Durgam Chennaiah
-
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మహిళ తీవ్ర ఆరోపణలు
-
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మహిళ తీవ్ర ఆరోపణలు
సాక్షి, మంచిర్యాల: బీఆర్ఎస్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యేపై మహిళా తీవ్ర ఆరోపణలు చేశారు. తమను నమ్మించి మోసం చేశారంటూ అరిజిన్ పాల సంస్థ భాగస్వామి శైలజ ఆరోపించారు. తమ డబ్బులు తీసుకొని, తిరిగి తమ మీదనే కేసులు బనాయించి రిమాండ్‌కు పంపించాడని తెలిపారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆడియోలో.. ‘దుర్గం చిన్నయ్య అనే వ్యక్తిని తొలిసారి మా బ్రాంచ్ ఓపెనింగ్ రోజు కలిశాము. మీ కంపెనీలో మాకు తెలిసన వాళ్లకు షేర్స్ ఇవ్వండి.. మీకు ఫుల్ సపోర్ఠ్ చేస్తాను, మీకు ఏం కావాలన్నా చేసి పెడతాను అని చెప్పారు. మేము దానికి ఓకే చెప్పాము. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తరుచూ బిజినెస్ పనుల కోసం మాట్లాడేవాళ్లం. కొన్నిసార్లు మాతో పాటు మా దగ్గర పనిచేసే ఒక అమ్మాయి కూడా వచ్చేది. ఒకరోజు ఎమ్మెల్యే కాల్ చేసి మీతోపాటు ఒక అమ్మాయి వచ్చింది కదా.. ఆమెను ఒకరోజుకు నాతో పంపిస్తారా అని అడిగారు. ఆ అమ్మాయి అలాంటిది కాదని చెప్పాం. కానీ ఎవరో ఒక అమ్మాయిని తప్పకుండా తన దగ్గరికి పంపాలని ఎమ్మెల్యే అడిగారు. లేకపోతే మీ ఇష్టం అంటూ బెదిరించారు. దీంతో చేసేదేం లేక తెలిసిన వాళ్ల ద్వారా బ్రోకర్ల నెంబర్లు ఇస్తే మేము డైరెక్ట్‌గా ఆయనకు అప్పజెప్పాం. వాళ్లతో ఆయన టచ్‌లో ఉన్నారు. తరువాత దళితబంధు సమావేశమని మళ్లీ ఒకసారి మమ్మల్ని పిలిపించి మందు ఏర్పాటు చేశారు. నాతో బలవంతంగా తాగించేందుకు ప్రయత్నించాడు. నన్ను లైంగిక వేధింపులకు గురిచేశాడు. నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను. మా దగ్గర డబ్బులు తీసుకొని తన పర్సనల్ పనులకు వాడుకున్నాడు. చెప్పింది చేయకుంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాడు. చాలా మోసం చేశాడు. మళ్లీ దళిత బంధు గురించే మట్లాడాలని ఒత్తిడి చేసి బెల్లంపల్లిలోని ఆయన ఇంటికి పిలిపించాడు. తరువాత ఆయన అక్కడున్న పోలీసులకు మమ్మల్ని అప్పగించి 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచారు. మేం ఏం తప్పులు చేయకున్నా తప్పుడు కేసులు పెట్టి పోలీసులు టార్చర్ చేశారు. మాకు సంబంధం లేదు అని చెబితే కూడా మీరు ఏమున్నా ఎమ్మెల్యేతో మాట్లాడుకోండి అని చెప్పారు. ఆయన చెప్పిన దానికి ఒప్పుకోవడం లేదని నన్ను రిమాండ్‌కు పంపించారు. రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రెండు తప్పుడు కేసులు పెట్టి ఇరికించారు. ఏ కేసులతో నాకు ఏలాంటి సంబంధం లేదు. తప్పుడు కేసులకు సంబంధించి మా దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయి. వీటిని చూపిస్తుంటే కూడా పోలీసులు.. మాకు ఇవ్వన్నీ సంబంధం లేదన్నట్లు మాట్లాడుతున్నారు. దుర్గం చిన్నయ్య, వాళ్ల మనుషుల నుంచి నాకు ప్రాణహాని ఉంది. నాకు మీడియా సపోర్ట్ కావాలి. నన్ను ఈ సమస్య నుంచి బయటకు తీసుకు రావాలి’ అని శైలజ విజ్ఞప్తి చేశారు. -
మంచిర్యాల: టోల్‌ప్లాజా ఘటనపై ఎమ్మెల్యే చిన్నయ్య కీలక వ్యాఖ్యలు
సాక్షి, మంచిర్యాల: మందమర్రి టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేసినట్లు వస్తున్న వార్తలపై స్పందించారు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. దాడి వార్తలను ఖండించారు. జాతీయ రహదారి పనులు పూర్తి కాకుండానే టోల్ వసూలు చేస్తున్నారని, అంబులెన్స్‌ను సైతం వదలటం లేదన్నారు. ఈవిషయంపైనే మేనేజర్‌తో మాట్లాడేందుకు వెళ్లినట్లు స్పష్టం చేశారు. ‘నేను దాడి చేసినట్లుగా టీవీలలో వార్తలు వస్తున్నాయి. జాతీయ రహదారి పనులు పూర్తి కాలేదు. సోమగూడేం ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయలేదు. కాని టోల్ ప్లాజాలో నూటయాభై టోల్ వసూలు చేస్తున్నారు. టోల్ ప్లాజా నుండి అంబులెన్స్ కూడ వదలడం లేదు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాలపై మేనేజర్‌తో మాట్లాడానికి వెళ్లాను. మేనేజర్ నుంచి ఎటువంటి స్పందింన లేదు. అంతే కానీ నేను దాడి చేయలేదు. కనీసం టోల్ ప్లాజా ప్రారంభానికి కూడా నన్ను పిలువలేదు’ అని దాడి వార్తలను ఖండించారు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఇదీ చదవండి: వీడియో: మందమర్రి టోల్‌ప్లాజా వద్ద ఎమ్మెల్యే చిన్నయ్య హల్చల్.. సిబ్బందిపై దాడి -
వికలాంగుల సంక్షేమానికి కృషి
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెల్లంపల్లి : వికలాంగుల సంక్షేమానికి తగిన సహకారం అందజేస్తానని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో లయన్స్‌క్లబ్ ఆఫ్ బె ల్లంపల్లి(సింగరేణి) ఆధ్వర్యంలో 32 మంది వికలాంగులకు ట్రై సైకిళ్లు, వీల్చైర్ల పంపిణీ జరి గింది. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మా ట్లాడారు. ప్రభుత్వం ఇతర వర్గాల ప్రజలతో స మానంగా వికలాంగుల అభ్యున్నతికి పాటుపడుతోందన్నారు. వికలాంగులకు జీవన భృతి క ల్పించడం కోసం నెలకు రూ.1500 చొప్పున పి ంఛన్ను మంజూరు చేస్తోందన్నారు. విద్య, ఉద్యోగవకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ ఏక కాలంలో రాష్ట్రంలో కొత్తగా 21 జిల్లాలను ప్రారంభించి సాహసోపే త నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ప్ర జలకు పరిపాలన సౌలభ్యం కల్పించడమే ల క్ష్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందన్నారు. ప్రజలకు సేవ చేయడంలో కలిగే తృప్తి మరెందులోనూ లేదన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ పసు ల సునీతారాణి మాట్లాడుతూ సింగరేణి లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రైసైకిళ్లు, వీల్ చైర్లను ఉచితంగా అందజేయడం అభినందనీయమన్నారు. వికలాంగుల తోడ్పాటుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. భవిష్యత్‌లోనూ మరిన్నీ కార్యక్రమాలు నిర్వహించాల ని సూచించారు. అనంతరం వికలాంగులకు ట్రై సైకిళ్లు, వీల్ చైర్లను ప్రదానం చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సత్యనారాయణ, ఎంపీపీ సు భాష్రావు, డీఎఫ్‌వో తిరుమల్‌రావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు రాములు, బి.సుదర్శన్, ఎస్.కె.యూసుఫ్, రాజులాల్‌యాదవ్, టి.వంశీకృష్ణారె డ్డి, ఎలిగేటి శ్రీనివాస్, సి.హెచ్.మధు, కో ఆప్షన్ సభ్యుడు నిజాముద్దీన్, సింగరేణి లయన్స్‌క్లబ్ నిర్వాహకులు నల్మాసు సంతోష్, చక్రపాణి, స త్యనారాయణ, సర్పంచ్‌లు అర్కాల హేమలత, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.