సాక్షి, నర్సంపేటరూరల్: నర్సంపేట మండలంలోని దాసరిపల్లిలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న రూ. 7.5లక్షలను శుక్రవారం పట్టుకున్నట్లు సీఐ కొత్త దేవేందర్‌రెడ్డి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. దాసరిపల్లిలో కో మాండ్ల ఆదిరెడ్డి, రాజిరెడ్డి, ప్రవీణ్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఆదిరెడ్డి ఇంటి వద్ద గుంపుగా ఉన్నారు. ఈ క్రమంలో నర్సంపేట ఎస్సై నాగ్‌నాథ్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా జీబు సౌండ్స్ విని కవర్లను అక్కడే వదిలివేసి వెళ్లారు. వెంటనే ఎస్సై వారిని పట్టుకొని ఆ కవర్లులో చూడగా మొ త్తం ఏడు లక్షల 50వేల రూపాయలు ఉన్నట్లు గు ర్తించారు. డబ్బును సీజ్ చేసి, ఆరుగురిని నర్సం పేట పోలీస్ స్టేషన్‌కు తరలించిన కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.
జూకల్లులో డబ్బుల పట్టివేత
చిట్యాల (భూపాలపల్లి) మండలంలోని జూకల్లులో శుక్రవారం బీజేపీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తుండగా రూ.లక్ష పట్టుకున్నట్లు ఎస్సై అనిల్‌కుమార్ తెలిపారు. గ్రామంలో పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో బీజేపీ నాయకులు జి. రామకృష్ణారెడ్డి, ఎన్.రామకృష్ణారెడ్డిలు డబ్బులు పంపిణీ చేస్తుండగా పట్టుకున్నామన్నారు. డబ్బులను స్వాధీనం చేసుకోని ఇద్దరిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
రూ.11800 నగదు స్వాధీనం
మంగపేట మండల కేంద్రంలో ఓట్లర్లకు నగదు పంపిణీ చేస్తు గురువారం రాత్రి పట్టుబడిన నలుగురిపై కేసు నమోదు చేసి వారి నుంచి రూ.11,800 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ఎస్సై కథనం మేరకు మండల కేంద్రంలోని సినిమాహాల్ వీధిలో టీఆర్‌ఎస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు ఆళ్ళ రాణి, ఆ పార్టీకి చెందిన బచ్చలకూరి ప్రసాద్, రావుల రామస్వామి, మానుపెల్లి శ్రీను అనే నలుగురు వ్యక్తులు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేస్తూ ఓటు వేసేందుకు ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారని సమాచారం వచ్చిందన్నారు. తాము అక్కడకు వెళ్లగా ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్న వారిని చెక్ చేయగా వారి నుంచి రూ.11,800 లభ్యమైందని తెలిపారు. నగదును స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment