విలియమ్సన్‌కు గాయం: మూడు మ్యాచ్‌లకు దూరం | Williamson ruled out until back end of 2023 WC group stage with thumb fracture | Sakshi
Sakshi News home page

విలియమ్సన్‌కు గాయం: మూడు మ్యాచ్‌లకు దూరం

Published Sun, Oct 15 2023 5:09 AM | Last Updated on Sun, Oct 15 2023 5:09 AM

Williamson ruled out until back end of 2023 WC group stage with thumb fracture - Sakshi

చెన్నై: ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ! అనుభవజు్ఞడైన కెపె్టన్‌ కేన్‌ విలియమ్సన్‌ బొటన వేలి గాయంతో ఏకంగా మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌ తో మ్యాచ్‌ సందర్భంగా బ్యాటింగ్‌లో పరుగు తీస్తున్న సమయంలో ఫీల్డర్‌ విసిరిన త్రో కారణంగా అతని ఎడమ చేతి బొటన వేలికి గాయమైంది.

దీంతో 78 పరుగుల వద్ద కేన్‌ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే తదనంతరం ఎక్స్‌రే తీయగా వేలికి ఫ్రాక్చర్‌ అయినట్లు తేలింది. దీంతో తదుపరి మూడు మ్యాచ్‌లకు (18న అఫ్గానిస్తాన్‌తో; 22న భారత్‌తో; 28న దక్షిణాఫ్రికాతో) అతను దూరం కానున్నాడు. అతను గాయం నుంచి కోలుకున్న తర్వాతే వచ్చే నెల మ్యాచ్‌లకు అందుబాటు లో ఉండేది లేనిది తెలుస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement