thumb injury
-
విలియమ్సన్కు గాయం: మూడు మ్యాచ్‌లకు దూరం
చెన్నై: ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ! అనుభవజు్ఞడైన కెపె్టన్ కేన్ విలియమ్సన్ బొటన వేలి గాయంతో ఏకంగా మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్‌లో పరుగు తీస్తున్న సమయంలో ఫీల్డర్ విసిరిన త్రో కారణంగా అతని ఎడమ చేతి బొటన వేలికి గాయమైంది. దీంతో 78 పరుగుల వద్ద కేన్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే తదనంతరం ఎక్స్‌రే తీయగా వేలికి ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. దీంతో తదుపరి మూడు మ్యాచ్‌లకు (18న అఫ్గానిస్తాన్‌తో; 22న భారత్‌తో; 28న దక్షిణాఫ్రికాతో) అతను దూరం కానున్నాడు. అతను గాయం నుంచి కోలుకున్న తర్వాతే వచ్చే నెల మ్యాచ్‌లకు అందుబాటు లో ఉండేది లేనిది తెలుస్తుంది. -
చర్మం ఒలిచినా దక్కని ఫలితం
వడోదర: రైల్వే ఉద్యోగం సాధించేందుకు ఓ యువకుడు చేసిన తెగింపు యత్నం బెడిసికొట్టింది. తన బొటన వేలి చర్మాన్ని ఒలిచి స్నేహితుడి వేలికి అతికించి, బయోమెట్రిక్ వెరిఫికేషన్‌లో బయటపడ్డాక తనకు బదులుగా పరీక్ష రాయించాలని పథకం వేశాడు. అయితే, బండారం బయటపడి ఇద్దరూ కటకటాల పాలయ్యారు. బిహార్‌లోని ముంగేర్ జిల్లాకు చెందిన మనీష్ కుమార్, రాజ్యగురు గుప్తా స్నేహితులు. 12వ తరగతి వరకు చదువుకున్నారు. రైల్వే శాఖలోని గ్రూప్ డి ఉద్యోగాలకు మనీష్ దరఖాస్తు చేసుకున్నాడు. ఎంపిక పరీక్ష వడోదరలో ఆదివారం జరిగింది. మనీష్ బదులు చదువులో ఎప్పుడూ ముందుండే గుప్తా పరీక్షకు వచ్చాడు. అభ్యర్థులకు బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఈ గండం గట్టెక్కేందుకు మనీష్ తన బొటనవేలి చర్మాన్ని ఒలిచి గుప్తా చేతి వేలికి అతికించాడు. గుప్తా ఆ చేతిని ప్యాంట్ జేబులోనే ఉంచుకుని, మరో చేతి వేలితో చేసిన బయోమెట్రిక్ వెరిఫికేషన్ యత్నం పలుమార్లు విఫలమైంది. అనుమానించిన అధికారులు అతడి మరో చేతిని బయటకు తీయించి, శానిటైజర్ స్ప్రే చేశారు. బొటనవేలికి అతికించిన చర్మ ఊడి కింద పడింది. అధికారుల విచారణలో అసలు నిజం బయటకు వచ్చింది. దీంతో ఇద్దరు మిత్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరీక్షకు ముందు బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను ఊహించిన కుమార్..పరీక్షకు ముందు రోజే ఎడమ బొటనవేలిని స్టౌపైన కాల్చుకుని, బ్లేడుతో ఆ చర్మాన్ని ఒలిచి గుప్తా బొటనవేలికి అంటించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. ఒకవేళ, అతికించిన చర్మం ఊడి రాకున్నా వారి పన్నాగం పారేది కాదని వైద్య నిపుణులు అంటున్నారు. -
ఆర్టీసీ సమ్మె : తెగిపడ్డ బొటనవేలు
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా శనివారం ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో వామపక్షాలు నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐఎంఎల్ నేత పోటు రంగారావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, విమలక్కలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు వాహనంలో ఎక్కించే క్రమంలో పోటు రంగారావు చేతి బొటనవేలు తెగిపోయింది. రెండు తలుపుల మధ్య వేలు పెట్టి కట్ చేశారని రంగారావు ఆరోపించారు. కేసీఆర్ నన్ను చంపమన్నాడా? అని పోలీసులను ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు, ఇప్పుడు కార్మికుల పక్షాన నిలబడి పోరాడినందుకు ఇది నాకు బహుమానమా? అంటూ తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు బస్ భవన్‌ను ముట్టండించేదుకు ప్రయత్నించిన తెలంగాణ జనసమితి నేతలను కూడా అరెస్ట్ చేశారు. -
ధావన్ ఔట్
సౌతాంప్టన్: ఊహించినంతా అయింది. వరుస విజయాలతో ప్రపంచ కప్‌లో జోరు మీదున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో బాధపడుతున్న ఓపెనర్ శిఖర్ ధావన్... టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. బుధవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆస్ట్రేలియాతో ఈ నెల 9న జరిగిన మ్యాచ్‌లో పేసర్ కమిన్స్ వేసిన బంతి బలంగా తాకడంతో ధావన్ ఎడమ బొటన వేలిలో చీలిక వచ్చింది. నొప్పితో బాధపడుతూనే ఆడిన అతడు మ్యాచ్‌లో సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మున్ముందు జట్టు అవసరాలరీత్యా ధావన్ కోలుకునే వరకు చూడాలని మేనేజ్మెంట్ భావించింది. అందుకని ఓపెనర్ మూడు మ్యాచ్‌ల వరకు అందుబాటులో ఉండడని ప్రకటిం చింది. అయితే, తాజా పరిస్థితి ప్రకారం జూలై రెండో వారం వరకు కూడా ధావన్ పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో అతడి స్థానాన్ని యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిష భ్ పంత్‌తో భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే స్టాండ్‌బైగా ఎంపిక చేసిన పంత్... పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌కు ముందే జట్టుతో చేరాడు. రోహిత్, కోహ్లిపై భారం ఫామ్‌లో ఉండీ ప్రతిష్టాత్మక టోర్నీకి అనూహ్యంగా దూరం కావడం వ్యక్తిగతంగా ధావన్‌ను తీవ్రంగా నిరాశకు గురిచేసే అంశమైతే, కీలకమైన అతడి సేవలు కోల్పోవడం కోహ్లి సేనను కలవరపాటుకు గురిచేసేదే. జట్టులో ఏకైక ఎడంచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన ధావన్‌కు ఐసీసీ టోర్నీల్లో అద్భుత రికార్డుంది. మొత్తం ఆరు సెంచరీలు (చాంపియన్స్ ట్రోఫీలో 3, ప్రపంచ కప్‌లలో 3) బాదాడు. అన్నింటికి మించి ధావన్–రోహిత్ శర్మ ప్రపంచ అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ. వీరిద్దరు ఎన్నో చక్కటి ఆరంభాలు ఇచ్చారు. ఒకరు విఫలమైనా మరొకరు రాణిస్తూ... వన్‌డౌన్‌లో వచ్చే కెప్టెన్ కోహ్లికి అండగా నిలుస్తున్నారు. కొన్నేళ్లుగా భారత విజయ యాత్రలో ఈ త్రయానిదే ప్రధాన వాటా. ఇప్పుడు ధావన్ దూరమవడం కచ్చితంగా ప్రభావం చూపేదే. ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లిపై మరింత భారం పడుతుంది. రెండో ఓపెనర్‌గా రాహుల్ ముందు పెద్ద బాధ్యతే ఉంది. జట్టు కూర్పుపై ప్రభావం ధావన్ బదులుగా ఎంపిక చేసిన పంత్‌కు తుది జట్టులో చోటు మాత్రంఅనుమానమే. అతడిని తీసుకుంటే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలి. హార్డ్ హిట్టర్ అయిన పంత్... మిడిలార్డర్‌కు తగిన రీతిలో స్ట్రయిక్ రొటేట్ చేయలేడు. రాహుల్‌పై భరోసా లేకుంటే ఓపెనర్‌గా పంత్‌ను పరీక్షించవచ్చు. అలాగైతే అది పెద్ద ప్రయోగమే అవుతుంది. ఎలాగూ స్కోరు పెంచే ఉద్దేశంలో నంబర్–4గా పాండ్యాను పంపుతున్నందున పంత్ అవసరం ఎంత అనేది చూడాలి. మరోవైపు పేసర్ భువనేశ్వర్ కండరాల నొప్పితో బాధపడుతున్న వేళ, బౌలింగ్ ప్రత్యామ్నాయంగానూ పనికొచ్చే ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ వైపే జట్టు మొగ్గు చూపే వీలుంది. రాబోయే రెండు మ్యాచ్‌లు బలహీన అఫ్గానిస్తాన్, విండీస్‌పైనే కాబట్టి వాటిపై జట్టు కూర్పును పరీక్షించుకుంటే తర్వాత తప్పొప్పులను సరిచేసుకునే వీలుంటుంది. 2019 ప్రపంచ కప్‌లో ఇకపై భాగం కాలేకపోతున్నాననే ప్రకటన చేయడానికి భావోద్వేగానికి గురయ్యా. దురదృష్టవశాత్తు గాయం సమయానికి నయం కావడం లేదు. కానీ, మన జట్టు విజయ పరంపర ముందుకు సాగాలి. జట్టు సభ్యులు, క్రికెట్ ప్రేమికులు, భారత దేశం నుంచి దక్కిన ప్రేమ, మద్దతుకు నేను ధన్యుడిని. జై హింద్! – ట్విట్టర్లో శిఖర్ ధావన్ పంత్‌కు జాక్‌పాట్! సరిగ్గా రెండు నెలల క్రితం రిషభ్ పంత్‌ను ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక చేయకపోవడాన్ని దిగ్గజాలు సహా అందరూ తప్పుబట్టారు. స్వయంగా పంత్ తీవ్ర నిరాశ చెందాడు. ఇప్పుడు మాత్రం అదృష్టం అతడిని మరో రూపంలో వరించింది. అన్నింట్లోనూ చోటు దక్కకున్నా పరిస్థితులు కలిసొస్తే కనీసం ఒకటి, రెండు మ్యాచ్‌ల్లోనైనా పంత్ తుది జట్టులో ఉండే వీలుంది. తద్వారా ప్రపంచ కప్ జట్టు సభ్యుడిగా చిరస్థాయిగా పేరు నిలిచే అవకాశం లభించింది. -
శిఖర్ ధావన్ తీవ్ర కసరత్తు
లండన్ : రెక్కలతో కాదు... సంకల్పంతో ఎగురుతానని గాయంపై స్పందించిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నట్లుగానే తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. గాయం నుంచి కోలుకుంటాననే ఆత్మవిశ్వాసం కనబరుస్తున్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా ధావన్ ఎడమ బొటన వేలికి గాయమైన విషయం తెలిసిందే. గాయంతోనే ఆ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన గబ్బర్‌కు మ్యాచ్ అనంతరం పరీక్షలు నిర్వహించగా బొటన వేలు విరిగిందని మూడు వారాల విశ్రాంతి అవసరమని తేలింది. దీంతో ప్రపంచకప్‌లోని ఇతర మ్యాచ్‌లకు గబ్బర్ దూరయ్యాడు. ఈ నేపథ్యంలో బుధవారం తన గాయంపై శిఖర్ ధావన్ తన ప్రతిస్పందనను కవితా రూపంలో వెల్లడించాడు. ప్రఖ్యాత ఉర్దూ రచయిత రాహత్ ఇందోరీ రాసిన పంక్తిని అతను ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. తాజాగా జట్టులోకి రావాడానికి జిమ్‌లో తాను చేస్తున్న కసరత్తులను ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. ‘ప్రస్తుత పరిస్థితులు ఓ పీడకలగా మిగిలిపోవచ్చు లేకుంటే తిరిగి కోలుకోవడానికి అవకాశం ఇవ్వచ్చు. నేను కోలుకోవాలని సందేశాలను పంపించిని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. చేతికి పట్టీ వేసుకొని మరి గబ్బర్ కసరత్తు చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. గబ్బర్ ఈజ్ బ్యాక్ అంటూ వారు కామెంట్ చేస్తున్నారు. ఇక భారత్-న్యూజిలాండ్‌తో గురువారం జరగాల్సిన మ్యాచ్ వర్షంతో రద్దైన విషయం తెలిసిందే. దీంతో ఇరు జట్లకు చెరోపాయింట్ లభించింది. You can make these situations your nightmare or use it an opportunity to bounce back. 🙌 Thank you for all the recovery messages from everyone. 🙏 pic.twitter.com/mo86BMQdDA — Shikhar Dhawan (@SDhawan25) June 14, 2019 ఈ ఫలితంపై కెప్టెన్ విరాట్‌కోహ్లి స్పందిస్తూ.. ‘కివీస్‌తో మ్యాచ్ రద్దు సరైన నిర్ణయమే. విజయాలు సాధించి ఉన్నాం కాబట్టి చెరో పాయింట్ దక్కడం ఏమంత ఇబ్బందికరమేం కాదు. పాక్‌తో ఆదివారం మ్యాచ్ గురించి ఆలోచిస్తున్నాం. మా ప్రణాళికలు మాకున్నాయి. మైదానంలో వాటిని అమలు చేయాలి. ధావన్ చేతికి కొన్ని వారాల పాటు ప్లాస్టర్ తప్పనిసరి. లీగ్ మ్యాచ్‌ల చివరి దశలో లేదా సెమీస్‌కు అతడు అందుబాటులోకి వస్తాడు. అతడు తిరిగి ఆడాలని కోరుకుంటున్నా’ అని కోహ్లి పేర్కొన్నాడు. చదవండి: ‘రెక్కలతో కాదు... సంకల్పంతో ఎగురుతా’ -
‘రెక్కలతో కాదు... సంకల్పంతో ఎగురుతా’
నాటింగ్‌హామ్: గాయం కారణంగా రాబోయే ప్రపంచకప్ మ్యాచ్‌లకు దూరమైన శిఖర్ ధావన్ తన ప్రతిస్పందనను కవితా రూపంలో వెల్లడించాడు. గాయం తనను దెబ్బ తీయలేదనే ఉద్దేశం అతని మాటల్లో కనిపించింది. ప్రఖ్యాత ఉర్దూ రచయిత రాహత్ ఇందోరీ రాసిన పంక్తిని అతను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ‘కభీ మహక్ కీ తరహ్ హమ్ గులోన్సే ఉడ్తే హై.. కభీ ధుయే కీ తరహ్ పర్బతోన్సే ఉడ్తే హై..యే కైంచియా హమే ఉడ్నే సే ఖాఖ్ రోకేంగీ.. కే హమ్ పరోన్సే నహీ హౌస్లోసే ఉడ్తే హై’ (పూలల్లో ఉండే సువాసనలా ఒకసారి, పర్వతాల మీదుగా వెళ్లే పొగ మంచులా మరోసారి ఎగురుకుంటూ వెళ్లిపోతాను. నేను ఎగరకుండా ఈ కత్తెరలు ఏం ఆపగలవు. నేను ఎగిరేది రెక్కలతో కాదు, సంకల్పంతో) అని ధావన్ తన భావాన్ని పంచుకున్నాడు. తన కవితతో ధావన్ స్ఫూర్తి పొందే ప్రయత్నం చేయగా... స్వయంగా రాహత్ ఇందోరి వెంటనే మరో కవితతో స్పందించడం విశేషం. ‘సెలయేటికి తన అస్తిత్వంపై చాలా గర్వం ఉంది. దాహంతో ఉన్న నాతో పెట్టుకుంటే తన సంగతేమౌతుందో తెలియదా’ (బహుత్ గురూర్ హై దరియాకో అప్నే హోనేపర్. జో మేరీ ప్యాస్ సే ఉల్ఝేతో ధజ్జియా ఉడ్జాయే, జిందాబాద్) అంటూ మరింతగా ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. -
ధావన్‌కి గాయం!
కోల్‌కతా: భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ఎడమ చేతి వేలుకు తీవ్ర గాయమైంది. బౌల్ట్ వేసిన ఇన్నింగ్ రెండో బంతి చూపుడు వేలు, బొటన వేలు మధ్య తాకగా ఫిజియో సహాయం తీసుకోవాల్సి వచ్చింది. బౌల్ట్ తర్వాతి ఓవర్లో కూడా అదే తరహాలో బొటనవేలుకు బంతి వేగంగా తగలడంతో అతను విలవిల్లాడాడు. ధావన్ అవుటైన తర్వాత అతని వేలికి ఎక్స్‌రే తీశారు. దీని ఫలితం ఇంకా రాలేదు. గాయం తీవ్రతను పరిశీలిస్తున్నట్లు మేనేజ్మెంట్ ప్రకటించగా... ధావన్ మూడు వారాల పాటు ఆటకు దూరం అయ్యే అవకాశం ఉందని తెలిసింది.