money Distribution
-
TG: ఎవరా పెద్ద సారు?
సాక్షి, హైదరాబాద్: పోలీసు విభాగంలో డీజీపీ కార్యాలయాన్ని మించిన ఉన్నత విభాగం (టాప్ ఆఫీస్) మరొకటి లేదు. ఆ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలు ఎవరైనా పాటించాల్సిందే. కానీ గతంలో ఓ ఉన్నతాధికారి (హయ్యర్ అప్) ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారా? అంటే.. క్రియ హెల్త్ కేర్ డైరెక్టర్ వేణుమాధవ్ చెన్నుపాటి కిడ్నాప్ కేసును పరిశీలిస్తే అవుననే సమాధానమే లభిస్తోంది. అదే సమయంలో ఎవరా ఉన్నతాధికారి? అనే సందేహం కలుగుతోంది. కృష్ణారావు ద్వారా హయ్యర్ అప్ వద్దకు.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో రిజిస్టర్ అయిన ఈ కేసులో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావు, ఇన్స్పెక్టర్లు బి.గట్టుమల్లు, ఎస్.మల్లికార్జున్ తదితరులు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కిడ్నాప్ కేసులో ఐదో నిందితుడిగా ఉన్న కృష్ణారావు అలియాస్ కృష్ణ పాత్ర కీలకమని తెలుస్తోంది. ఈయన గతంలో ఓ మీడియా చానల్లో కీలక స్థానంలో పని చేశారు. అప్పట్లోనే పలువురు పోలీసు ఉన్నతాధికారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అలాంటి వారిలో ఈ ‘హయ్యర్ అప్’కూడా ఒకరని సమాచారం. వేణు మాధవ్‌ను కిడ్నాప్ చేసి, తీవ్ర స్థాయిలో బెదిరించి, పత్రాలపై సంతకాలు చేయించుకుని క్రియా హెల్త్ కేర్ సంస్థను చేజిక్కించుకోవాలని దాని పార్ట్‌టైమ్ డైరెక్టర్లు గోపాల్, రాజ్ తలసిల, నవీన్, రవి... గోల్డ్ ఫిష్ అబోడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ వేగేతో కలిసి కుట్ర పన్నారు. కృష్ణారావు అనేక మంది పోలీసు ఉన్నతాధికారులకు సన్నిహితుడని తెలిసిన చంద్రశేఖర్ ఆయన్ను సంప్రదించాడని, కృష్ణారావు ద్వారానే హయ్యర్ అప్ వరకు ఈ వ్యవహారం వెళ్లిందని సమాచారం. కాగా విషయం సెటిల్ చేయడానికి రూ.10 కోట్లకు డీల్ మాట్లాడుకున్న ఆ పెద్ద సారు.. పని పూర్తి చేసే బాధ్యతల్ని రాధాకిషన్‌రావు, గట్టు మల్లులకు అప్పగించినట్లు, దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. డీజీపీ కార్యాలయం గట్టు మల్లుకు ఫోన్ సిట్ సమాచారం మేరకు.. 2018 నవంబర్ 22న ఉదయం 5.30 గంటలకు అప్పట్లో టాస్క్‌ఫోర్స్ ఎస్సైగా పని చేస్తున్న మల్లికార్జున్.. వేణుమాధవ్‌ను తన బృందంతో కిడ్నాప్ చేసి సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించాడు. అక్కడ రాధాకిషన్‌రావు ప్రోద్భలంతో అప్పటి వెస్ట్‌జోన్ టాస్‌్కఫోర్స్ ఇన్స్పెక్టర్ గట్టు మల్లు తీవ్రస్థాయిలో వేణును బెదిరించాడు. అతి కష్టంమ్మీద తన ఫోన్ దక్కించుకున్న వేణుమాధవ్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయం నుంచే తొలుత తన న్యాయవాది శ్రీనివాస్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆయన కోర్టులో తేల్చుకుందాం అన్నారు. తర్వాత తన స్నేహితుడైన లహరి రిసార్ట్స్ యజమాని సంజయ్‌ను వేణు సంప్రదించారు. దీంతో డీజీపీ కార్యాలయానికి వెళ్లిన సంజయ్ అక్కడ నుంచి గట్టు మల్లుకు ఫోన్ చేయించారు. ఆ కాల్ అందుకున్న రాధాకిషన్ రావు మాటాడుతూ.. ఇది ఉన్నతాధికారే అప్పగించిన విషయని చెప్పడంతో డీజీపీ కార్యాలయం చేతులెత్తేసింది. దీంతో రాధాకిషన్‌రావు, గట్టు మల్లు, మల్లికార్జున్ తదితరులు వేణుమాధవ్‌తో పత్రాలపై సంతకాలు చేయించి క్రియా హెల్త్‌కేర్‌లో షేర్లు, ఆయన యాజమాన్యం మార్పు చేశారు. ఆ నలుగురి వాంగ్మూలాలు కీలకమే.. వేణును తీవ్రస్థాయిలో భయపెట్టడానికి ఉగ్రవాదం, మనీలాండరింగ్ కేసులు నమోదు చేస్తామంటూ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బెదిరించారు. ఇందుకు సంబంధించి రాధాకిషన్‌రావు సహా తొమ్మిది మందిపై కేసు నమోదైంది. వేణు మాధవ్ తన నలుగురు పార్ట్‌టైమ్ డైరెక్టర్ల వేధింపులపై 2018 అక్టోబర్ 3న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదే నెల 12 నుంచి నలుగురి నుంచి వేణుకు వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో అప్పటి బంజారాహిల్స్ ఏసీపీని కలిసి న్యాయం చేయమని కోరినా ఫలితం దక్కలేదు. ఈ ఫిర్యాదు విషయంలో పోలీసుల ఉదాశీన వైఖరికి కారణం తెలియాలంటే నాటి బంజారాహిల్స్ ఏసీపీని పిలిచి విచారించాల్సి ఉంది. ముఖ్యంగా డీజీపీ కార్యాలయం, హయ్యర్ అప్‌తో పాటు న్యాయవాది శ్రీనివాస్, లహరి రిసార్ట్స్ యజమాని సంజయ్‌ల నుంచీ వాంగ్మూలాలు సేకరించాలి. అయితే డీజీపీ కార్యాలయం, ‘హయ్యర్ అప్ విషయంలో సిట్ అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారన్నది వేచి చూడాల్సి ఉంది. సిట్ అదుపులో ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ రాధాకిషన్‌రావు ఇప్పటికే అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై, జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. దీంతో ఆయన్ను కిడ్నాప్ కేసులో పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి, కోర్టు అనుమతితో పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీసులు, సిట్ అధికారులు నిర్ణయించారు. మరోపక్క ఇదే కేసులో నిందితుడిగా ఉన్న నాటి టాస్క్‌ఫోర్స్ ఎస్సై, ప్రస్తుతం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో (ఎస్ఐబీ) ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న మల్లికార్జున్‌ను సిట్ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
తాయిలాల ఎర
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ప్రజాక్షేత్రంలో టీడీపీకి ఎదురుగాలి వీస్తోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుంటే, ప్రతిపక్ష టీడీపీలో మాత్రం నైరాశ్యం నెలకొంది. గ్రామాల్లో ప్రచారానికి వెళ్లినా నేతలకు స్పందన కానరావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అసంతృప్తిలో ఉన్న టీడీపీలోని ద్వితీయ శ్రేణి నాయకులకు ఎర వేసి, వారిని తమవైపు తిప్పుకొనేందుకుప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా గన్నవరం, గుడివాడ, మైలవరం, తిరువూరు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాల్లోనూ డబ్బుతో ఓటర్లకు గాలం వేస్తున్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో అసంతృప్తిగా ఉన్న టీడీపీ నేతలు చేజారిపోకుండా నోట్ల కట్టలతో బేరం పెడుతున్నారు. మచిలీపట్నంలో జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరికి ఎదురుగాలి వీస్తుండటంతో కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలకు తాయిలాలు ఇచ్చి తమ వైపు తిప్పుకోవడానికి తంటాలు పడుతున్నారు. ప్రచారంలోనూ డబ్బు పంపిణీ విజయవాడ వెస్ట్ నియోజక వర్గంలో ప్రచారంలో తొలిరోజే బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని వినూత్న మార్గాన్ని ఎంచుకొన్నారు. హారతి ఇస్తే రూ.వెయ్యి, కొబ్బరికాయలు కొడితే రూ.వెయ్యి అంటూ మహిళలకు తాయిలాల ఎర వేశారు. ప్రచారంలో మహిళలు వరుసగా అభ్యర్థులకు హారతి ఇవ్వడం తంతుగా మారింది. గన్నవరంలో యార్లగడ్డ వెంకటరావు కూడా ఇదే తరహాలో డబ్బు పంపిణీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రచారంలో పాల్గొన్న వారికి రూ.500, చికెన్, మటన్ భోజనాలు, పార్టీ జెండాలు మోసిన వారికి విచ్చల విడిగా మద్యం బాటిళ్లు పంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ప్రచారంలో పెయిడ్ ఆర్టిస్ట్ లను ఏర్పాటు చేసుకొన్నారని తెలుస్తోంది. తిరువూరులో కొలికపూడి శ్రీనివాస్ డబ్బునే ఆయుధంగా ఎంచుకొన్నారు. గిరిజన తండాలు, ఎస్సీ కాలనీలో ప్రజలనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే గన్నవరంలో టీడీపీ అభ్యరి్థ యార్లగడ్డ వెంకటరావు గ్రామ కమిటీల ద్వారా ఇళ్ల స్థలాలు ఇస్తామని దర ఖాస్తులు స్వీకరించి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో పెద్ద ఎత్తున మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. ద్వితీయ శ్రేణి నాయకులకు వల వైఎస్సార్ సీపీ పార్లమెంటు అభ్యర్థి కేశినేని నానికి నియోజకవర్గంలో బలమైన క్యాడర్‌తోపాటు టాటా ట్రస్ట్ ద్వారా సేవలు అందించిన మంచి పేరుంది. ఈ నేపథ్యంలో టీడీపీ పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్ని ప్రచారానికి ప్రజా స్పందన లేకపోవడంతోపాటు అసంతృప్తితో ఉన్న టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులను ప్రలోభాలుపెడుతున్నట్లు సమాచారం తెలుస్తోంది. నాయకుని స్థాయిని బట్టి డబ్బు ముట్టజెప్పి, పార్టీలో చేరికలు అంటూ కలరింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే ఆయన విజయవాడ తూర్పు, సెంట్రల్, వెస్ట్, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు నియోజక వర్గాలో వారి స్థాయిని బట్టి ద్వితీయ శ్రేణి నాయకులకు డబ్బు పంపిణీ పూర్తి చేశారు. మైలవరం నియోజక వర్గంలో నేతలంతా తమ వెంటే ఉన్నారని చెప్పుకొనేందుకు వసంత కృష్ణ ప్రసాద్ తంటాలు పడుతున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల్లో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ నేతలు ఎవ్వరూ ఆయనకు మద్దతుగా లేకపోవడంతో, టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులకు డబ్బులతో గాలం వేస్తున్నారు. విజయవాడ వెస్ట్‌లో సుజనాచౌదరి సైతం ద్వితీయ శ్రేణి నాయకులపై ఫోకస్ పెట్టి, తాయిలాల పంపిణీ చేసి తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయతి్నస్తున్నారు. మొత్తం మీద కూటమి అభ్యర్థులకు ఎదురుగాలి వీస్తుండటంతో, ఓటర్లను, ద్వితీయ శ్రేణి నేతలను ఆకర్షించడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. -
TS Election 2023: పట్టుబడిన నగదు, గోల్డ్, డ్రగ్స్ విలువ ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత భారీగా నగుదు, మద్యం, గోల్డ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వందల కోట్ల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో స్వాధీనం చేసుకున్న నగదు, తదితర వివరాలను అధికారులు వెల్లడించారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి రూ.469.63 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకోగా దీనికి సంబంధించి 11,859 ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అదే, 2018 ఎన్నికల సందర్భంగా రెండు వేలకుపైగా కేసులు నమోదు కాగా.. రూ.103 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఇక, 2018తో పోలిస్తే 2023లో భారీగా కేసులు పెరగగా.. భారీ మొత్తంలో నగదును పట్టుకున్నారు. 2023కు సంబంధించిన వివరాలు ఇవే.. నగదు.. 241.52 కోట్లు.. 241 ఎఫ్ఐఆర్లు నమోదు గోల్డ్/సిల్వర్.. 175.95 కోట్లు.. 5 ఎఫ్ఐఆర్లు నమోదు మద్యం.. 13.36 కోట్లు.. 11,195 ఎఫ్ఐఆర్లు నమోదు డ్రగ్స్.. 22.17 కోట్లు.. 323 ఎఫ్ఐఆర్లు నమోదు ఉచితాలు.. 16.63 కోట్లు.. 95 ఎఫ్ఐఆర్లు నమోదు. -
కారులో డబ్బుల సంచులు.. సీఐపై కాంగ్రెస్ నేత దాడి!
సాక్షి, చెంగిచెర్ల: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. పలు చోట్ల తనిఖీల్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. తాజాగా ఓ పోలీసు అధికారి కారులో డబ్బు తరలిస్తుండగా.. కాంగ్రెస్ నేతలు అడ్డుకుని దాడికి చేశారు. వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా చెంగిచర్ల దగ్గర కారులో డబ్బుల సంచుల కలకలం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కారును అడ్డుకుని తనిఖీలు చేశారు. కారులో నగుదు ఉన్న సంచులను గుర్తించారు. అనంతరం, ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఎన్నికల అధికారులు వచ్చి నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తిని వరంగల్ అర్బన్ సీఐ అంజిత్ రావుగా కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తించారు. బీఆర్ఎస్ నేతలు కారులో డబ్బులు తరలిస్తున్నారని కాంగ్రెస్ నేతల ఆరోపణ చేశారు. దీంతో, ఆవేశంలో ఓ కాంగ్రెస్ కార్యకర్త.. సీఐ అంజిత్ రావుపై దాడి చేశాడు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే, దొరికిన డబ్బును మంత్రి మల్లారెడ్డికి చెందినది అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలకు పోలీసులు సహకరిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. -
భారత్ ప్రపంచకప్ గెలిస్తే రూ.100 కోట్లు ఇస్తామన్న సీఈఓ
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే ఏకంగా రూ.100 కోట్లు ఇస్తానని ఆస్ట్రోటాక్ సీఈఓ పునీత్ గుప్తా ప్రకటించారు. ఆస్ట్రోటాక్ వినియోగదారులకు ఈ డబ్బును పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా తన లింక్డ్ఇన్ ఖాతాలో కొన్ని విషయాలను పంచుకున్నారు. ‘భారత్ చివరిసారి 2011లో ప్రపంచకప్ గెలిచినప్పుడు నేను కాలేజీలో చదువుతున్నాను. అవి నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజులు. చండీగఢ్‌లోని కళాశాల సమీపంలో ఉన్న ఆడిటోరియంలో నా స్నేహితులతో కలిసి ఆ మ్యాచ్‌ని చూశాను. ఆ సమయంలో రోజంతా చాలా టెన్షన్‌గా ఉన్నాం. మ్యాచ్ జరిగే ముందురోజు గెలుపోటములపై చర్చించాం. దాంతో సరిగా నిద్రపోలేదు. ఆరోజు విజయాన్ని పంచుకునేందుకు నాకు కొందరు స్నేహితులు ఉండేవారు. ఈసారి ఇండియా విజయాన్ని పంచుకునేందకు చాలా మంది ఆస్ట్రోటాక్ వినియోగదారులు ఉన్నారు. అందరూ ఇండియా గెలవాలని ప్రార్థించాలి’ అని తెలిపారు. ఇదీ చదవండి: అక్కడ క్రికెట్ వరల్డ్‌కప్ రోజున ఉచిత వసతి! ‘టీం ఇండియా ఫైనల్ మ్యాచ్‌లో గెలిస్తే నా ఆనందాన్ని పంచుకోవడానికి ఏదైనా చేయాలి. కాబట్టి, ఈరోజు నా ఫైనాన్స్ టీమ్ సభ్యులతో చర్చించాను. భారత్ కప్ గెలిస్తే మా వినియోగదారులకు రూ.100 కోట్లు పంపిణీ చేస్తాను’అని చెప్పారు. -
మునుగోడులో డబ్బు ప్రవాహం.. మరో వాహనం!
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉపఎన్నికలో ధన ప్రవాహం వెల్లువెత్తుతోంది. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రధాన పార్టీలతో పాటు ఇతర అభ్యర్థులు.. డబ్బు పంపిణీ, ఇతర ప్రలోభాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా.. మంగళవారం చండూరు మండల పరిధిలోని గుట్టుప్పల్ శివారులో ఓ వాహనంలో తరలిస్తున్న రూ.19 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. కారు ఢిక్కీలో ఈ డబ్బును తరలిస్తుండగా.. పోలీసులు గుర్తించారు. కారులోని వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నగదుతో పాటు ఓ పార్టీకి సంబంధించిన ప్రచార సామాగ్రి ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. మునుగోడులో గత రెండు వారాల్లో భారీగా నగదు పట్టుబడడం ఇది మూడోసారి. పదిరోజుల కిందట రూ. 10 లక్షలు, సోమవారం(నిన్న) కోటి రూపాయలు తరలిస్తున్న ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
లెక్కలు లేని.. 3.5 కోట్లు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు నగదు అక్రమ రవాణాపై దృష్టిపెట్టారు. గతవారం మూడు ఘటనల్లో రూ.3.7కోట్లు పట్టుకోగా..సోమవారం రాత్రి నగరంలోని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు లెక్కలు లేని రూ.3.5 కోట్లను పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నిర్మాణ రంగ వ్యాపారైన హిమాయత్‌నగర్ ప్రాంతానికి చెందిన కె.వెంకటేశ్వర్రావు సైదాబాద్‌కు చెందిన మరోవ్యాపారి బాలు మహేందర్‌కు రూ.3.5 కోట్లు నగదు రూపంలో ఇవ్వాలని భావించారు. అయితే ఈ నగదు తీసుకునేందుకు బాలు మహేందర్ కర్మన్‌ఘాట్ ప్రాంతానికి చెందిన తన స్నేహితులు గండి సాయికుమార్ రెడ్డి, మహేశ్, సందీప్‌కుమార్, మహేందర్, అనూష్‌రెడ్డి, భరత్‌లను పంపాడు. ఈ ఆరుగురూ సోమవారం రాత్రి రెండుకార్లలో మారియట్ హోటల్ వెనుక ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడకు మరో కారులో వచ్చిన వెంకటేశ్వర్రావు నాలుగు అట్టపెట్టెల్లో సీల్‌వేసి తీసుకువచ్చిన నగదును వీరికి అప్పగించాడు. వాటిని తమ కార్లలో పెట్టుకుని ఆరుగురూ సైదాబాద్ వైపు బయల్దేరారు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి వారిపై దాడిచేసి నలుగురిని పట్టుకున్నారు. వెంకటేశ్వర్రావు, బాలు మహేందర్‌లు పారిపోయారు. కాగా, వీరి వాహనాలను తనిఖీ చేయగా రూ.3.5 కోట్లు బయటపడ్డాయి. ఈ నగదుకు సంబంధించిన లెక్కలు వారి వద్ద లేకపోవడంతో కార్లతో సహా స్వాధీనం చేసుకుని గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న వెంకటేశ్వర్రావు, బాలు మహేందర్ కోసం గాలిస్తున్నారు. ఈ నగదుతో మునుగోడు ఉప ఎన్నికలకు ఏమైనా లింకులు ఉన్నాయా? అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. -
గొర్రెలొద్దు.. డబ్బులు కావాలి
సాక్షి, హైదరాబాద్/సుందరయ్య విజ్ఞాన కేంద్రం: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సబ్సిడీ గొర్రెల పథకం కింద తమకు గొర్రెలు వద్దని, నగదు బదిలీ చేస్తే లబ్ధిదారుడికి అనుకూలంగా ఉన్న చోట గొర్రెలు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు జీఎంపీఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన చర్చావేదికలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. జీఎంపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కిల్లె గోపాల్ అధ్యక్షతన జరిగిన చర్చా వేదికలో నగదు బదిలీ తీర్మానాన్ని సంఘం ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై పలువురు మాట్లాడిన అనంతరం చర్చా వేదిక ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ చర్చా వేదికలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ గొర్రెలు, మేకల పెంపకందారులకు 1లక్ష 75 వేల నుంచి 5 లక్షల రూపాయల వరకు పెంచాలని, ఈ పథకం కింద నగద బదిలీ చేయాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ పథకం అమలులో కోట్లాది రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చాయని, ఇకనైనా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీపీసీసీ అధికార ప్రతినిధి లోకేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఉపాధ్యక్షుడు మారం తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సదస్సులో మాట్లాడుతున్న ఆర్.కృష్ణయ్య -
డబ్బు, ముక్కుపుడకలు పంచిన టీడీపీ
సాక్షి,విడవలూరు (నెల్లూరు): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా టీడీపీ అక్రమాలకు పాల్పడుతోంది. 2వ వార్డు టీడీపీ అభ్యర్థి జూగుంట కళ్యాణ్ ఓటుకు రూ.వెయ్యి నగదు, బంగారు ముక్కపుడక పంచిపెట్టారు. 3వ వార్డు టీడీపీ అభ్యర్థి బట్టా ప్రవల్లిక తరఫున కార్యకర్త ఉసురుపాటి ప్రసాద్ నగదు పంచుతుండగా వైఎస్సార్సీపీ నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రసాద్ వద్ద రూ.12 వేల నగదునుస్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. -
లోకేశ్ ప్రచారం.. డబ్బు పంపిణీ..
సాక్షి, తిరుపతి: కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో ఓటమి భయం వెన్నాడుతుండటంతో తెలుగుదేశం నేతలు అన్ని అడ్డదారులు తొక్కుతున్నారు. ఎలాగైనా కుప్పంలో గెలవాలని చంద్రబాబు, లోకేశ్.. తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోలింగ్ సమయం సమీపిస్తుండడంతో ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడే కుప్పంలో ప్రచారానికి రాకుండా గెలిచిన చంద్రబాబు.. ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. శుక్రవారం లోకేశ్ ప్రచారం చేస్తున్నారు. లోకేశ్ గురువారం రాత్రి డబ్బు సంచులతో కుప్పం చేరుకున్నారనే ప్రచారం సాగుతోంది. లోకేశ్ వచ్చిన గంట తరువాత డబ్బుల పంపిణీ మొదలుపెట్టారు. ఓటర్ల బంధువులు, మహిళల ద్వారా డబ్బు పంపిణీ చేస్తున్నారు. డబ్బులు ఇచ్చే సమయంలో ఒకరు ఇంట్లోకి వెళ్లి మరొకరు బయట కాపలా ఉంటున్నారు. లోనికి వెళ్లిన వ్యక్తి.. మహిళల చేతిలో డబ్బులు పెట్టి ప్రమాణం చేయించుకుని వస్తున్నారు. శుక్రవారం లోకేశ్ ప్రచారం ఒక వైపు సాగుతుండగా మరోవైపు నగదు పంపిణీ చేపట్టారు. పోలీసులు లోకేశ్ ప్రచారం వైపే ఉంటారు కాబట్టి మరోవైపు ఇళ్లకు వెళ్లి డబ్బు అందజేస్తున్నారు. ఓటరు టీడీపీ సానుభూతిపరులైతే రూ.2 వేలు, మిగతావారైతే రూ.5 వేలు చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబం ఉంటే ఒకేసారి పెద్ద మొత్తంలో ఇచ్చేస్తున్నారు. కొందరికి ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా బదిలీ చేస్తున్నారు. విచ్చలవిడిగా మద్యం పంపిణీ కుప్పంలో కర్ణాటక మద్యం పంపిణీ చేయాలని టీడీపీ నాయకులకు చంద్రబాబు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కర్ణాటక, తమిళనాడు నుంచి భారీగా మద్యం తెప్పించి పంపిణీ చేశారు. గురువారం రాత్రి రాష్ట్ర సరిహద్దుల్లో కర్ణాటక పరిధిలో ఉన్న దుకాణాల ద్వారా భారీగా కొనుగోలు చేసినట్లు టీడీపీ నాయకులే చెబుతున్నారు. బెంగళూరులో స్థిరపడిన టీడీపీ ముఖ్యనేతలు కర్ణాటక సరిహద్దులో ఉండే మద్యం దుకాణాలను బినామీ పేర్లతో దక్కించుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో ఆరు మద్యం దుకాణాలుంటే, సరిహద్దులో కర్ణాటక పరిధిలో తొమ్మిది దుకాణాలున్నాయి. ఆ మద్యం దుకాణాల పరిసరాల్లో ఒక్క గ్రామం కూడా లేకపోవడం గమనార్హం. -
ఏడేళ్ల క్రితం హిజ్రాగా మారిన యువకుడు.. మిత్రులు అన్యాయం చేశారని..
సాక్షి, కోలారు(కర్ణాటక): ఏడేళ్ల కిందట ఇల్లు వదిలి హిజ్రాగా మారిన శివకుమార్ అలియాస్ వందన (30) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గాంధీనగరలో నివాసం ఉంటున్న వందన గురువారం రాత్రి భిక్షాటన చేయగా వచ్చిన డబ్బును పంచుకోవడంలో తోటి హిజ్రాలతో గలాటా జరిగింది. మిత్రులు కూడా అన్యాయం చేశారన్న ఆవేదనకు లోనైన వందన శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. గల్‌పేట పోలీసులు పరిశీలన జరిపి కేసు నమోదు చేశారు. అడవి ఏనుగు కంటబడి.. మైసూరు: మైసూరు సమీపంలో చామరాజనగర జిల్లా పరిధిలోని బిళిగిరి రంగన బెట్ట ప్రాంతం పుణజనూరు వద్ద అడవి ఏనుగు దాడిలో ఒకరు మృతి చెందారు. చామరాజనగర తాలూకాకు చెందిన చాటి నింగయ్య (52) జాతీయ రహదారిలో నడుచుకుంటూ వెళ్తుండగా కొంతదూరంలో ఓ అడవి ఏనుగు రోడ్డు దాటుతోంది. అది నింగయ్యను చూసి కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన్ని కాళ్ళతో తొక్కి చంపింది. చామరాజనగర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. చదవండి: Afghanistan: విమానంలోనే అఫ్గన్ మహిళ ప్రసవం -
చేతిలో ఉంచండి
లాంగ్ బెల్ కొడితే స్కూల్ అయిపోతుంది. లాక్డౌన్లో ఇప్పుడు స్కూలే లేదు. కణ్ణగి మేడమ్ మనసు స్కూలు పిల్లల వైపు లాగుతోంది. పిల్లల్ని తప్ప బెల్ని చూసుకోలేదు తనెప్పుడూ. తిన్నారో లేదో! ఎలా ఉన్నారో ఏమో! అందరి తల్లిదండ్రులూ అంతంత మాత్రమే. పనులు ఉన్నప్పుడే పస్తులు తప్పనివాళ్లు. ఇప్పుడు పనులకీ పస్తులు పడి ఉంటారు. వాళ్లకేదైనా చేయాలనుకున్నారు. ఇంటింటికీ తిరిగి వెయ్యి రూపాయలిచ్చి వెళ్లారు. లాక్డౌన్లో పూట గడవని ఇళ్లు తుప్పాపురంలో చాలానే ఉండి ఉంటాయి. వాటిల్లో 41 ఇళ్లను మాత్రం ఎంపిక చేసుకోగలిగారు కణ్ణగి మేడమ్. అరియళూరు (తమిళనాడు) లోని ప్రభుత్వ పాఠశాల హెచ్.ఎం. ఆమె. అరియళూరుకు దగ్గర్లోనే ఉంటుంది తుప్పాపురం. బడిలో చదువుతున్న మొత్తం 62 మంది పిల్లలూ ఆ 41 ఇళ్లవాళ్లే. అదే బడిలో పరమేశ్వరీ వరదరాజన్ అనే టీచర్ పని చేస్తున్నారు. కణ్ణగి మేడమ్ అక్కడికి దగ్గర్లోని కొడంగుడి నుంచి, పరమేశ్వరి టీచర్ కళత్తూరు నుంచి రోజూ స్కూలుకు వచ్చి వెళుతుంటారు. కణ్ణగి మేడమ్ పన్నెండేళ్లుగా అక్కడ పనిచేస్తున్నారు. పరమేశ్వరి టీచర్ రెండున్నరేళ్లుగా ఉన్నారు. పాఠశాలలోని ప్రతి విద్యార్థి గురించి, వారి కుటుంబ పరిస్థితుల గురించి వారికి తెలుసు. అందుకే ఒక విద్యార్థి స్కూలుకు రాలేదంటే ఎందుకు రాలేదని కాకుండా, ఎందుకు రాలేకపోయారో తెలుసుకుంటారు. ఇప్పుడు పిల్లలెవరూ రావడం లేదు. ఎవరు ఎలా ఉన్నారో అడగడానికి ఎవరుంటారు? లాక్డౌన్ పరిస్థితుల్ని కళ్లారా చూస్తూ ఉన్నారు కనుక అడిగే అవసరం లేదు. పనుల్లేవు కాబట్టి పస్తులే. పిల్లల కుటుంబాలకు సహాయం చేయాలనుకున్నారు కణ్ణగి మేడమ్. ఇంటికి వెయ్యి రూపాయలు ఇవ్వాలని అనుకున్నారు. ‘‘ఇద్దరం కలిసి తుప్పాపురం వెళ్లి ఒక్కో ఇంటికి ఇచ్చి వద్దాం’’ అని పరమేశ్వరి టీచర్‌తో అంటే.. ‘‘మేడమ్.. నేను కూడా కొద్దిగా డబ్బు ఇస్తాను’’ అన్నారు. అక్కరలేదని సున్నితంగా చెప్పినా వినలేదామె. ఐదు వేలు తెచ్చిచ్చారు. మేడమ్‌వి 36 వేలు, టీచర్‌వి 5 వేలు కలిపి 41 వేలు నలభై ఒక్క ఇళ్లకూ వెళ్లి ‘చేతిలో ఉంచండి’ అని పంచిపెట్టారు. వాళ్లకు సహాయంగా పాఠశాల సిబ్బంది ఒకరిద్దరు ఉన్నారు. డబ్బులు చేతిలో పెడుతున్నప్పుడు చూడాలి ఆ తల్లిదండ్రుల సంతోషం. పిల్లలకు చదువు చెప్పి జీవితాన్నిచ్చే టీచర్లు పెద్దలకు బతుకునివ్వడానికి ఇంటికొచ్చారు. దండం పెట్టి, కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఆ పేదలు ఏం చెయ్యగలరు? ‘‘నాకూ ఈ ఆలోచన రాకపోయేది. మా అబ్బాయే అన్నాడు.. ‘మమ్మీ మీ స్కూల్లో అందరూ పేద పిల్లలే అన్నావు కదా.. వాళ్ల పేరెంట్స్‌కి ఈ లాక్డౌన్లో పనులు దొరకవు. మనం డబ్బులు ఇవ్వొచ్చు కదా’ అని. మంచి ఆలోచన అనిపించింది’’ అంటారు నవ్వుతూ కణ్ణగి మేడమ్. -
సైకిల్ తొక్కితే.. కి.మీ.కు రూ.16!
శారీరక వ్యాయామం కోసం తప్ప మామూలుగా సైకిల్ తొక్కేవాళ్లు చాలా తక్కువమందే ఉంటారు. అప్పుడెప్పుడో స్కూల్ డేస్‌లో తొక్కేవాళ్లం. ఆ తరువాత ఎప్పుడు తొక్కామో గుర్తులేదు అనేవాళ్లు లేకపోలేదు. ఇప్పుడైతే జిమ్‌లో ఉన్న సైకిల్ తొక్కడమే. బయటకు వెళ్లాలంటే బైక్ లేదా కారులో వెళ్తామని నూటికి 98 మంది చెబుతారు. గ్రామాల్లోనూ సైకిల్ తొక్కే సంస్కృతి క్రమంగా దూరమైపోతోంది. స్కూల్ విద్యార్థులకే పరిమితమైపోతోంది. కానీ.. విదేశాల్లో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. చాలా దేశాల్లోని ప్రజలు సైక్లింగ్‌ను ఒక అలవాటుగా మార్చుకున్నారు. దీనికి తగ్గట్టే ప్రభుత్వాలు సైకిల్ తొక్కడాన్ని ప్రోత్సహిస్తున్నాయి. వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నాయి. నెదర్లాండ్స్‌లో అయితే సైకిల్ తొక్కేవారికి డబ్బులు కూడా ఇస్తున్నారు. ఇది కాస్త విచిత్రంగా ఉన్నప్పటికి సైక్లింగ్‌ను ప్రోత్సహించడానికి ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. జనాభా కంటే సైకిళ్లే ఎక్కువ.... సైకిల్ వినియోగం విషయంలో ప్రపంచంలో ఎవరైనా నెదర్లాండ్స్ ప్రజలకన్నా వెనుకే ఉంటారు. ఎందుకంటే ఆ దేశంలో ఉన్న జనాభా కంటే సైకిళ్లే ఎక్కువ. అక్కడి ప్రజలకు సైకిల్ తొక్కడమంటే మహా సరదా. ఆఫీస్‌కు, పక్క ఊర్లో ఉన్న చుట్టాల ఇళ్లకు.. ఇలా సమీప ప్రాంతాలకు సైకిల్‌పై రయ్యిన వెళ్లిపోతుంటారు. కార్లు, బైక్‌ల కన్నా సైకిల్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రభుత్వం కూడా సైకిల్ తొక్కడాన్ని విపరీతంగా ప్రోత్సహిస్తుంది. సైకిలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. మన దగ్గర రోడ్లపై బస్సుల కోసం బస్‌బేలు ఉన్నట్టు.. నెదర్లాండ్స్‌లో రోడ్లపై సైకిళ్ల కోసం ప్రత్యేకంగా దారులు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే కేవలం సైకిళ్లనే అనుమతి ఇస్తారు. వేరే వాహనాలకు అనుమతి ఉండదు. సైకిళ్లకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. నెదర్లాండ్స్ రాజధాని అమ్‌స్టర్ డ్యామ్‌లో పనిచేసే ఉద్యోగులు సైకిల్‌పై ఆఫీస్‌కు వెళ్లడానికే ఇష్టపడతారు. స్థానికంగా నివాసం ఉండేవారిలో అత్యధికశాతం మంది సైకిల్‌పై సవారీ చేస్తారు. రాజధాని చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేవారు కూడా తమ ప్రయాణాల్లో సగంపైన సైకిల్ పైనే చేస్తారట. అందుకే నెదర్లాండ్స్‌ను నంబర్‌వన్ బైస్కిలింగ్ నేషన్ అని పిలుస్తుంటారు. కిలోమీటరుకు రూ.16... సైకిల్ తొక్కడాన్ని మరింత ప్రోత్సహించే చర్యల్లో భాగంగా నెదర్లాండ్స్ ప్రభుత్వం సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగులు ఒక కిలోమీటర్ సైకిల్ తొక్కితే రూ.16 (0.22 డాలర్లు) చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఈ మొత్తం ఆదాయపన్ను నుంచి మినహాయింపు రూపంలో అందుతుంది. అంటే ఏడాదికి ఒక వంద కిలోమీటర్లు సైకిల్ తొక్కితే రూ.1600 మేర ఆదాయపన్ను తగ్గుతుందన్నమాట. ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చేటప్పుడు, తిరిగి వెళ్లే సమయంలో సైకిల్ ఉపయోగిస్తేనే ఈ వెసులుబాటు కలుగుతుంది. వ్యక్తిగత అవసరాలకు సైకిల్ తొక్కితే ఇవ్వరు. ఒక ఉద్యోగి ఎన్ని కిలోమీటర్లు తొక్కారో కంపెనీ గుర్తించి.. ఆ మొత్తాన్ని కంపెనీయే చెల్లిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి క్లెయిమ్ చేసుకుంటుంది. ఈ విషయంలో ఉద్యోగులను ప్రోత్సహించాలని, వారు ఎంతమేర సైకిల్ ప్రయాణం చేస్తున్నారో గుర్తించి పన్ను మినహాయింపు ఇప్పించాలని ప్రభుత్వం దేశంలోని కంపెనీలన్నింటికీ విజ్ఞప్తి చేయడం విశేషం. ప్రత్యేక రాయితీలు... సైకిల్ తొక్కడాన్ని ప్రోత్సహించే సంప్రదాయం ఇతర దేశాల్లోనూ ఉంది. బ్రిటన్‌లో ఆఫీస్‌కు సైకిల్‌పై వచ్చే ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలుంటాయి. కంపెనీలు డిస్కౌంట్లతో సైకిళ్లు అందిస్తాయి. బెల్జియంలో కూడా నెదర్లాండ్స్ తరహాలో ఆదాయపన్ను తగ్గింపు స్కీమ్ అమల్లో ఉంది. యూరప్‌లోని పలు దేశాలు సైతం టాక్స్ తగ్గింపు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. – పోకల విజయ దిలీప్, సాక్షి స్టూడెంట్ ఎడిషన్ -
కాసులు ఖాతాల్లోకి..
ఖమ్మంవ్యవసాయం: పెట్టుబడి పైకం రైతుల ఖాతాల్లోకి చేరుతోంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి రైతుబంధు పేరిట నూతన పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు పెట్టుబడి సహాయం అందించి.. రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి సీజన్‌కు ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి నగదు అందించాలని ప్రభుత్వం నిర్ణయించి.. పకడ్బందీగా అమలు చేస్తోంది. దీంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు జిల్లాలో 2,79,198 మంది రైతులకు చెందిన 6.87 లక్షల ఎకరాల భూమికి రూ.343.10కోట్ల పెట్టుబడి సహాయం అందనుంది. ఇప్పటికే ఈ ప్రక్రియను వ్యవసాయ శాఖ ప్రారంభించింది. రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సహాయం జమ అయ్యే విధంగా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. గత ఏడాది ఒక్కో సీజన్‌కు ఎకరాకు రూ.4వేల చొప్పున రైతులకు పెట్టుబడి సహాయం అందించి ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు ఖరీఫ్, రబీ సీజన్లలో వేర్వేరుగా ఎకరాకు రూ. 4వేల చొప్పున పంటలకు పెట్టుబడి సహా యం రూ.8వేలను ప్రభుత్వం అందించింది. ఖరీఫ్ సీజన్లో చెక్కుల రూపంలో పెట్టుబడి అందించిన ప్రభుత్వం.. రబీ సీజన్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. అదే విధానాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎకరాకు రూ.5వేల పెట్టుబడి సాయం ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ఎకరాకు రూ.5వేల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సహాయం అందిస్తోంది. గత ఏడాది సీజన్‌కు రూ.4వేల చొప్పున పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం.. రైతులను మరింతగా ప్రోత్సహించేందుకు ఈ ఏడాది నుంచి ఎకరాకు మరో రూ.వెయ్యి పెంచింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో రైతుబంధు పథకంలో ఎకరాకు సీజన్‌కు మరో రూ.వెయ్యి పెంచుతామని పేర్కొంది. మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో మరింత శ్రద్ధ చూపి.. ఖరీఫ్ సీజన్ నాటికి ఎకరాకు రూ.5వేల చొప్పున రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సహాయం అందించే ప్రక్రియను వ్యవసాయ శాఖ చేపట్టింది. 2,79,198 మంది రైతులకు ‘పెట్టుబడి’ జిల్లాలో సొంత భూములతో పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన 2,79,198 మంది రైతులకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతుబంధు పథకం వర్తించనుంది. ప్రభుత్వం గత ఏడాది నుంచి అందిస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన రైతులకు, అటవీ భూములకు(పోడు) హక్కు పత్రాలు కలిగిన రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 6.87 లక్షల ఎకరాల భూమికి రూ.343.10కోట్లు కేటాయింపు జిల్లాలో వివిధ రకాలుగా పట్టాలు కలిగి ఉన్న 6.87 లక్షల ఎకరాల భూమికి ప్రభు త్వం పెట్టుబడి సాయం అందించేందుకు చర్యలు తీసుకుంది. మొత్తం భూమి లో పంటల సాగుకు పెట్టుబడి సహాయంగా రూ.343.10కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ సహాయంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులు తమ భూముల్లో సాగు చేసే పంటలకు సంబంధించిన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం లక్ష్యం కూడా అదే. పెట్టుబడి సహాయంతో పంటలను సాగు చేసుకోవాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అవగాహన కల్పిçంచే ప్రయత్నాలు చేస్తోంది. సద్వినియోగం చేసుకోవాలి.. ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు అందిస్తున్న రైతుబంధు పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కొనుగోలు కోసం రైతుబంధు పథకం నగదును వినియోగించుకోవాలి. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం రైతులకు, వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేస్తుంది. ఖరీఫ్ సీజన్‌కు అనుకూలంగా పెట్టుబడి సహాయం రైతులకు బ్యాంక్ ఖాతాల ద్వారా చేరుతుంది. ఆ ఖాతాల నుంచి నగదును వివిధ రకాలుగా పంట పెట్టుబడులకు వినియోగించుకోవచ్చు. – ఏ.ఝాన్సీలక్ష్మీకుమారి, జిల్లా వ్యవసాయాధికారి -
ఖరీఫ్ ‘పెట్టుబడి’
నల్లగొండ అగ్రికల్చర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం నగదు రైతుల ఖాతాల్లో జమవుతోంది. ఖరీఫ్‌లో రైతులకు పెట్టుబడి కోసం ఉపయోగపడే విధంగా ఈ నెల మొదటి వారంనుంచి రైతుల ఖాతాల్లో నగదును జమచేయడాన్ని వ్యవసాయశాఖ ప్రారంభించింది. మృగశిర కార్తె ప్రారంభం కావడం జిల్లాలో రెండు రోజుల క్రితం వర్షం కురవడంతో రైతులు ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే రైతులు దుక్కులు దున్నడం, విత్తనాలు, ఎరువులు కొనుగోలు ప్రారంభించారు. సీజన్ మొదట్లోనే రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమచేయడంతో.. రైతులకు సకాలంలో పెట్టుబడి కోసం ఉపయోగపడే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 4,14,272 మంది రైతులకు గాను రూ.579,96,32,660లను రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.5 వేల చొప్పున జమచేయాల్సి ఉంది. అయితే ట్రెజరీ ద్వారా ఇప్పటి వరకు జిల్లాలోని 19,795 మంది రైతులకు ఎకరాకు రూ.5వేల చొప్పున రూ.17,73,81,865 బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. మిగిలిన రైతులకు వరుస క్రమంలో ఖాతాల్లో జమకానున్నాయి. ఈ ప్రక్రియ ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏఈఓలకు ఖాతా నంబర్లు అందజేయాలి.. పట్టాదార్ పాస్ పుస్తకాల్లో దొర్లిన తప్పొప్పులు సవరణలు చేసిన తరువాత తహసీల్దార్ డిజిటల్ సంతకంతో కూడిన పాస్బుక్కలు వచ్చిన వారు జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల మంది వరకు ఉన్నారు. వారికి గత ఖరీఫ్, రబీలో రైతుబంధు నగదు ఖాతాల్లో జమకాలేదు. వారందరి నుంచి పాస్‌పుస్తకాల జిరాక్స్‌లను, రైతు ఖాతా నెంబర్లను సేకరించాలని వ్యవసాయ శాఖను అదేశించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల నుంచి పాస్‌పుస్తకాల జిరాక్స్‌లు, ఖాతా నంబర్లను సేకరించే పనిలో ఉన్నారు. రైతులందరూ విధిగా వ్యవపాయ విస్తరణాధికారులకు జిరాక్స్‌లను అందజేయాలని కోరుతున్నారు. భూములు కొనుగోలు చేసిన వారు.. ఇతరుల నుంచి భూములను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుని తహసీల్దార్ నుంచి పాస్ పుస్తకం తీసుకున్న వారు కూడా రెవన్యూ శాఖ.. తమ పేరు వ్యవసాయ శాఖకు పంపిన జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలి. ఆ జాబితా కోసం వ్యవసాయ విస్తరణాధికారులను సంప్రదించాల్సి ఉంది. వారి పేరు జాబితాలో ఉంటే వారు కూడా పాస్‌పుస్తకం, ఖాతా నెంబర్ జిరాక్స్‌లను అందజేస్తే ఖరీఫ్‌లో రైతుబంధు నగదు జమచేసే అవకాశం ఉంటుంది. దశల వారీగా రైతుల ఖాతాల్లో జమ.. ఖరీఫ్‌లో రైతుబంధు పంపిణీ ఇప్పటికే ప్రారంభమై సుమారు రూ.17 కోట్ల వరకు రైతుల ఖాతాల్లో నగదు జమ చేశాం. రైతులందరికీ తప్పకుండా దశల వారీగా ఖాతాల్లో జమచేస్తారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రైతులు దుక్కులు దున్నకం, విత్తనాల కొనుగోలును ప్రారంభించారు. రైతుబంధు పథకం పెట్టుబడికి ఎంతో ఉపయోగపడనుంది. రైతులు అవకాశాన్ని సద్వినియోగ చేసుకుని సకాలంలో పంటల సాగును చేపట్టాలి. – జి.శ్రీధర్‌రెడ్డి, జేడీఏ -
అన్నదాతకు అండగా..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగయ్యే అవకాశముంది.. ఎంత పరిమాణంలో విత్తనాలు, ఎరువులు అవసరమో అంచనా వేసింది. మరో నెల రోజుల్లో తొలకరి పలకరించే వీలుండటంతో అందుకు సంబంధించిన కసరత్తు పూర్తిచేయడంలో నిమగ్నమైంది. గతేడాది తరహాలోనే 1.68 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు కావొచ్చని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో వరుసగా వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలను, భూగర్భ జలాలను నమ్ముకుని మెట్ట పంటలకే రైతులు ప్రాధాన్యం ఇస్తున్నారు. సాగునీటి వనరులు లేవు. దీంతో ఎప్పటిలాగే జిల్లాలో పత్తి అధిక మొత్తంలో సాగవుతుందని అంచనా వేశారు. జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 60,417 హెక్టార్లు. ఇంతే మొత్తంలో వచ్చే ఖరీఫ్‌లో సాగవుతుందని భావిస్తున్నారు. అయితే, గతేడాది రికార్డు స్థాయిలో 69వేల హెక్టార్లలో జిల్లా రైతులు సాగుచేశారు. వర్షాలు సకాలంలో కురిస్తే అదే స్థాయిలో సాగు విస్తీర్ణం పెరగొచ్చని భావిస్తున్నారు. పత్తి తర్వాత అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న, వరి పంట వేయనున్నారు. కందుల సాగుపైనా రైతులు దృష్టి సారిస్తున్నారు. ఖరీఫ్‌లో సాగయ్యే అన్ని పంటలకు కలిపి సుమారు 26వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా వేశారు. సబ్సిడీపై విత్తనాలు పత్తి మినహా ఇతర పంటల విత్తనాలపై రైతులకు సబ్సిడీ లభిస్తుంది. పంటను బట్టి విత్తనాలపై సబ్సిడీ ధర మారుతుంది. అయితే, ఇప్పటివరకు కొన్ని పంటల విత్తనాలకే సబ్సిడీ ధరను నిర్ణయించారు. మిగితా వాటి ధరను ప్రకటించాల్సి ఉంది. సోయాబీన్ క్వింటా ధర రూ.6,150 కా>గా.. సబ్సిడీపై రూ.2,500లకే రైతులకు అందజేశారు. అలాగే క్వింటా జీలుగ ధర రూ.5,150 కాగా.. రాయితీపై రూ.3,350కు విక్రయిస్తారు. జొన్న, కొర్రలు, సజ్జలు, అండ్రు కొర్రలు తదితర చిరుధాన్యాలపై 65 శాతం, వేరుశనగ, నువ్వులు, ఆముదంపై 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. సబ్సిడీ విత్తనాలు ఇప్పుడిప్పుడో గోదాంలకు చేరుతున్నాయి. తొలకరి ప్రారంభానికి ముందే రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్), రైతు సేవా కేంద్రాలు (ఏఆర్ఎస్కే), జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ (డీసీఎంఎస్) తదితర కేంద్రాల నుంచి రైతులు విత్తనాలు పొందవచ్చు. రైతు ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ పత్రాలను సమీప ఏఈఓను సంప్రదించి సబ్సిడీపై విత్తనాలు పొందవచ్చు. పత్తి విత్తనాల ధర ఇలా.. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న డీలర్లు మాత్రమే విత్తనాలు విక్రయించాలి. ఇతరులు అమ్మడానికి వీల్లేదు. ఒకవేళ అలా చేస్తే అది నేరమే. ఈ విషయంలో జిల్లా వ్యవసాయ అధికారులు పకడ్బందీగా వ్యహరిస్తున్నారు. అంతేగాక ఎమ్మార్పీకి మించి విక్రయించకూడదు. వ్యవసాయ శాఖ పత్తి విత్తనాల ధరను నిర్ణయించింది. 450 గ్రాముల తూకం కలిగిన బీజీ–1 విత్తనాలను రూ.635, బీజీ–2 విత్తనాలను రూ.730కు మాత్రమే రైతులకు అమ్మాలి. ముందే సాగుచేయాలి రైతుల పొలాల్లో కావాల్సిన స్థాయిలో సారం లేదు. ఈ లోటును అధిగమించేందుకు పచ్చిరొట్ట ఎరువులను విరివిగా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జనుము, జీలుగ, పిల్లిపెసర వంటిని వేసుకోవడానికి ఇదే మంచి తరుణమని చెబుతున్నారు. ఇప్పుడు వేసుకుంటేనే తొలకరి నాటికి పంట కావాల్సిన పోషకాల్లో సమతుల్యత ఏర్పడుతుందని వివరిస్తున్నారు. తద్వారా మంచి దిగుబడులు సాధ్యమవుతాయని పేర్కొంటున్నారు. -
ఎన్నికల్లో దొరికిన నగదును ఏం చేస్తారు?
సాక్షి, ఆళ్లగడ్డ రూరల్: ఎన్నికల్లో అక్రమంగా తరలించే డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకంటారు. రూ.10లక్షల లోపు పట్టుబడిన కేసులను పోలీసులు, ఆపై కేసులను ఐటీ శాఖ విడివిడిగా విచారిస్తాయి. సరైన బిల్లులు, డాక్యుమెంట్లు ఉంటే ఆ నగదను విడిపించుకోవచ్చు. ఎలాంటి బిల్లులు, పత్రాలు చూపని డబ్బును పోలీసులు అక్కడి నుంచి కోర్టుకు, ఆ తర్వాత కేంద్రప్రభుత్వానికి వెళ్తుంది. ఈప్రక్రియకు చాలా సమయం పడుతుంది. బ్లూ ఇంక్ చరిత్ర తెలుసా.. ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత చేతికి పెట్టే బ్లూ ఇంక్‌కు చాలా చరిత్ర ఉంది. 1962 లోక్ సభ ఎన్నికల్లో మొదటిసారి ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. బ్లూ ఇంక్ 15 రోజుల పాటు చెదిరిపోకుండా అలాగే ఉంటుంది. మూడు నెలలైనా కూడా కొందరి వేళ్లపై ఇంకు ఉంటుంది. మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ తయారు చేసే ఈ ఇంకును ఇండియాలోనే కాదు..కెనడా, కాంబోడియా, దక్షిణాఫ్రికా, టర్కీ దేశాల్లో కూడా ఉపయోగిస్తారు. ఓట్లు.. రకాలు సాధరణ ఓటు: పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేయడం పోస్టల్ ఓటు: ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు భద్రతా బలగాలు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ప్రాక్సీ ఓటు: మన తరపున ఓటు హక్కును వేరే వాళ్లు వేసేలా అధికారుల నుంచి అనుమతి పొంది ఓటేయడం టెండర్ ఓటు: మన ఓటు వేరేవాళ్లు అక్రమంగా వేసినప్పుడు, అధికారుల అనుమతితో మన ఓటును మనమే మళ్లీ వేయడం. -
ఆయన దారి.. అడ్డ దారే!
రాష్ట్రంలో టీడీపీకి వ్యతిరేక పనవాలు వీస్తుండడంతో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం అడ్డదారులు ఎంచుకున్నారు. ఓటుకు నోటు పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న వైనం విస్మయానికి గురి చేస్తోంది. టీడీపీ కోటరీలో కీలక నేతగా ఉన్న నారాయణ విద్యాసంస్థల అధినేత, మంత్రి నారాయణకు ఓటమి భయం పట్టుకుంది. నోట్ల కట్టలు తెగ్గొట్టేశారు. కేవలం నోట్లతో ఓట్లు కొల్లగొట్టాలని నగర పరిధిలో నోట్లు వరదలా పారిస్తున్నారు. నెల్లూరు నగర అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న నారాయణకు రోజు రోజుకు ప్రజాదరణ తగ్గిపోతోంది. ఓటమిపై బెంగతో తమ విద్యాసంస్థల ఉద్యోగులతో ఓటర్లకు నగదు చేర వేస్తూ వైఎస్సార్సీపీ నేతలకు పట్టుబడుతున్నారు. నగదు పంపిణీ కష్టతరం కావడంతో చివరకు విద్యార్థుల స్కూల్ బ్యాగుల ద్వారా చోటా నేతలకు నగదు చేర వేస్తున్నట్లు తెలిసింది. సాక్షి, నెల్లూరు: ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేని మంత్రి నారాయణ టీడీపీ కోటరీలో మాత్రం కీలక నేతగా ఎదిగారు. రెండు దశాబ్దాలుగా టీడీపీ అధినేత చంద్రబాబుతో మంచి సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు. చంద్రబాబుకు బినామీ అని కూడా ప్రచారం ఉంది. ఎన్నికల సమయంలో నారాయణ తన విద్యాసంస్థల ఉద్యోగులతో సర్వేలు చేయిస్తూ, పార్టీకి భారీ విరాళాలతో ఆర్థిక వనరులు సమకూర్చేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో టీడీపీ అధికారంలో ఉన్న 1994–1999, 1999–2004 మధ్య కాలంలో నారాయణ విద్యాసంస్థలను దేశ వ్యాప్తంగా విస్తరించారు. నెల్లూరులో ప్రైవేట్ మెడికల్ కళాశాలను నారాయణకే కేటాయించేలా చేయడంలో చంద్రబాబు ఎంతో కృషి చేశారు. ఇలా నారాయణ, చంద్రబాబు మధ్య ఇంతటి సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. బాబుకు బినామీగా ఉన్న నారాయణ ప్రతి సాధారణ ఎన్నికల్లో ఆర్థిక వ్యవహారాలు చక్క బెట్టేవారు. రాష్ట విభజన అనంతరం 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా టీడీపీ అధికారంలోకి తెప్పించేందుకు వందల కోట్లు నిధులను తన విద్యాసంస్థల ద్వారా సమకూర్చి, వారి ఉద్యోగులను కూడా ఎన్నికల సమయంలో పార్టీకి కార్యకర్తలా పనిచేయించారు. టీడీపీ అధికారంలోకి రాగానే నారాయణ స్వామి భక్తికి మెచ్చిన సీఎం చంద్రబాబు ప్రత్యక్ష ఎన్నికల అనుభవం లేని నారాయణకు తన కేబినేట్లో కీలకమైన మున్సిపల్ శాఖను అప్పగించారు. ఆది నుంచి స్వార్థమే.. దోపిడీ నారాయణ విద్యాసంస్థల అధినేతగా గుర్తింపుతోనే నారాయణ నెల్లూరు వాసులకు పరిచయం. నెల్లూరీయుల ఇచ్చిన ప్రోత్సాహంతో విద్యా సంస్థలను స్థాపించిన నారాయణ ఎన్నడూ నెల్లూరు వాసులకు సేవా కార్యక్రమాలు చేసిన పాపాన పోలేదు. తనతో చదువుకున్న స్నేహితులను కూడా కష్టకాలంలో ఆదుకున్న వ్యక్తిత్వం కాదనే ప్రచారం ఉంది. నారాయణ విద్యాసంస్థల్లో పేద వర్గాలను ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నారన్న ప్రచారం ఉంది. నారాయణ మెడికల్ కాలేజీలో రోగుల వద్ద అధిక ఫీజులు వసూలు చేశారన్న ప్రచారం ఉంది. నారాయణ ఆస్పత్రిలో ఠాగూరు సినిమా సీన్లు జరిగిన ఘటనలు ఉన్నాయి. మెడికల్ కాలేజ్‌లో దాదాపు 10 మందికి పైగా మెడిసిన్ చదివే విద్యార్థినులు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి అవినీతి, అక్రమాల మరకలు ఉన్న నారాయణ మంత్రిగా పని చేసిన ఐదేళ్ల కాలంలో కూడా అవినీతినే ప్రొత్సహించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తొలిసారిగా ఎన్నికల బరిలో దిగడంతో ప్రజాదరణ లే క ఓటమి భయం పట్టకుంది. ఎలాగైనా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఓట్లు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. డబ్బు పంచుతూ.. నెల్లూరు నగరంలో ఓటుకు నోటు పంచుతూ నారాయణ విద్యాసంస్థల ఉద్యోగులు పట్టుబడ్డారు. మూడు రోజుల క్రితం 43వ డివిజన్లో నారాయణ విద్యాసంస్థల ఏజీఎం రమణారెడ్డి నేతృత్వంలో ఉద్యోగులు డబ్బు పంచుతుండగా వైఎస్సార్సీపీ నేతలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారి వద్ద రూ.8 లక్షల నగదు దొరికింది. సోమవారం కూడా 40వ డివిజన్లో నగదు పంచుతున్న నారాయణ విద్యాసంస్థల ఉద్యోగి బాలమురళీకృష్ణ పట్టుబడ్డారు. ఇలా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నగదు ప్రవాహంలా చేసి అడ్డదారుల్లో గెలుపు కోసం నారాయణ చేస్తున చర్యలు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. పోలీసుల సహకారం ఎన్నికల సమయంలో ఎన్ని అడ్డదారులు తొక్కినా ఏమి కాకుండా పోలీసుల సహకారం కూడా మంత్రి నారాయణ తీసుకుంటున్నారు. ఎన్నికల కోసమే తనకు అనుకూలమైన పోలీసు అధికారులను నగరంలో సీఐలుగా నియమించుకున్నారు. వారి ద్వారానే కొన్ని పనులు కూడా చక్కబెట్టించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. విద్యార్థులు బ్యాగుల ద్వారా.. నారాయణ విద్యాసంస్థల ఉద్యోగులతో పాటు అక్కడ చదువుకునే విద్యార్థులను కూడా ఎన్నికల కోసం ఉపయోగించుకోవడం విమర్శల పాలవుతోంది. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉండే పిల్లల తల్లిదండ్రులను గుర్తించి వారి బ్యాగుల ద్వారా ఓటుకు నోట్లు పంపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
అది టీడీపీ నగదేనా..?
పెందుర్తి: సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. ఎన్నికలకు మరో 22 రోజుల సమ యం ఉన్న క్రమంలో ముందుగా అన్నీ ‘సర్దు’బాటు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుం టుంది. ఈ క్రమంలో పారదర్శకంగా ఉంటున్న బ్యాంక్‌లను సైతం అధికార పార్టీ వాడుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంగళవారం సబ్బవరంలో పట్టుబడిన రూ.కోటి నగదు ఈ అనుమానాలను బలపరుస్తుంది. బ్యాంక్ నగదు ముసుగులో తరలిపోతున్న ఈ మొత్తాన్ని ఎన్నికల అధికారులు, పోలీసులు పట్టుకోవడం సంచలనం రేపిం ది. మంత్రి, టీడీపీ కీలక నేత అయిన వ్యక్తి నుం చి పెందుర్తి నియోజకవర్గానికి ఈ మొత్తం వచ్చి నట్లు స్పష్టమవుతుంది. ఓటమి భయంతో వణుకుతున్న టీడీపీ డబ్బుతో గట్టెక్కాలన్న తాపత్రయం ఈ ఘటనతో బట్టబయలైంది. నిజంగా బ్యాంక్ సొమ్మేనా? సాదారణంగా ఏ బ్యాంక్ సొమ్ము అయినా ఎస్కార్ట్ లేకుండా ఇతర శాఖలకు తరలించరు. అదీ నగరం నుంచి ఏజెన్సీ ప్రాంతానికి అయితే ఆ భద్రత మరింత పగడ్బందీగా ఉంటుంది. అయితే మంగళవారం నగరంలోని సీతంపేట నుంచి పాడేరుకు రూ.కోటి తరలిస్తున్నామని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అధికారులు ప్రాథమిక జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదన్నదే వేయి డాలర్ల ప్రశ్న. ఏదైనా బ్యాంక్ తన ప్రధాన శాఖను నుంచి అనుబంధ శాఖలకు నగదు తరలిస్తే ఖచ్చితంగా ఇండెంట్ పత్రం ఉంటుంది. నగదు తరలింపునకు తప్పనిసరిగా ప్రతీ బ్యాంక్‌కు సొంత వాహనం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితి అయితే ప్రైవేటు ట్రావెల్ వాహనాన్ని వినియోగిస్తారు. నగదు తరలింపు వాహనం డ్రైవర్ పేరు పత్రాల్లో నమోదు చేస్తారు. అన్నింటికీ మించి ఎన్నికల సమయంలో నగదు తరలిస్తే ఎన్నికల సంఘం/రిటర్నింగ్ అధికారి అనుమతి ఇచ్చిన పత్రాలు తప్పనిసరి. కానీ మంగళవారం సబ్బవరంలో బ్యాంక్ సొమ్ముగా చెబుతున్న నగదు పట్టుబడిన ఘటనలో అలాంటి ఒక్క పత్రం కూ డా బ్యాంక్ అధికారుల వద్ద లభించలేదు. ఆయా ఆధారాల బట్టి ఆ సొమ్ము బ్యాంక్దేనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ నాయకుడి వాహనమే ఎందుకు మరోవైపు బ్యాంక్ అధికారులకు నగదు తరలింపునకు టీడీపీ నాయకుడి వాహనమే దొరికిందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అదీ ఎన్నికల సమయంలో ఓ పార్టీకి చెందిన వాహనంలో తమ బ్యాంక్‌కు చెందిన నగదును ఎలా తరలిస్తారన్నది మరో ప్రశ్న. ఇదిలా ఉండగా నగదు పట్టుబడిన వెంటనే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్‌కు చెందిన ఉన్నతాధికారులు పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యారు. కానీ ఆ నగదుకు సంబంధించిన ఒక్క పత్రం కూడా లేదు. దీనిపై మీడియా ప్రతినిధులు వారిని ప్రశ్నించగా మాకేం తెలియదు.. పోలీసులనే అడగండి అంటూ వారు మొహం చాటేయడం అనుమానాలను బలపరుస్తోంది. టీడీపీకి చెందిన నగదును తరలించిన క్రమంలో పట్టుబడడం... దాని నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న సదరు బ్యాంక్ అధికారులను వాడుకున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరహా ‘పంపిణీ’ టీడీపీ బడా నాయకుల కనుసన్నల్లో జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నట్లు ఈ ఘటన నిరూపిస్తుంది. -
కారులో రూ.1.09 కోట్లు స్వాధీనం
-
నర్సంపేట: రూ. 7.5 లక్షలు పట్టివేత
సాక్షి, నర్సంపేటరూరల్: నర్సంపేట మండలంలోని దాసరిపల్లిలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న రూ. 7.5లక్షలను శుక్రవారం పట్టుకున్నట్లు సీఐ కొత్త దేవేందర్‌రెడ్డి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. దాసరిపల్లిలో కో మాండ్ల ఆదిరెడ్డి, రాజిరెడ్డి, ప్రవీణ్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఆదిరెడ్డి ఇంటి వద్ద గుంపుగా ఉన్నారు. ఈ క్రమంలో నర్సంపేట ఎస్సై నాగ్నాథ్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా జీబు సౌండ్స్ విని కవర్లను అక్కడే వదిలివేసి వెళ్లారు. వెంటనే ఎస్సై వారిని పట్టుకొని ఆ కవర్లులో చూడగా మొ త్తం ఏడు లక్షల 50వేల రూపాయలు ఉన్నట్లు గు ర్తించారు. డబ్బును సీజ్ చేసి, ఆరుగురిని నర్సం పేట పోలీస్ స్టేషన్‌కు తరలించిన కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. జూకల్లులో డబ్బుల పట్టివేత చిట్యాల (భూపాలపల్లి) మండలంలోని జూకల్లులో శుక్రవారం బీజేపీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తుండగా రూ.లక్ష పట్టుకున్నట్లు ఎస్సై అనిల్‌కుమార్ తెలిపారు. గ్రామంలో పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో బీజేపీ నాయకులు జి. రామకృష్ణారెడ్డి, ఎన్.రామకృష్ణారెడ్డిలు డబ్బులు పంపిణీ చేస్తుండగా పట్టుకున్నామన్నారు. డబ్బులను స్వాధీనం చేసుకోని ఇద్దరిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. రూ.11800 నగదు స్వాధీనం మంగపేట మండల కేంద్రంలో ఓట్లర్లకు నగదు పంపిణీ చేస్తు గురువారం రాత్రి పట్టుబడిన నలుగురిపై కేసు నమోదు చేసి వారి నుంచి రూ.11,800 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్రావు తెలిపారు. ఎస్సై కథనం మేరకు మండల కేంద్రంలోని సినిమాహాల్ వీధిలో టీఆర్ఎస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు ఆళ్ళ రాణి, ఆ పార్టీకి చెందిన బచ్చలకూరి ప్రసాద్, రావుల రామస్వామి, మానుపెల్లి శ్రీను అనే నలుగురు వ్యక్తులు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేస్తూ ఓటు వేసేందుకు ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారని సమాచారం వచ్చిందన్నారు. తాము అక్కడకు వెళ్లగా ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్న వారిని చెక్ చేయగా వారి నుంచి రూ.11,800 లభ్యమైందని తెలిపారు. నగదును స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థి వద్ద రూ. 50లక్షల నగదు పట్టివేత!
సాక్షి, హైదరాబాద్ : కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు చెందిన రూ.50లక్షల నగదును పోలీసులు సీజ్‌చేశారు. సర్వే ప్రధాన అనుచరుడు గాలి బాలాజీ వద్ద ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.50లక్షలు, ప్రచార సామాగ్రిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బును సర్వే సత్యనారాయణ కోసం తీసుకెళ్తుండగా.. నాంపల్లి వద్ద పట్టుకున్నారు. సర్వే ఆదేశాల మేరకు బేగంబజార్‌లోని హవాలా డీలర్ దిలీప్ నుంచి రూ. 50లక్షలు గాలి బాలాజీ తీసుకున్నట్లు సమాచారం. మరో చోట రూ.40లక్షలు పట్టివేత! గచ్చిబౌలి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రూ.40లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. సరైన పత్రాలు లేని కారణంగా ఈ డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నగదు టీడీపీకి చెందిన ఓ నేతవిగా పోలీసులు చెబుతున్నారు. -
జూపూడి ఇంటి వద్ద డబ్బు సంచులు
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల వేళ ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాక ర్రావు నివాసం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. బుధవారం రాత్రి 9:30 గంటలకు ఓ ఇన్నోవా కారులో ముగ్గురు వ్యక్తులు కూకట్పల్లి బాలాజీనగర్‌లోని జూపూడి నివాసానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న టీఆర్ ఎస్ శ్రేణులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు హుటాహుటిన జూపూడి నివాసానికి రావడంతో ఆ ముగ్గురు 3 బ్యాగులతో జూపూడి నివాసం వెనుక గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు వెంబడించి ఒకరిని పట్టుకోగా, ఇద్దరు పారిపోయారు. దొరికిన వ్యక్తిని, అతడి వద్ద ఉన్న రూ.17.50 లక్షలను పోలీసులకు అప్పగించారు. అనంతరం అతడిని పోలీసులు ఠాణాకు తరలించారు. పారిపోయిన ఆ ఇద్దరు వ్యక్తుల వద్ద భారీ ఎత్తున నగదు ఉందంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు జూపూడి నివాసం ఎదుట ధర్నాకు దిగారు. ఓటర్లకు పంచేందుకే ఈ నగదు తీసుకొచ్చినట్లు వారు ఆరోపించారు. -
ప్రలోభాలు షురూ! : నిజామాబాద్
సాక్షి, నిజామాబాద్‌అర్బన్: ఎన్నికలకు మూడు రోజుల ముందు నుంచే ప్రలోభాల పర్వం జోరందుకుంది. ఓటర్లపై మందు, విందులతో పాటు డబ్బుల వర్షం కురుస్తోంది. నేటి సాయంత్రంతో ప్రచారానికి తెర పడనుంది. అయితే, మంగళవారం నుంచే ప్రలోభాల పర్వానికి తెర లేపారు అభ్యర్థులు. విచ్చలవిడిగా డబ్బుల వర్షం కురిపిస్తున్నారు. అన్ని చోట్లా తీవ్రమైన పోటీ నెలకొనడంతో ఎలాగైనా గట్టెక్కాలని అభ్యర్థులు ఓటర్లకు గాలం వేసే పనిలో పడ్డారు. జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజక వర్గాల్లో మంగళవారం నుంచి విందులు, డబ్బుల పంపిణీ ఊపందుకుంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో లెక్కకు మించి ఖర్చు చేస్తున్నారు. ఓటర్లపై డబ్బులు వెదజల్లుతున్నారు. ఏలాగైనా ఓటర్లను ఆకట్టుకోవాలని ప్రలోభాలకు తెర లేపారు. గ్రామీణ ప్రాంతాల్లో విందులు విపరీతంగా నడుస్తున్నాయి. ఇంటింటికీ మాంసం, మద్యం పంపిణీ కొనసాగుతోంది. ఓటర్ల డిమాండ్‌ను బట్టి.. జిల్లాలోని ఐదు నియోజక వర్గాల్లో ప్రచారం తీవ్ర స్థాయికి చేరింది. నిన్నటివరకూ రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారాలు చేపట్టిన అభ్యర్థులు మంగళవారం గేర్ మార్చారు. పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో ఓవైపు ప్రచారం నిర్వహిస్తూనే, మరోవైపు ప్రలోభాల పర్వానికి తెర లేపారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు వారు పెట్టే డిమాండ్లకు తలొగ్గుతున్నారు. ఖర్చులను లెక్క చేయకుండా అభ్యర్థులు రూ.కోట్ల డబ్బు కుమ్మరిస్తున్నారు. మంగళవారం నుంచి దాదాపు అన్ని గ్రామాల్లో విందులు ఏర్పాటు చేశారు. ఆర్మూర్ ప్రాంతంలో ప్రతీ గ్రామానికి మేకలను పంపించి, విందులు ఏర్పాటు చేయించారు. మరో అభ్యర్థి విందు భోజనాలను గ్రామాలకు పంపుతున్నారు. రాత్రివేళ ఇంటింటికి చికెన్, మటన్‌ను పంపిస్తున్నారు. అలాగే, కుల సంఘాలను కలుస్తూ, వారికి కావల్సిన డిమాండ్లను అంగీకరిస్తూ కుల పెద్దలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారిచేత పూర్తి స్థాయి ఓట్లు పడేలా తీర్మానాలు చేసేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఒక్క ఆర్మూర్ నియోజకవర్గానికే పరిమితం కాలేదు, మిగతా అన్ని చోట్లా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. డబ్బుల పంపిణీ.. కొన్ని ప్రాంతాల్లో డబ్బుల పంపిణీ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం రూ.200 నుంచి రూ.300 ముట్టజెబుతున్నారు. పోలింగ్ రోజున రూ.వెయ్యి ఇస్తామని, తమకే ఓటు వేయాలని ప్రలోభపెడుతున్నారు. మహిళా సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేయించి, ఓట్లు తమకే వేయాలని గాలం వేస్తున్నారు. మహిళా సంఘాలకు ఉన్న బకాయిలను తీరుస్తామంటూ, బకాయిలో సగం డబ్బులను నేరుగా చేతికి అందించి, మద్దతిస్తున్నట్లు తీర్మాన పత్రాలు రాయించుకుంటున్నారు. ఇంటింటికి మాంసంతో పాటు మహిళలకు శీతల పానీయాలను పంపిణీ చేస్తున్నారు. మగవారికి ప్రతిరోజు మద్యం పంపిణీ కొనసాగుతోంది. మందు, మాంసం.. మంగళవారం రోజే పెద్ద మొత్తంలో మందు, మాంసం పంపిణీ కొనసాగింది. ఇక, బుధ, గురువారాల్లో ఇది రెట్టింపు కానుంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో అక్రమంగా మద్యాన్ని నిల్వ చేసిన అభ్యర్థులు ఓటర్లకు చేర వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మరోవైపు, ఎన్నికల వేళ మాంసానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. చికెన్ సెంటర్లలో పార్టీ నాయకుల రద్దీ ఎక్కువైంది. మరోవైపు, ఓటర్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అభ్యర్థులు సమకూరుస్తున్నారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. -
మెదక్‌లో భారీగా మద్యం, మనీ
ఎన్నికల ప్రచారం చివరిదశకు చేరింది. అభ్యర్థులు అస్త్రశస్త్రాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ ప్రలోభాలకు తెరలేపుతున్నారు. మద్యం, మనీ పంపిణీపై దృష్టి సారిస్తున్నారు. పంపిణీ బాధ్యతలను కుటుంబ సభ్యులకు, నమ్మినబంట్లకు అప్పగిస్తున్నారు. ప్రతీ గ్రామంలో ఏమేరకు పంపకాలు జరుగుతున్నాయో? తెలుసుకునేందుకు సైతం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకుంటున్నారు. అభ్యర్థులు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాక, ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అధికారులు అభ్యర్థుల ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీవ్రతరం చేశారు. ఇప్పటికే జిల్లాలో భారీగా మద్యం, మనీ పట్టుకున్నారు. సాక్షి, మెదక్: ఎన్నికలకు ఇంకా ఐదురోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్న అభ్యర్థులు విజయం కోసం ఏ అవకాశాన్ని వదులుకోవడంలేదు. ఓవైపు ముమ్మర ప్రచారం సాగిస్తూనే మరోవైపు ఎదుటి పార్టీలోని నేతలను తమవైపు తిప్పుకుంటున్నారు. కొంత మందిని కోవర్టులుగా మార్చుకుంటున్నారు. అదే సమయంలో ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు తెరలేపుతున్నారు. ఓటర్ల కోసం మద్యం, డబ్బులను ప్రధాన ఆస్త్రంగా మల్చుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎన్నికల అధికారులు నిఘా పెట్టినా వారికి దొరక్కకుండా అభ్యర్థులు ఓటర్ల కోసం రహస్య మార్గాల్లో గ్రామాలకు మద్యం, మనీ చేరవేస్తున్నారు. మద్యం, డబ్బుల రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది మొదలు అధికార యంత్రాంగం గట్టి నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయటంతోపాటు ప్రత్యేక బృందాలు వాహనాల తనిఖీలు చేస్తున్నాయి. మరోవైపు ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ఎన్నికల యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ధర్మారెడ్డి ఓటర్లను చైతన్యవంతుల్ని చేసేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓటును అమ్ముకోవద్దని, ప్రలోభాలకు గురికావద్దంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పట్టుబడిన మనీ వివరాలు మెదక్ రూ.24.86 లక్షలు నర్సాపూర్ రూ.23.22 లక్షలు మొత్తం రూ.48.08 లక్షలు ఓటుకెంత..? పట్టణ, గ్రామీణ కూడళ్లలో ఓటర్లను చైతన్యవంతుల్ని చేసేలా బ్యానర్లు ఏర్పాటు చేయిస్తున్నారు. అదే సమయంలో మద్యం, డబ్బులు పంపిణీలు జరగుకుండా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక బృందాల ద్వారా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయిస్తున్నారు. జిల్లాలో ప్రత్యేక బృందాల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.48,08,480 నగదు లభించింది. మెదక్ నియోజకవర్గంలో రూ. రూ.24,86,400, నర్సాపూర్‌లో రూ.23,22,080 లక్షలు పట్టుబడ్డాయి. అలాగే ఎక్సైజ్ అధికారుల జిల్లాలో చేపట్టిన తనిఖీల్లో రూ.14,86,276 విలువ చేసే 21,123 లీటర్లు మద్యాన్ని సైతం పట్టుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యేక బృందాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా ఐదురోజులు మిగిలి ఉండటంతో డబ్బు, మద్యం పంపిణీ ఎక్కువగా జరిగే అవకావం ఉంది. దీనిని పసిగట్టిన తనిఖీ బృందాలు నిఘా పెంచాయి. ప్రలోభాలకు తెరలేపుతున్న పార్టీలు ప్రచారంలో హామీల వర్షం కురిపిస్తూనే మరోవైపు ప్రలోభాలకు తెరతీస్తున్నారు. మెదక్ నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య పోటీ నెలకొంది. నర్సాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. తమ గెలుపుకోసం ఉపయోగపడే ఏ అవకాశాన్ని వదులుకునేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు సిద్ధంగా లేరు. దీంతో డబ్బులు, మద్యం పంపిణీకి ప్రధాన పార్టీల అభ్యర్థులు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. గుట్టుగా తమ ముఖ్య అనుచరుల, బంధువుల ద్వారా డబ్బులు, మద్యం చేరవేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎక్కువగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రధాన రాజకీయ పార్టీలు ఓటుకు విలువ కట్టే పనిలో నిమగ్నమయ్యాయి. ఇవి ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయో వేచి చూడాలి..