
ఆస్ట్రేలియాతో భారత్ మ్యాచ్ ఎప్పుడూ రసవత్తరంగా సాగుతుంది. అదీ నాకౌట్ దశలో ఆడే మ్యాచ్ మరింత క్లిష్టతరంగా ఉంటుంది. ఇందుకు చివరివరకూ పోరాడే ఆస్ట్రేలియా నైజం, వారి పోరాట తత్త్వం ప్రధాన కారణాలు. సాధారణముగా ఈ విషయం లో భారత్‌పై ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా దే పైచేయిగా నిలిచింది. ముఖ్యంగా భారత్‌లో జరిగిన 2023 వరల్డ్ కప్ ఫైనల్ , అదే సంవత్సరం ఇంగ్లండ్‌లో జరిగిన టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఒక నిదర్శనం. ఈ రెండిటిని లోనూ ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ ప్రధాన భూమిక వహించాడు.
కోహ్లీ విభిన్నమైన ఇన్నింగ్స్
అయితే, మంగళవారం దుబాయ్ వేదిక పై జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఇందుకు భిన్నమైనిది. అందుకు ప్రధాన కారణం 36 ఏళ్ల భారత్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. కోహ్లీ ఆడిన తీరు భారత్ క్రికెట్ అభిమానులకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కోహ్లీ లో అసాధారణ పరిణతి కనిపించింది. ఎక్కడా తడబాటు లేదు. పెద్ద షాట్లు కొట్టి ఆస్ట్రేలియా వాళ్లకి అవకాశం ఇవ్వకూడదనే దృఢ సంకల్పంతో సింగిల్స్ కోసం చిన్నపిల్లల వాడిలాగా పరిగెడుతూనే ఉన్నాడు.
ఎక్కడా అలసట లేదు. అలసత్వం లేదు. ఇక్కడ ముఖ్యంగా గమినించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో ప్రధానమైనది కోహ్లీ వయ్యస్సు. కోహ్లీ దుబాయ్ ఎండలో మధ్యానమంతా ఫీల్డింగ్ చేసాడు. ఇక కోహ్లీ ఫీల్డ్ లో ఎలా ఉంటాడో చెప్పనవసరం లేదు. ఒక మెరుపు తీగలాగా, పాదరసం లాగా మైదానమంతా కళయదిరగడం, తోటి ఆటగాళ్ళని ఉత్సహాబారచడం కోహ్లీ కి అలవాటు.
కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కీలక భాగస్వామ్యం
265 పరుగుల విజయ లక్ష్యం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కొద్దిగా దూకుడుగా ఆడినా కెప్టెన్ రోహిత్ శర్మ మరియు శుభ్‌మాన్ గిల్ త్వరితగతిన ఔటవ్వడంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి భారత్ 55/2తో ఉంది. ఆ దశలో జత కలిసిన కోహ్లీ మరియు శ్రేయాస్ అయ్యర్ 91 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
చాలా పరిణతితో ఆడారు. ఎక్కడా ఆస్ట్రేలియా బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. ఆస్ట్రేలియా ఫీల్డ్ ప్లేసిమెంట్లను జల్లెడ పట్టారు. గాప్స్ లో కొడుతూ ప్రధానంగా సింగిల్స్ పైనే దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా బౌలర్లకు ఎలాంటి అవకాశం రాలేదు. బ్యాటర్ తప్పిదాలు చేస్తేనే కదా ప్రత్యర్థికి అవకాశం.
అలాంటిది షాట్లు కొట్టకుండా నిబ్బరంగా ఆడుతుంటే ఆస్ట్రేలియా బౌలర్లకు ఒక దశలో ఏమి చేయాలో తెలియకుండా పోయింది. భారత్ మాత్రం విజయం దశగా పరుగు తీసింది. ఈ మ్యాచ్ కోహ్లీ మాస్టర్ స్ట్రోక్ కి మచ్చు తునక గా నిలిచిపోతుంది.
సచిన్ టెండూల్కర్ రికార్డుబ్రేక్
అవసరమైన పక్షంలో విజృన్భించి ఆడగల బ్యాటర్ జట్టులో ఉన్నందునే కోహ్లీకి ఈ అవకాశం దక్కిందండంలో సందేహం లేదు. తెలివైన స్ట్రైక్ రొటేషన్ మరియు సకాలంలో బౌండరీలతో కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ భారత్ ఇన్నింగ్స్‌ను స్థిరపరిచారు. 25వ ఓవర్‌లో కోహ్లీ తన అర్ధ సెంచరీని సాధించాడు.
విరాట్ కోహ్లీ, 98 బంతుల్లో 84 పరుగులు చేసి ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో అత్యధికంగా 50+ స్కోర్లు సాధించిన సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. ఇప్పుడు కోహ్లీ ఖాతాలో 24 అర్థసెంచరీలు ఉండగా, సచిన్ సాధించిన 23 అర్థసెంచరీల మైలురాయి ని అధిగమించాడు.
కోహ్లీ క్రూయిజ్ మోడ్ బ్యాటింగ్
కోహ్లీ ఇన్నింగ్స్ ఒక విషయాన్నీ స్పష్టం చేసింది. వన్డే ఫార్మాట్‌లో అతని నైపుణ్యం ఒక దశకు చేరుకుంది. కోహ్లీ ఇప్పుడు ఎటువంటి అనవసరమైన ఒత్తిడి లేకుండా హైవే పై పరుగు తీసే క్రూయిజ్ మోడ్ లో ఉండే కారు లాగా సునాయాసంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ..
"నేను ఎక్కడా తొందరపడలేదు. చాల ప్రశాంతంగా బ్యాటింగ్ చేశాను. ఒక్క సింగిల్స్ తో ఇన్నింగ్స్ ని అలా నిర్మించడం నాకు చాలా సంతోషకరంగా ఉంది" అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. కోహ్లీ ఇప్పుడు 106 ఇన్నింగ్స్‌లలో 5999 పరుగులు చేసి భారత్ విజయలక్ష్య సాధన లో పరుగులు సాధించిన బ్యాటర్లలో అగ్రస్థానంలో నిలిచాడు.
ఈ మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ విరాట్ కోహ్లీ పై ప్రశంసలు కురిపించాడు. " కోహ్లీ మరో సారి తన ప్రతిభని చాటి చెప్పాడు. పరిస్థితులను అద్భుతంగా అంచనా వేశాడు. ఒక క్లాస్ ప్లేయర్ అయిన అతనికి తన జట్టుకు ఏమి అవసరమో మరియు మ్యాచ్ ని గెలవడానికి సరిగ్గా ఎలా ఆడాలో దిశా నిర్దేశం చేసాడు.
ముందుండి జట్టుని నడిపించాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సాధించిన సెంచరీ తో ఈ విషయం స్పష్టమైంది. మళ్ళీ కోహ్లీ అదే ఇన్నింగ్స్ ని పునరావృతం చేసాడు. వన్డేలలో మొనగాడని మరోసారి నిరూపించుకున్నాడు’’ అని క్లార్క్ విరాట్ కోహ్లీని ప్రశంసించాడు.
Comments
Please login to add a commentAdd a comment