Bazzball
-
యాషెస్ నాలుగో టెస్ట్‌కు వర్షం ముప్పు.. బజ్‌బాల్ డోస్ పెంచుతామన్న స్టోక్స్
బజ్‌బాల్ అప్రోచ్ విషయంలో, యాషెస్ సిరీస్ నెగ్గే విషయంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఏమాత్రం తగ్గేదేలేదంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో యాషెస్ సిరీస్ గెలుస్తామని ధీమాగా చెబుతున్నాడు. నాలుగో టెస్ట్‌కు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్టోక్స్ మాట్లాడుతూ.. సిరీస్ అవకాశాలు సజీవంగా ఉంచే నాలుగో టెస్ట్‌లో ఎలాగైనా గెలిచి తీరతామని.. ఆసీస్ ఆధిక్యాన్ని 0-2 నుంచి 1-2కు తగ్గించాం, దీన్ని 2-2కు తీసుకువచ్చి, 3-2గా ముగిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. నాలుగో టెస్ట్ మొత్తానికి వర్షం ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలపై స్పందిస్తూ.. వాస్తవానికి మేము వాతావరణం గురించి ఆలోచించం. అయితే ప్రస్తుతం మేమున్న పరిస్థితుల్లో ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం. వరుణుడు ఇబ్బంది పెడితే తమ సాధారణ ఆటలో శృతి పెంచి, ఫలితం సాధిస్తామని చెప్పాడు. తప్పక గెలవాల్సిన మూడో టెస్ట్‌కు ముందు కూడా వర్షం ఇలానే మమ్మల్ని బయపెట్టిందని, అదే తమలోని అత్యుత్తమ ఆటతీరును వెలికి తీసి విజయం సాధించేలా చేసిందని తెలిపాడు. కాగా, నాలుగో టెస్ట్‌కు వేదిక అయిన ఓల్డ్ ట్రాఫర్డ్, మాంచెస్టర్‌లో మరో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మ్యాచ్ తొలి రోజు (జులై 19) వర్షం పడే అవకాశాలు కాస్త అటు ఇటుగా ఉన్నా, మిగతా నాలుగు రోజుల్లో మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ జరిగే సమయంలో ఓ మోస్తరుకు మించి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తమ నివేదికలో పేర్కొంది. వర్షం కురువని సమయంలో గాలి వేగం అధికంగా ఉంటుందని తెలిపింది. ఇదిలా ఉంటే, వర్షం కురువకుండా గాలి వేగం అధికంగా ఉంటే ఫాస్ట్ బౌలర్లు రెచ్చిపోతారు. ముందస్తు వాతావరణ హెచ్చరికల కారణంగానే ఇరు జట్లు స్పిన్నర్లను పక్కకు పెట్టి, కేవలం పేస్ దళంతోనే బరిలోకి దిగుతున్నారు. ఆల్‌రౌండర్లతో కలిపి ఇరు జట్లు ఐదుగురు పేసర్లతో కత్తులు దూసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంగ్లండ్: బెన్ డకెట్, జాక్ క్రాలే, మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జోనాథన్ బెయిర్‌స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖ్వాజా, లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్ -
ఇంగ్లండ్ తిక్క కుదిరింది.. బజ్‌బాల్ అప్రోచ్‌కు అదే విరుగుడు
బజ్‌బాల్ విధానం అంటూ టెస్ట్ క్రికెట్లో వేగం పెంచే ప్రయత్నం చేస్తూ, ఇటీవలే ఆసీస్ చేతిలో చావు దెబ్బ (యాషెస్ సిరీస్ తొలి టెస్ట్‌లో ఓటమి) తిన్న ఇంగ్లండ్ టీమ్‌ను ఉద్దేశిస్తూ ఆసీస్ మాజీ ఓపెనర్, మాజీ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడిలో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ కనబర్చిన సంయమనం ఇంగ్లండ్ బజ్‌బాల్ పద్ధతికి విరుగుడు అని ఆయన అభిప్రాయపడ్డాడు. యాషెస్ తొలి టెస్ట్ ఆఖరి రోజు ఇంగ్లండ్ ఆసీస్‌ను తెగ ఇబ్బంది పెట్టిందని, అయితే కమిన్స్ క్రీజ్‌లోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నాడు. కమిన్స్ తీవ్రమైన ఒత్తిడిలో ఎంతో ఓర్పును, సహనాన్ని ప్రదర్శించి తన జట్టును విజయతీరాలకు చేర్చాడని.. ఒత్తిడిలో కమిన్స్ ప్రదర్శించిన ఆ ఓర్పు,సహనమే ఆసీస్‌ను గెలిపించిందని తెలిపాడు. కమిన్స్‌కు లయోన్ అద్భుతంగా సహకరించాడని, వారిద్దరు ఒత్తిడిని అధిగమించి, తమ జట్టుకు చారిత్రక విజయాన్ని అందించారని పేర్కొన్నాడు. ఎంతటి ఒత్తిడిలోనైనా గెలవడం వల్లే ఆసీస్ వరల్డ్ నంబర్ జట్టుగా చలామణి అవుతుందని, ఇందుకు యాషెస్ తొలి టెస్ట్ ఉదాహరణ అని చెప్పుకొచ్చాడు. బజ్‌బాల్‌కు విరుగుడు ఏమిటనే దానిపై గతంలో చాలా సందర్భాల్లో ప్రశ్నలు తలెత్తాయని.. ఆసీస్ కెప్టెన్ తొలి టెస్ట్‌లో బంతితో పాటు కీలక ఇన్నింగ్స్ ఆడి ఆ ప్రశ్నకు జవాబిచ్చాడని తెలిపాడు. కాగా, యాషెస్ సిరీస్ తొలి టెస్ట్‌లో ఆసీస్ 2 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. పాట్ కమిన్స్ (0/59, 38, 4/63, 44 నాటౌట్) ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆసీస్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. వికెట్లు చేతిలో ఉన్నా, తొలి రోజే తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ఇంగ్లండ్ చేతులు కాల్చుకోగా.. తమ ముందు బజ్‌బాల్ గిజ్బాల్ జాన్తానై అంటూ ఆసీస్.. ఇంగ్లండ్ ఎత్తుగడను తిప్పికొట్టింది. ఛేదనలో కమిన్స్ ప్రదర్శించిన ఓర్పు, సంయమనం ఇంగ్లండ్ బజ్‌బాల్ అప్రోచ్‌ను తుంగలో తొక్కి ఆసీస్‌కు చారిత్రక విజయాన్ని అందించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ జూన్ 28 నుంచి లార్డ్స్ వేదికగా జరుగనుంది. -
ENG VS AUS Ashes 1st Test: బజ్‌బాల్ బెడిసికొట్టింది..!
బజ్‌బాల్ అప్రోచ్ అంటూ టెస్ట్ క్రికెట్ ఉనికిని చెరిపే ప్రయత్నం చేస్తున్న ఇంగ్లండ్ జట్టుకు తిక్క కుదిరింది. వారు నమ్ముకున్న బజ్‌బాల్ ఫార్ములా తొలిసారి బెడిసికొట్టింది. ఆసీస్ లాంటి జట్టు ప్రత్యర్ధిగా ఉన్నప్పుడు బజ్‌బాల్, గిజ్బాల్ అంటూ ఓవరాక్షన్లు చేయకూడదని ఇంగ్లండ్‌కు తెలిసొచ్చింది. యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ తొలి రోజే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన ఇంగ్లండ్ పరిస్థితి ప్రస్తుతం చావు తప్పి కన్ను లొట్ట పోయిందన్న చందంగా మారింది. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (141) వీరోచిత శతకంతో ఇంగ్లండ్ తిక్క కుదిర్చాడు. అతనికి ట్రవిస్ హెడ్ (50), కెమారూన్ గ్రీన్ (38), అలెక్స్ క్యారీ (66), పాట్ కమిన్స్ (38) సహకరించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను ఆసీస్ దాదాపుగా చేరుకున్నంత పని చేసింది. మూడో రోజు లంచ్ విరామం సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు ఆలౌటై, 7 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. 311/5 స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. ఆదిలోనే అలెక్స్ క్యారీ వికెట్ కోల్పోయింది. జేమ్స్ ఆండర్సన్ క్యారీని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆతర్వాత ఖ్వాజా.. కమిన్స్ సాయంతో ఆసీస్ స్కోర్‌ను పెంచే ప్రయత్నం చేశాడు. అయితే ఆఖర్లో ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో 386 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ (9), లబూషేన్ (0), స్టీవ్ స్మిత్ (16), లయోన్ (1), బోలండ్ (0) విఫలం కాగా.. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, రాబిన్సన్ తలో 3 వికెట్లు, మొయిన్ అలీ 2 వికెట్లు, ఆండర్సన్, స్టోక్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (118 నాటౌట్), జాక్ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించగా 393/8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. -
Ashes 1st Test: తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఇంగ్లండ్ ఓవరాక్షన్ చేసిందా..?
ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ (టెస్ట్‌ల్లో) బజ్ బాల్ అంటూ తెగ హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అప్రోచ్‌తో ఆ జట్టు చాలా మ్యాచ్‌ల్లో గెలుపొంది, భారీ సక్సెస్ సాధించింది. తాజాగా ఆ జట్టు యాషెస్ సిరీస్ తొలి టెస్ట్‌లోనూ బజ్‌బాల్ ఫార్ములానే ఉపయోగించి, తొలి ఇన్నింగ్స్‌ను తొలి రోజే డిక్లేర్ చేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. మరి ఈ నిర్ణయం ఇంగ్లండ్‌కు మరో విజయం సాధించి పెడుతుందో, లేక ఆ జట్టు కొంపముంచుతుందో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే. లంచ్ విరామం సమయానికి (78/3) ఆట ఇంగ్లండ్ వైపే మొగ్గుచూపుతున్నప్పటికీ మరికొద్ది గంటలు గడిచే వరకు ఏమీ చెప్పలేని పరిస్థితి. లంచ్ తర్వాత ఆసీస్ గేర్ మార్చి వేగంగా పరుగులు సాధిస్తుండటంతో మ్యాచ్ ఫలితం ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. 45 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్ 3 వికెట్లు కోల్పోయి 148 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఉస్మాన్ ఖ్వాజా (66), ట్రవిస్ హెడ్ (50) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆసీస్ ఇంకా 245 పరుగులు వెనుకపడి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఎవరిది పైచేయి అవుతుందనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (118 నాటౌట్), జాక్ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించగా 393/8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి రోజే తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆసీస్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. రెండో రోజు ఆట తొలి సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లు స్టువర్ట్ బ్రాడ్, స్టోక్స్ చెలరేగి.. వార్నర్ (9), లబూషేన్ (0), స్టీవ్ స్మిత్ (16) వికెట్లు పడగొట్టారు. చదవండి: Ashes Series 1st Test: స్మిత్ భరతం పట్టిన స్టోక్స్ -
బజ్‌బాల్ లేదు తొక్కా లేదు..మీ పప్పులు మా ముందు ఉడకవు..ఇంగ్లండ్‌కు స్టీవ్ స్మిత్ వార్నింగ్
టీమిండియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో సెంచరీతో కదంతొక్కి, తన జట్టును పటిష్ట స్థితిలో ఉంచిన ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్.. త్వరలో ఇంగ్లండ్‌తో ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మైండ్ గేమ్‌లో భాగంగా స్టీవ్.. ఇప్పటి నుంచే ఇంగ్లండ్‌ను టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. ఇంగ్లీష్ క్రికెటర్లను మానసికంగా దెబ్బకొట్టేందుకు మాటల యుద్దానికి దిగాడు. ఇటీవలికాలంలో టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ అవళంభిస్తున్న బజ్‌బాల్ అప్రోచ్‌ను తక్కువ చేస్తూ.. మాపై ఇంగ్లీష్ బ్యాటర్లకు అంత సీన్ ఉండదని విర్రవీగాడు. ఇతర జట్లపై బజ్‌బాల్ అప్రోచ్ ప్రభావం చూపి ఉంవచ్చని, మా ముందు మాత్రం వారి పప్పులు ఉడకవని గొప్పలు పోయాడు. తమ బౌలర్ల ముందు బజ్‌బాల్ అప్రోచ్ వర్కౌట్ కాదని ధీమా వ్యక్తం చేశాడు. ఇంకా చెప్పాలంటే తమ బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడం ఖాయమని తెలిపాడు. కాగా, ఇంగ్లండ్ బజ్ బాల్ అప్రోచ్ అంటూ టెస్ట్‌ల్లో వేగాన్ని పెంచింది. గడిచిన ఏడాది కాలంలో ఆ జట్టు 4.85 రన్‌రేట్‌తో పరుగులు సాధించి, 13 మ్యాచ్‌ల్లో 11 విజయాలు సాధించింది. ఇంగ్లీష్ టీమ్‌లోని ఐదుగురు 75కుపైగా స్ట్రయిక్ రేట్‌తో పరుగులు సాధించారు. ఇదే జోరును ఇంగ్లండ్ త్వరలో ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్‌లో కూడా కొనసాగించాలని చూస్తుంది. అయితే, పటిష్టమైన ఆసీస్ బౌలింగ్ అటాక్ ముందు బజ్‌బాల్ అప్రోచ్ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చని విశ్లేషకుల అంచనా. మరి బజ్‌బాల్‌తో ఇంగ్లండ్ బ్యాటర్లు ఆసీస్‌పై పైచేయి సాధిస్తారో లేక ఆసీస్ బౌలర్లే ఎదురుదాడికి దిగి ఇంగ్లీష్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడతారో వేచి చేడాలి. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య ఇంగ్లండ్ వేదికగా జరిగే యాషెస్ సిరీస్ షెడ్యూల్.. తొలి టెస్ట్, జూన్ 16-20, ఎడ్జ్‌బాస్టన్ రెండో టెస్ట్, జూన్ 28-జులై 2, లార్డ్స్ మూడో టెస్ట్, జులై 6-10, హెడింగ్లే నాలుగో టెస్ట్, జులై 19-23, ఓల్డ్ ట్రాఫర్డ్ ఐదో టెస్ట్, జులై 27-31, ఓవల్ చదవండి: మిగతా వారు ఏదో ఒక రకంగా పనికొచ్చారు.. నువ్వేందుకు, దండగ.. ఉమేశ్‌పై ఫ్యాన్స్ ఫైర్ -
ఇంగ్లండ్ టీమ్ ఓవర్ కాన్ఫిడెన్స్.. తొలి రోజే.. ఓ వికెట్ ఉన్నా..!
2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ టీమ్.. మౌంట్ మాంగనూయ్‌లో ఇవాళ (ఫిబ్రవరి 16) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో (డే అండ్ నైట్ టెస్ట్) ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. తొలి రోజు.. అది కూడా కేవలం 58.2 ఓవర్లు మాత్రమే ఆడి, ఓ వికెట్ ఉన్నా తొలి ఇన్నింగ్స్‌ను 325 పరుగుల (9 వికెట్ల నష్టానికి) వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం పట్ల క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరో 20.. 30 పరుగులు అదనంగా చేసే అవకాశం ఉన్నా ఎందుకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ సోషల్‌మీడియాలో కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఇది టెస్ట్ క్రికెట్ అనుకుంటున్నారా లేక ఇంకేమైనానా అంటూ ఇంగ్లండ్ నిర్ణయాన్ని దుయ్యబడుతున్నారు. టెస్ట్‌లను కూడా టీ20ల్లా ఆడాలనుకుంటే, కేవలం వాటికే పరిమితం కావచ్చు కాదా అంటూ సలహాలిస్తున్నారు. ఇంగ్లండ్ నిర్ణయం మిస్ ఫైర్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. ఇంగ్లండ్ తీసుకునే ఇలాంటి నిర్ణయాల వల్ల టెస్ట్ క్రికెట్ మనుగడకు ప్రమాదం పొంచి ఉందని మండిపడుతున్నారు. సంప్రదాయ టెస్ట్ మ్యాచ్‌లను బజ్‌బాల్ అనే అతిగతి లేని విధానాన్ని అమలు చేసి చంపేస్తున్నారని తూర్పారబెడుతున్నారు. 5 రోజుల టెస్ట్ మ్యాచ్‌లు ఆడే ఓపిక లేకపోతే, ఇంట్లోనే కూర్చోవాలి కానీ, ఆటకు కళంకం తేవడమెందుకని నిలదీస్తున్నారు. కాగా, ఇంగ్లండ్ టీమ్ గత కొంతకాలంగా టెస్ట్ క్రికెట్లో వేగం పెంచిన విషయం విధితమే. ఫలితం త్వరగా రాబట్టాలనే ఉద్దేశంతో ప్రత్యర్ధిపై ఎదురుదాడికి దిగడమే వారి ప్రణాళిక. దీనికి వాళ్లు బజ్‌బాల్ అప్రోచ్ అనే పేరు పెట్టుకున్నారు. వాస్తవానికి వారు ఈ విధానంలో టెస్ట్‌లు ఆడి 100 శాతం సఫలమయ్యారు. అయితే సంప్రదాయ టెస్ట్ క్రికెట్ వాదులు ఇంగ్లండ్ అమలు చేస్తున్న బజ్‌బాల్ విధానాన్ని తప్పుపడుతున్నారు. ఇలా చేయడం వల్ల టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుందని వాపోతున్నారు. ఇప్పటికే టీ20ల వల్ల టెస్ట్ క్రికెట్ కళ తప్పిందని అంటున్నారు. ఇదిలా ఉంటే, కివీస్‌తో తొలి టెస్ట్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రాకెట్ వేగంతో పరుగులు సాధించి 325/9 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. బెన్ డక్కెట్ (68 బంతుల్లో 84; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 89; 15 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ధశతకాలు సాధించి తృటిలో సెంచరీలు చేసే అవకాశాన్ని కోల్పోయారు. ఓలీ పోప్ (42), బెన్ ఫోక్స్ (38) సైతం బౌండరీలతో విరుచుకుపడి జట్టు వేగంగా పరుగులు సాధించడానికి దోహదపడ్డారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి రాబిన్సన్ (15 నాటౌట్; 3 ఫోర్లు) జోరుమీదుండగా.. జేమ్స్ ఆండర్సన్ బరిలోకి దిగలేదు. కివీస్ బౌలర్లలో వాగ్నర్ 4, సౌథీ, కుగ్గెలెన్ తలో 2, టిక్నర్ ఓ వికెట్ పడగొట్టాడు. కాగా, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం వెనుక మరో కోణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పిచ్ పేసర్లకు సహకరించడం మొదలుపెట్టిందని తెలిసి వారు హడావుడిగా పరుగులు సాధించి, ప్రత్యర్ధిని బరిలోకి ఆహ్వానించారని సమాచారం. డిన్నర్ బ్రేక్ తర్వాత ఇంగ్లండ్ ఆఖరి 4 వికెట్లను 46 పరుగుల వ్యవధిలో కోల్పోవడం వారి ప్రణాళికకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ విషయంలో ఇంగ్లండ్ వ్యూహాలు కూడా ఫలించాయి. తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 37 పరగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. కాన్వే (17), వాగ్నర్ (4) క్రీజ్‌లో ఉన్నారు. -
KL Rahul: ఇంగ్లండ్‌లా దూకుడు క్రికెట్ ఆడతాం..!
టెస్ట్ క్రికెట్లో ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ అనుసరిస్తున్న బజ్‌బాల్ విధానంపై టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్రశంసల వర్షం కురిపించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఇంగ్లండ్ అనుసరిస్తున్న వ్యూహాన్ని అతను ఆకాశానికెత్తాడు. ఇంగ్లండ్ క్రికెటర్లు దూకుడగా ఆడుతున్న విధానాన్ని కొందరు నిర్లక్షపు క్రికెట్ అని పేర్కొనడాన్ని తప్పుబట్టాడు. టెస్ట్ క్రికెట్లో ఇంగ్లండ్ క్రికెటర్ల అప్రోచ్ సరైందేనని, వాళ్లు నిర్భయంగా, దూకుడుగా ఆడుతున్న విధానాన్ని ప్రతి క్రికెట్ అభిమాని అమితంగా ఇష్టపడుతున్నాడని పేర్కొన్నాడు. టెస్ట్ క్రికెట్‌కు ఆదరణ తగ్గుతున్న తరుణంలో బజ్‌బాల్ అప్రోచ్ చాలా మార్పులు తెచ్చిందని, వ్యక్తిగతంగా ఇది తనను కూడా బాగా ఆకట్టుకుందని తెలిపాడు. ఇంగ్లండ్ క్రికెటర్ల అటాకింగ్ స్టైల్ చాలా బాగుంటుందని, బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌లో తాము కూడా ఇంగ్లండ్‌లా ఆడేందుకు ప్రయత్నిస్తామని ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అన్నాడు. కాగా, రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో బంగ్లాతో టెస్ట్ సిరీస్‌కు టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఎంపికైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుపెట్టిన ఇంగ్లండ్ జట్టు.. బజ్‌బాల్ విధానాన్ని అనుసరించి మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను స్టోక్స్ సేన తమదైన దూకుడు స్టైల్లో ఆడి 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఫలితం తేలదనుకున్న మ్యాచ్‌లో (తొలి టెస్ట్) సైతం ఇంగ్లండ్ ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడి గెలిచారు. గత కొంతకాలంగా ఇంగ్లండ్ ఇదే విధానాన్ని అనుసరించి వరుస విజయాలు సాధిస్తుంది. -
బజ్‌బాల్.. టెస్ట్ క్రికెట్లో సరికొత్త మంత్ర
Bazball: బజ్‌బాల్.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ట్రెండింగ్‌లో ఉన్న పదం. విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫాలోవర్స్ అంతా ప్రస్తుతం ఈ పదంపైనే చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏంటీ బజ్‌బాల్..? క్రికెట్‌కి ఈ పదానికి ఉన్న సంబంధం ఏంటి..? వివరాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం. ఇటీవల న్యూజిలాండ్-ఇంగ్లండ్ జట్ల మధ్య ముగిసిన టెస్ట్ సిరీస్ తర్వాత క్రికెట్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న పదం బజ్‌బాల్. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ అనుసరించిన మెరుపుదాడి విధానాన్నే బజ్‌బాల్ అని అంటారు. మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్ నిర్ధేశించిన భారీ టర్గెట్లను ( 277, 299, 296) బెన్ స్టోక్స్, బ్రెండన్ మెక్కల్లమ్ ఆధ్వర్యంలోని న్యూ ఇంగ్లండ్ జట్టు బజ్‌బాల్ విధానాన్ని అవలంబించి అవలీలగా ఛేదించింది. తాజాగా టీమిండియాతో జరిగిన రీ షెడ్యూల్డ్ టెస్ట్‌లోనూ ఇంగ్లండ్ ఇదే మంత్రను ఫాలో అయి సక్సెస్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు రూట్, బెయిర్‌స్టో టీమిండియా బౌలర్లపై మెరుపుదాడికి దిగి 378 పరుగుల భారీ టార్గెట్‌ను ఈజీగా ఊదేశారు. డిఫెన్స్ మోడ్‌లో సాగే టెస్ట్ క్రికెట్లో గెలుపే లక్ష్యంగా బ్యాటింగ్ చేసే ఈ అటాకింగ్ స్టయిల్‌నే బజ్‌బాల్ అంటారు. మెక్కల్లమ్, స్టోక్స్‌లు ఇంగ్లండ్ కోచింగ్, సారధ్య బాధ్యతలు చేపట్టాక ఈ వ్యూహాన్ని పకడ్బందీగా ఆచరణలో పెడుతున్నారు. ఈ ద్వయం టెస్ట్ క్రికెట్ రూపు రేఖలను మార్చేస్తూ, సంప్రదాయ క్రికెట్‌కు సరికొత్త శోభను తెస్తుంది. బ్యాటర్లు నిర్భయంగా ఎదురుదాడికి దిగే బజ్‌బాల్ విధానంపై ప్రస్తుతం అన్ని దేశాలు అధ్యయనం చేస్తున్నాయి. ఈ సరికొత్త అప్రోచ్ వల్ల టెస్ట్ క్రికెట్ కళ తప్పుతుందని కొందరు భావిస్తుంటే, జనరేషన్‌కు తగ్గట్టుగా ఆటలో వేగం ఉండాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి బజ్‌బాల్ అప్రోచ్ టీమిండియాకు అయితే కొత్త కాదు. 2000 దశకం ఆరంభంలో నజఫ్గడ్ నవాబ్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ విధానాన్ని అప్లై చేసి బౌలర్లపై తొలి బంతి నుంచే ఎదురుదాడికి దిగాడు. టెస్ట్‌ల్లో వీరూ ఒక్కరోజే భారీ డబుల్ సెంచరీ (284) బాదడం మనందరికీ తెలుసు. చదవండి: Ind Vs Eng: రీషెడ్యూల్డ్ టెస్టు గెలవాల్సింది.. కానీ: రోహిత్ శర్మ