పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో డకౌటైన టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఆసీస్ గడ్డపై తొలిసారి ఆడుతున్న జైశ్వాల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు.
జైశ్వాల్ ప్రస్తుతం 90 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 7 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. కేఎల్ రాహుల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను జైశ్వాల్ అద్భుతంగా ముందుకు నడపిస్తున్నాడు.
జైశ్వాల్ వరల్డ్ రికార్డు..
ఈ క్రమంలో జైశ్వాల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఈయర్‌లో టెస్టుల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ప్లేయర్‌గా వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో జైశ్వాల్ ఇప్పటివరకు 34 సిక్స్‌లు బాదాడు.
ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండన్ మెకల్లమ్ పేరిట ఉండేది. మెక్‌కల్లమ్ 2014 ఏడాదిలో టెస్టుల్లో 33 సిక్స్‌లు బాదాడు. తాజా మ్యాచ్‌లో నాథన్ లియోన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన జైశ్వాల్.. మెకల్లమ్ అల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. వీరిద్దరి తర్వాతి స్ధానంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(26) ఉన్నారు.
ఇక రెండో రోజు ఆటలో కూడా ఆసీస్‌పై భారత్ పై చేయి సాధించింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్(90), కేఎల్ రాహుల్(62) నాటౌట్‌గా ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
చదవండి: కేఎల్ రాహుల్ అవుట్‌పై రగడ.. స్పందించిన స్టార్క్
Comments
Please login to add a commentAdd a comment