సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా శనివారం ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో వామపక్షాలు నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐఎంఎల్ నేత పోటు రంగారావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, విమలక్కలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు వాహనంలో ఎక్కించే క్రమంలో పోటు రంగారావు చేతి బొటనవేలు తెగిపోయింది. రెండు తలుపుల మధ్య వేలు పెట్టి కట్ చేశారని రంగారావు ఆరోపించారు. కేసీఆర్ నన్ను చంపమన్నాడా? అని పోలీసులను ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు, ఇప్పుడు కార్మికుల పక్షాన నిలబడి పోరాడినందుకు ఇది నాకు బహుమానమా? అంటూ తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు బస్ భవన్‌ను ముట్టండించేదుకు ప్రయత్నించిన తెలంగాణ జనసమితి నేతలను కూడా అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment