
హైదరాబాద్ : ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు, మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా నాగోలుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సునీతా మహేందర్ రెడ్డి కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ఘటన అనంతరం తేరుకున్న సునీత మాట్లాడుతూ...తాను క్షేమంగానే ఉన్నానని, యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దయతో ప్రమాదం నుంచి బయపడినట్లు ఆమె తెలిపారు.