సాక్షి, జనగామ: ఎన్నికల ప్రక్రియలో చాలా విషయాలు తెలుసుకోవాలి. బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ ఇలా ఒకదానికి ఒకటి అనుసంధానంగా పనిచేస్తాయి. ఇందులో ఈవీఎం పాత్ర ప్రధానం. ప్రతి పోలింగ్‌కేంద్రంలో గరిష్టంగా 1400 మంది ఓటర్లు మాత్రమే ఉంటారు. అలా ఎందుకు సంఖ్యను పరిమితం చేస్తారంటే... ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియలో వినియోగిస్తున్న ఈవీఎంలకు అనుసంధానించి ఉండే వీవీ ప్యాట్‌లో థర్మల్ కాగితం పొందుపరుస్తున్నారు. ఈ కాగితం 1500 స్లిప్పులను మాత్రమే ముద్రించగలుగుతుంది. 22.5 ఓల్ట్స్ బ్యాటరీతో పనిచేసే వీవీ ప్యాట్‌లో ఓటరు ఎవరికి ఓటు వేసింది.. తెలుసుకునే స్లిప్ డిస్‌ప్లేలో కనిపిస్తుంది. ఇందులో వంద వరకు కాగితపు స్లిప్పులు పోలింగ్ రోజున మాక్ పోలింగ్ ప్రక్రియలోనే ఖర్చవుతాయి. అందుకే గరిష్టంగా ప్రతి పోలింగ్ స్టేషన్‌లో 1400 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా అధికారులు ఏర్పాట్లుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment