ్యాటింగ్‌ చేసే ఈ అటాకింగ్‌ స్టయిల్‌నే బజ్‌బాల్‌ అంటారు. మెక్‌కల్లమ్‌, స్టోక్స్‌లు ఇంగ్లండ్‌ కోచింగ్‌, సారధ్య బాధ్యతలు చేపట్టాక ఈ వ్యూహాన్ని పకడ్బందీగా ఆచరణలో పెడుతున్నారు. 

ఈ ద్వయం టెస్ట్‌ క్రికెట్‌ రూపు రేఖలను మార్చేస్తూ, సంప్రదాయ క్రికెట్‌కు సరికొత్త శోభను తెస్తుంది. బ్యాటర్లు నిర్భయంగా ఎదురుదాడికి దిగే బజ్‌బాల్‌ విధానంపై ప్రస్తుతం అన్ని దేశాలు అధ్యయనం చేస్తున్నాయి. ఈ సరికొత్త అప్రోచ్‌ వల్ల టెస్ట్‌ క్రికెట్‌ కళ తప్పుతుందని కొందరు భావిస్తుంటే, జనరేషన్‌కు తగ్గట్టుగా ఆటలో వేగం ఉండాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి బజ్‌బాల్ అప్రోచ్ టీమిండియాకు అయితే కొత్త కాదు. 2000 దశకం ఆరంభంలో నజఫ్‌గడ్‌ నవాబ్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ విధానాన్ని అప్లై చేసి బౌలర్లపై తొలి బంతి నుంచే ఎదురుదాడికి దిగాడు. టెస్ట్‌ల్లో వీరూ ఒక్కరోజే భారీ డబుల్‌ సెంచరీ (284) బాదడం మనందరికీ తెలుసు. 
చదవండి: Ind Vs Eng: రీషెడ్యూల్డ్‌ టెస్టు గెలవాల్సింది.. కానీ: రోహిత్‌ శర్మ
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement