
అవ్వా ఎవరికేసినవ్ ఓటు.: ఆరెపల్లిలో ఓటు ఎవరికేసినవని ఓ వ్యక్తి వృద్ధురాళ్లను ప్రశ్నించగా అట్టడుగొద్దు బిడ్డా.. అంటూ సమాధాన మిస్తున్న దృశ్యం
సాక్షి, వరంగల్: ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు.. దానిని బాధ్యతతో వినియోగించుకోవాలనే విషయాన్ని ప్రజలు పాటించారు.. ఓటును వినియోగించుకునేందుకు ప్రజలు కదిలొచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నేటి యువతలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపేలా పెద్ద సంఖ్యలో దివ్యాంగులు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. కర్రలు, వీల్ చైర్ల సాయంతో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఎలక్షన్ అధికారులు ఓటర్లకు అన్ని విధాల సహకరిస్తూ వారి సందేహాలను తీర్చారు. ఓటు వినియోగించే పద్ధతిని వివరించారు.

ఓటేసి పనులకు పోవాలె.. కేసముద్రం మండలం పెనుగొండలో ఉదయమే బారులు దీరిన ఓటర్లు

మొదటిసారి ఓటేశాం : గోవిందరావుపేట మండలం గౌరారం గడ్డలో ఓటేసినట్లు సిరా గుర్తును చూపుతున్న గొత్తి కోయలు

ఓ మహిళా మేలుకో: ప్రకాష్‌రెడ్డిపేట స్కూల్‌లో ఓటు వేయడానికి వస్తున్న మహిళలు