
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో యూపీ వారియర్స్ జట్టుకు ఆడుతున్న శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ చమరి అటపట్టు చివరి దశ మ్యాచ్‌లకు దూరం కానుంది. మార్చి 4 నుంచి 18 వరకు న్యూజిలాండ్‌తో న్యూజిలాండ్‌లో జరిగే మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే శ్రీలంక జట్టుకు చమరి కెపె్టన్‌గా వ్యవహరించనుంది.
ఈ నేపథ్యంలో ఈనెల 26న ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్ తర్వాత చమరి యూపీ వారియర్స్ జట్టును వీడి న్యూజిలాండ్‌కు బయలుదేరుతుంది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన చమరి 28 పరుగులు చేయడంతోపాటు మూడు వికెట్లు తీసుకుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్న న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ అమెలియా కెర్ మాత్రం డబ్ల్యూపీఎల్ పూర్తి సీజన్ ఆడుతుంది. శ్రీలంకతో జరిగే సిరీస్‌లో అమెలియా కెర్ పోటీపడటం లేదు.