trs mla
-
ప్లాట్స్ ఎలా అమ్ముతావో చూస్తా.. రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఎమ్మెల్యే వార్నింగ్
సాక్షి, బోథ్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.. బెదిరింపుల ఆడియో బయటకు లీక్ అవడం రాజకీయంగా కలకలం సృష్టించింది. బోథ్‌లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఎమ్మెల్యే బెదిరింపులకు గురిచేశాడు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే బాపురావు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద మధ్యవర్తి సాయంతో కొంత భూమి కొనుగోలు చేశారు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిరణ్.. సదరు మధ్యవర్తిని భూమికి సంబంధించి రూ.28 లక్షలు ఇవ్వాలని కోరారు. దీంతో, అతను ఎమ్మెల్యే బాపురావును ఆశ్రయించడంతో ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఫోన్ చేశాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కిరణ్‌కు బెదిరింపులకు గురిచేశాడు. వెంచర్ ఎలా వేశావ్.. ప్లాట్లు ఎలా అమ్ముతావో చూస్తానంటూ ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చాడు. ఇక, ఎమ్మెల్యే బెదిరింపుల అనంతరం రియల్ ఎస్టేట్ కిరణ్.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసులు కోరినట్టు సమాచారం. అయితే, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో ఉన్నతాధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే చర్చ నడుస్తోంది. -
రోహిత్‌రెడ్డి ఈడీ విచారణలో కొత్త ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి – ఈడీ కేసులో కొత్త ట్విస్ట్. ఎమ్మెల్యేలకు ఎర కేసులోనే తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించిందని రోహిత్‌రెడ్డి చెప్పిన 24 గంటల్లోనే ఈడీ అధికారులు ‘7 హిల్స్ మాణిక్‌చంద్’ పాన్ మసాలా యజమాని అభిషేక్ ఆవాలకు నోటీసులు జారీచేశారు. గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్‌గోయల్ స్పష్టం చేశారు. 2015 నుంచి అన్ని బ్యాంకు ఖాతాల స్టేట్మెంట్లు, ఏయే సంస్థల్లో డైరెక్టర్‌గా ఉన్నారు, కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న స్థిర, చరాస్తుల వివరాలను తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు నందుకుమార్ తనను రూ.1.75 కోట్ల మేరకు మోసం చేశారంటూ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో అభిషేక్ ఈనెల రెండోవారంలో ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. అభిషేక్, రోహిత్‌రెడ్డి సోదరుడి మధ్య రూ.7.75 కోట్ల మేరకు లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ లావాదేవీలు ఏ సందర్భంగా జరిగాయి? ఏ వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు? రోహిత్‌రెడ్డితో ఉన్న సంబంధాలపై పూర్తిస్థాయిలో కూపీ లాగేందుకు అభిషేక్‌కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. రెండురోజులపాటు ఈడీ విచారణను ఎదుర్కొన్న రోహిత్‌రెడ్డి తనను ఎమ్మెల్యేల ఎర కేసులోనే విచారించారని, ఈ కేసులో తాను ఫిర్యాదుదారుడిగా ఉన్నా.. దోషులను వదిలిపెట్టి తనను విచారణకు పిలవడం ఏమిటో అర్థం కావడం లేదని మీడియాతో వాపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈడీ అధికారులు మాత్రం ‘7 హిల్స్ మాణిక్‌చంద్’ పాన్ మసాలాకు సంబంధించిన లావాదేవీలపై రోహిత్‌రెడ్డిని ఎక్కువగా ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పాన్‌మసాలా కేసులోనే రోహిత్‌రెడ్డిని విచారించినట్లు స్పష్టమవుతోంది. 2015లోనే సొంత బ్రాండ్‌పై... మాణిక్‌చంద్ గుట్కాకు హైదరాబాద్ కేంద్రంగా ప్రధాన పంపిణీదారుగా ఉన్న అభిషేక్ ఆవాల 2015లో సొంత బ్రాండ్‌తో పాన్ మసాలా తయారీని ప్రారంభించారు. బీబీనగర్ సమీపంలోని నేమర గోముల గ్రామంలో ఓ యూనిట్ స్థాపించి ‘7 హిల్స్ మాణిక్‌చంద్’ పేరుతో పాన్ మసాల, జర్దా తదితరాలను ఉత్పత్తి చేసి విక్రయించడం మొదలెట్టాడు. ఆపై గుజరాత్ నుంచి గుట్కా తెచ్చి అక్రమంగా అమ్మకాలు సాగించినట్లు సమాచారం. ఆ దందాలో ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడిగా ఉన్న నందుకుమార్ కూడా కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. అభిషేక్, నందుకుమార్ సంయుక్తంగా వే ఇండియా టుబాకో ప్రైవేట్ లిమిటెడ్, 7 హిల్స్ మాణిక్‌చంద్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, 7 హిల్స్ మార్కెటర్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, డబ్ల్యూ3 హాస్పిటాలిటీస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు డైరెక్టర్లుగా ఉన్నారు. డబ్ల్యూ3 సంస్థలో రాజేశ్వర్‌రావు కల్వకుంట్ల కూడా ఓ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ సంస్థను ముగ్గురూ కలిసి 2015 నవంబర్ 6న ఏర్పాటు చేశారు. ‘7 హిల్స్ మాణిక్‌చంద్ పాన్ మసాలా’ ఉత్పత్తులకు సంబ«ంధించిన ఫ్రాంచైజీలు, డిస్ట్రిబ్యూషన్స్, సీ అండ్ ఎఫ్ ఏజెన్సీలు ఇస్తానంటూ అభిõÙక్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఒడిశా, పశి్చమబెంగాల్‌లోని అనేక మందిని మోసం చేశారన్న అభియోగాలున్నాయి. ఈ వ్యవహారాల్లోనూ నందుకుమార్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయ్యప్ప దీక్షను విరమించిన రోహిత్‌రెడ్డి తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అర్ధాంతరంగా అయ్యప్ప దీక్ష విరమించారు. ఆయన అన్న కుమారుడు శశాంక్‌రెడ్డి మంగళవారం అర్ధరాత్రి బషీరాబాద్ మండలం ఇందర్‌చెడ్ గ్రామంలో మృతిచెందారు. దీంతో అయ్యప్ప దీక్షలో కొనసాగడం మంచిది కాదని, విరమించినట్లు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తెలిపారు. చదవండి: 'ఫోన్ 10 సార్లు ఎందుకు మార్చారు కవిత? వాళ్ల ఇంటికి ఎందుకెళ్లారు?' -
డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. సోమవారం విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి రావాలని స్పష్టం చేసింది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టంలోని (పీఎంఎల్ఏ) 2, 3, 50 సెక్షన్ల కింద జారీ చేసిన ఈ నోటీసుల్లో మొత్తం పది అంశాలను పొందుపరిచింది. హైదరాబాద్ జోనల్ ఈడీ కార్యాలయం అదనపు డైరెక్టర్ దేవేందర్ కుమార్ సింగ్ పేరుతో, 15వ తేదీతో (గురువారం) ఈ సమన్లు ఉన్నాయి. 2015 నుంచి రోహిత్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులకు సంబంధించిన ఆర్థిక, వ్యాపార లావాదేవీలు, ఐటీ, జీఎస్టీ రిటర్న్స్, బ్యాంకు స్టేట్మెంట్స్, స్థిరచరాస్తులతోపాటు రుణాల వివరాలు తీసుకురావాలంటూ ఈడీ స్పష్టం చేసింది. ఆధార్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు కాపీలు తీసుకురావాలని పేర్కొంది. అతడి కుటుంబీకులకు సంబంధించిన పూర్తి బయోడేటాను అందించాలని కోరిన ఈడీ దాని నమూనాను నోటీసులతో జత చేసింది. రోహిత్‌రెడ్డిపై తొమ్మిది కేసులు రోహిత్ రెడ్డి 2018లో నామినేషన్‌తోపాటు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయనపై మొత్తం 9 కేసులు ఉన్నాయి. ఇవన్నీ 2017–18 మధ్య తాండూరుతోపాటు బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో నమోదయ్యాయి. వీటిలో అత్యధికం ఎన్నికల సంబంధిత నేరాలే. ఒక్క కేసులో మాత్రమే మోసం తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ ఏడాది మార్చిలో బెంగళూరులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులోనూ రోహిత్‌రెడ్డి పేరు వినిపించింది. నిర్మాత శంకరగౌడ్ బెంగళూరులో గతేడాది ఇచ్చిన పార్టీకి రోహిత్‌రెడ్డి హాజరైనట్లు ఆరోపణలు ఉన్నాయి. నైజీరియన్ అరెస్టుతో గుట్టురట్టయిన ఈ వ్యవహారంలో రూ.కోట్ల విలువైన డ్రగ్స్ విదేశాల నుంచి వచ్చినట్లు అక్కడి నార్కోటిక్ అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబం«ధించి ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తలకు నోటీసులు ఇచ్చిన బెంగళూరు పోలీసులు విచారించారు. వీరిలో కొందరు తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులను ఆ పార్టీకి తీసుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమేయంపై వార్తలు వెలువడ్డాయి. ఆ డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని రోహిత్‌రెడ్డి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏ కేసులో ఈడీ సమన్లు జారీ చేసిందో తెలియాల్సి ఉంది. ఏ కేసు ప్రస్తావన లేకుండా ఈడీ ఇచ్చిన నోటీసులపై రోహిత్‌రెడ్డి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఈడీ ఎలాంటి కేసులను దర్యాప్తు చేస్తుంది? ఈడీ అధికారులు రెండు చట్టాలకు సంబంధించిన కేసులను మాత్రమే దర్యాప్తు చేస్తుంటారు. పీఎంఎల్ఏతో పాటు విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద మాత్రమే కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తుంటుంది. ఫెమా చట్టాన్ని ఈడీ అధికారులే నేరుగా వినియోగించవచ్చు. విదేశీ మారకద్రవ్యాలకు సంబంధించిన లావాదేవీలున్న అంశాలనే ఈ చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో దర్యాప్తు చేస్తుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, విచారణకు నోటీసులు అందుకున్న వారు ఏదో ఒక కోణంలో విదేశీ కరెన్సీ లావాదేవీలు చేసి ఉండాలి. అయితే పీఎంఎల్ఏ కింద ఈడీ అధికారులు ఓ కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలంటే మాత్రం నేరుగా కుదరదు. అప్పటికే ఏదో ఒక పోలీసుస్టేషన్ లేదా సీబీఐ వంటి ప్రత్యేక విభాగంలో కేసు నమోదై ఉండాలి. ఆ ఎఫ్ఐఆర్ ఆ«ధారంగానే ఈడీ పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేస్తుంది. ఏదైనా కేసులో ఓ వ్యక్తి నిందితుడు కాకపోయినప్పటికీ... నిందితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి విచారణలో పేరు వెలుగులోకి రావడమో, వారి వాంగ్మూలాల్లో ప్రస్తావన ఉండటమో జరిగినా ఈడీ నోటీసులు ఇచ్చి విచారించే ఆస్కారం ఉంది. ఇప్పటికే ఏదో ఒకచోట నమోదైన కేసు ఆధారంగానే రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసి ఉండొచ్చని చెప్తున్నారు. మరోసారి రకుల్‌కు నోటీసులు టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ అధికారులు శుక్రవారం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈమెను సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. టాలీవుడ్ ప్రముఖులతో ముడిపడి ఉన్న డ్రగ్స్ కేసుకు సంబం«ధించి ఇప్పటికే ఈడీ రకుల్‌ను ఓసారి విచారించింది. ఎక్సైజ్ అధికారులు 2017లో నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. అయితే అప్పట్లో ఎక్కడా రకుల్ పేరు బయటకు రాలేదు. తర్వాత ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన ఓ డ్రగ్ కేసులో కీలక నిందితుడైన కెల్విన్ విచారణలో బయటపడిన అంశాల ఆధారంగానే రకుల్‌ను గత సెప్టెంబర్ 3న ప్రశ్నించింది. తాజాగా రకుల్‌ను ఏ అంశాలపై, ఎవరితో సంబంధాలపై, ప్రశ్నిస్తారనే ఉత్కంఠ నెలకొంది ఇదీ చదవండి: హైదరాబాద్ నుంచి విదేశాలకు డ్రగ్స్ -
రూ.100 కోట్లు తీసుకుని హ్యాపీగా ఉండేవాణ్ణి.. కానీ.. తాండూరు కోసమే..
బషీరాబాద్: నియోజకవర్గం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ‘ఎమ్మెల్యేల ఎర కేసు’లో తాను పెద్ద రిస్క్ తీసుకున్నానని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. బషీరాబాద్ మండలం మల్కన్‌గిరి గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలని కోరుతూ గ్రామ యువకులు కొందరు వారం రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దీక్ష చేస్తున్న బాలకృష్ణ అనే యువకుడితో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. ‘తాండూరు అభివృద్ధి కోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నా. లేకుంటే వాళ్లు ఇచ్చే వంద కోట్ల రూపాయలు తీసుకొని నేను హ్యాపీగా ఉంటాను కదా. కానీ నేను మన కోసం రిస్క్ తీసుకున్నా. మీ గ్రామం అభివృద్ధికి ఏమేమి కావాలో నాకు లెటర్ రాయండి. మీ గ్రామం డెవలప్మెంట్ నేను చూసుకుంటా. సమస్యను నా దృష్టిలో పెట్టుకుంటా. ప్రభుత్వం ముందు ప్రపోజల్ చేస్తా..’అని తెలిపారు. నా కోసం దీక్ష విరమించాలని కోరారు. కాగా వారం రోజుల్లో మల్కన్‌గిరి గ్రామానికి రూ.25 లక్షల నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు దీక్ష చేస్తున్న యువకులు చెప్పారు. రిలే దీక్షలు విరమిస్తున్నట్లు తెలిపారు. చదవండి: అసెంబ్లీ సెగ్మెంట్లపై నజర్.. ఎన్నికలకు సమాయత్తంపై కేసీఆర్ ఫోకస్ -
బుల్లెట్లతో ఎమ్మెల్యే బాల్క సుమన్ పేరు.. సీఆర్పీఎఫ్ జవాన్ నిర్వాకం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏకే 47 రైఫిల్ బుల్లెట్లతో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేరు రాసి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఓ జవాన్. మొత్తం 62 బుల్లెట్లతో ‘జై బాల్క సుమన్’ అని టవల్‌పై ఇంగ్లిష్ అక్షరాలతో రాసి ఉన్న ఫొటో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. చెన్నూరులో టీఆర్ఎస్ కార్యకర్త తన వాట్సాప్ స్టేటస్‌లో ఈ ఫొటో పెట్టుకున్నాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం తెలిసింది. చెన్నూరుకు చెందిన వంగాల సంతోష్ సీఆర్పీఎఫ్ జవాన్. ప్రస్తుతం బీజాపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. తన వద్ద ఉన్న బుల్లెట్లతో ఎమ్మెల్యే పేరు రాసి ఫొటో తీసి, వాట్సాప్‌లో పంపించాడు. దీన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు స్టేటస్‌గా పెట్టుకున్నట్లు విచారణలో వెల్లడైంది. చదవండి: మూడు పదులు నిండకుండానే 'గుండెపోట్లు'.. కారణాలివే.. -
చీకోటితో ఏమిటి సంబంధం?
సాక్షి, హైదరాబాద్: క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్‌కుమార్ వ్యవహారంలో మనీలాండరింగ్, ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చిన మంచిరెడ్డిని అధికారులు రాత్రి వరకు ప్రశ్నించారు. చీకోటితో ఏమిటి సంబంధం? మనీలాండరింగ్‌కు పాల్పడ్డారా? తరలించిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకోసం తరలించాల్సి వచ్చింది? అన్న అంశాలపై స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు తెలిసింది. చీకోటితో ఆయన కుటుంబసభ్యులకున్న ఆర్థిక లావాదేవీలపైనా ప్రశ్నించినట్టు సమాచారం. కాగా, మంచిరెడ్డిని 9 గంటల పాటు విచారించి ఇంటికి పంపించిన ఈడీ అధికారులు, బుధవారం కూడా విచారణకు హాజరు కావాలని సూచించారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి.. క్యాసినో వ్యవహారంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ చీకోటిని రెండు నెలల క్రితం ఈడీ ప్రశ్నించింది. ఆయనతో సంబంధాలున్నట్టుగా అనుమానాలున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను సైతం విచారించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చీకోటితో 2015 నుంచి మంచిరెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. 2015–16లో ఇండోనేసియాలోని పెట్టుబడులు పెట్టేందుకు చీకోటి నెట్వర్క్ ద్వారా మంచిరెడ్డి భారీగా డబ్బును హవాలా రూపంలో తరలించినట్టు అనుమానిస్తోంది. ఇందులో ఫెమా నిబంధనల ఉల్లంఘన చోటు చేసుకున్నట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలోనే కిషన్‌రెడ్డిని ఈడీ ప్రశ్నించినట్టు తెలిసింది. క్యాసినోల్లోనూ మంచిరెడ్డి పెట్టుబడులు క్యాసినోలోనూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి లావాదేవీలున్నట్టుగా ఈడీ కీలక ఆధారాలు గుర్తించింది. ఇండోనేసియాలోని బాలి, నేపాల్, గోవాలోని క్యాసినోల్లో చీకోటితో పాటు మంచిరెడ్డి కొంతమేర పెట్టుబడి పెట్టినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. అదే సమయంలో కిషన్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబీకుల్లో ఒకరికి చీకోటి ప్రవీణ్‌తో ఆర్థిక లావాదేవీలున్న విషయాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా మంచిరెడ్డిని ఈడీ అధికారులు విచారించినట్టు తెలిసింది. ఇలావుండగా మంచిరెడ్డి తర్వాత జాబితాలో ఎవరున్నారన్నదానిపై చర్చ జరుగుతోంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ మంత్రికి ఈడీ తాఖీదులు తప్పవని తెలుస్తోంది. -
ఇంటికే వస్తా అంటే రమ్మంటిని, కానీ, ఎక్కడా?: జూపల్లి
సాక్షి,నాగర్ కర్నూల్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం విష్ణువర్ధన్ రెడ్డి పరస్పర సవాళ్లతో కొల్లాపూర్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో అవాంఛిత ఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ భారీ ఎత్తున మోహరించారు. అయితే, చర్చలో పాల్గొనేందుకు జూపల్లి ఇంటికి బీరం ర్యాలీగా వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్టు చేశారు. ఈక్రమంలో ఎమ్మెల్యే బీరం నిరాధార ఆరోపణలను జూపల్లి మీడియా ఎదుట ఎండగట్టారు. చదవండి👉🏼 విరాట పర్వం.. 30 ఏళ్ల కిందట పేలిన తూటా శంకరన్న చేతిలో సరళ బలి రాత్రి నుంచి చూస్తున్నా.. ఎక్కడా? ‘నేను అంబేద్కర్ చౌరస్తాలో చర్చ పెడదామన్న. కాని చర్చకు ఇంటికే వస్తా అంటే స్వాగతం పలుకుతానని చెప్పా. నీ మాట ప్రకారమే రాత్రి నుంచి ఎదురుచూస్తున్నా. కానీ, ఎమ్మెల్యే రాలేదు. మూడున్నరేళ్లు ఎమ్మెల్యే ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. అరెస్టు చేయించుకుని తప్పించుకుని పోయినవ్.. ముఖం చాటేసుకున్నవ్. ఎమ్మెల్యే మాట మార్చాడు. నేను మాట మార్చలేదు. హుస్సేన్ సాగర్ కారు ప్రమాదం, ఫ్రుడెన్షియల్ బ్యాంకు వ్యవహారాలపై ఎమ్మెల్యే అవాస్తవాలు మాట్లాడుతున్నాడు. అప్పు తీసుకుని వ్యాపారం చేసాం, ఇది తప్పు అన్నట్లుగా మాట్లాడితే ఎట్లా!. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేయొద్దని సహచర మంత్రులే సూచించినా నేను వెనక్కి తగ్గలేదు. మిగతా మంత్రులపై ఒత్తిడి వస్తుంది వద్దన్నారు. వెయ్యి కోట్లిచ్చినా అమ్ముడు పోయే వ్యక్తిని కాను. నాది మచ్చలేని చరిత్ర. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద కోర్టులో కేసు వేసిందెవరు? నా పై నిరాధార ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే బీరంపై పరువు నష్టం దావా వేస్తా’అని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. చదవండి👉🏼కొల్లాపూర్‌లో హై టెన్షన్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్ -
రంగారెడ్డి: టీఆర్ఎస్ నేతల్లో పీకే ఫీవర్!
అధికార పార్టీ నేతలకు ప్రశాంత్ కిషోర్(పీకే) ఫీవర్ పట్టుకుంది. కొంత మంది సిట్టింగ్‌లపై భూ కబ్జాలు, అక్రమ సంపాదన, అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలకు తోడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. వచ్చే ఎన్నికల్లో వీరి గెలుపు అత్యంత కష్టమని అధినేత కేసీఆర్‌కు నివేదిక అందడమే ఇందుకు కారణం. ఆయా స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలో దించాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సాక్షి, రంగారెడ్డి జిల్లా: టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతతో పలువురు ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు కష్టమేనని తెలుస్తోంది. మరోవైపు ద్వితీయ శ్రేణి లీడర్లు అవకాశం కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారు. సొంత పార్టీలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజికవర్గం, బంధువులు, పార్టీ శ్రేణులు, స్నేహితులు, వ్యాపార భాగస్వాములు ఇలా ఎవరు ఏ చిన్న కార్యక్రమానికి పిలిచినా.. వెంటనే వాలిపోతున్నారు. అంతర్గత కుమ్ములాట చేవెళ్ల నియోజకవర్గంలో ఇప్పటికే పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే రత్నంల మధ్య వర్గపోరు తార స్థాయికి చేరింది. భూ కబ్జాలు, అక్రమ ఆస్తులు, అధికార దుర్వినియోగం, అవినీతిపై వీరిరువురూ బహిరంగ ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ కారణంగా ప్రజల్లో పార్టీపై నమ్మకం సన్నగిల్లింది. కల్వకుర్తిలోనూ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రెండు వర్గాలుగా విడిపోయారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్నారు. ఎల్బీనగర్లోనూ ఇదే తంతు కనిపిస్తోంది. కాంగ్రెస్ తరఫున గెలుపొంది.. అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన రామ్మోహన్‌గౌడ్ మధ్య అంతర్గత ఆధిపత్య పోరు కొనసాగుతోంది. రాజేంద్రనగర్‌లో సిట్టింగ్ స్థానంపై మంత్రి కుమారుడితో పాటు ఎంపీ కన్నేశారు. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఎవరికి వారు పార్టీ శ్రేణులను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. వీరు స్థానికంగా ఉన్న సామాజికవర్గం బంధువులు, ముఖ్య నేతలను తరచూ కలుస్తుండటంతో కేడర్‌లో కొంత గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇరువురూ విఫలమవుతున్నారు. మొత్తానికి తమపై ఎలాంటి రిపోర్ట్ అందిందోనని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. ‘పట్నం’ దాటని జిల్లా సారథి ప్రత్యర్థులు బలపడకుండా చూడటంతో పాటు పార్టీకి నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తన నియోజకవర్గమైన ఇబ్రహీంపట్నం దాటడం లేదు. నియోజకవర్గాల వారీగా పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసి, ముఖ్య నాయకుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలేవీ చేయడం లేదు.గ్రామ,మండల,వార్డు, డివి జన్, మున్సిపాలిటీ,కార్పొరేషన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసినప్పటికీ..జిల్లా కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో నియమించలేదు. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలే ఇందుకు కారణమని తెలుస్తోంది. పార్టీ పదవులను ముట్టుకుంటే తేనెతుట్టెను కదిపినట్లేననే భావనలో నేతలు ఉన్నట్లు సమాచారం. చదవండి: గోరంట్ల వెర్సెస్ ఆదిరెడ్డి.. సిటీ సీట్ హాట్ గురూ..! -
బాధిత చిన్నారులను చూసి కంటతడి పెట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సింధే
నిజాంసాగర్/పిట్లం/పెద్దకొడప్గల్/బాన్సువాడ టౌన్/నిజామాబాద్ అర్బన్: అన్నాసాగర్ తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌సింథే అన్నారు. మంగళవారం ఆయన బాన్సువాడ, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించారు. ప్రమాదంలో తల్లులను కోల్పోయిన చిన్నారులను చూసి ఎమ్మెల్యే తీవ్రంగా చలించి కంటతడి పెట్టారు. చదవండి👉🏾 అయ్యో! ఎంత ఘోరం.. అనారోగ్యంతో బాబు, ఆవేదనతో తల్లి.. ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడం బాధాకరం అన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలందరి గురుకుల పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మృతి చెందిన వారిలో ముగ్గురు రైతు బీమాకు అర్హులని, మిగతావారు టీఆర్ఎస్ సభ్యత్వం కల్గిన్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట సొసైటీ చైర్మన్ హన్ముంత్‌రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మరెడ్డి, సర్పంచ్ రమేష్, నాయకులు లచ్చిరెడ్డి, విజయ్, రహిమతుల్లా, విజయ్, విజయ్ దేయ్, పాల్గొన్నారు. చదవండి👉🏻 చదివింపులు.. రూ. అరకోటి! -
మానవత్వం చాటుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే
అర్వపల్లి (నల్గొండ): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని అటుగా వెళ్తున్న తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ గమనించి అప్పటికప్పుడు కారు, ఆటో ఏర్పాటు చేసి ఆస్పత్రికి పంపించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు.. సూర్యాపేట–జనగామ 365బీ జాతీయ రహదారిపై జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం వద్ద బుధవారం సూర్యాపేట నుంచి అర్వపల్లి వైపు వస్తున్న ఆటో, అర్వపల్లి నుంచి కుంచమర్తికి వెళ్తున్న బైక్ ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై, ఆటోలో ప్రయాణిస్తున్న మేడి వినయ్, ఆకారపు మహేష్, మనుబోతుల నాగరాజు, కల్లెం సంతోష్, పత్తెపురం ముత్తమ్మ గాయపడ్డారు. కాగా మండల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అదే సమయంలో ఆ రోడ్డు గుండా వెళ్తూ క్షతగాత్రులకు చూసి వెంటనే ఆగారు. తన వాహన శ్రేణిలోని కారుతో పాటు మరో ఆటోలో క్షతగాత్రులను సూర్యాపేట జిల్లా జనరల్ ఆస్పత్రికి పంపించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అర్వపల్లి ఎస్సై మహేష్ తెలిపారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ -
దమ్ముంటే రండి.. ప్రతిపక్ష నేతలకు ఎమ్మెల్యే సవాల్
-
ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి త్రుటిలో తప్పిన ప్రమాదం..
సాక్షి, మెదక్: మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. అక్కన్నపేట రైల్వే గేట్ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారును వెనకాల నుంచి వచ్చిన మరో కారు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో పద్మాదేవేందర్ రెడ్డి వాహంలోనే ఉన్నారు. అయితే వాహనం వెనుకనుంచి వచ్చి ఢీకొట్టడంతో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కారు స్వల్పంగా ధ్వంసమైంది. మెదక్ పర్యటన అనంతరం రామాయంపేటలో జరిగే పెళ్లికి హాజరు కావడానికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. చదవండి: రూ.3 వేలకు కొని రూ.12 వేలకు విక్రయం.. 410 కిలోల గంజాయి స్వాధీనం -
జూబ్లీహిల్స్ ప్రమాదం.. కారులో ఎమ్మెల్యే కొడుకు కూడా
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. బాలుడి మృతికి కారణమైన బండిలో.. ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ కూడా ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని అధికారికంగా పోలీసులు ప్రకటించారు. రాహిల్ కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఏసీపీ సుదర్శన్ వివరాలను వెల్లడించారు.. ఫిలింనగర్ నుండి ఇన్ ఆర్బిట్ మాల్ మీదుగా తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. కారులో ఎంఎల్ఏ కొడుకు రాహిల్ ఉన్నాడు. రాహిల్ తో పాటు అఫ్నాన్, నాజ్ మొత్తం ముగ్గురు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు పారిపోయారు. నిందితులు పారిపోయిన రూట్ లో సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ టవర్ ఆధారంగా గుర్తించాం. అన్ని రకాల ఎవిడెన్స్ సేకరించాం. ప్రమాదం జరిగిన టైంలో కారు నడిపింది అఫ్నాన్. రాహిల్ పక్కనే ఉన్నాడు. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా కారు నడిపింది అఫ్నాన్ అని నిర్ధారించుకున్నాం. ప్రమాదానికి నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ ప్రధాన కారణాలని ఏసీపీ వెల్లడించారు. గురువారం రాత్రి దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 వైపు మహేంద్ర థార్ వేగంగా దూసుకొచ్చింది. ఆ టైంలో రోడ్డు దాటుతున్న కాజల్ చౌహాన్, సారికా చౌహాన్, సుష్మా బోస్లేలను ఢీకొట్టింది. ఈ ఘటనలో కాజల్ చౌహాన్ రెండు నెలల బిడ్డ కిందపడి.. మృతి చెందిన విషయం తెలిసిందే. బండిపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ అహ్మద్ పేరుతో స్టిక్కర్ ఉండడంతో కేసు ఆసక్తికరంగా మారింది. కాజల్ చౌహాన్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆపై పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కారు నడిపింది ఎమ్మెల్యే కొడుకేనంటూ ప్రచారం మొదలైంది. అభం శుభం తెలియని రెండు నెలల చిన్నారి మృతి చెందడంతో.. విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఆ కారు తమ బంధువులదని, ఓ ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని, ఆ కారులో తన కొడుకు లేడని ఎమ్మెల్యే షకీల్ వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఆ కారులో తమ బంధువులు మాత్రమే ఉన్నారని ఎమ్మెల్యే శుక్రవారం వివరణ ఇవ్వగా.. అందులో ఆయన కొడుకు కూడా ఉన్నాడంటూ తాజాగా పోలీసులు ప్రకటించడం విశేషం. -
మైక్ కట్ చేయడంతో ఎమ్మెల్యే రసమయి అసంతృప్తి
-
అనూహ్యంగా తెరపైకి పేరు.. గులాబీ బాస్‌గా ‘కల్వకుంట్ల’
సాక్షి, జగిత్యాల: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి అనూహ్యంగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు దక్కింది. అనేకమంది ఆశావహులు కుర్చీ కోసం పోటీపడ్డారు. అయినా, ముఖ్యమంత్రి కేసీఆర్.. విద్యాసాగర్‌రావుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇంతకాలం కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. గత సెప్టెంబర్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత ఎన్నికల సందడి మొదలైంది. నిరాశలో ఆశావహులు.. కీలకమైన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. పార్టీ సంస్థాగత కమిటీలు పూర్తయ్యాక జిల్లా అధ్యక్ష పదవిలో ఎవరిని నియమిస్తారనే అంశాన్ని సీఎం కేసీఆర్‌కు అప్పగిస్తూ అప్పట్లోనే నిర్ణయించారు. అనివార్య కారణాలతో ఆ ప్రక్రియ నిలి చిపోయింది. గ్రామ, మండల, పట్టణ కమిటీల నియామకం పూర్తయ్యింది. ప్రస్తుతం టీఆర్ఎస్ జి ల్లా అధ్యక్షుడిగా విద్యాసాగర్‌రావును ప్రకటిస్తూ సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటన చేశారు. చదవండి: వీరే గులాబీ రథసారథులు.. 33 జిల్లాల అధ్యక్షుల జాబితా ఇదే మంత్రి ఆశీస్సులు ఉన్నవారికే పదవులని.. ధర్మపురి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌తోపాటు ఎమ్మెల్యేలకు అనుకూలమైన నాయకుల ఆశీస్సులు ఉన్నవారికే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందని భావించారు. ఇందుకు భిన్నంగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు అనూహ్యంగా ఆ కుర్చీ దక్కింది. ధర్మపురి జెడ్పీటీసీ బాదినేని రాజేందర్, మల్యాలకు చెందిన మిట్టపల్లి సుదర్శన్, వెల్గటూర్‌కు చెందిన పునుగోటి శ్రీనివాస్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి ఈ పదవిని ఆశించారు. వీరితోపాటు మరికొందరు నాయకులు పోటీపడ్డారు. మంత్రి, ఎమ్మెల్యేలు అందించిన నివేదికలోని పేర్లు, మరికొన్ని పేర్లను అధిష్టానం పరిశీలించింది. ఇంటలిజెన్స్ నివేదిక ఆధారంగా జిల్లా అధ్యక్షుడిగా విద్యాసాగర్‌రావును ఎంపిక చేసినట్లు తెలిసింది. పార్టీ భవనం పూర్తి ధరూర్ క్యాంప్‌లోని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనిని ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈనేపథ్యంలోనే పార్టీ జిల్లా అధ్యక్ష పదవి భర్తీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బయోడేటా పేరు : కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు (ఎమ్మెల్యే, కోరుట్ల) జననం: 10 నవంబర్ 1953 జన్మస్థలం: రాఘవపేట విద్యార్హతలు: బీఏ రాజకీయ ప్రవేశం..:1977లో స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ 1997 అక్టోబర్‌లో టీడీపీలో చేరారు. 1998లో ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2001లో ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీగా గెలుపొందారు. 2003లో ఆర్టీసీ జోనల్ చైర్మన్‌గా నియమితులయ్యారు.2008లో టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. పార్టీని మరింత బలోపేతం చేస్తా జగిత్యాల/కోరుట్ల: ‘ప్రస్తుతం కోరుట్ల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా. ఇటీవల టీటీడీ బో ర్డు సభ్యుడిగా అకాశం కల్పించారు. తెలంగా ణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ సీఎం కేసీఆర్ నాకూ అనూహ్యంగా పదవి ఇచ్చారు. ఇది నాపై మరింత బాధ్యత పెంచింది’ అని కోరుట్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు వెల్లడించారు. ఇంకా ఏమంటున్నారంటే.. సాక్షి : చాలామంది జిల్లా అధ్యక్ష పదవి ఆశించారు. సీఎం కేసీఆర్ మిమ్మల్ని నియమించారు. మీ స్పందన ఏమిటి? విద్యాసాగర్‌రావు : ఉద్యమ నాయకుడిగా, సీనియర్ ఎమ్మెల్యేగా నాకు ఈ పదవి అప్పగించారు. బాధ్యతగా ఈ పదవిని నిర్వర్తిస్తా. సాక్షి : ఆశావహులు నిరాశలో ఉంటారు, వారిని ఎలా కలుపుకుపోతారు? విద్యాసాగర్‌రావు : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అందరినీ సమన్వయపరుస్తూ ముందుకు వెళ్తా. సాక్షి : చాలామంది నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు? విద్యాసాగర్‌రావు : జిల్లామంత్రి సహకారంతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆశావహులకు న్యాయం చేస్తా. సాక్షి : రానున్న ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడిగా ఎలాంటి చర్యలు చేపడతారు? విద్యాసాగర్‌రావు : టీఆర్ఎస్ ఇప్పటికే నంబర్‌వన్ స్థానంలో ఉంది. రానున్న ఎన్నికల్లో అన్ని ఎన్నికల్లో గెలుస్తాం. కార్యకర్తలు, నాయకుల సమన్వయంతో వెళ్లి పార్టీ పటిష్టతకు కృషి చేస్తాం. సాక్షి : ఎమ్మెల్యేగా, టీటీడీ సభ్యుడిగా, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి.. వీటన్నింటికీ ఎలా న్యాయం చేస్తారు? విద్యాసాగర్‌రావు : ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నా. టీటీడీ సభ్యుడిగా భక్తులకు దైవ దర్శనం కల్పిస్తున్నాం. పార్టీ అధ్యక్షుడిగా అందరినీ సమన్వయపరుస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తా. -
రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసులో వనమా రాఘవేంద్ర అరెస్ట్..
-
‘జంతువుల కంటే హీనంగా వనమా రాఘవ ప్రవర్తిస్తున్నాడు’
-
‘జంతువుల కంటే హీనంగా వనమా రాఘవ ప్రవర్తిస్తున్నాడు’
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచ పట్టణ పరిధిలోని పాత పాల్వంచలో కుటుంబం సజీవదహనం చేసుకున్న మండిగ రామకృష్ణ నివాసాన్ని మంగళవారం భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ.. ఈ కేసులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేందర్‌ను కఠినంగా శిక్షించాలని, రాఘవ ఎన్ని దురాగతాలు చేసిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. సంబంధిత వార్త: కుటుంబం ఆత్మహత్య కేసు.. సూసైడ్ నోట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడి పేరు? కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రామకృష్ణ కూతురిని చూసి చలించిపోయామని అన్నారు. జంతువుల కంటే హీనంగా వనమా రాఘవ ప్రవర్తిస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. వనమా రాఘవను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే షూట్ చేయాలని పొదెం వీరయ్య డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తన పదవికి వెంటనే రాజీనామా చేయాలన్నారు. గతంలో ఎస్ఐ జ్యోతి, మలిపెద్ది వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు కారణం వనమా రాఘవ అని అన్నారు. పోలీసుల ఈ కేసు విషయంలో స్పందించాలని డిమాండ్ చేశారు. -
పోలీసులపై నోరు పారేసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
-
శృతిమించిన ఎమ్మెల్యే అనుచరుల వర్గపోరు
సాక్షి, ఖమ్మం: పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అనుచరుల మధ్య విబేధాలు భగ్గుమంటున్నాయి. టీఆర్ఎస్ మండలాల కమిటీల ప్రకటన సందర్భంగా గురువారం కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయకుల మధ్య తోపులాట జరిగిన విషయం విదితమే. ఇక శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్‌తో పాటు జెడ్పీటీసీ సభ్యురాలు అయిన ఆయన సతీమణి బేబీ హాజరయ్యారు. ఇదే సమావేశానికి సొసైటీ చైర్మన్ వాసంశెట్టి వెంకటేశ్వర్లు భార్య, సర్పంచ్ అరుణ కూడా వచ్చారు. చదవండి: 10 రోజులుగా పత్తాలేని పిల్లి.. అన్నం ముట్టని తల్లి.. స్కూల్‌కు వెళ్లని పిల్లలు, దాంతో.. ఇంతలోనే వెంకటేశ్వర్లు తన అనుచరులతో ఎంపీడీఓ కార్యాలయానికి వస్తుండగా, అప్పటికే కార్యాలయంలో మొహరించిన శేఖర్ అనుచరులు కార్యాలయ గేట్ వద్ద వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ పెరిగి పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకున్నా సీఐలు సతీష్, సత్యనారాయణరెడ్డి తమ సిబ్బందితో అక్కడకు చేరుకొని నాయకులు, కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. చదవండి: ‘ఎగబడి కరుస్తున్నాయ్.. కుక్కలే కదా చంపితే ఏమవుతుందిలే’ -
రేవంత్ రెడ్డి ఓ డ్రామా ఆర్టిస్టు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
-
సోనియమ్మకు థాంక్స్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘‘పార్టీలకతీతంగా ఈ రోజు సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి (రూ.1,16,000) చెక్కులు పంపారు. ఎస్.. నేను సీఎంగా ఉన్నా.. మీ సాదకబాధకాల్లో ఉంటానని చెక్కులు పంపించారు. కేసీఆర్ తన, మన తేడా లేకుండా అందరి గురించి ఆలోచన చేసే సందర్భంగా అన్ని పార్టీలు కూడా ఆయన్ను ఆశీర్వదిస్తున్నాయి. రెండోసారి ముఖ్యమంత్రిని చేశాయి. మూడోసారి కూడా ముచ్చటగా ముఖ్యమంత్రి అవుతారనడంలో అతిశయోక్తిలేదు. ఇంత ఆలోచన చేశాక.. కేసీఆర్ గురించి మీరు కూడా ఆలోచించాలిగా.. ఎవరైనా, ఏ భావజాలంవారైన కావచ్చు’’ అని ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ వ్యాఖ్యానించారు. ‘‘నక్సల్స్ అయినా కావచ్చు.. ఎన్టీ రామారావు ఏమన్నారు.. నక్సల్స్ కూడా దేశభక్తులే అన్నారు.. ఆయనకు నమస్కారం చేయాలి. ఎస్.. అది కరెక్ట్ భావజాలం. ఎక్కడైనా అభివృద్ధికి సపోర్ట్ చేయాల్సిందే. అమ్మ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. ఆమెకు థాంక్స్ చెప్పాలి’’ అన్నారు రాములునాయక్. మంగళవారం ఖమ్మం జిల్లాలోని బొక్కలతండాలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. గతంలోనూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. చదవండి: 'ఓటు వేస్తే డబ్బులు ఇస్తాం..భయపడాల్సిందేమీ లేదు' -
చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు జైలుశిక్ష
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ చీఫ్ విప్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు నాంపల్లి స్పెషల్ కోర్టు జైలు శిక్ష విధించింది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా రైల్ రోకోలో పాల్గొన్న కేసుకు సంబంధించి ఆయనపై నేరం రుజువైనట్లు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తెలిపింది. అదే విధంగా ఈ కేసులో... వినయ్ భాస్కర్ సహా 18 మందికి న్యాయస్థానం రూ.3 వేలు జరిమానా విధించింది. అయితే, దాస్యం వినయ్ భాస్కర్ అభ్యర్థన మేరకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం. కాగా టీఆర్ఎస్ తరఫున దాస్యం వినయ్‌భాస్కర్ ప్రస్తుతం పశ్చిమ వరంగల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో కాజీపేట వద్ద రైలురోకో సందర్భంగా ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు బుధవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. -
Nalgonda: మానవత్వం చాటిన ఎమ్మెల్యే కంచర్ల
నల్లగొండ క్రైం : ఆ కుటుంబాన్ని కరోనా ఇంటికే పరిమితం చేసింది. మహమ్మారి బారిన పడి ఆ కుటుంబంలో ఓ వృద్ధురాలు మృతిచెందింది. దీంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కుటుంబానికి నల్లగొండ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అండగా నిలిచారు. మృతిచెందిన వృద్ధురాలికి అంత్యక్రియలు దగ్గరుండి ఆయనే చేయించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నల్లగొండలోని పాతబస్తీ వంటిస్తంభం ప్రాంతానికి చెందిన పూజారి కుటుంబానికి చెందిన కాంచనపల్లి భారతమ్మ (70) కరోనాతో మృతి చెందింది. మనుమరాలు సుమలత, ఆమె భర్త బొల్లోజు దుర్గాప్రసాద్, కుమారుడు మహేశ్‌కు ఈనెల 3వ తేదీన కరోనా పాజిటివ్ రావడంతో ఇంటికే పరిమితమయ్యారు. గురువారం వృద్ధురాలు భారతమ్మను స్థానిక కౌన్సిలర్ ఎడ్ల శ్రీనివాస్ అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా తానుండలేనంటూ భయానికే ఇంటికి తిరిగి వచ్చి శుక్రవారం ఉదయం మరణించింది. కరోనాతో భయంతో ఉన్న కుటుంబానికి అంత్యక్రియలు చేయడం మరింత క్లిష్టంగా మారింది. దీంతో కౌన్సిలర్ శ్రీను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వృద్ధురాలికి హిందూపూర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేయించారు. వృద్ధురాలి కుటుంబ సభ్యులు కరోనాతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాలేమని చెప్పడంతో ఎమ్మెల్యే అంతా తానై అంత్యక్రియలు పూర్తి చేశారు. అవసరమైన మందులు , నిత్యావసర సరుకులను అందిస్తామని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. -
ఆడియో కలకలం.. బోధన్ ఎమ్మెల్యే బూతు పురాణం
సాక్షి, నిజామాబాద్: బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఆడియో టేపు కలకలం రేపుతోంది. ఓ కిరాణా దుకాణం యజమానిని బూతులు తిడుతూ వేధిస్తున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రంజాన్ పండుగకు ఆర్డర్ ఇచ్చిన తోఫా ప్యాకెట్లకు సంబంధించిన డబ్బులు అడిగిన దుకాణం యజమానిపై ఎమ్మెల్యే బూతు పురాణం మొదలెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నాలుగేళ్ల క్రితం బోధన్ ఎమ్మెల్యే షకీల్ రంజాన్ పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన కిరాణా వ్యాపారి అయిన రుద్రంగి మురళీధర్‌కు 6వేల తోఫా ప్యాకెట్లను ఆర్డర్ చేశారు. ఒక్కోటి రూ.600 రూపాయల చొప్పున 6000 వేల ప్యాకెట్లకు ఆర్డర్ ఇవ్వగా.. ఎమ్మెల్యే 36లక్షలు రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో షకీల్ అడ్వాన్స్‌గా 12 లక్షల రూపాయలు చెల్లించి మిగిలిన మొత్తాన్ని తర్వాత ఇస్తానని చెప్పారు. 2019 ఎన్నికల్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా క్యాటరింగ్ నిమిత్తం మురళీధర్‌కు మరో 4 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఇలా ఎమ్మెల్యే షకీల్, కిరాణా వ్యాపారికి 30లక్షల రూపాయల వరకు బాకీ పడ్డారు. తన డబ్బులు ఇప్పించాలని మురళీధర్ రెండేళ్ల నుంచి ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నా ఆయన స్పందించడం లేదు. దీంతో బాధితుడు ఎమ్మెల్యే సన్నిహితుడి వద్ద బాధను చెప్పుకోగా ఆ వ్యక్తి ఎమ్మెల్యే షకీల్‌తో రెండు రోజుల క్రితం ఫోన్లో మాట్లాడించాడు. ఈ నేపథ్యంలోనే మురళీధర్‌పై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నీకు డబ్బులు ఇచ్చేది ఎక్కడిదిరా..’ అంటూ చెప్పుకోలేని రీతిలో దుర్భాషలాతుడూ కాల్ కట్ చేశారు. ఎమ్మెల్యే బూతు పురాణాన్ని సెల్ఫోన్లో రికార్డు చేసిన బాధితుడు మీడియా ఎదుట తన గోడు వెళ్లిబోసుకున్నాడు. బ్యాంక్ రుణం తీసుకుని షాపు పెట్టుకున్నానని, ఎమ్మెల్యే కారణంగా ఈఎంఐలు కట్టలేకపోవడంతో అధికారులు తన షాపును సీజ్ చేశారని మురళీధర్ తెలిపాడు. తనకు న్యాయం చేయాలని బోధన్ ఏసీపీని ఆశ్రయిస్తే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎమ్మెల్యే కారణంగా తన కుటుంబం రోడ్డున పడిందని, తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. చదవండి: వీఆర్ఓపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే తిట్ల పురాణం! ఆడియో టేప్ లీక్: ఖుష్బూ క్షమాపణ