విలియమ్సన్ సెంచరీ; కివీస్ విక్టరీ | Kane Williamson ton sees New Zealand to 2-1 series lead | Sakshi
Sakshi News home page

విలియమ్సన్ సెంచరీ; కివీస్ విక్టరీ

Published Tue, Jan 20 2015 2:31 PM | Last Updated on Fri, Nov 9 2018 6:39 PM

విలియమ్సన్ సెంచరీ; కివీస్ విక్టరీ - Sakshi

విలియమ్సన్ సెంచరీ; కివీస్ విక్టరీ

నెల్సన్: శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. లంక నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. విలియమ్సన్ సెంచరీ(103)తో రాణించాడు. ఎలియట్ 44, ఆండర్సన్ 47, రోంచి 32, గుప్తిల్ 20, మెక్ కల్లమ్ 11 పరుగులు చేశారు.

ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటయింది. జయవర్థనే(94) ఆరు పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు. సంగక్కర అర్థసెంచరీ(76)తో రాణించాడు. ఈ విజయంతో 7 వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ 2-1తో ముందంజలో ఉంది. మూడో వన్డే వర్షం కారణంగా రద్దయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement