RTC Cross Roads
-
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట.. రెండు రోజుల ముందే లేఖ రాసిన యాజమాన్యం!
అల్లు అర్జున్ సినిమాకు పుష్ప-2 మూవీకి భద్రతా కల్పించాలని తాము కోరినట్లు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ యాజమాన్యం తెలిపింది. తమకు 4, 5 తేదీల్లో సెక్యూరిటీ ఇవ్వాలని రెండో తేదీనే లేఖ రాసినట్లు వెల్లడించింది. పుష్ప-2 ప్రత్యేక షోల దృష్ట్యా థియేటర్ వద్ద భద్రత కల్పించాలని చిక్కడపల్లి ఏసీపీకి రాసిన లేఖలో కోరినట్లు యాజమాన్యం పేర్కొంది.అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండిఅయితే డిసెంబర్ 4న వ తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో పుష్ప-2 బెనిఫిట్ షో ప్రదర్శించారు. ఈ షోకు అల్లు అర్జున్‌తో పాటు ఆయన సతీమణి కూడా హాజరయ్యారు. అయితే బన్నీని చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్‌పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృత్యువాతపడగా.. ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. -
RTC X Roads: ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో అగ్ని ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ కింద ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.వివరాల ప్రకారం.. దత్తసాయి కాంప్లెక్స్‌లో కమర్షియల్‌లో కాసేపటి క్రితం మంటలు చెలరేగాయి. దీంతో, సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి రెండు ఫైర్ ఇంజిన్లు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. కాగా, దత్తసాయి కాంప్లెక్స్‌కు తపాడియా ఆసుపత్రి ఆనుకొని ఉండటం ఆందోళన కలిగిస్తోంది.అయితే, కాంప్లెక్స్ నుంచి మంటలు చెలరేగుతుండటంతో తపాడియా ఆసుపత్రి నుంచి రోగులను కిందకు దింపుతున్నారు అధికారులు. మరోవైపు.. ఆర్టీసీ క్రాస్ రోడ్వైపు వస్తున్న వాహనాలను ముషీరాబాద్‌లోనే నిలిపిస్తున్నారు. దీంతో, ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
స్టీల్ బ్రిడ్జికి ‘నాయిని’ పేరు
హైదరాబాద్: ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.426 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న ఉదయం 10 గంటలకు ఇందిరాపార్కు చౌరస్తాలో మంత్రి కేటీఆర్ స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. స్టీల్‌బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య తీరుతుందని, నగరంలోని వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా వెళ్లే వాహనాదారులకు ఇది ఎంతో వెసులుబాటు కల్పిస్తుందని తెలిపారు. ఎటువంటి రోడ్డు వెడల్పు లేకుండా దుకాణాదారులకు నష్టం కలిగించకుండా అనుకున్న సమయానికి స్టీల్‌బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మెట్రో ట్రైన్ మీదుగా అత్యంత ఎత్తు నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం స్టీల్ మాత్రమే ఉపయోగించి నిర్మించినట్లు తెలిపారు. ఇది నగరానికే తలమానికమని ఆయన కొనియాడారు. కాగా.. స్టీల్ బ్రిడ్జికి మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరును ఖరారు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం తొలి హోంమంత్రిగా నాయిని నర్సింహారెడ్డి పని చేశారని, స్టీల్ బ్రిడ్జికి ఆయన పేరు పెడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వు జారీ చేయనుందన్నారు. నాయిని నరసింహారెడ్డి సుదీర్ఘ కాలం పాటు ముషీరాబాద్ కేంద్రంగా రాజకీయాల్లో పాల్గొని తెలంగాణ ఉద్యమానికి అనేక సేవలందించారన్నారు. అక్కడే ఉన్న వీఎస్టీ ఫ్యాక్టరీ కార్మికుల యూనియన్ నాయకుడిగా దశాబ్దాల పాటు పనిచేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెండు ప్రాంతాల్లో నాయిని సేవలను దృష్టిలో ఉంచుకొని స్టీల్ బ్రిడ్జికి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. -
వీఆర్ఏలపై లాఠీ ఛార్జ్.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 73 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. నిరసన కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వందలాది మంది వీఆర్ఏలు మంగళవారం ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయడానికి పెద్దఎత్తున తరలివచ్చారు. కానీ దీనికి అనుమతి లేకపోవడంతో ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకొని వీఆర్ఏలను అరెస్ట్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రోడ్డుపై బైఠాయించిన వీఆర్ఏలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. వాళ్లను బలవంతంగా అరెస్ట్ చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చదవండి: మునుగోడుకు రూ. 22 వేల కోట్లు ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటాం -
సినిమా చూపించలేం మావా!
స్టార్ హీరోల కటౌట్లతో కళకళలాడిన థియేటర్ అది వందల సినిమాలను చూపించిన తెర అది హౌస్‌ఫుల్ బోర్డ్‌తో ఆనందించిన స్క్రీన్ అది గల్లాపెట్టె గలగలు విన్న చోటు అది తెగిన టికెట్లు, విసిరిన పూలతో మురిసిన ప్రాంగణం అది కానీ ఇక ఇవేవీ కనబడవు. స్టార్ల కటౌట్ల స్థానంలో ఆఫర్ల హోర్డింగులు అగుపించనున్నాయి పెళ్లి భజంత్రీలు మోగనున్నాయి రెస్టారెంట్లు కనపడబోతున్నాయి. భాగ్యనగరంలో పలు సింగిల్ థియేటర్లు మూతపడబోతున్నాయి. కొన్నేళ్లుగా ‘సినిమా చూపిస్త మావా’ అంటూ కొన్ని వందల సినిమాలు చూపించాయి. ఇక ‘సినిమా చూపించలేం మావా’ అంటున్నాయి. హైదరాబాద్‌లో ఫేమస్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కొన్ని మూతపడనున్నాయని తెలిసింది. హైదరాబాద్‌లో సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్స్‌కు పాపులర్ జంక్షన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సినిమా ఆడేదాన్ని బట్టి హిట్, ఫ్లాప్ డిసైడ్ చేయొచ్చు అంటారు సినిమా పండితులు. సంధ్య, సుదర్శన్, దేవి, శ్రీమయూరి, సప్తగిరి, ఉష మయూరి... ఈ ఏరియాలో చాలా ముఖ్యమైన థియేటర్లు. ఈ థియేటర్స్‌లో శ్రీ మయూరి 70 ఎంఎంని త్వరలోనే మూసేయాలనుకుంటున్నారట. అలానే హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో ఉండే ఫేమస్ సింగిల్ స్క్రీన్లు కూడా మూతబడనున్నాయని తెలిసింది. టోలీచౌకి ఏరియాలోని ‘గెలాక్సీ’, నారాయణగూడలోని ‘శాంతి’ థియేటర్, బహదూర్‌పురలోని ‘శ్రీరామా’, మెహదీపట్నంలోని ‘అంబ’, సికింద్రాబాద్ ఏరియాలోని ‘టివోలీ’, ఎల్బీ నగర్‌లోని ‘సుష్మ’ థియేటర్స్ కూడా మూతపడనున్నాయని సమాచారం. కరోనా వల్ల థియేటర్స్ పరిశ్రమకు పూర్తిస్థాయిలో దెబ్బ పడింది. ఎనిమిదిన్నర నెలలు అయింది థియేటర్స్‌లో బొమ్మ పడి... కౌంటర్ దగ్గర టికెట్స్ తెగి. అయితే ఇలా థియేటర్స్‌ను మూసివేయడం సినిమా ప్రేమికులకు పెద్ద దెబ్బే. కానీ కోవిడ్ కంటే ముందు నుంచి కూడా సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి బాలేదు. థియేటర్లు నిండకపోవడం, టికెట్ రేట్లు, రెంటల్ చార్జీలు, కరెంట్ బిల్లులు, యూఎఫ్ఓ (ప్రొజెక్టర్‌కి సంబంధించినవి) బిల్లులు.. ఈ లెక్కల్లో లాభం చూడటం గగనం అనే పరిస్థితులే థియేటర్లు మూసేద్దాం అనే నిర్ణయం వెనక బలమైన కారణం అని తెలిసింది. కరోనా వల్ల పరిస్థితి ఇంకా దారుణం అయింది. సినిమా పరిశ్రమ కోలుకోవాలని ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా థియేటర్ల యాజమాన్యాలకు అనేక రాయితీలు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రకటన తర్వాత సినిమాహాళ్లు త్వరలోనే తెరచుకుంటాయి అని అందరూ అనుకుంటున్న సమయంలో ఇలా పలు థియేటర్లకు శాశ్వతంగా తాళాలు పడబోతున్నాయనేది ఆయా థియేటర్లలో సినిమాలు చూసి ఆనందించిన ప్రేక్షకులకు చేదు వార్తే. ఈ సింగిల్ స్క్రీన్స్‌ను ఫంక్షన్ హాలులా, సూపర్ మార్కెట్లలా, షాపింగ్ మాల్స్‌లా మార్చబోతున్నారని తెలిసింది. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ సంఖ్య చాలా ఎక్కువ. అలానే మన తెలుగులో విడుదలయ్యే సినిమాల సంఖ్య కూడా అంతే. మరి థియేటర్స్ ఒక్కొక్కటిగా మూతపడితే థియేటర్స్ సిస్టమ్ కచ్చితంగా ప్రమాదంలో ఉన్నట్టే. ఆల్రెడీ ఓటీటీ వర్సెస్ థియేటర్స్ డిబేట్ ఓవైపు నడుస్తూనే ఉంది. ప్రేక్షకుడిని థియేటర్స్‌వైపు వచ్చేలా చేస్తూనే, ఆల్రెడీ ఉన్న థియేటర్స్‌ను కమర్షియల్ స్పేస్లా మార్చేయకుండా చూడటం కూడా అంతే ముఖ్యం. ఎందరో సూపర్స్టార్లు పుట్టిన సింగిల్ స్క్రీన్లు తన శోభ కోల్పోకూడదు. థియేటర్లు మూతపడటానికి ప్రధాన కారణం గురించి థియేటర్ యాజమాన్యాల ప్రతినిధిగా సదానందం మాట్లాడుతూ – ‘‘లాభం లేకుండా ఏ వ్యాపారమూ చేయలేం. గవర్నమెంట్ నుండి మాకు రావాల్సిన రాయితీలు అన్నీ ఇచ్చామంటున్నారు. కానీ, పన్నెండేళ్లుగా రావాల్సిన థియేటర్ మెయింటినెన్స్ ఛార్జీలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇంతవరకు ఒక్క రూపాయి చెల్లించలేదు. (ప్రతి సినిమా టిక్కెట్‌కు 3 రూపాయలు గవర్నమెంట్ చెల్లించాలి). అలాగే రెండేళ్లనుండి థియేటర్లో ఫ్రీ పార్కింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టడంతో పార్కింగ్‌కు డబ్బులు లేక థియేటర్ల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. దానికి తోడు కరోనా కారణంగా సినిమాల ప్రొడక్షన్ తగ్గటం వంటి ఎన్నో కారణాలతో ఈ థియేటర్లు మూతపడుతున్నాయి. ఈ థియేటర్లన్నీ ప్రైమ్ ఏరియాల్లో ఉండటంతో వాటిని షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లకు ఉపయోగించుకునే ఆలోచనలతో యాజమాన్యాలు ఉన్నాయి’’ అన్నారు. -
ఆర్టీసీ సమ్మె : తెగిపడ్డ బొటనవేలు
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా శనివారం ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో వామపక్షాలు నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐఎంఎల్ నేత పోటు రంగారావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, విమలక్కలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు వాహనంలో ఎక్కించే క్రమంలో పోటు రంగారావు చేతి బొటనవేలు తెగిపోయింది. రెండు తలుపుల మధ్య వేలు పెట్టి కట్ చేశారని రంగారావు ఆరోపించారు. కేసీఆర్ నన్ను చంపమన్నాడా? అని పోలీసులను ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు, ఇప్పుడు కార్మికుల పక్షాన నిలబడి పోరాడినందుకు ఇది నాకు బహుమానమా? అంటూ తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు బస్ భవన్‌ను ముట్టండించేదుకు ప్రయత్నించిన తెలంగాణ జనసమితి నేతలను కూడా అరెస్ట్ చేశారు. -
శ్వేత.. వన్డే కమిషనర్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అప్సా ప్లాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని కార్మిక శాఖ కార్యాలయంలో విద్యార్థిని శ్వేత ఒక్క రోజు జంటనగరాల సంయుక్త కార్మిక శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహించింది. సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటలోని గుండా ఈశ్వరయ్య ప్రభుత్వ పాఠశాలలో శ్వేత 9వ తరగతి చదువుతోంది. తాను ఒక్క రోజు కమిషనర్‌గా విధులు నిర్వహించడం చాలా సంతోషానిచ్చిందని తెలిపింది. ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతాధికారిగా స్థిరపడి ప్రజలకు సేవ చేస్తానని వివరించింది. జంటనగరాల సంయుక్త లేబర్ కమిషనర్ డాక్టర్ ఇ.గంగాధర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగడానికి ఇలాంటి వారికి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. ఏఎల్ఓ స్థాయి అధికారులు ప్రభాకర్, పవన్, అప్సా పద్మ, బస్వరాజ్, గౌరి, శంకర్, పట్నాయక్, రాంప్రసాద్ పాల్గొన్నారు. ‘బాలానందం’ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం కాచిగూడ: ఆంధ్ర బాలానంద సంఘం 80వ వార్షికోత్సవం సందర్భంగా జంటనగరాల్లోని బాలబాలికలకు వివిధ అంశాల్లో ప్రతిభా పాట వ పోటీలు నిర్వహిస్తున్నామని ఆసక్తి గల బాల బాలికల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బాలానందం కార్యదర్శి జేవీ కామేశ్వరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నర్సరీ నుండి 9వ తరగతి వరకు విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులన్నారు. వివరాలకు నారాయణగూడలోని బాలనంద సంఘం కార్యాలయంలో నేరుగా గాని, ఫోన్ నెంబర్ 040– 27561443లో సంప్రదించాలని సూచించారు. -
ర్యాష్ డ్రైవింగ్‌తో మహిళ హల్చల్
చిక్కడపల్లి: అతివేగంగా కారు నడిపిన ఓ మహిళ పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన సంఘటన ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో చోటు చేసుకుంది. బంజారాహిల్స్‌కు చెందిన దీపాకురానా శుక్రవారం మధ్యాహ్నం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి అశోక్‌నగర్‌వైపు హోండా సిటీ కారులో అతివేగంగా వెళుతూ అశోక్‌నగర్ చౌరస్తా వద్ద బైక్‌పై వెళుతున్న గుర్తుతెలియని వ్యక్తిని ఢీకొట్టి అదే వేగంతో ముందుకు వెళ్లింది. దీంతో స్థానికులు చిక్కడపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే స్పందించి కారును వెంబడించి ఆపేందుకు ప్రయత్నించగా, ఆమె ఆపకపోవడంతో మధ్య మండలం కంట్రోల్‌రూమ్ ద్వారా సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీసులు కారును ఐమ్యాక్స్ థియేటర్ వద్ద నిలిపివేశారు. దీంతో ఆమె పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతోపాటు గతంలో సైబరాబాద్ కమిషనర్‌గా విధులు నిర్వహించి, ప్రస్తుతం కేంద్ర సర్వీస్‌లో ఉన్న ఉన్నతాధికిరి సమాచారం అందించింది. దీంతో ఆయన వెంటనే సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ సీఐ గంగారాంకు ఫోన్‌చేసి సదరు మహిళ వద్ద వ్యక్తిగత వివరాలు తీసుకుని వదిలిపెట్టమని ఆదేశించినట్లు సమాచారం. దీంతో సీఐ ఆమెను వదిలివేశారు. సదరు మహిళ తనను కారుతో ఢీకొట్టినట్లు ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు పేర్కొనడం గమనార్హం. -
తెలంగాణ ప్రభుత్వ విప్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
హైదరాబాద్ : ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు, మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా నాగోలుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సునీతా మహేందర్ రెడ్డి కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ఘటన అనంతరం తేరుకున్న సునీత మాట్లాడుతూ...తాను క్షేమంగానే ఉన్నానని, యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దయతో ప్రమాదం నుంచి బయపడినట్లు ఆమె తెలిపారు. -
శోభాయాత్ర: నగరంలో భారీగా ట్రాఫిక్‌జాం
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా పలుచోట్ల వాహనాలను దారి మళ్లించారు. వాహనాల దారి మళ్లింపులో పొరపాటు చోటుచేసుకోవడంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కు భారీగా వాహనాలు వచ్చి చేరాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి ముషీరాబాద్ వరకు భారీగా ట్రాఫిక్‌జామ్ సంభవించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనసాగుతున్న శోభాయాత్ర మరోవైపు భారీ భద్రత నడుమ హనుమాన్ శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. ఉదయం గౌలిగూడ నుంచి ప్రారంభమైన యాత్ర తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు కొనసాగనుంది. వందలాది వాహనాలు, వేలాదిమందితో భక్తుల నడుమ యాత్ర కొనసాగుతోంది. దారి పొడవునా భజనలు, డప్పు వాయిద్యాలు, జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగుతున్నాయి. శోభాయాత్ర సందర్భంగా సున్నిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 10 వేల మంది పోలీసులతో బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ప్రతి కిలోమీటరకు ఓ సీనియర్ పోలీస్ అధికారితో పర్యవేక్షిస్తున్నారు. -
పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలి: గట్టు శ్రీకాంత్‌రెడ్డి
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచిన విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంపునకు నిరసనగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వరంలో నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ధర్నా నిర్వహించారు. ఛార్జీల పెంపును నిరసిస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హజరయ్యారు. -
మొబైల్ షోరూంలో భారీ చోరీ
హైదరాబాద్: నగరంలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డు సమీపంలోని ప్రముఖ మొబైల్ షోరూంలో మంగళవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. మొబైల్ షోరూమ్ గోడకు కన్నం వేసిన దొంగలు సుమారు 10 లక్షలు విలువ చేసే 74 సెల్ఫోన్లను, 27వేల నగదును దొచికెళ్లారు బుధవారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన షాపు సిబ్బంది వెంటనే పోలీసుకులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మొబైల్ షాపునకు చేరుకుని... దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ నుంచి తప్పించుకునేందుకు దొంగ నల్లదుస్తులు, మొఖానికి మాస్క్, గ్లౌజేస్ వేసుకొని దొంగతనానికి పాల్పడినట్లు సీసీ ఫుటేజీ ద్వారా తెలిసింది. సంఘటన స్థలానికి చేరుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ వివి కమలాసన్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ సీసీ ఫుటేజీలో ఓ దొంగ చోరికి పాల్పడినట్లు తెలుస్తుందన్నారు. ముందస్తు చర్యగా నల్లదుస్తులు, మాస్కులు ధరించడాన్ని బట్టి చూస్తే దొంగతనం నైపుణ్యం గలిగిన వాడై ఉంటాడని ఈ దొంగను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. -
నిబంధనలు గాలికి! ప్రాణాలు గాలికి !
సిటీబ్యూరో: వాహన చోదకుల అజాగ్రత్త... అధికార యంత్రాంగం నిర్లక్ష్యం... వెరసి రోడ్డు ప్రమాదాల రూపంలో నిత్యం ఎందరినో మృత్యువు పొట్టన పెట్టుకుంటోంది. బుధవారం నగరంలోని ఔటర్ రింగ్ రోడ్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, పేట్ బషీరాబాద్ల్లో చోటు చేసుకున్న మూడు రోడ్డు ప్రమాదాలకు నిర్లక్ష్యమే కారణం. ఈ ఉదంతాల్లో ఐదు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మృతులలో మాజీ డీజీపీ పేర్వారం రాములు మనవడు, బంధువు, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి కుమారుడు ఉన్నారు. ప్రాణం తీసిన ‘లైన్’ మార్పు... ఓఆర్ఆర్పై పాల వ్యాన్‌ను వెనుక నుంచి ఢీ కొట్టిన ప్రమాదంలో పేర్వారం రాములు మనవడు వరుణ్ పవార్ సహా ముగ్గురు మరణించగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారులతో పాటు ఈ తరహా రోడ్లపై ఏ వాహనాలు ఏ లైన్లో వెళ్లాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఓఆర్ఆర్ విషయానికివస్తే ఒక్కో వైపు నాలుగు లైన్లుగా ఉండే ఈ రహదారిలో కుడి నుంచి ఎడమకు వేగంగా వెళ్లే వాటి నుంచి పరిమిత స్పీడ్‌తో వెళ్లే వాటి వరకు ప్రయాణించాల్సి ఉంది. దీనిపై పూర్తి స్థాయిలో ప్రచారం లేదు.ఈ విషయాన్ని హెచ్ఎండీఏ పట్టించుకోలేదు. ఫలితంగా వరుణ్ తదితరులు ప్రయాణిస్తున్న స్కోడా కారు లైను మారి పాల వ్యాను వెనక్కు వచ్చింది. అతి వేగంతో ఢీ కొట్టింది. ప్రాణం పోయినా మార్పు లేదు... చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ప్రమాదంలో రాజేందర్‌రెడ్డి కుమారుడు విశాల్‌రెడ్డి కన్ను మూశారు. దీనికి ప్రధాన కారణం ఆ ప్రాంతంలో రోడ్లపై ఉన్న గోతులే. ‘గొయ్యి చూపిస్తే వెయ్యి’ అంటూ జీహెచ్ఎంసీ చేసిన ప్రకటనలు ఏనాడో గాలిలో కలిసిపోయాయి. గల్లీలు, ఇతర రోడ్లలో ఉన్న గుంతల మాట అటుంచినా... అనునిత్యం అత్యంత రద్దీగా ఉండే ఆర్టీసీ క్రాస్రోడ్స్నే జీహెచ్ఎంసీ పట్టించుకోలేదు. ఈ ప్రమాదం జరిగిన చోటే కొద్ది గంటల ముందు (మంగళవారం అర్థరాత్రి) మరో ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డు అధ్వానంగా ఉండటమే కారణమని తెలిసినా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ సహా ఏ ఒక్కటీ స్పందించలేదు. మొదటి ప్రమాదం జరిగిన వెంటనే నిర్లక్ష్యాన్ని వీడి ఉంటే రెండో ప్రాణం దక్కేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మలుపులోనూ మితిమీరిన వేగం పేట్ బషీరాబాద్‌లో దూలపల్లి చౌరస్తా వద్ద ప్రమాదంలో స్థానికురాలైన నాగ మనోహరమ్మ అక్కడిక్కడే మృతి చెందారు. జాతీయ రహదారైనా ప్రాంతాన్ని బట్టి వేగ పరిమితులు ఉంటాయి. ప్రధానంగా మలుపులు, జనసమ్మర్థ ప్రాంతాలు, జంక్షన్ల వద్ద నెమ్మదిగా వెళ్లాలంటూ సూచికలు ఏర్పాటు చేస్తారు. వీటిని వాహన చోదకులు కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తూ దూలపల్లి వైపు నుంచి మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన కారుమనోహరమ్మ పాలిట మృత్యు శకటమైంది. ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. మూడు సెక్షన్లే దిక్కా? నగరంలో ఏటా వందల మంది ఉసురుతీస్తున్న రోడ్డు ప్రమాదాలపై కేసులు నమోదు చేయడానికి ప్రత్యేక చట్టమంటూ ఇప్పటి వరకు లేదు. వీటినీ లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) కిందే నమోదు చేస్తుంటారు. సాధారణంగా ప్రమాదాల కేసులన్నీ కేవలం మూడు సెక్షన్ల కిందికే వస్తున్నాయి. బాధితులకు సాధారణ స్థాయిలో గాయాలు తగిలితే ఐపీసీ-337, తీవ్ర గాయాలైతే ఐపీసీ-338, మృతి చెందితే ఐపీసీ-304 (ఏ) కింద నమోదు చేస్తున్నారు. అతితక్కువ ఉదంతాల్లో మాత్రమే వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించి ఎంవీ యాక్ట్-185 సెక్షన్ మాత్రం కలుపుతున్నారు. రోడ్డు ప్రమాదానికి వాహన చోదకుడితో పాటు ఇతర విభాగాల నిర్లక్ష్యమూ కారణమయ్యే ఉదంతాలు ఎన్నో ఉంటున్నాయి. అలాంటి సందర్భాల్లో జరిగే ప్రమాదాలపై ఐపీసీ 304 పార్ట్ 2 కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది. రోడ్డుపై గుంతల విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం మొదలు అనేక ఇంజినీరింగ్ లోపాలపై దృష్టి పెట్టి ఆయా సంస్థల్ని బాధ్యులను చేసిన సందర్భాలు అత్యంత అరుదనే చెప్పుకోవచ్చు. ప్రాణాంతకమని తెలిసీ నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తే బెయిల్ కష్టసాధ్యం కావడంతో పాటు శిక్షలూ పెరుగుతాయి. పోలీసు విభాగం మాత్రం ఇలా నమోదు చేయడంలో వెనుకడుగు వేస్తోంది. ఈ చర్య నగరంలో సాధ్యమేనా? భద్రతా ప్రమాణాలు పాటించని... ప్రమాదమని తెలిసీ నిర్లక్ష్యంగా వ్యవహరించే పౌర సేవా విభాగాలపై బెంగళూరు పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. అక్కడి దేవరబీనహల్లీ ఫ్లైఓవర్‌పై చోటు చేసుకున్న ప్రమాదంలో పోలీసుల స్పందనే దీనికి నిదర్శనం. అంతర్జాతీయ విమానాశ్రయానికి దారి తీసే ఆ ఫ్లైఓవర్‌పై డివైడర్లు ప్రమాదభరితంగా ఉన్నాయని, వాటికి సూచిక బోర్డులు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాల్సిందిగా బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు రాసిన లేఖలను బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ (బీడీఏ) నిర్లక్ష్యం చేసింది. దీంతో ఈ ఫ్లైఓవర్‌పై క్యాబ్ వాహనానికి జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించారు. తీవ్రంగా పరిగణించిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన బీడీఏ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.శ్రీపద్రాజు, అసిస్టెంట్ ఇంజినీర్ ప్రదీప్‌లపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇలాంటి చర్యలు తీసుకుంటే తప్ప నగరంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి చెక్ పడదని నిపుణులు వాదిస్తున్నారు.