సాక్షి, జనగామ: అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారా... కళ్లు కనిపించడం లేదా... వినికిడి సమస్య ఉందా... నో టెన్షన్.. మేము ఉన్నాం.. మీరు కూడా ఓటు వేయడానికి.. అని ఎన్నికల సంఘం ముందుఉంది. ఈ సారి ఎన్నికల కమిషన్ దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ర్యాంపులు ఏర్పాటుచేసింది. ఉచితంగా రవాణా సౌకర్యం ఏర్పాటుచేసింది. బ్రెయిలీ లిపి ఈవీఎంలను సైతం వినియోగిస్తున్నారు. దీంతో దివ్యాంగులు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
వరంగల్ అర్బన్ జిల్లాలో 2వేల 447 మంది, వరంగల్ రూరల్‌జిల్లాలో 9వేల 120 మంది, జనగామ జిల్లాలో 13వేల 766 మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2వేల 161 మంది, మహబూబాబాద్ జిల్లాలో 8వేల 981 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి వరంగల్‌జిల్లాలో మొత్తంగా 36వేల 475 మంది ఓటర్లు ఉన్నారు. వీరు 100 శాతం ఓటుహక్కు వినియోగించుకోవడం కోసం ఎలక్షన్ కమిషన్ సకల ఏర్పాట్లు చేస్తుంది.
ర్యాంపులు, వీల్‌చైర్లు ఏర్పాటు
జనగామ జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజక వర్గాల పరిధిలో 828 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దివ్యాంగుల కోసం అంతే మొత్తంలో ర్యాంపులను ఏర్పాటుచేశారు. ఇందులో ఆరు పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు లేరని తేలింది. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని పెండ్యాల పోలింగ్ బూత్‌ను మోడల్‌గా తీర్చి దిద్దుతున్నారు. మూడు నియోజక వర్గాల పరిధిలో 13,766 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక్కో వీల్ చైర్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. దివ్యాంగులను వీల్ చైర్‌లో కూర్చో బెట్టుకుని ఓటు వేయించేందుకు సహాయకులను ఏర్పాటు చేస్తున్నారు. దివ్యాంగులు, గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు వరుసలో నిలబడి ఓటు వేయడం వంటివి లేకుండా డైరెక్టుగా తనకు కేటాయించిన బూత్‌లోకి వెళ్లి ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 572 బూతులు ఉన్నా ఉన్నాయి. 205 పోలింగ్ బూత్‌లలో దివ్యాంగులు ఉన్నట్లు గుర్తించి ర్యాంపుల నిర్మాణం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 2వేల 447 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. 690 పోలింగ్ బూతులు ఉండగా అన్ని బూతుల్లోనూ ర్యాంపులు ఏర్పాటుచేశారు. 200 వీల్‌చైర్లు ఏర్పాటు చేశారు. వరంగల్ రూరల్‌జిల్లాలో 285 వీల్‌చైర్లు ఏర్పాటు చేశారు.
రవాణా సౌకర్యాలు
జనగామ జిల్లాలో రవాణా సౌకర్యం ద్వారా పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చే వారు 8వేల 320 మంది ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు అవసరమయ్యే వసతి సౌకర్యాలపై ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించింది. గత ఎన్నికల్లో దివ్యాంగులకు ఎలాంటి సహాయక చర్యలు లేకపోవడంతో పూర్తిస్థాయిలో ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మానుకోట జిల్లాల్లోనూ వికలాంగులకు రవాణా ఏర్పాట్లు చేశారు.
ఆ శాఖకు బాధ్యతల అప్పగింత
దివ్యాంగులకు ఏర్పాట్లు చేసే బాధ్యతను జిల్లా మాతా, శిశు, వికలాంగుల, వయో వృద్ధుల శాఖకు ఎన్నికల కమిషన్ అప్పగించింది. మొట్టమొదటిసారిగా ఓటు హక్కు వినియోగంలో దివ్యాంగులకు ప్రత్యేక గుర్తింపు లభించింది. దివ్యాంగులు ఉన్న ప్రాంతాల నుంచి పోలింగ్ కేంద్రాల వరకు ఉచితంగా రవాణా సౌకర్యాలను కల్పించింది. అడుగు తీసి అడుగు వేయలేని వారిని ఇంటి నుంచి పోలింగ్ వరకు ఆ తర్వాత తిరిగి తీసుకెళ్లే బాధ్యత పూర్తిగా వీరిపైనే ఉంటుంది.
అందుబాటులో బ్రెయిలీ లిపి
అంధులు, వినికిడి లోపం కలిగిన ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు వారికి ఓటింగ్‌కు సంబంధించి వివరాలు తెలిపేందుకు బ్రెయిలీ లిపిని అందుబాటులో ఉంచుతున్నారు. సైగలు.. నోటి మాట ద్వారా సమాధానాలు చెప్పనున్నారు. బ్రెయిలీ లిపిలో శిక్షణ పొందిన నిపుణులను అందుబాటులో ఉంచనున్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలు
- వీల్‌చైర్‌లు త్వరగా అందుబాటులో ఉండేందుకు వాటి కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
- గర్భిణులు, బాలింతలు, వృద్ధులకు క్యూ లేదు
- ఇబ్బందిగా ఉన్న వారికి వీల్‌చైర్‌లో సహాయక చర్యలు
- ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా టెంట్లు వేయడం..
- తాగునీరు, టాయిలెట్ సదుపాయాలతో పాటు అత్యవసర సేవలు
- పోలింగ్ కేంద్రానికి వచ్చిన అనంతరం ఏదైనా ఆరోగ్య సమస్యలు
- తలెత్తినప్పుడు వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచడం.
శారీరక దివ్యాంగులు | 9507 |
అంధులు | 2233 |
బధిరులు | 1073 |
మానసిక మాంధ్యం | 1148 |
మానసిక వికలాంగులు | 401 |
మొత్తం | 13,766 |
అంధులు | 564 |
దివ్యాంగులు | 1078 |
మూగ, చెవిటి | 519 |
మొత్తం | 2161 |
నియోజకవర్గం | పోలింగ్ బూత్‌లు | ఓటర్లు |
నవడలేని ఓటర్లు |
వినికిడి లోపం ఓటర్లు |
---|---|---|---|---|
జనగామ | 270 | 4693 | 2841 | 04 |
స్టేషన్‌ఘన్‌పూర్ | 279 | 4526 | 3202 | 04 |
పాలకుర్తి | 279 | 4547 | 2277 | 03 |
మొత్తం | 828 | 13,766 | 8320 | 11 |
Comments
Please login to add a commentAdd a comment