Kane-Williamson
-
విలియమ్సన్కు గాయం: మూడు మ్యాచ్‌లకు దూరం
చెన్నై: ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ! అనుభవజు్ఞడైన కెపె్టన్ కేన్ విలియమ్సన్ బొటన వేలి గాయంతో ఏకంగా మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్‌లో పరుగు తీస్తున్న సమయంలో ఫీల్డర్ విసిరిన త్రో కారణంగా అతని ఎడమ చేతి బొటన వేలికి గాయమైంది. దీంతో 78 పరుగుల వద్ద కేన్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే తదనంతరం ఎక్స్‌రే తీయగా వేలికి ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. దీంతో తదుపరి మూడు మ్యాచ్‌లకు (18న అఫ్గానిస్తాన్‌తో; 22న భారత్‌తో; 28న దక్షిణాఫ్రికాతో) అతను దూరం కానున్నాడు. అతను గాయం నుంచి కోలుకున్న తర్వాతే వచ్చే నెల మ్యాచ్‌లకు అందుబాటు లో ఉండేది లేనిది తెలుస్తుంది. -
విలియమ్సన్ సెంచరీ; కివీస్ విక్టరీ
నెల్సన్: శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. లంక నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. విలియమ్సన్ సెంచరీ(103)తో రాణించాడు. ఎలియట్ 44, ఆండర్సన్ 47, రోంచి 32, గుప్తిల్ 20, మెక్ కల్లమ్ 11 పరుగులు చేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటయింది. జయవర్థనే(94) ఆరు పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు. సంగక్కర అర్థసెంచరీ(76)తో రాణించాడు. ఈ విజయంతో 7 వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ 2-1తో ముందంజలో ఉంది. మూడో వన్డే వర్షం కారణంగా రద్దయింది.