Physically handicapped people
-
మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం వైఎస్ జగన్
-
తోటివారే! తక్కువ చేయకండి!
మనం పెట్టుకున్న నిబంధనలకైనా మానవీయ కోణం తప్పనిసరి. వినియోగదారులను దేవుళ్ళుగా భావించాల్సిన సేవల రంగం సహా అనేక చోట్ల అది మరీ ముఖ్యం. తద్విరుద్ధంగా రాంచీ విమానాశ్రయంలో ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఒక దివ్యాంగ టీనేజ్ కుర్రాడి విషయంలో ఇటీవల వ్యవహరించిన తీరు నివ్వెరపరిచింది. ‘తోటి ప్రయాణికుల భద్రతకు భంగకరం’ అనే సాకుతో, హైదరాబాద్‌కు రావాల్సిన ఆ వీల్‌ఛెయిర్ కుర్రాడినీ, అతని తల్లి తండ్రులనూ విమానం ఎక్కనివ్వకుండా ఇండిగో సిబ్బంది చూపిన అమానుషత్వం తీవ్ర విమర్శల పాలైంది. మన దేశంలో దివ్యాంగుల పట్ల సరైన రీతిలో సున్నితంగా స్పందిస్తున్నామా? వారినీ సమాజంలో ఓ భాగంగా కలుపుకొని పోతున్నామా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. తోటి ప్రయాణికులు సైతం అభ్యర్థిస్తున్నప్పటికీ, అవసరమైతే తామున్నామని ప్రయాణికుల్లోని డాక్టర్లు చెప్పినప్పటికీ ఆ ప్రైవేట్ విమానయాన సిబ్బంది పెడచెవినపెట్టడం పరాకాష్ఠ. సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అయిన ఆ సంఘటనపై చివరకు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించి చర్యలకు ఆదేశించాల్సి వచ్చింది. ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్’ (డీజీసీఏ) సమగ్ర విచారణకు దిగింది. సదరు ప్రైవేట్ విమాన సంస్థ అధిపతులు ‘ఆ క్లిష్ట పరిస్థితుల్లో తమది మంచి నిర్ణయమే’ అని సన్నాయి నొక్కులు నొక్కుతూనే, క్షమాపణ చెప్పారు. ఆ దివ్యాంగుడికి ఎలక్ట్రిక్ వీల్‌ఛైర్ ఇస్తామన్నారు. కొంతకాలంగా ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిసారీ మీడియాలో వివాదం రేగడం, పౌర విమానయాన శాఖ రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు చేపట్టడం మామూలైంది. మానవీయత పరిమళించాల్సిన ఆధునిక సమాజంలో ఇవాళ్టికీ ఇలాంటి దుర్విచక్షణ కొనసాగడం విచారకరం. నిజానికి, దివ్యాంగుల పట్ల డీజీసీఏ నియమావళి కూడా ఇక్ష్వాకుల కాలం నాటిది. మారిన కాలంతో పాటు కొత్తగా వచ్చిన సమస్యలు, సవాళ్ళకు తగ్గట్టుగా దాన్ని మార్చుకోవాల్సి ఉంది. ప్రవర్తన అదుపులో లేని ప్రయాణికుల గురించి నివేదించమనీ, ప్రమాదకరమైన అలాంటి వ్యక్తులను విమానంలోకి ఎక్కనివ్వవద్దనీ నియమావళిలో ఉండవచ్చు గాక. దాన్ని అడ్డం పెట్టుకొని, అభం శుభం తెలియని దివ్యాంగుడి ప్రయాణం నిరాకరించడం మానవత్వం అనిపించుకోదు. గడచిన కొన్ని దశాబ్దాలుగా దేశీయ, విదేశీ విమానాశ్రయాలు, అలాగే ప్రైవేట్ విమానయాన సంస్థలు బాగా పెరిగాయి. ఫలితంగా, ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు విమానయానం పలువురికి అనువుగా మారింది. అందుబాటులోకి వచ్చింది. అలాగే, ప్రత్యేక అవసరాలుండే దివ్యాంగుల విభాగంలోని ప్రయాణికుల సంఖ్యా పెరిగింది. కానీ, వారు సౌకర్యవంతంగా ప్రయాణించేలా తగిన వసతులు కల్పించడం, సేవలు అందించడం కరవైంది. విమానయాన టికెట్లు బుక్ చేసుకుంటున్న ప్పుడు దివ్యాంగులకు లభించే సేవలపై స్పష్టత పూజ్యం. విమానాశ్రయాల్లో, చెక్–ఇన్ సందర్భాల్లో, బోర్డింగ్ నియమాల్లో, విమానాల్లో ఆతిథ్యంలో వారి ప్రత్యేక అవసరాలకు తగ్గట్టు వసతులూ అంతంత మాత్రం. రైళ్ళలోనూ, ప్రభుత్వ రవాణా సదుపాయాల్లోనూ ఇదే పరిస్థితి. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో 2.68 కోట్ల మంది దివ్యాంగులున్నారు. వారిలో 20 శాతం మంది కదలడంలో, ప్రయాణంలో సమస్యలున్నవారే. ప్రయాణ సౌకర్యాలు, బహిరంగ ప్రదేశాలను వారికి కూడా సౌకర్యంగా ఉండేలా మార్చాలని 2015లోనే ప్రభుత్వం ‘యాక్సెసిబుల్ ఇండియా’ పేరిట కార్యక్రమం చేపట్టింది. కానీ, ఆ లక్ష్యాలను ఇప్పటికీ అందుకోలేదన్నది చేదు నిజం. పౌర భవనాలన్నిటినీ దివ్యాంగులకు అనుకూలంగా ఉండేలా చూడాలని 2017లోనే సుప్రీమ్ కోర్ట్ ఆదేశించింది. ఇవాళ్టికీ అది అమలైంది చాలా కొద్దిగానే! అందుకే, మన తోటివారైన దివ్యాంగుల పట్ల కనీసపు అక్కర, వారి సమస్యలను అర్థం చేసుకొనే సహృదయం పని ప్రదేశాల్లో, ప్రయాణ వసతుల్లో లోపిస్తోందనడానికి తాజా ఇండిగో ఘటన ఓ మచ్చుతునక మాత్రమే. విమానాల్లోనే కాదు... రైళ్ళు, బస్సులు, వినోదశాలలు, చివరకు విద్యాల యాలు, కార్యాలయాల్లో కూడా వారి శారీరక, మానసిక ప్రత్యేకతల రీత్యా ఏర్పాట్లు చేయడం కీలకం కాదా? ఆ మాత్రం చేయడం కనీస మానవ ధర్మం, వ్యవస్థపై ఉన్న బాధ్యత కావా? ఆ మధ్య సినీ నటి – దివ్యాంగ నర్తకి సుధా చంద్రన్ కృత్రిమ పాదం పట్ల విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది నుంచి అవమానం ఎదురైంది. నెల రోజుల క్రితమే రెండు బ్యాటరీలతో నడిచేదే తప్ప నాలుగు బ్యాటరీలతో నడిచే వీల్‌ఛైర్‌ను అనుమతించబోమంటూ ఓ దివ్యాంగ ప్రొఫెసర్‌ను ఎయిర్‌పోర్ట్‌లో నిర్దాక్షిణ్యంగా ఆపేశారు. ఇలాంటి ఉదాహరణలెన్నో. ఇలాంటి ఘటనలు పునరా వృతం కాకుండా చర్యలు చేపట్టడం ప్రభుత్వ బాధ్యత. తప్పు చేసిన సంస్థలకు భారీ జరిమానాలు విధించాలి. అయితే, ప్రభుత్వ విధానాలు, ఆదేశాలతో పాటు సామాజిక ఆలోచనలో మార్పు మరీ కీలకం. బౌద్ధిక, గ్రహణ సామర్థ్యాల విషయంలో కొందరిలో ఉండే ఇబ్బందుల పట్ల ప్రభుత్వం, సంస్థలు సహానుభూతితో వ్యవహరించే సంస్కారం కావాలి. దివ్యాంగులూ మన లాంటి మనుషులే నన్న భావంతో, మానవీయంగా వ్యవహరించేలా చైతన్యం తేవాలి. అన్నిటికన్నా ముందుగా... ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది మనమే! విమానాల్లో పక్షులు, జంతువులకు కూడా తగిన చోటిచ్చే మనం, మన వ్యవస్థ మన సోదర దివ్యాంగుల్ని లోకువగా చూడడమేంటి? -
దివ్యాంగులపై చిన్నచూపు
సాక్షి, భూపాలపల్లి రూరల్: వికలాంగుల అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది డిసెంబర్ 3న జిల్లా స్థాయి క్రీడలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది నవంబర్ 23, 24 తేదీల్లో నిర్వహించే క్రీడలను సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని, దివ్యాంగులపై చిన్నచూపుగా భావిస్తున్నామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఇండియా(ఎంపీఆర్డీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాసాని నర్సింగారావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్ క్రీడా మైదానంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత నెల చివరి వారంలో జేసీ స్వర్ణలత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో క్రీడలకు సంబంధించిన తేదీలను నిర్ణయించినా జిల్లా సంక్షేమశాఖ అధికారి అందుబాటులో లేడన్నారు. ఫోన్లో మాట్లాడితే క్రీడలు వాయిదా పడ్డాయని చెప్పారని అన్నారు. పోటీల కోసం జిల్లా నలుమూలల నుంచి వ్యయ ప్రయాసాలకోర్చి వచ్చిన 50 మంది క్రీడాకారులు అధికారి తీరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి కుమారస్వామి, వంగనర్సయ్య, నీలంబరంలు పాల్గొన్నారు. ప్రకటించిన తేదీల ప్రకారమే ఏర్పాట్లు ప్రకటించిన తేదీల ప్రకారమే ఈనెల 23 ఉదయమే క్రీడలకు సంబంధించి ఏర్పాట్లు చేశాం. ఉదయం 11:30 గంటల వరకు సైతం కొద్దిమంది క్రీడాకారులు మాత్రమే వచ్చారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా చాలా మంది హాజరుకాలేదు. ఈ విషయాన్ని జేసీకి చెప్పగా మిగతావారు నిరుత్పాహ పడకుండా ఉండేదుకు జేసీ ఆదేశాల మేరకు క్రీడలను వాయిదా వేశాం. త్వరతోనే తిరిగి తేదీలను ప్రకటిస్తాం. అందరూ హాజరయ్యేలా చర్యలు తీసుకుంటాం. - చిన్నయ్య, జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి -
మేమున్నాం.. మీరు కూడా ఓటు వేయడానికి..
సాక్షి, జనగామ: అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారా... కళ్లు కనిపించడం లేదా... వినికిడి సమస్య ఉందా... నో టెన్షన్.. మేము ఉన్నాం.. మీరు కూడా ఓటు వేయడానికి.. అని ఎన్నికల సంఘం ముందుఉంది. ఈ సారి ఎన్నికల కమిషన్ దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ర్యాంపులు ఏర్పాటుచేసింది. ఉచితంగా రవాణా సౌకర్యం ఏర్పాటుచేసింది. బ్రెయిలీ లిపి ఈవీఎంలను సైతం వినియోగిస్తున్నారు. దీంతో దివ్యాంగులు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. వరంగల్ అర్బన్ జిల్లాలో 2వేల 447 మంది, వరంగల్ రూరల్‌జిల్లాలో 9వేల 120 మంది, జనగామ జిల్లాలో 13వేల 766 మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2వేల 161 మంది, మహబూబాబాద్ జిల్లాలో 8వేల 981 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి వరంగల్జిల్లాలో మొత్తంగా 36వేల 475 మంది ఓటర్లు ఉన్నారు. వీరు 100 శాతం ఓటుహక్కు వినియోగించుకోవడం కోసం ఎలక్షన్ కమిషన్ సకల ఏర్పాట్లు చేస్తుంది. ర్యాంపులు, వీల్చైర్లు ఏర్పాటు జనగామ జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజక వర్గాల పరిధిలో 828 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దివ్యాంగుల కోసం అంతే మొత్తంలో ర్యాంపులను ఏర్పాటుచేశారు. ఇందులో ఆరు పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు లేరని తేలింది. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని పెండ్యాల పోలింగ్ బూత్‌ను మోడల్‌గా తీర్చి దిద్దుతున్నారు. మూడు నియోజక వర్గాల పరిధిలో 13,766 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక్కో వీల్ చైర్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. దివ్యాంగులను వీల్ చైర్లో కూర్చో బెట్టుకుని ఓటు వేయించేందుకు సహాయకులను ఏర్పాటు చేస్తున్నారు. దివ్యాంగులు, గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు వరుసలో నిలబడి ఓటు వేయడం వంటివి లేకుండా డైరెక్టుగా తనకు కేటాయించిన బూత్‌లోకి వెళ్లి ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 572 బూతులు ఉన్నా ఉన్నాయి. 205 పోలింగ్ బూత్‌లలో దివ్యాంగులు ఉన్నట్లు గుర్తించి ర్యాంపుల నిర్మాణం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 2వేల 447 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. 690 పోలింగ్ బూతులు ఉండగా అన్ని బూతుల్లోనూ ర్యాంపులు ఏర్పాటుచేశారు. 200 వీల్చైర్లు ఏర్పాటు చేశారు. వరంగల్ రూరల్‌జిల్లాలో 285 వీల్చైర్లు ఏర్పాటు చేశారు. రవాణా సౌకర్యాలు జనగామ జిల్లాలో రవాణా సౌకర్యం ద్వారా పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చే వారు 8వేల 320 మంది ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు అవసరమయ్యే వసతి సౌకర్యాలపై ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించింది. గత ఎన్నికల్లో దివ్యాంగులకు ఎలాంటి సహాయక చర్యలు లేకపోవడంతో పూర్తిస్థాయిలో ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మానుకోట జిల్లాల్లోనూ వికలాంగులకు రవాణా ఏర్పాట్లు చేశారు. ఆ శాఖకు బాధ్యతల అప్పగింత దివ్యాంగులకు ఏర్పాట్లు చేసే బాధ్యతను జిల్లా మాతా, శిశు, వికలాంగుల, వయో వృద్ధుల శాఖకు ఎన్నికల కమిషన్ అప్పగించింది. మొట్టమొదటిసారిగా ఓటు హక్కు వినియోగంలో దివ్యాంగులకు ప్రత్యేక గుర్తింపు లభించింది. దివ్యాంగులు ఉన్న ప్రాంతాల నుంచి పోలింగ్ కేంద్రాల వరకు ఉచితంగా రవాణా సౌకర్యాలను కల్పించింది. అడుగు తీసి అడుగు వేయలేని వారిని ఇంటి నుంచి పోలింగ్ వరకు ఆ తర్వాత తిరిగి తీసుకెళ్లే బాధ్యత పూర్తిగా వీరిపైనే ఉంటుంది. అందుబాటులో బ్రెయిలీ లిపి అంధులు, వినికిడి లోపం కలిగిన ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు వారికి ఓటింగ్‌కు సంబంధించి వివరాలు తెలిపేందుకు బ్రెయిలీ లిపిని అందుబాటులో ఉంచుతున్నారు. సైగలు.. నోటి మాట ద్వారా సమాధానాలు చెప్పనున్నారు. బ్రెయిలీ లిపిలో శిక్షణ పొందిన నిపుణులను అందుబాటులో ఉంచనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలు వీల్చైర్లు త్వరగా అందుబాటులో ఉండేందుకు వాటి కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, వృద్ధులకు క్యూ లేదు ఇబ్బందిగా ఉన్న వారికి వీల్‌చైర్‌లో సహాయక చర్యలు ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా టెంట్లు వేయడం.. తాగునీరు, టాయిలెట్ సదుపాయాలతో పాటు అత్యవసర సేవలు పోలింగ్ కేంద్రానికి వచ్చిన అనంతరం ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచడం. జనగామ జిల్లాలో దివ్యాంగులు శారీరక దివ్యాంగులు 9507 అంధులు 2233 బధిరులు 1073 మానసిక మాంధ్యం 1148 మానసిక వికలాంగులు 401 మొత్తం 13,766 జయశంకర్ భూపాలపల్లి అంధులు 564 దివ్యాంగులు 1078 మూగ, చెవిటి 519 మొత్తం 2161 జనగామ జిల్లాలో ఓటర్ల వివరాలు నియోజకవర్గం పోలింగ్ బూత్‌లు ఓటర్లు నవడలేని ఓటర్లు వినికిడి లోపం ఓటర్లు జనగామ 270 4693 2841 04 స్టేషన్‌ఘన్‌పూర్ 279 4526 3202 04 పాలకుర్తి 279 4547 2277 03 మొత్తం 828 13,766 8320 11 -
దివ్యాంగుల కోసం ఫోన్లు!!
న్యూఢిల్లీ: సాంకేతికత ప్రయోజనాలను దేశ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ భావిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కేంద్ర ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది. కేంద్రం వీటికి ఆమోదం తెలిపితే దివ్యాంగులు సహా సమాజంలోని ప్రతి ఒక్కరికి సాంకేతికత ఫలాలు అందుతాయి.కాగా టెలికం, బ్రాండ్‌బాండ్ సేవల వినియోగంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించేందుకు ట్రాయ్ గతేడాది డిసెంబర్ నుంచే పరిశ్రమతో చర్చలు ప్రారంభించింది. సిఫార్సులను పరిశీలిస్తే.. ♦ ఐదు లేదా అంతకన్నా ఎక్కువ మోడళ్లను తయారుచేసే మొబైల్ హ్యాండ్సెట్స్ కంపెనీలన్నీ 2020 నాటికి దివ్యాంగులు సైతం సులువుగా వాడగలిగేలా కనీసం ఒక్క హ్యాండ్సెట్నైనా మార్కెట్లోకి తీసుకురావాలి. ♦ ఇదే సయమంలో టీవీ సెట్–టాప్ బాక్స్ తయారీదారులు లేదా దిగుమతిదారులు కూడా యాక్సెసబిలిటీ ప్రమాణాలకు అనువుగా కనీసం ఒక మోడల్‌నైనా కలిగి ఉండాలి. ♦ 2023 నుంచి భారత్‌లో తయారయ్యే లేదా దిగుమతయ్యే మొబైల్ ఫోన్లు, ల్యాండ్‌లైన్ హ్యాండ్సెట్స్ అన్నీ యాక్సెసబుల్ ఫార్మాట్లోనే ఉండాలి. సెట్–టాప్ బాక్స్‌లకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. ♦ టెలికం, బ్రాండ్‌కాస్ట్ ఆపరేటర్లు వారి కాల్ సెంటర్లలో దివ్యాంగుల కాల్స్‌ను హ్యాండిల్ చేసేందుకు ప్రత్యేకమైన డెస్క్‌లను కలిగి ఉండాలి. ♦ ప్రభుత్వ వెబ్సైట్లన్నీ యాక్సెసబిలిటీ ప్రమాణాలకు అనువుగా మారాలి. ♦ ఇంటర్నేషనల్ టెలీ కమ్యూనికేషన్ యూనియన్ రూపొందించిన ప్రమాణాలన్నీ భారత్‌లో కూడా అందుబాటులోకి రావాలి. ♦ ప్రముఖ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లోని యాక్సెసబిలిటీ ఫీచర్లను తొలగించకుండా హ్యాండ్సెట్స్ తయారీదారులను ప్రభుత్వం ఆదేశించాలి. ♦ టెలికం ఆపరేటర్లు దివ్యాంగులను ప్రత్యేక కేటగిరి కింద గుర్తించి, కస్టమర్ అక్వైజిషన్ ఫామ్‌లలో అవసరమైన మార్పులు తీసుకురావాలి. ♦ మొబైల్ హ్యాండ్‌సెట్స్‌లో కీలకమైన వాటికోసం ప్రి–రికార్డెడ్ వాయిస్ కమాండ్ సౌకర్యం, మెరుగైన స్థిరత్వం కోసం గ్రిప్స్, వాయిస్ డైలింగ్/థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా యూజర్ ఇంటర్ఫేస్తో ఆడియో లేదా వాయిస్ ఇన్టరాక్షన్ వంటివి ఉండాలి. ల్యాండ్‌లైన్ విషయానికి వస్తే.. పెద్ద బటన్ ఉన్న ఫోన్స్, వాయిస్ కంట్రోల్డ్ కాలింగ్, ప్రోగ్రామబుల్ డైలర్, బ్రెయిలీ రీడర్‌తో కనెక్ట్ వంటివి సౌకర్యాలుండాలి. -
మనసు..చెదిరిన పందిరి..బతుకు..చిరిగిన విస్తరి
పిచ్చివాళ్ల దుర్భర జీవనం కరుణ చూపని సమాజం దారీతెన్నూ లేని జీవితం..దయనీయ రీతిలో అంతం ఒకరు.. తమలో తాము మాటాడుకుంటూ... ఎందుకో నవ్వుతూ.. అంతలోనే ఏడుస్తూ.. అలా నడుస్తూ పోతూ ఉంటారు. ఒకరు ఎవరినో శపిస్తూ.. అర్థంపర్థం లేని భాష మాట్లాడుతూ.. ఉన్మాదానికి మారుపేరులా ఉంటారు. ఇంకొకరు మాటాపలుకూ లేకుండా రోడ్డు పక్క రాయిలా పడి ఉంటారు. కొందరు అసహ్యంగా, అసభ్యంగా ప్రవరిస్తారు. కొందరు జనం మీద దాడులు చేస్తారు. ఈ దీనులు.. దురదృష్టవంతులు ఎక్కడ పడితే అక్కడ కనిపించే పిచ్చివాళ్లు. మనసు చెదిరిపోయి.. సమాజంతో బంధం చెరిగిపోయి.. తెగిన గాలిపటాల్లా.. గాలికి ఎగిరే పండుటాకుల్లా ఎక్కడో మొదలై.. ఎక్కడో కథ ముగిసిపోయే నిర్భాగ్యులు.. అభాగ్యులు.. మనలో ఎవరికీ ఏమీ కాని పిచ్చివాళ్లు. పెదవాల్తేరు (విశాఖతూర్పు): ఎక్కడ పుట్టారో తెలియదు... ఎక్కడ పెరిగారో తెలియదు... ఇక్కడికి ఎలా వచ్చారో అంతకన్నా తెలియదు.. ఇక్కడ ఎన్నాళ్లుంటారో.. మళ్లీ ఎక్కడికి వెళ్తారో.. అసలు ఎక్కడికైనా వెళ్తారో లేదో కూడా తెలియదు. వీళ్ల గురించి ఏమీ తెలియక.. వాళ్లకూ ఏమీ తెలియక.. సమాజానికి వెలియై.. బతుకే బలియై.. జీవితమే పుస్తకంలో పేజీలు తారుమారై.. అక్షరాలు చెల్లాచెదురై.. మనసు ఆనవాళ్లు మాయమైపోయిన నిర్భాగ్యులు.. ఎక్కడ పడితే అక్కడ తారసపడే పిచ్చివాళ్లు. దేనిపైనా ధ్యాస లేక.. తమకేమవుతోందో తెలియక, ఇది తమ తనువనే స్పృహ కూడా కానరాక.. రకరకాలుగా.. వింతగా, విభిన్నంగా ప్రవర్తిస్తూ.. సమాజానికి దూరమైపోయిన దీనులు వీళ్లు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లు.. ఇక్కడి వాళ్లు ఎందరో మనసు చెదిరిన మందభాగ్యులు నగరంలో అనేక చోట్ల కనిపిస్తారు. బస్టాపులు, రైల్వే స్టేషన్ పరిసరాలు, మారుమూల ప్రాంతాలు, ఫుట్‌పాత్‌లు.. ఎక్కడైనా వీళ్లు కనిపిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలనుంచి విశాఖకు వచ్చే రైళ్లలో పిచ్చివాళ్లు వస్తున్నారు. నగరంలోని రైల్వేస్టేషన్, జ్ఞానాపురం, అక్కయ్యపాలెం, డాబాగార్డెన్స్, చినవాల్తేరు, పెదవాల్తేరు, వన్‌టౌన్, కేజీహెచ్, రామకృష్ణాబీచ్ తదితర ప్రాంతాలలో వీళ్లు బతుకు ఈడుస్తారు. చివరికి ఎక్కడో జీవన పయనాన్ని ముగిస్తారు. అనాథ మృతదేహంగా ఇక్కడి మట్టిలో కలిసిపోతారు. బిచ్చగాళ్లలా యాచించడం కూడా తెలియక ఎవరైనా జాలిపడి ఏదైనా ఇస్తే తిని, లేదంటే అలా గాలికెగిరే ఎండుటాకులా ఊరంతా సంచరిస్తూ ఉంటారు. సమాజంలో ఉన్న అనేక అపోహలు, తప్పుడు అభిప్రాయాల కారణంగా వీరికి సాయం చేయడానికి కూడా ఎవరూ ముందుకురారు. అసలు వీరి గురించి పట్టించుకోవడానికి కూడా ఇచ్చగించరు. నగరంలోని పలువురు దాతలు తరచూ ఫుట్‌పాత్‌లు, బస్టాపులలో గల పిచ్చివాళ్లకు భోజనాలు అందజేస్తూ తమ దాతృత్వం చాటుకుంటున్నారు. కాని, ఆస్పత్రికి తరలించే విషయంలో మాత్రం అంతటా నిర్లక్ష్యం కనిపిస్తోంది. అసలేం చేయాలి? ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోడ్లపై ఎవరైనా పిచ్చివాళ్లు కనిపిస్తే ట్రాఫిక్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాలి. న్యాయమూర్తి ఆదేశాల మేరకు వారిని ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో చేర్పించాలి. అక్కడ వైద్యులు చికిత్స చేస్తారు. అనంతరం వారి సంబంధీకుల చిరునామా తెలిస్తే సమాచారం చేరవేస్తారు. లేదంటే అనాథాశ్రమాలకు తరలిస్తారు. స్వచ్ఛంద సంస్థలు సేవకే పరిమితం నగరంలోని పలు స్వచ్ఛంద సంస్థలు తరచూ రోడ్లపై తిరిగే పిచ్చివాళ్లకు ఆహారం అందిస్తూ ఉంటాయి. కొంతమంది వ్యక్తులు దుస్తులు, దుప్పట్లు అందజేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు పిచ్చివాళ్లకు క్షవరం, స్నానాలు వంటి సపర్యలు చేస్తూ అభినందనలు అందుకుంటున్నాయి. కాని, ఎవరూ పోలీసుల సాయంతో వీరిని ఆస్పత్రిలో చేర్పించే ప్రయత్నం చేయకపోవడం దురదృష్టకరం. అనాథాశ్రమాలే గతి... సాధారణంగా మానసిక ఆస్పత్రిలో ఎవరికైనా రోగం తగ్గాక సంబంధీకులకు ఆస్పత్రి వర్గాలు లేఖ లేదా టెలిఫోన్ ద్వారా సమాచారం చేరవేస్తుంటారు.కాని, కొంతమంది ఇందుకు స్పందించకుండా నయం అయిపోయిన రోగులను తీసుకువెళ్లడానికి రావడం లేదు. దీనితో ఆస్పత్రి వర్గాలు ఇటువంటి వారిని నగరంలోని అనాథ ఆశ్రమాలలో చేర్పించిన సంఘటనలు ఉన్నాయి. అక్కడ తగిన ఆదరణ లభించక మునుపటి సమస్య తిరగబెట్టి మళ్లీ రోడ్డున పడ్డ ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇక్కడికే ఎందుకు? సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రజలు తమ ఇంట్లో ఎవరికైనా పిచ్చి పడితే విశాఖపట్నం వెళ్లే రైళ్లలో బలవంతంగా ఎక్కించేస్తుంటారన్న అపప్రథ ఉంది. విశాఖలో ప్రభుత్వ మానసిక ఆస్పత్రి ఉండడమే దీనికి కారణంగా చెప్పుకుంటారు. ప్రజలో, పోలీసులో వీరికి ఆస్పత్రిలో చేర్పిస్తారులే అన్న నిర్లక్ష్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరికైనా పిచ్చి పడితే వారిని వదిలించుకుందామని కుటుంబ సభ్యులే చూడడం అంతరించిపోతున్న మానవత్వానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. అందుకే చాలా మంది మనసు గతి తప్పిన వారు తగిన వైద్యం పొందక సమస్య ముదిరిపోయి రోడ్డు పడి పూర్తిగా పిచ్చివాళ్లైపోతారు. ఇలా చేస్తే మేలు నగరంలోని పలు ప్రాంతాలలో రోడ్లపైనా, బస్టాపులలోను, ఫుట్పాత్లపైనా పిచ్చివాళ్లు నా అన్నవాళ్లకు దూరంగా బతుకుతున్నారు. అందరూ వీరిని చూసి అయ్యో అనుకోవడం తప్ప ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఇటీవలి కాలంలో అపోహల కారణంగా వీరి మీద జనం దాడులు చేస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మానసిక ఆస్పత్రి ఆధ్వర్యంలో ఒక సంచార వాహనం ఏర్పాటు చేసి ట్రాఫిక్ పోలీసులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పిచ్చివాళ్లను ఆస్పత్రికి తరలించాలి. ఈ విషయంలో జిల్లా యంత్రాంగంకూడా స్పందించి తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. పోలీసులే స్పందించాలి రోడ్లపై పిచ్చివాళ్లు కనిపించినా మేము తీసుకురావడానికి వీల్లేదు. ట్రాఫిక్ పోలీసులు వీరిని కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు మానసిక ఆస్పత్రిలో చేర్పించాల్సి వుంటుంది. అనంతరం వారికి చికిత్స చేయిస్తాం.–డాక్టర్ రాధారాణి, సూపరింటెండెంట్, ప్రభుత్వ మానసిక ఆస్పత్రి,చినవాల్తేరు. -
‘దివ్యాంగ’ పోస్టులపై ఆచితూచి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై యంత్రాంగం ఆచితూచి అడుగులు వేస్తోంది. తొలుత కొత్త జిల్లాల ప్రాతిప దికన భర్తీ చేపట్టాలని నిర్ణయించిన యంత్రాంగం.. ప్రస్తుతం పునరాలోచనలో పడింది. ఉమ్మడి జిల్లానా? కొత్త జిల్లానా.. వీటిలో ఏ ప్రాతిపదికన నియామకాలు చేయాలని తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని గతేడాది చివరలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో.. జిల్లా యంత్రాంగం తొలుత కొత్త జిల్లా ప్రాతిపదికన ఖాళీలను తేల్చేందుకు రంగంలోకి దిగింది. ఒకటి రెండు మినహా దాదాపు అన్ని శాఖల్లో కేడర్ వారీగా ఖాళీల లెక్కలను సైతం తేల్చారు. గత డిసెంబర్ నెలాఖరులోపు నియామకాల నోటిఫికేషన్‌ను కూడా వెలువరిస్తామని అధికారులు సైతం ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఇది ఉన్నట్లుండి బ్రేక్ పడింది. అంతకుముందు కొత్త జిల్లాల ప్రాతిపదికన టీచర్ల ఖాళీ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా.. ప్రభుత్వ తీరును సైతం న్యాయస్థానం తప్పుబట్టింది. కొత్త జిల్లాలు కాకుండా.. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదిన రీ నోటిఫికేషన్ జారీ చేయాలని తీర్పు చెప్పిన సంగతి విధితమే. ఈ నేపథ్యంలో సవరణ నోటిఫికేషన్ కూడా ఇటీవల వెలువడింది. అయితే, కొత్త జిల్లాను పరిగణలోకి తీసుకుని వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తే ఇదే తరహాలో న్యాయపరమైన చిక్కులు వస్తే ఇబ్బంది తప్పదని యంత్రాంగం గ్రహించింది. ఈనేపథ్యంలో కొత్త జిల్లా కాకుండా.. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయాలన్న ఏకాభిప్రాయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని ఆయా విభాగాల్లో ఖాళీ పోస్టులను తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఖాళీల సంఖ్య పూర్తిగా తేలేందుకు మరో పది రోజుల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ నియామకాల్లో దివ్యాంగులకు మూడు శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంది. గత పది నెలల్లో ఆయా విభాగాల్లో కొందరు బదిలీ అయ్యారు. మరికొందరికి పదోన్నతులు లభించాయి. పలువురు ఉద్యోగ విరమణ పొందారు. వీటితోపాటు రోస్టర్ పాయింట్ అమలు ద్వారా కొన్ని పోస్టులు ఉద్భవించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయా విభాగాల్లో ఖాళీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
హైదరాబాద్ మెట్రోరైల్లో ఆ భయం లేదు..
సాక్షి, హైదరాబాద్ : విధి వక్రించి దివ్యాంగులుగా మారిన వారికి రైలు ప్రయాణమంటే కత్తిమీద సామే.. బస్సెక్కాలంటేనే ఆందోళన.. అలాంటిది రైలు ఎక్కాలంటే వారి ఇబ్బంది చెప్పనవసరం లేదు. ఎవరోఒకరు తోడుంటే తప్ప ప్రయాణం చేయలేరు. అయితే హైదరాబాద్ మెట్రోరైల్లో ఆ భయం అవసరం లేదు. ఈ ప్రాజెక్టులో ఇంజినీరింగ్ అద్భుతాలే కాదు..సామాజిక కోణం..ఆర్థిక కోణం..మానవీయ కోనం...ఇలా అన్ని వర్గాల వారు మన మెట్రో ..మన గౌరవం అన్న స్ఫూర్తితో ముందుకు సాగేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద మెట్రో ప్రాజెక్టులను క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేసిన తరవాత దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారులు..మహిళలు ఇలా అన్ని వర్గాల వారికి మెట్రో స్టేషన్లు,రైళ్లలో ప్రత్యేక వసతులు,సౌకర్యాలు కల్పించారు. సౌకర్యవంతమైన ప్రయాణం.. వికలాంగులు, అంధులు, వినికిడి సామర్థ్యంలేనివారు, మాట్లాడలేని వారు కూడా ఎవరి సాయం లేకుండానే మెట్రో రైలులో సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. స్టేషన్ పరిసరాలు, టిక్కెట్ కలెక్షన్ గేట్లు, టిక్కెట్ జారీ యంత్రాల వద్ద దివ్యాంగులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేసినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. సుమధుర స్వరంతో అనౌన్స్మెంట్.. ఇక మీరు ఎక్కాల్సిన రైలు ఆగే ప్రదేశం..దిగాల్సిన స్టేషన్ వివరాలను నిరంతరాయంగా తెలియజేసేందుకు తెలుగు, ఇంగ్లిష్ హిందీ భాషల్లో అనౌన్స్మెంట్ వినిపించేందుకు ఏర్పాట్లుచేశారు. రోడ్‌లెవల్ నుంచి మొదటి అంతస్తు (స్టేషన్ మధ్యభాగం కాన్కోర్స్)కు చేరుకోగానే ప్రతీ ఒక్కరికీ అనౌన్స్మెంట్ మూడు భాషల్లో వినిపిస్తుంది. ఏదేని స్టేషన్ రాగానే బోగీ డోర్లు తెరచుకున్న..మూసుకున్న ప్రతీసారీ సుమధుర స్వరంతో మూడుభాషల్లో అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. దీంతో ఎవరి సాయం అక్కరలేకుండానే ఎవ్వరైనా మెట్రో జర్నీ చేయవచ్చు. వీల్చైర్లకు ప్రత్యేక ర్యాంపులు రోడ్‌లెవల్ నుంచి నేరుగా ప్లాట్ఫారం మీదకు వీల్‌చైర్‌లో వెళ్లేందుకు ప్రతీ స్టేషన్ వద్ద ప్రత్యేకంగా ర్యాంపులు నిర్మించారు. అంతేకాదు వీల్‌చైర్‌తో సహా లిఫ్టులో ప్రయాణించేందుకు ప్రతి స్టేషన్ వద్ద విశాలమైన లిఫ్టులు ఏర్పాటుచేశారు. ఇక వీల్‌చైర్‌లో వెళ్లే ప్రయాణీకులు నేరుగా బోగీలోకి చేరుకునేందుకు ప్లాట్‌ఫాంకు.. ట్రాక్‌ను సమాన ఎత్తులో ఏర్పాటు చేశారు. తద్వారా వీల్‌చైర్‌తో నేరుగా భోగీలోకి వెళ్లి సౌకర్యవంతంగా కూర్చుని ప్రయాణించవచ్చు. ఇక బోగీలోనూ ప్రత్యేకంగా గ్రాబ్హోల్డ్లను ఏర్పాటుచేశారు. దీనికి వీల్‌చైర్‌ను లాక్చేయవచ్చు. ఇక వీరు వీల్‌చైర్‌తో సహా టాయిలెట్‌కు వెళ్లేందుకు ప్రత్యేకంగా ప్రతి స్టేషన్లో టాయిలెట్లను ఏర్పాటు చేశారు. అంధుల కోసం... బ్రెయిలీ లిపిలో లిఫ్టు బటన్లను ఏర్పాటుచేశారు. ఇక తమ చేతిలో ఉన్న ఎలక్ట్రానిక్ కర్ర సాయంతో ప్లాట్ఫారం పైకి చేరుకునేందుకు ప్రత్యేకమైన టైల్స్‌తో మార్గం ఏర్పాటు చేశారు. అంధులు ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫాంపై కిందపడకుండా ఉండేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు,సౌకర్యాలు కల్పించారు. నిరక్షరాస్యుల కోసం.. స్వల్ప దృష్టిలోపం ఉన్నవారు..నిరక్షరాస్యులు సైతం స్టేషన్లో వివిధ ప్రాంతాలకు, స్టోర్లకు వెళ్లేందుకు సూక్ష్మచిత్రాలు (పిక్టోగ్రామ్స్)తో ఏర్పాటుచేసిన సైనేజి బోర్డులు, రేడియం బోర్డులు ఉపయుక్తంగా ఉంటాయి. వారు ఎవరి సాయం లేకుండానే ఈ చిత్రాలను వీక్షించి తాము కోరుకున్న ప్రాంతానికి వెళ్లవచ్చు. మెట్రో క్యా బాత్‌హై రాళ్లెత్తిన కూలీలు..18 వేలు... మెట్రో నిర్మాణానికి సుమారు 18 వేల మంది కార్మికులు సుమారు ఐదేళ్లపాటు అహరహం శ్రమించడంతో కలల మెట్రో ప్రాజెక్టు సాకారమైంది. ఒరిస్సా, బీహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్, ఏపీకి చెందిన వేలాదిమంది కార్మికులకు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ఉప్పల్, మియాపూర్ మెట్రో డిపోల్లో ప్రత్యేకంగా ఆరునెలల పాటు శిక్షణనిచ్చి నైపుణ్యం గల కార్మికులుగా తీర్చిదిద్దింది. ఇందులో బార్బెండర్స్, వెల్డర్స్, ఇతర నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యే కార్మికులున్నారు. వీరందరికీ....వసతి,భోజన,వైద్య సౌకర్యాలు సైతం డిపోలోనే కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా వారికోసం వసతిసముదాయాలను తాత్కాలికంగా ఏర్పాటుచేసింది. వీరంతా మూడు షిఫ్టులవారీగా పనుల్లో నిమగ్నమయ్యారు. ఎక్కడా ప్రమాదాలు జరగకుండా అంతర్జాతీయ ప్రమాణాల మేరకు భద్రతా ఏర్పాట్లు,కార్మికులకు సేఫ్టీ ఉపకరణాలు అందజేశారు. -
వికలాంగుల సంక్షేమానికి కృషి
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెల్లంపల్లి : వికలాంగుల సంక్షేమానికి తగిన సహకారం అందజేస్తానని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో లయన్స్‌క్లబ్ ఆఫ్ బె ల్లంపల్లి(సింగరేణి) ఆధ్వర్యంలో 32 మంది వికలాంగులకు ట్రై సైకిళ్లు, వీల్చైర్ల పంపిణీ జరి గింది. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మా ట్లాడారు. ప్రభుత్వం ఇతర వర్గాల ప్రజలతో స మానంగా వికలాంగుల అభ్యున్నతికి పాటుపడుతోందన్నారు. వికలాంగులకు జీవన భృతి క ల్పించడం కోసం నెలకు రూ.1500 చొప్పున పి ంఛన్ను మంజూరు చేస్తోందన్నారు. విద్య, ఉద్యోగవకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ ఏక కాలంలో రాష్ట్రంలో కొత్తగా 21 జిల్లాలను ప్రారంభించి సాహసోపే త నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ప్ర జలకు పరిపాలన సౌలభ్యం కల్పించడమే ల క్ష్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందన్నారు. ప్రజలకు సేవ చేయడంలో కలిగే తృప్తి మరెందులోనూ లేదన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ పసు ల సునీతారాణి మాట్లాడుతూ సింగరేణి లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రైసైకిళ్లు, వీల్ చైర్లను ఉచితంగా అందజేయడం అభినందనీయమన్నారు. వికలాంగుల తోడ్పాటుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. భవిష్యత్‌లోనూ మరిన్నీ కార్యక్రమాలు నిర్వహించాల ని సూచించారు. అనంతరం వికలాంగులకు ట్రై సైకిళ్లు, వీల్ చైర్లను ప్రదానం చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సత్యనారాయణ, ఎంపీపీ సు భాష్రావు, డీఎఫ్‌వో తిరుమల్‌రావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు రాములు, బి.సుదర్శన్, ఎస్.కె.యూసుఫ్, రాజులాల్‌యాదవ్, టి.వంశీకృష్ణారె డ్డి, ఎలిగేటి శ్రీనివాస్, సి.హెచ్.మధు, కో ఆప్షన్ సభ్యుడు నిజాముద్దీన్, సింగరేణి లయన్స్‌క్లబ్ నిర్వాహకులు నల్మాసు సంతోష్, చక్రపాణి, స త్యనారాయణ, సర్పంచ్‌లు అర్కాల హేమలత, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.