ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లి : వికలాంగుల సంక్షేమానికి తగిన సహకారం అందజేస్తానని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో లయన్స్‌క్లబ్ ఆఫ్ బె ల్లంపల్లి(సింగరేణి) ఆధ్వర్యంలో 32 మంది వికలాంగులకు ట్రై సైకిళ్లు, వీల్‌చైర్ల పంపిణీ జరి గింది. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మా ట్లాడారు. ప్రభుత్వం ఇతర వర్గాల ప్రజలతో స మానంగా వికలాంగుల అభ్యున్నతికి పాటుపడుతోందన్నారు. వికలాంగులకు జీవన భృతి క ల్పించడం కోసం నెలకు రూ.1500 చొప్పున పి ంఛన్‌ను మంజూరు చేస్తోందన్నారు.
విద్య, ఉద్యోగవకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ ఏక కాలంలో రాష్ట్రంలో కొత్తగా 21 జిల్లాలను ప్రారంభించి సాహసోపే త నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ప్ర జలకు పరిపాలన సౌలభ్యం కల్పించడమే ల క్ష్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందన్నారు.
ప్రజలకు సేవ చేయడంలో కలిగే తృప్తి మరెందులోనూ లేదన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పసు ల సునీతారాణి మాట్లాడుతూ సింగరేణి లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రైసైకిళ్లు, వీల్ చైర్‌లను ఉచితంగా అందజేయడం అభినందనీయమన్నారు. వికలాంగుల తోడ్పాటుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. భవిష్యత్‌లోనూ మరిన్నీ కార్యక్రమాలు నిర్వహించాల ని సూచించారు.
అనంతరం వికలాంగులకు ట్రై సైకిళ్లు, వీల్ చైర్‌లను ప్రదానం చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సత్యనారాయణ, ఎంపీపీ సు భాష్‌రావు, డీఎఫ్‌వో తిరుమల్‌రావు, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు రాములు, బి.సుదర్శన్, ఎస్.కె.యూసుఫ్, రాజులాల్‌యాదవ్, టి.వంశీకృష్ణారె డ్డి, ఎలిగేటి శ్రీనివాస్, సి.హెచ్.మధు, కో ఆప్షన్ సభ్యుడు నిజాముద్దీన్, సింగరేణి లయన్స్‌క్లబ్ నిర్వాహకులు నల్మాసు సంతోష్, చక్రపాణి, స త్యనారాయణ, సర్పంచ్‌లు అర్కాల హేమలత, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
వికలాంగుల సంక్షేమానికి కృషి
Published Sat, Oct 15 2016 12:32 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM
Advertisement
Advertisement